Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals1
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?

'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్యం రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. పైగా దీన్నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)

maha kumbh mela history, sakshi special2
కుంభమేళా చరిత్ర ఇప్పటిది కాదు

కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్రకందని కాలం నుంచీ జరుగుతూ వస్తోందని చెబుతారు. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభ మేళా అనే పేరు అమృతకలశం నుంచి వచ్చింది. సాగరమథనం వల్ల పుట్టుకొచ్చిన అమృత భాండం నుంచి నాలుగు చుక్కలు భూమిపై ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో పడ్డాయని ఐతిహ్యం. తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతభాండం తెస్తుండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ నాలుగు చోట్లా కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది.నాలుగు రకాలు కుంభమేళా నాలుగు రకాలు. ఏటా మాఘ మాసంలో జరిగేది మాఘ మేళా. ఇది కేవలం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఆరేళ్లకు ఓసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయోగరాజ్‌ల్లో జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత, అంటే 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహా కుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయోగరాజ్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహా కుంభమేళా. ఏం చేస్తారు? కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా ఆచరించేది త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం. తద్వారా పాపాలు తొలగి దేహత్యాగానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందన్నది విశ్వాసం. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఆరు ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు. ఆ రోజుల్లో సంగమ స్థలికి ఇసుక వేసినా రాలనంతగా జనం పోటెత్తుతారు. పుణ్య స్నానం తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్‌ కోటలో అక్షయ వటవృక్షాన్ని. ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్‌ ఆలయాన్ని, అక్కడికి సమీపంలో ఉండే మాధవేశ్వరీ శక్తి పీఠాన్ని దర్శిస్తారు. మామూలు రోజుల్లో కంటే మేళా సమయంలో సంగమ స్థలిలో చేసే పుణ్యకార్యాలు అత్యంత ఫలప్రదాలని నమ్ముతారు. కల్పవాసం కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు కల్పవాసం. భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో సంగమ ప్రాంతంలో నెల రోజుల పాటు దీన్ని నిష్టగా పాటిస్తారు. మేళా మొదలయ్యే పుష్య పౌరి్ణమ నాడు కల్పవాస సంకల్పం తీసుకుంటారు. అప్పటినుంచి మాఘ పూరి్ణమ దాకా కల్పవాసాన్ని పాటిస్తారు. ఆ నెల పాటు సంగమ స్థలం దాటి వెళ్లరు. రోజూ గంగలో మూడు మునకలు వేయడం, యోగ, ధ్యానం, పూజలు, ప్రవచనాల శ్రవణం వంటివాటితో పూర్తి భక్తి భావనల నడుమ కాలం గడుపుతారు. ఈసారి 15 నుంచి 20 లక్షలకు పైగా భక్తులు కల్పవాసం చేయనున్నట్టు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు. వారి కోసం కుంభ్‌నగర్‌లో విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Uttar Pradesh govt proposes no helmet, no fuel rule to put curb on road accidents3
హెల్మెట్‌ లేకపోతే పెట్రోల్‌ పోయొద్దు

లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్‌ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్‌ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్‌ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్‌ బ్రజేష్‌ నారాయణ సింగ్‌ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్‌ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్‌ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్‌’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్‌ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు.

Rush over Sankranthi Kodi Pandalu: Social media platform announces schedules and invites in AP4
పీక్స్‌కు చేరిన కోడి పందేల సందడి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్‌ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌ డే మ్యాచ్‌లట.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్‌ ప్రకటించుకున్నారు.మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్‌డే మ్యాచ్‌లంటూ షెడ్యూల్‌ ప్రకటించడం వంటివి రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నిషేధం బేఖాతరు.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974­లోని సెక్షన్‌ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్‌ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్‌ లీగ్‌’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్‌ లీగ్‌ (కోడి పందేల లీగ్‌) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. క్రికెట్‌ టోర్నమెంట్స్‌ లీగ్‌ మాదిరిగా కోడి పందేల లీగ్‌ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.

Daily Horoscope On 13 January 2025 In Telugu5
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: పౌర్ణమి తె.3.59 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.59 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.48 నుండి 3.36 వరకు, అమృతఘడియలు: ఉ.8.25నుండి 10.02 వరకు, భోగి పండగ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39. మేషం...కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.వృషభం...రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత అసంతృప్తి. ఉద్యోగాలలో పనిభారం.మిథునం...ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.కర్కాటకం...ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.సింహం.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయికన్య...కొత్త పనులు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.తుల..దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్యమైన పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.వృశ్చికం......పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మకరం..చిరకాల మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.కుంభం..ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.మీనం....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమాధిక్యం.

YS Jagan Mohan Reddy On AP Govt Tirumala Stampede Incident: andhra pradesh6
చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిస­లాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి(YS Jagan mohan reddy) ఆదివారం మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిస­లాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి.. వారిని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని విడిచి­పెట్టిం­దంటే దానర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వాళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి.. కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవునిపట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకోలేదు..చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ ఆరో తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవడం మొదలు.. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ సహా, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? ఈ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం.. వెంటనే టీటీడీ చైర్మన్‌ను, ఈఓను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం.. ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా!డిప్యూటీ సీఎం డిమాండ్లు హాస్యాస్పదం..ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్ర­బాబుగారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి­గారే­మో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండన­గా చిత్రీకరిస్తుంటే, డిప్యూటీ సీఎంగారేమో, లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రా­మా­కు తెరలేపారు.ఇంతకన్నా దిగజారు­డు­తనం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరు­గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయ­శ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీలేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీ­డీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు.

Jemimah hundred helps India clinch ODI series with 116-runs7
టాప్‌ ఫోర్‌... వైల్డ్‌ ఫైర్‌

భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్‌ ఫైర్‌’ అయ్యింది. టాప్‌–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్‌ డియోల్‌ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్‌ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్‌కోట్‌: భారత టాపార్డర్‌ టాప్‌ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్‌ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్‌ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్‌ వేదిక పరుగుల ‘పొంగల్‌’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్‌ బ్యాటర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్‌లో తొలి శతకం సాధించగా... హర్లీన్‌ డియోల్‌ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్‌ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్‌ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్‌’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్‌’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్‌ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్‌ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్‌ బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్‌ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్‌ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్‌ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్‌ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్‌ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్‌ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్‌ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్‌ 10; తేజల్‌ (నాటౌట్‌) 2; సయాలీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్‌: వోర్లా ప్రెండర్‌గాస్ట్‌ 8–0–75–2, అవా క్యానింగ్‌ 10–0–51–0, అర్లెన్‌ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్‌ 9–0–77–0, అలానా డాల్జెల్‌ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్‌ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్‌ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్‌ (నాటౌట్‌) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్‌ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్‌: టిటాస్‌ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్‌ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0.

Laxman special focus on valuable gifts given by donors: TTD8
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!

అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్‌ వ్యక్తుల హవా­కు సం­బంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో ప్రధాన నింది­తుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్‌ మని­షిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కు­మార్‌ ఏకంగా ‘సూ­డో’ అదనపు ఈఓగా చెలరేగి­పోతున్నారు. అద­న ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయ­నకు కుర్చీవేసి ప్రొటో­కాల్‌ మర్యాదలు అందిస్తున్నా­రంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహ­నం, ఇతర సౌకర్యా­ల­ను కల్పి­స్తున్నారు. ఏ అధికా­రిక ఉత్తర్వులు లేకపో­యినా టీటీడీలో తిష్టవేసి అందరి­నీ శాసి­స్తున్న లక్ష్మణ్‌కుమార్‌ వ్యవహారం ఇప్పు­­డు టీ­టీడీ­లో హాట్‌ టాపిక్‌. టీటీడీలో ఎ­లాంటి ఉత్త­ర్వుల్లేకుండా అధికారిక సమా­వేశంలో పా­లొ­్గన­డం, ఏఈ­ఓ­తోపాటు సమీ­క్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్య­భద్ర­తాధికారి పాల్గొన్న సమావేశా­నికీ హాజరైన ఈ సూడో అడిషనల్‌ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూ­లలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామి­వారికి కాను­కలిచ్చే సమయంలో తమ పేరు చెప్ప­డానికి సైతం ఇష్టప­డరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్‌ ఈ వ్యవ­హారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలు­స్తోంది. తిరు­­మలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్‌ దీపాలంకరణ బాధ్యతను దాత సహా­యంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్‌ కనుసన్న­ల్లోనే జర­­గాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్య­చౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబు­తున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈ­ఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్‌ ఏర్పా­టు­చేయాల్సి వచ్చింది? స్పెషల్‌ టైప్‌–05 నెంబర్‌ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచే­శారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాల­యంలోనే అప­విత్ర కార్యక్రమాలకు పాల్పడు­తున్న­ట్లు ఆరోపి­స్తున్నారు.టీడీపీ కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రావడంతో తామేంచేసి­నా చె­ల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తు­లుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచు­కు­నేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్‌ సూడో అడిషనల్‌ ఈఓ చెలామణి అవుతు­న్నారు. అసలు కస్టమ్స్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్‌ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్‌ఎస్‌ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పు­చేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌­కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలు­స్తోంది. ఆయన పరకామణి, పోటు, దాత­లిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తు­న్నారు. రహస్య సమాచారం అంతా ఆయ­న చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫా­ర్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూ­సు­­కుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్‌ వ్యక్తికి అప్పగించ­డంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తి­రు­మలలో ఏ స్కాం జరిగినా బయటకు రా­కుండా వ్యవస్థను ఏర్పరుచు­కు­న్నా­రని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు.

Nakkina Trinadha rao Vulgar Comments on Majaka Heroine Anshu9
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్‌ అసభ్యకర వ్యాఖ్యలు

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్‌ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్‌ ఓ రేంజ్‌లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ హీరోయిన్‌ మజాకాలో హీరోయిన్‌గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్‌ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ శరీరం గురించి డైరెక్టర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్‌లో సెకండ్‌ హీరోయిన్‌ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్‌ ఇవ్వమని కొంత గ్యాప్‌ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్‌ ఓవరాక్షన్‌ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్‌ అయినా ముందే చెప్పాలిగా

Surge in Estrogen Linked to Binge Drinking in Females10
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు

న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరిగిన సందర్భాల్లో మహిళల్లో మద్యం అతిగా తాగాలనే ఆలోచనలు ఎక్కువగా రావొచ్చని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని వెల్‌ కార్నెల్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల సంబంధిత అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’జర్నల్‌లో ప్రచురతమయ్యాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలకు మహిళల్లో అతి మద్యపాన అలవాట్లకు మధ్య దగ్గరి సంబంధం ఉందని తొలిసారిగా కనుగొన్నామని పరిశోధకులు చెప్పారు. పురుషులతో పోలిస్తే ఈ ధోరణి మహిళల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళ ఒకేసారి నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తాగితే ఆ అలవాటును అతిమద్యపాన సేవనంగా పేర్కొంటారు. సంబంధిత ప్రయోగాన్ని ఎలుకలపై చేసి నిర్ధారించుకున్నారు. మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల మెదడులో ‘స్ట్రియా టెరి్మనల్‌లోని బెడ్‌ న్యూక్లియస్‌’న్యూరాన్లు ఈస్ట్రోజన్‌ ఎక్కువ అయినప్పుడు అతిగా మద్యం తాగాలని ప్రేరేపిస్తున్నాయి. మద్యం అందించిన తొలి 30 నిమిషాల్లోనే వాటిలో ఈ అతిపోకడ కనిపించింది. మహిళల్లో అతిమద్యం అలవాట్లకు కారణం ఏమై ఉంటుందో ఇన్నాళ్లూ బోధపడలేదు. ఎందుకంటే ఇంతకాలం జరిగిన ఈ తరహా పరిశోధనలు కేవలం పురుషులమీదే జరిగాయి. ఈ పరిశోధన ఫలితాలు మహిళల్లో మద్యం అలవాట్లపై అధ్యయనానికి కొత్త బాటలు వేశాయి’’అని వెల్‌ కార్నెల్‌ మెడిసిన్‌లోని ఫార్మకాలజీ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్, నివేదికలో కీలక రచయిత క్రిస్టీన్‌ పెయిల్‌ వ్యాఖ్యానించారు. మహిళల్లో నెలసరి రోజులులాగా ఎలుకల్లో ఈస్ట్రోజన్‌ చక్రం కొనసాగినంతకాలం ఈ పరిశోధన చేశారు. ఈస్ట్రోజన్‌ స్థాయిలు ఎక్కువ ఉన్నన్ని రోజులూ ఆడ ఎలుకలు మద్యం ఫూటుగా తాగడం గమనించారు. మద్యానికి బానిసలైన మహిళా బాధితులకు చికిత్సా విధానాల్లో మార్పుకు ఈ కొత్త పరిశోధన ఎంతగానో సాయపడనుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి

ముంబై/డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమ

title
Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమం ఒడ

title
Maha Kumbh: 15 లక్షలకుపైగా విదేశీ పర్యాటకుల రాక

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింద

title
అబ్బురపరుస్తున్న టెంట్‌ సిటీ

కుంభమేళాకు పోటెత్తే కోట్లాది భక్తులకు బస, ఏర్పాట్లు చేసే సామర్థ్యం ప్రయాగ్‌రాజ్‌లోని హోటళ్లకు లేదు.

title
మేళాలో ప్రత్యేక ఆకర్షణ... నాగ సాధువులు

వాళ్లు బంధాలు, అనుబంధాలుండవు. సర్వం త్యజించిన సన్యాసులు. చలికాలమైనా, ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు.

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement