Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Drama On TTD Officers Over Tirupati Stampede Incident1
బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!

సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్‌సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసు­గులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణ­మైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..టీటీడీలో బాబు బినామీలు పాగా..పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్‌ టీటీడీ వ్యవస్థను హైజాక్‌ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్‌ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్‌ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్‌ కుమార్‌ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్‌ మర్యాదలు అందిస్తున్నారు.ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌక­ర్యా­లను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్‌ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్ర­బాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగంతిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్‌ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్‌ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.పరారైన బాబు ముఠాతమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్ర­బాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్‌ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకు­న్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్ర­బాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కిన­ట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విష­యాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి.

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali2
ఏడు చేపల కథ!

‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్‌? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్‌ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్‌ ఆఫ్‌ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్‌ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్‌ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్‌ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్‌ అడ్రస్‌ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్‌టైమ్‌ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్‌ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్‌ సర్కారే కనిపించింది. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్‌ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్‌ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్‌ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్‌ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్‌ టెక్‌’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్‌సెన్స్‌ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్‌ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్‌ కల్యాణ్‌ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్‌ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్‌ మాఫ్‌! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్‌ కల్యాణ్‌ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్‌ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్‌లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్‌ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్‌ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్‌ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్‌ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్‌ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్‌ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్‌ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్‌ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Daaku Maharaaj Movie Twitter Review3
Daku Maharaaj : ‘డాకు మహారాజ్‌’ ట్విటర్‌ రివ్యూ

వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్‌ బాబీ ఓ మంచి మాస్‌ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్‌ పవర్‌ఫుల్‌ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్‌ బాగుంది. కానీ క్లైమాక్స్‌ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్‌ పడొచ్చు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ 3.25 రేటింగ్‌ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్‌ మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌.కానీ సెకండాఫ్‌ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్‌ కాంబో మరోసారి సాలిడ్‌ మాస్‌ మూమెంట్స్‌ని అందించారు. డైరెక్టర్‌ బాబీ బాలయ్యను సెట్‌ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025

Increases Bus Charges: Private Bus Exploitation During Sankranti Festival4
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బాదుడే బాదుడు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ‘ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రైవేట్‌ సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్‌ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..’ ఇది సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పదే పదే మీడియాలో చెబుతున్న మాట.. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్‌ బస్సుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆన్‌లైన్‌లో ధరలను మూడు, నాలుగింతలు పెంచేసి నిలువు దోపిడీ చేసే­స్తు­న్నారు. పైగా.. టికెట్లను బ్లాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి రూ.వందల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్‌ వేశారు.ఎందుకంటే పండుగ రద్దీకి తగ్గట్లుగా ఆర్డీసీ బస్సు సర్వీసుల్లేవు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులే దిక్క­య్యాయి. ఇదే అదనుగా రాష్ట్రంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తోంది. చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేసి ఎడాపెడా దోచేస్తోంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఎందుకంటే రవాణా శాఖలో ఓ కీలక నేతకు ఈ సిండికేట్‌ ముందుగానే రూ.50 కోట్లకు పైగా ముడుపులు అందించినట్లు ఆరోప­ణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం తక్కువ. ఒకవేళ ఉన్నా వారు డబ్బులు తీసుకుని టికెట్‌ బుక్‌­చేసినట్లు మెసేజ్‌ ఇస్తున్నారు. అందులో వ్యూహా­త్మకంగా టికెట్‌ ధర పేర్కొనడంలేదు. కానీ, ఆన్‌లై­న్‌లో మాత్రం పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నారు. మూడు, నాలుగురెట్లు అధికంగా చార్జీలు..ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులే దిక్కు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్‌ చేసేశాయి. ఆ తర్వాత చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేశాయి. ఉదా.. ⇒ సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్‌ ఏసీ బస్సు రూ.750, ఏసీ బస్సు రూ.1,200, స్లీపర్‌ బస్సు రూ.1,500 టికెట్‌ వసూలుచేసేవారు. కానీ, ఈ పండుగ సీజన్‌లో నాన్‌ ఏసీ బస్సు రూ.2 వేలు, ఏసీ బస్సు రూ.3 వేలు, ఏసీ స్లీపర్‌ బస్సు రూ.5 వేలు వరకు అమాంతంగా పెంచేశారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకైతే మరో రూ.500 వరకు అదనంగా చెల్లించాలి. ⇒ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో రూ.వెయ్యి వసూలుచేసే­వారు. ఇప్పుడు దానిని రూ.2,500కు పెంచేశారు. ⇒ విజయవాడ నుంచి రాయలసీమలోని కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు రూ.1,200 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4వేల వరకు పెంచేయడం గమనార్హం. ⇒ కాకినాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాలకు కూడా చార్జీలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ భారీగా పెంచేసింది. ⇒ ఇక సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్‌ 1,500 ఉంటే ఇప్పుడు రూ.3వేల వరకు ఉంది. నాన్‌–ఏసీ స్లీపర్‌ ధర రూ.1,000 నుంచి రూ.2,500కు పెరిగింది. అదే నాన్‌–ఏసీ బస్సు అయితే రూ.850 ఉన్న దానిని రూ.2 వేల వరకు పెంచారు. ⇒ బెంగుళూరు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్‌ సాధారణ రోజుల్లో రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.2,500 వరకు ఉంది. అదే నాన్‌–ఏసీ స్లీపర్‌కు రూ.900 నుంచి రూ.2వేలు, నాన్‌–ఏసీకి రూ.800 నుంచి రూ.1,700 వరకు పెంచారు.⇒ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో నాన్‌ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్‌ ఏసీ బస్సుకు రూ.650–­750, హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్‌ ఏసీ రూ.600–రూ.700 రూపాయలు.. కానీ, పండుగ సీజన్‌తో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును పెంచేశారు. ⇒ అదే బెంగళూరుకు ఆర్టీసీలో రూ.900 నుంచి రూ.18 వందల వరకూ ధర ఉండగా, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రూ.2 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలుచేస్తున్నారు. ఈ రేట్లను అధికారికంగా వెబ్‌సైట్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు. రూ.1,200 కోట్ల దోపిడీ..దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారానే ప్రయాణించనుండటం సిండికేట్‌ దోపిడీకి మార్గం సుగమమైంది. సగటున ఒక్కో టికెట్‌పై సరాసరిన రూ.1,500 వరకు అదనపు బాదుడుకు పాల్పడుతోంది. ఇలా 40 లక్షల మంది రానూపోనూ ప్రయాణం అంటే 80 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆ ప్రకారం రూ.1,200 కోట్లు దోపిడీకి ప్రైవేట్‌ బస్సుల ముఠా పాల్పడుతోంది.⇒ ఈమె పేరు బొత్స పద్మప్రియ. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని. హైదరాబాద్‌లో ఓ పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువైపు నుంచి రైలు టికెట్‌ దొరికింది. కానీ, తిరుగు ప్రయాణానికి దొరకలేదు. దీంతో.. 20 రోజుల ముందే ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంది. అయినా ఆ ట్రావెల్స్‌ ఆపరేటర్‌ సంక్రాంతి సీజన్‌ పేరుతో రూ.4,220.95 చార్జీ అని, జీఎస్టీ పేరుతో మరో రూ.780 వసూలుచేశారు. విచిత్రమేమిటంటే టికెట్‌లో జీఎస్టీ కోసం మినహాయించిన మొత్తాన్ని చూపించలేదు. ముందు బుక్‌ చేయకపోతే నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని పద్మప్రియ వాపోయింది.కీలక నేతకు ముడుపుల మేత?ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ అమాంతంగా చార్జీలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా రవాణా శాఖ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది అందరి అనుమానం. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాకు రాయలసీమకు చెందిన రవాణా శాఖ కీలక నేతే పచ్చజెండా ఊపారు. ఎందుకంటే.. ట్రావెల్స్‌ సిండికేట్‌ ముందుగానే ఆయనతో డీల్‌ కుదుర్చుకుంది. విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి, ఆ కీలక నేత పేషీలోని ఓ ముఖ్య ఉద్యోగే ఈ డీల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందుకే.. వీటివైపు కన్నెత్తి చూడడంలేదు.చార్జీలను అమాంతంగా పెంచేశారు..సంక్రాంతి పేరుతో ప్రైవేట్‌ బస్సుల్లో చార్జీలను అమాంతంగా పెంచేశారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ నుంచి సొంతూరు వచ్చి వెళ్లాలంటే చార్జీ­లకు రూ.25 వేలు అవుతోంది. సరిపడా బస్సులను ప్రభుత్వం ఏర్పాటు­చేయక­పో­వ­డం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతు­న్నారు. పెంచిన చార్జీలను వెబ్‌సైట్‌లో పెడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. – కార్తీక్‌ రామిరెడ్డి, నెల్లూరువిమాన టికెట్‌ ధరలకూ రెక్కలు..గన్నవరం: సంక్రాంతి సందర్భంగా విమాన టికెట్ల ధరలకూ రెక్కాలొచ్చాయి. సాధారణ రోజులతో పోల్చితే ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానాల్లో ధరల దరువు ఎక్కువగా ఉంది. రైళ్లు, బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో పండక్కి స్వగ్రామాలకు వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతు­న్నారు. దీంతో విమాన టికెట్‌ ధరలు కొండెక్కాయి.ముఖ్యంగా.. బెంగళూరు నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.3,500 నుంచి రూ.3,750 ఉండే విమాన టికెట్‌ ధరలు ఈ మూడు రోజులు రూ.13,350 నుంచి రూ.16,058 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే విమానాల టికెట్‌ ధరలు సాధారణ రోజుల్లో రూ.3 వేల లోపు ఉండగా ప్రస్తుతం రూ.11,615 నుంచి రూ.16,716 వరకు పెరిగాయి. ఇక న్యూఢిల్లీ–విజయవాడ మధ్య టికెట్‌ ధర రూ.6,500 నుంచి రూ. 20,986కు చేరుకోవడం గమనర్హం. అలాగే, చెన్నై నుంచి విజయవాడకు టికెట్‌ ధర నాలుగు రేట్లు పెరిగి రూ. 13,407కు, ముంబై నుంచి విజయవాడకు రూ.4 వేలులోపు ఉండే టికెట్‌ ధర రూ. 11,975కు చేరింది. పండుగ తర్వాత కూడా ఈ ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశముందని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Weekly Horoscope Telugu 12-01-2025 To 18-01-20255
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. దూరప్రయాణాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.వృషభం...అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. గణపతి స్తోత్రాలు పఠించండి.మిథునం.....ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలు. తెలుపు, నేరేడురంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.సింహం...కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.కన్య....వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. గణేశాష్టకం పఠించండి.తుల....ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.వృశ్చికం...కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం చివరిలో శ్రమాధిక్యం. వివాదాలు. నీలం, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మకరం...మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. గణేశ్‌ను పూజించండి.కుంభం...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం....పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

163rd Birth Anniversary of Swami Vivekananda6
Swami Vivekananda: గమ్యం.. చేరే వరకూ..!

‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచి్చన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది.‘గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే తన సహజ లక్షణమైన ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది.’ అని వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ..మరిన్ని విశేషాలు.. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా పాటించనున్నారు. రామకృష్ణమఠంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. జాతి నిర్మాణంలో యువశక్తి ఎంతో కీలకమైందనే సందేశాన్నిస్తూ ట్యాంక్‌బండ్‌ నుంచి రామకృష్ణ మఠం వరకూ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే నేషనల్‌ యూత్‌ డే వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గోనున్నారు. ‘ఛేంజింగ్‌ యూత్‌ పవర్‌ ఫర్‌ నేషనల్‌ బిల్డింగ్‌’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యువజన ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.. సృజన శక్తులన్నీ నీలోనే.. మనం బలహీనులం, అపవిత్రులం అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ బలవంతులు, శక్తిసంపన్నులే. అనంతశక్తి మీలోనే దాగివుంది. జీవితంలోని ప్రతి సందర్భంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో వివేకానందుడు ప్రబోధించాడు. ‘మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి’ అన్నారు. నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొని స్వరూపజ్ఞానంతో కార్యాచరణ చేపట్టినప్పుడు గొప్ప శక్తి, తేజస్సు లభిస్తాయి. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ప్రతి ఒక్కరికీ వారి నిజస్వరూప జ్ఞానాన్ని తెలియజేయడమే ఔన్నత్యానికి మార్గం. పౌరుషాన్ని ప్రకటించడం అంటే దౌర్జన్యం, హింస వంటి వాటి కోసం శక్తియుక్తులను వినియోగించటం కాదు. సాధువర్తనం కలిగి ఉండడం. నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం, అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని వివేకానంద బోధించారు. యువత తమలోని సృజనశక్తులను ఆవిష్కరించేందుకు ఆ బోధనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ‘విశ్వ’ భావన ఉండాలి.. ప్రతి ఒక్కరూ ‘విశ్వవ్యాపిత భావన’ను కలిగి ఉండాలి. ‘పరిమితమైన నేను’ ‘నేను ఫలానా’, ‘ఇది నాది’ వంటి అనేక స్వార్థబంధాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ ‘పరిమిత నేను’ నుండి విడివడి ‘విశ్వవ్యాపిత నేను’ అనే భావనతో తాదాత్మ్యం చెందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు కావలసింది మనుషులు మాత్రమే అంటారు స్వామి వివేకానంద. బలవంతులు, చక్కటి నడవడిక కలిగినవాళ్లు, గొప్ప ఆత్మవిశ్వాసమున్న యువకులు కావాలని చెబుతారు. అలాంటివారు వంద మంది దొరికినా ప్రపంచం పూర్తిగా మారిపోతుందంటారు. అలాంటి యువత కావాలి ఇప్పుడు.నేషనల్‌ యూత్‌ డే..ఈ నెల 12న రామకృష్ణమఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్సీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలతో పాటు, జాతీయ యువజన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమంలో స్వామి బోధమయానంద ‘ఛేంజింగ్‌ యూత్‌ ఫర్‌ నేషనల్‌ బిల్డింగ్‌’ పై తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు చెన్నైకి చెందిన తుగ్లక్‌ మేగజైన్‌ సంపాదకులు ఎస్‌.గురుమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా 18 అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద మ్యూరల్‌ను ఆవిష్కరించనున్నారు.సహనమే సరైన లక్షణం..శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఏదైనా సాధించగలమనే విశ్వాసం పెరిగింది. కానీ అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదే సహనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి. కానీ వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు కాదు. అనుకున్నదే తడవుగా అన్నీ జరిగిపోవాలనుకుంటారు, కానీ ప్రతికూలత ఎదురు కాగానే కుదేలయిపోతున్నారు. ప్రతికూలత ఎదురైనపుడు సహనంతో, ఓర్పుతో దానిని ఎదుర్కొనే సామర్థ్యం అలవర్చుకోవాలి. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తుంది. అలాగే మనిషి మానసిక స్థైర్యాన్ని ప్రతికూలతలు పరీక్షిస్తాయి. అందుకే వేచివుండాల్సిన సమయంలో నిరాశ నిస్పృహలకు లోనవకుండా ఓర్పుతో నిరీక్షించటం ఎంతో అవసరం. ‘అసహనం ప్రకటించటం వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది’ అని చెప్పిన వివేకానందుడి మాటలను గుర్తుంచుకోండి. – స్వామి బోధమయానంద, రామకృష్ణమఠం అధ్యక్షులు

My Wife is Wonderful, I Love Staring at Her says Anand Mahindra7
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం

న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్‌ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్‌ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్‌ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. ఎక్స్‌ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు.

You Can Change The World in 10 Hours Says Anand Mahindra8
'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు'

పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy), ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వివిధ రకాలుగా స్పందించారు. ప్రస్తుతం పనిగంటలపై సర్వత్రా చర్చ మొదలైపోయింది. తాజాగా దీనిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యాంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.వారానికి 70 గంటల పనిఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.వారానికి 90 గంటల పనిఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్‌ అండ్‌ టుబ్రో చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు.వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందనభారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై గౌతమ్ అదానీ (Gautam Adani) మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..70 గంటల పనిపై నిమితా థాపర్ వ్యాఖ్యలుహ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' (Namita Thapar) మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.పని గంటల పెంపు.. ఉద్యోగులపై తీవ్రమైన పని భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తుందని కొందరు తీవ్రంగా ఖండిస్తే.. మరికొందరు పని గంటలు పెంచడం సరైనదే అని సమర్ధించారు. ఏది ఏమైనా పనిగంటలు వ్యవహారం రోజు రోజుకి తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది.

Indian womens second ODI against Ireland today9
సిరీస్‌ విజయంపై గురి

రాజ్‌కోట్‌: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్‌ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్‌ హసబ్నిస్‌ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్‌ ఫామ్‌ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే టిటాస్‌ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్‌ బెంచ్‌ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్‌ అదే జోష్‌లో సిరీస్‌ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది.

Ind vs Eng T20Is: India Squad Announced Shami Comeback Superstar Ignored10
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌(India vs England)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్‌ బౌలర్‌.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ బెంగాల్‌ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు, మరో స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్‌ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు హర్షిత్‌ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌(Axar Patel), వాషింగ్టన్‌ సుందర్‌ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్‌ ద్వారా.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్‌ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ ఆడింది. ఆ టూర్‌లో సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా ప్రొటిస్‌ జట్టును 3-1తో ఓడించి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌(వైస్‌ కెప్టెన్‌), హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌). చదవండి: స్టీవ్‌ స్మిత్‌ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్‌’ రికార్డ్‌!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement