Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy On AP Govt Tirumala Stampede Incident1
కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట(tirupati stampede) జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan mohan reddy) ధ్వజమెత్తారు ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. మొత్తం పోలీసుల బలగం అంతా చంద్రబాబు చుట్టూనే..‘‘చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తీరు ఇంకా హాస్యాస్పదంప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట(tirupati stampede Incident) జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా స్థానిక కలెక్టర్‌, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు వైఎస్‌ జగన్‌.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025

Former MP Manda Jagannadham Passed Away2
మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌/అలంపూర్‌: నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథం (74) అనా రోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్‌పీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ఎంపీగా ప్రజలకు సేవలందించిన జగన్నాథం మృతి బాధాకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.

My Wife Loves Staring At Me Says CEO Adar Poonawalla Mocks L T Chief Words3
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'

ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025

Whats Next Plan To Team India On Fast Bowling Unit4
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?

ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్‌,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్‌ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్‌లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం.

BRS MLA Harish Rao Takes On Revanth Reddy Sarkar5
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో హరీష్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్‌.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్‌ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్‌ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్‌ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్‌.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్‌ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్‌, అల్లు అర్జున్‌ మీద దాడులు చేస్తోంది. రేవంత్‌రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు.

argumentation Between Kaushik Reddy And MLA Sanjay6
ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్‌(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్‌ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్‌ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.

Glenn Maxwell Scores 90 To Resurrect Melbourne Stars Innings Against Renegades In BBL7
మ్యాక్స్‌వెల్‌ ఊచకోత.. సిక్సర్ల సునామీ

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్‌.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నుంచి గేర్‌ మార్చాడు. ఆడమ్‌ జంపా వేసిన 16వ ఓవర్‌లో సిక్సర్‌, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్‌.. కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్‌లోని తొలి సిక్సర్‌ (రెండో బంతి) బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్‌ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్‌ రికార్డు సహచరుడు హిల్టన్‌ కార్ట్‌రైట్‌ పేరిట ఉండింది. ఇదే సీజన్‌లో కార్ట్‌రైట్‌ 121 మీటర్ల సిక్సర్‌ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్‌లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్‌ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్‌ రిచర్డ్‌సన్‌ మ్యాక్సీని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్‌ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. ఆతర్వాత బెన్‌ డకెట్‌ (21), బ్యూ వెబ్‌స్టర్‌ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్‌ డకెట్‌, థామస్‌ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్‌, 55 పరుగుల వద్ద సోయినిస్‌ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్‌ (6), 75 పరుగుల వద్ద జోయల్‌ పారిస్‌ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్‌ బౌలర్లలో టామ్‌ రోజర్స్‌, ఫెర్గస్‌ ఓనీల్‌, ఆడమ్‌ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్‌ బేతెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్‌ఈ మ్యాచ్‌ చూసేందుకు టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్‌ కెప్టెన్‌ స్టోయినిస్‌ ఔట్‌ కాగానే జకో​ నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్‌166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్‌ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్‌ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్‌ ఇన్నింగ్స్‌లో జోష్‌ బ్రౌన్‌ 4, మార్కస్‌ హ్యారిస్‌ 1, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 19, జేకబ్‌ బేతెల్‌ 1, విల్‌ సదర్‌ల్యాండ్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్‌ సీఫర్ట్‌ 26, హ్యారీ డిక్సన్‌ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్‌ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి.

Danam Nagender Once Again Sensational Comments On HYDRA8
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఈ-కార్‌ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్‌ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్‌ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్‌ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్‌!

Ex Minister Kurasala Kannababu Fires On Chandrababu9
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు

సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్‌ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్‌ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్‌ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!

Daaku Maharaaj Movie Review And Rating In Telugu10
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌: డాకు మహారాజ్‌నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్‌ కార్తీక్‌ఎడిటర్‌: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్‌ ఖేడ్కర్‌)కి ఓ కాఫీ ఎస్టేట్‌ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్‌) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్‌, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్‌ జైలులో ఉన్న మహారాజ్‌(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్‌ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్‌ ఇంజనీర్‌ సీతారాం(బాలకృష్ణ), చంబల్‌ డాన్‌ బల్వంత్‌ ఠాకూర్‌(బాబీ డియోల్‌) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్‌), కావేరి(ప్రగ్యా జైస్వాల్‌) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్‌ యాక్షన్‌ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్‌ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్‌(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్‌ అవుతుంటాడు. రొటీన్‌ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్‌ ఫార్మెట్‌లో డాకు మహారాజ్‌ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్‌ సీన్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్‌ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్‌ యాక్షన్‌ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్‌ విలన్‌ని సెకండాఫ్‌ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్‌ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్‌ బ్లాక్‌ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్‌ ఇంజనీర్‌ సీతారాం, డాకు మహారాజ్‌ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్‌ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్‌ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్‌ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్‌ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్‌లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్‌ చూపించాడు. యాక్షన్‌ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్‌, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్‌ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్‌ ఠాకూర్‌గా బాబీ డియోల్‌ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్‌ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్‌ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్‌ ఖేడ్కర్‌, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్‌ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్‌ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement