Top Stories
ప్రధాన వార్తలు
మళ్లీ మస్కే.. ఫోర్బ్స్ తాజా టాప్ 10 బిలియనీర్లు వీళ్లే..
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. ఫోర్బ్స్ (Forbes) తాజా బిలియనీర్ ర్యాంకింగ్‌ల ప్రకారం.. 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 2025 సంవత్సరాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రారంభించారు. ప్రధానంగా స్పేస్ఎక్స్ (SpaceX) విలువ 350 బిలియన్ డాలర్లకు పెరగడంతో గడిచిన డిసెంబర్ 1 నుండి మస్క్ నెట్‌వర్త్ 91 బిలియన్ డాలర్లు పెరిగింది.గణనీయ పెరుగుదలఫోర్బ్స్ ర్యాంకింగ్ మొదటి 10 మంది సంపన్న వ్యక్తుల నెట్‌వర్త్‌లో గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. వారి మొత్తం సంపద డిసెంబర్లో 1.8 ట్రిలియన్ డాలర్ల నుండి 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సంపన్న వ్యక్తులు.. పెరిగిన వారి సంపద గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ఎలాన్ మస్క్421.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఫోర్బ్స్ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. 2002లో స్పేస్ఎక్స్ని స్థాపించి దాని సీఈవోగా (CEO) కొనసాగుతున్న మస్క్.. టెస్లాకు అధిపతిగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (X), ఏఐ (AI) కంపెనీ ‘ఎక్స్ఏఐ’ (xAI), టన్నెలింగ్ సంస్థ బోరింగ్ కోలో వాటాలను కలిగి ఉన్నారు. టెస్లాలో ఆయనకు 13% వాటా ఉంది.జెఫ్ బెజోస్అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) 233.5 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. బెజోస్ 1994లో అమెజాన్‌ను ఆన్లైన్ పుస్తక దుకాణంగా స్థాపించారు. తరువాత క్లౌడ్ కంప్యూటింగ్, వినోదం, మరిన్నింటికి విస్తరించారు. ఆయన ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ను కూడా స్థాపించారు. గత డిసెంబర్ లో అమెజాన్ స్టాక్ 5% పెరిగింది. దీంతో ఆయన సంపదకు దాదాపు 10 బిలియన్ డాలర్లు తోడయ్యాయి.లారీ ఎల్లిసన్ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) 209.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. 1977లో కంపెనీని స్థాపించిన ఆయన 2014 వరకు సీఈవోగా నాయకత్వం వహించారు. ఇప్పుడు ఛైర్మన్, సీటీవో (CTO)గా పనిచేస్తున్నారు. ఒరాకిల్ స్టాక్ డిసెంబర్ లో 9% పైగా పడిపోయింది. ఆయన సంపద నుండి సుమారు 17 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు.మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫోర్బ్స్ ప్రకారం 202.5 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. కంపెనీలో ఆయనకు దాదాపు 13% వాటా ఉంది. మెటా షేర్లు 1.9% పెరగడంతో గత డిసెంబర్ లో ఆయన నెట్‌వర్త్ 3.8 బిలియన్ డాలర్లు పెరిగింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ (LVMH) సీఈవో, ఛైర్మన్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( Bernard Arnault) నికర విలువ $168.8 బిలియన్ డాలర్లు. ఎల్వీఎంహెచ్ పోర్ట్‌ఫోలియోలో క్రిస్టియన్ డియోర్ కోచర్, గివెన్చీ, ఫెండి, సెలిన్, కెంజో, టిఫనీ, బల్గారీ, లోవే, ట్యాగ్ హ్యూయర్, మార్క్ జాకబ్స్, సెఫోరా వంటివి ఉన్నాయి. గత నెలలో ఎల్వీఎంహెచ్ షేర్లలో 7% పెరుగుదలతో ఆర్నాల్డ్ నెట్‌వర్త్ 8.5 బిలియన్ డాలర్లు పెరిగింది. లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచారు.లారీ పేజ్గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ స్టాక్ ధర 11% పెరగడంతో లారీ పేజ్ (Larry Page) సంపద కూడా 14 బిలియన్ డార్లు పెరిగి 156 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజా లిస్ట్‌లో ఈయనది ఆరో స్థానం. పేజ్ 1998లో సెర్గీ బ్రిన్‌తో కలిసి గూగుల్ (Google)ని స్థాపించారు. 2001 వరకు, మళ్లీ 2011 నుండి 2015 మధ్య దానికి సీఈవోగా పనిచేశారు ఇప్పుడాయన ఆల్ఫాబెట్లో బోర్డు సభ్యుడుగా ఉంటూ నియంత్రణ వాటాను కలిగి ఉన్నారు.సెర్గీ బ్రిన్ఆల్ఫాబెట్ స్టాక్ ధర పెరుగుదల కారణంగా లారీ పేజ్ లాగే గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) నెట్‌వర్త్ కూడా గత నెలలో 14.7 బిలియన్ డాలర్లు పెరిగి 149 బిలియన్ డాలర్లకు చేరింది.ఈ పెరుగుదల ఆయన్ని ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 8వ ర్యాంక్ నుండి 7వ స్థానానికి నెలబెట్టింది.వారెన్ బఫెట్డిసెంబర్లో బెర్క్‌షైర్ హాత్వే స్టాక్ ధర 6% పడిపోవడంతో వారెన్ బఫెట్ (Warren Buffett) సంపద నుండి 8.9 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడాయన నెట్‌వర్త్ 141.7 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆయన ర్యాంక్ 6 నుండి ర్యాంక్ 8కి పడిపోయింది. వారెన్ బఫ్ఫెట్ బీమా సంస్థ గీకో, బ్యాటరీ కంపెనీ డ్యూరాసెల్, ఫాస్ట్ ఫుడ్ చైన్ డైరీ క్వీన్ వంటి ప్రధాన వ్యాపారాలను కలిగి ఉన్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ (Steve Ballmer) 124.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. హార్వర్డ్‌లో బిల్ గేట్స్ మాజీ క్లాస్మేట్ అయిన స్టీవ్ బామర్ 2000 నుండి 2014 వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, బామర్ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. డిసెంబరులో బామర్ సంపద సుమారు 500 మిలియన్ డాలర్లు తగ్గింది.జెన్సన్ హువాంగ్ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) 117.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 10వ స్థానంలో ఉన్నారు. ఏఐ రంగంలో కంపెనీ చిప్‌లు ప్రజాదరణ పొందడంతో ఆయన సంపద పెరిగింది. డిసెంబరులో ఎన్విడియా షేర్లలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, హువాంగ్ టాప్ 10 సంపన్నులలో స్థానాన్ని పొందారు.
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు!
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు.
‘శీష్‌మహల్’ ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్
ఢిల్లీ : ‘కోవిడ్-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం శీష్‌మహల్‌ను నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యారు. శీష్‌మహల్ (Sheeshmahal) కోసం పెట్టిన ఖర్చు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రజల సంక్షేమం కంటే ఆయనకు విలాసాలు కావాల్సి వచ్చిందంటూ’ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says "The 'AAP-DA' people have left no stone unturned in destroying Delhi's transport system. These people are not paying any attention to the maintenance of buses. The common citizens of Delhi have suffered… pic.twitter.com/I93IqlMaKz— ANI (@ANI) January 5, 2025 అదే సమయంలో కేజ్రీవాల్ అధికారిక నివాసంపై మోదీ ప్రశ్నలు సంధించారు. మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా ప్రాధాన్యమని సూచించారు.అనంతరం, మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ..ఆప్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు. ‘దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారని మోదీ నొక్కాణించారు.👉చదవండి : ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సెటైర్లు
‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’
ఢిల్లీ: ‘నన్ను క్షమించండి. ప్రియాంక గాంధీ (priyanka gandhi) గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను’అని ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) క్షమాపణలు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (delhi assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.ఈ తరుణంలో కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనేట్ మండిపడ్డారు.మహిళల పట్ల బిదూరి మనస్తత్వాన్నిఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అవును. ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే. హేమామాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. 👉చదవండి: ప్రియాంకగాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు నోటిని అదుపులో పెట్టుకోకపోతేనోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తన పార్టీ మాజీ ఎంపీలకు తెలిసొచ్చేలా చేసింది బీజేపీ అధినాయకత్వం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 400పై చిలుకు లోక్‌సభ స్థానాల్ని గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేసింది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేష్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు సీట్లను నిరాకరించింది. వారిలో రమేష్ బిదురి ముందు వరసలో ఉన్నారు. రమేష్ బిదురిఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది.అనంత్‌కుమార్ హెగ్డేకర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.పర్వేష్ సాహిబ్సింగ్ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.ప్రజ్ఞాసింగ్ ఠాకూర్మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించినా, ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. అందుకే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను పక్కన పెట్టేసింది.
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025
ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు.‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. వీఆర్ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదుట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు
కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)1% మాత్రమే బతికే ఛాన్స్దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
హైదరాబాద్: మినర్వా కిచెన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ఒకే రోజు రెండు హాఫ్ సెంచరీలు.. ఫామ్‌లోకి వచ్చిన బాబర్ ఆజమ్
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
హైదరాబాద్: మినర్వా కిచెన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ఒకే రోజు రెండు హాఫ్ సెంచరీలు.. ఫామ్‌లోకి వచ్చిన బాబర్ ఆజమ్
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
సినిమా
Game Changer: కాఫీ కప్పులోనే ఊరి సెట్.. ఆ పాటకే 30 కోట్లు
గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ లిరికల్ వీడియో వచ్చినప్పుడు చూసి నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ రీసెంట్గా పూర్తి పాటను చూసి షాకయ్యాను. దాదాపు రూ.25-30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాటను తెరకెక్కించారు. కాఫీ కప్పులోనే ఊరి సెట్ వచ్చేలా శంకర్ ప్లాన్ చేశారు. థియేటర్లో ఆ పాట బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఆ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోయాయనిపిస్తుంది. అంతలా శంకర్ గారు మ్యాజిక్ చేశారు’ అన్నారు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్(Game Changer) కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.→ ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.→ నటుడిగా ఓ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. శంకర్(Shankar) గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.→ ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.→ గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ).→ గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.→ నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే..ఖషి2 తెరకెక్కిస్తాను.
డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్
డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్మెన్ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నన్నే టార్గెట్ చేస్తున్నాడునాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్‌తో పిలిచాడు. (చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు)చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను. మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను. (చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్)ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదునేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్‌లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.సినిమాకాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న ‘లవ్‌రెడ్డి’
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’(Love Reddy Movie). యువ దర్శకుడు స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 18న థియేటర్స్‌లో రిలీజ్ అయి మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, అమెజాన్ ఫ్రైమ్ వీడియో( Amazon Prime Video)లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అమెజాన్ ప్రెమ్‌లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఈ చిత్రం నిలిచింది. తమ సినిమా ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో ద్వారా మరింతగా రీచ్ కావడం పట్ల మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లవ్ రెడ్డి కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
టిమ్ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్‌బాష్ లీగ్‌లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్.. ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ విధ్వంసం ధాటికి అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), అలెక్స్ రాస్ (47) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. ఓలీ పోప్ (33), జేమీ ఓవర్టన్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు. హరికేన్స్ బౌలర్లలో వకార్ సలామ్‌ఖీల్ 2, క్రిస్ జోర్డన్, స్టాన్లేక్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ డేవిడ్ అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్ ఓవెన్ (37), మాథ్యూ వేడ్ (27), నిఖిల్ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, కెమరూన్ బాయ్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.శతక్కొట్టిన రజత్ పాటిదార్విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 132 పరుగులు (నాటౌట్) చేశాడు. పాటిదార్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుదీప్ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాట్ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ రజత్ పాటిదార్.. శుభమ్ శ్యామ్‌సుందర్ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.భీకర ఫామ్‌లో పాటిదార్దేశవాలీ క్రికెట్లో రజత్ పాటిదార్ భీకరఫామ్‌లో ఉన్నాడు. రజత్ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్ గత 14 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు.
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్‌పై టెస్ట్, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు.
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్, బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.సెలెక్టర్లకు సవాల్..తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ఈ మ్యాచ్‌లో బెంగాల్ కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్), కౌశిక్ మైతి (20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్యన్ పాండే, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్, సాగర్ సోలంకీ చెరో వికెట్ దక్కించుకున్నారు.270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు. శుభమ్ శ్యామ్ సుందర్ శర్మ (53), కెప్టెన్ రజత్ పాటిదార్ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
కోహ్లి ఇప్పట్లో రిటైర్ కాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సొంత అభిమానులు సైతం కోహ్లిని ఎండగడుతున్నారు. తాజాగా ముగిసిన బీజీటీలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు మాత్రమే చేశాడు. బీజీటీ 2024-25 ద్వారా కోహ్లికి ఉన్న ఓ వీక్ పాయింట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోలేక నానా అవస్థలు పడ్డాడు. తొమ్మిదింట ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో రిటైర్మెంట్పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోహ్లి అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పీటీఐ నివేదిక కొట్టిపారేస్తుంది. కోహ్లికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని సదరు నివేదిక పేర్కొంది. కోహ్లి తనకు తాను లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నాడని తెలిపింది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ప్రణాళికలు సెట్ చేసుకున్నాడని పేర్కొంది.ఇదిలా ఉంటే, కోహ్లి సహా రోహిత్ శర్మను త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. రో-కోను ఏ ప్రాతిపదికన ఇంగ్లండ్‌తో పరిమత సిరీస్‌లకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు ప్రశిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి దేశవాలీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ నిరూపించుకున్నాకే వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. విశ్లేషకుల అంచనా మేరకు, రోహిత్‌తో పోలిస్తే కోహ్లికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు అవకాశాలు రాకపోవడానికి అతని ఫామ్ లేమితో పాటు వయసు కూడా ప్రధాన అంశమే. వయసులో కోహ్లి రోహిత్ కంటే సంవత్సరం చిన్నవాడు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి రోహిత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు. బీజీటీ.. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లి సెంచరీలు చేశాడు. రోహిత్ పరిస్థితి అలా లేదు. అతను ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే.. కోహ్లి కంటే ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లికి ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.కాగా, బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది.
బిజినెస్
హైదరాబాద్‌లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్‌వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్‌కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్‌కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త ఐపీవో.. ఒక్కో షేర్ ధర రూ.128–135
మౌలిక రంగ నిర్మాణ సంస్థ బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (BR Goyal Infrastructure) ఐపీఓ జనవరి 7న ప్రారంభమై 9న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.128–135గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.85.2 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇష్యూలో భాగంలో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 63.12 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జనవరి 6న బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని మూల ధన వ్యయానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు, వృద్ధి ఆధారిత కార్యక్రమాలకు వినియోగిస్తామని కంపెనీ చైర్మన్ బ్రిజ్ కిషోర్ గోయల్ తెలిపారు. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్, రిజిస్ట్రార్‌గా లింక్ ఇన్‌టైం ఇండియా వ్యవహరిస్తున్నాయి.క్వాడ్రాంట్ ఫ్యూచర్ కూడా అదే రోజునే..రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) కూడా ఈనెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐపీవో బాటలో సన్‌షైన్ పిక్చర్స్సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 83.75 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 50 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు.ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ర. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి కార్యకలాపాలకు వినియోగించనుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సృష్టి, అభివృద్ధి, నిర్మాణం, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను కంపెనీ ప్రధానంగా చేపడుతోంది. ఇప్పటికే 10 సినిమాలు నిర్మింంది. వీటిలో 6 మూవీలకు సహనిర్మాతగా వ్యవహరింంది. 2 వెబ్‌సిరీస్‌లు, 2 సీరియళ్లు సైతం కంపెనీ నుంచి వెలువడ్డాయి.కంపెనీ నుంచి త్వరలో గుడ్ మార్నింగ్ రియా, గవర్నర్, కేరళ స్టోరీ2, బుల్డోజర్, సముక్, భీమ్ తదితర సినిమాలు రానున్నాయి. ఈ బాటలో మాయా, నానావతి వెర్సస్ నానావతి, విజిల్ బ్లోయర్ వెబ్‌సిరీస్ ప్రాజెక్టులు సైతం చేపట్టింది. ఈ ఏడాది(2024–25) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో రూ. 45 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.
ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!
ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్‌లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్‌లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు, రిటైలర్లు పాంటూన్లు వంటివన్నీ చూడవచ్చు.గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్ఫర్డ్ (యూకే)లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్‌లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్‌డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్‌డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్‌కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.సౌత్ స్టేషన్ రీడెవలప్మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)న్యూ ఇంగ్లాండ్‌లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్‌ను కూడా రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.గోథే ఇన్స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్కర్ ప్రైజ్‌ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.అర్బన్ గ్లెన్, హాంగ్జౌ (చైనా)బీజింగ్‌లోని సీసీటీవీ హెడ్‌క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్లు అర్బన్ గ్లెన్లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్‌లో ప్రారంభమైంది.స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్‌తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది.
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్‌కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది.
ఫ్యామిలీ
బభ్రువాహన ప్రేత సంవాదం
పూర్వకాలం బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. మహోదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని, అతడు జనరంజక పాలన కొనసాగించేవాడు. ఒకనాడు ఆయన పరివారంతో కలసి వేట కోసం కీకారణ్యానికి వెళ్లాడు. అడవిలో ఒక లేడి కనిపించింది. బభ్రువాహనుడు ఆ లేడిని వేటాడాలనుకుని, దానిపై బాణం వేశాడు. అది బాణం నుంచి తప్పించుకుని, పరుగు తీసింది. దాన్ని ఎలాగైనా వేటాడి తీరాలనుకుని, బభ్రువాహనుడు ఆ లేడిని వెంటాడుతూ, తన పరివారానికి దూరంగా సాగిపోయి, ప్రేతాలు సంచరించే తావుకు చేరుకున్నాడు.అదే సమయానికి అక్కడ ఉండే ఒక ప్రేతం బభ్రువాహనుడి ముందు ప్రత్యక్షమైంది.‘మహారాజా! చాలా ఏళ్లుగా నేను ప్రేతరూపంలో ఉన్నాను. ఇన్నాళ్లకు రాజువైన నిన్ను చూడటంతో నా పాపాన్ని కొంత పోగొట్టుకున్నాను. నేను మరణించాక, నాకు ఉత్తరక్రియలు జరిపేవారు ఎవరూ లేక నేనిలా ప్రేతంగా మారాను. నువ్వు రాజువు. రాజు అంటే ప్రజలను రంజింపజేసేవాడు. కాబట్టి, నువ్వు నగరానికి వెళ్లిన తర్వాత నాకు ఉత్తరక్రియలు జరిపించు. బాగా బతికిన వాణ్ణి. అనాథలా ఇతరుల సొమ్ముతో ఉత్తరక్రియలు జరిపించుకోలేను. నా దగ్గర ఒక అతిలోకమణి ఉంది. ఇదిగో! ఆ మణి. దీనిని తీసుకో! ఇది చాలా విలువైనది. ఖర్చు నిమిత్తం ఇచ్చాననుకున్నా సరే, లేదా ఈ మణికి నువ్వు వారసుడివి అనుకున్నా సరే, నాకు అభ్యంతరం లేదు. ఇది తీసుకుని, నాకు ఉత్తరక్రియలు జరిపించడం మాత్రం మరువకు’ అని వేడుకుంది.తన ఎదుట ప్రేతం ప్రత్యక్షమవడంతోనే బభ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రేతం కోరిన కోరిక విన్న తర్వాత మరింతగా విస్మయం చెందాడు. రాజు కాబట్టి తన భావోద్వేగాలను బయటపడనివ్వకుండా, తొణకకుండా ఇలా అడిగాడు:‘ఓ ప్రేతమా! నువ్వు కోరిన కోరిక సబబుగానే ఉంది. నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు, గోత్ర ప్రవరలు తెలియకుండా ఉత్తరక్రియలు జరిపించడం, కర్మకాండలు ఆచరించడం సాధ్యం కాదు కదా! అందువల్ల నువ్వు పార్థివదేహంతో జీవించి ఉన్ననాటి వివరాలు చెప్పు!’ అన్నాడు.బభ్రువాహనుడు అడిగిన దానికి ప్రేతం బదులిస్తూ, ‘మహారాజా! పార్థివదేహంతో నేను జీవించిన నాటి వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను! వైదేశమనే నగరంలో వైశ్యుడిగా జన్మించాను నేను. నా పేరు దేవగుప్తుడు. జ్ఞానం తెలిసినది మొదలు నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు. జీవించిన కాలమంతా నిత్య దేవతారాధనలు చేశాను. పేదసాదలకు దాన ధర్మాలు చేశాను. ఎన్నో శిథిలాలయాలకు జీర్ణోద్ధరణ చేశాను. నిర్మితాలైన శూన్యాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసి, వాటిలో పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశాను. విప్రులకు అగ్రహారాలు ఇచ్చాను. సత్యాన్ని గౌరవించాను, ధర్మాన్ని ఆచరించాను. అయినా ఏంలాభం? మరణానంతరం ఇదిగో! ఇలా ప్రేతంలా మారిపోయాను’ అని చెప్పింది. ‘జీవించినంత కాలం ధర్మాచార పరాయణుడివైనా, ఎందుకిలా ప్రేతంగా మారిపోయావు?’ ఆశ్చర్యంగా అడిగాడు బభ్రువాహనుడు. ‘ఎందుకంటే, ఏం చెప్పను మహారాజా! నేను కన్నుమూసే వేళకు చెవిలో నారాయణ నామాన్ని పలికేవారు ఎవరూ లేరు. అవసాన క్షణాల్లో గొంతులో ఉద్ధరిణెడు తులసితీర్థం పోసేవారు లేరు. ప్రాణాలు విడిచిన తర్వాత నా దేహాన్ని దహనం చేసే వారసులు లేరు. కనీసం కన్నీరు కార్చే సోదరులు, దాయాదులు లేరు. ఉత్తరక్రియలకు నోచుకోని కారణంగానే నేనిలా ప్రేతంగా మిగిలిపోయాను. ఇదిగో! ఈ మణిని తీసుకో! నాకు ఉత్తరక్రియలు ఆచరించు’ అంటూ మణిని బభ్రువాహనుడి చేతిలో ఉంచిందా ప్రేతం.‘తప్పకుండా నీకు ఉత్తరక్రియలు ఆచరిస్తాను’ మాట ఇచ్చాడు బభ్రువాహనుడు.‘అయితే, నాదొక సందేహం. ఉత్తరక్రియలకు నోచుకోనివారికేనా, ఇతరులు ఎవరికైనా కూడా ఇలా ప్రేతత్వం సిద్ధిస్తుందా?’ అని అడిగాడు.‘ఇతరులకు కూడా సిద్ధిస్తుంది’ అని చెప్పసాగింది ప్రేతం.‘దేవతలు, బ్రాహ్మణులు, స్త్రీలు, బాల బాలికలు, వికలాంగులకు చెందిన ద్రవ్యాన్ని అపహరించిన వారికి ప్రేతత్వం సిద్ధిస్తుంది. పరస్త్రీలను బలవంతంగా చెరబట్టిన వారికి, బంగారాన్ని, నవరత్నాలను, తామర పువ్వులను దొంగిలించిన వారికి, యుద్ధంలో శత్రువుకు వెన్నుచూపి పారిపోయిన వారికి, తమకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టిన వారికి తప్పనిసరిగా ప్రేతత్వం సిద్ధిస్తుంది’‘ప్రేతత్వ విముక్తి మార్గమేమిటో చెప్పు’ అడిగాడు బభ్రువాహనుడు.‘నియమబద్ధంగా ఉత్తరక్రియలు జరిపించడం, నారాయణ నామ పారాయణం, పూజ జరిపించడం ద్వారా ప్రేతత్వ విముక్తి కలుగుతుంది. ఉత్తరక్రియలలో బ్రాహ్మణులకు షడ్రసోపేతంగా సంతర్పణ చేయాలి. షోడశ దానాలు చేయాలి. ప్రేతత్వం పొందిన వారి విముక్తి కోసం ఎవరైనా పూనుకొని ఉత్తరక్రియలను నియమబద్ధంగా ఆచరించినట్లయితే, తక్షణమే ప్రేతత్వం తొలగిపోతుంది’ అని చెప్పింది ప్రేతం.ఈలోగా బభ్రువాహనుడి భటులు ఆయనను వెదుకుతూ అక్కడకు చేరుకున్నారు. వారి అలికిడికి ప్రేతం అదృశ్యమైపోయింది. నగరానికి చేరుకున్నాక, బభ్రువాహనుడు ఆ ప్రేతానికి ఉత్తరక్రియలు జరిపించాడు. ప్రేతత్వం నుంచి విడుదల పొందిన దేవగుప్తుడు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన
యువ కథ : పారిజాతం
తెల్లవారుజాము పావు తక్కువ నాలుగవుతోంది. ఎంతసేపు పక్క మీద దొర్లినా నిద్ర పట్టడం లేదు. చోటు మారడం వల్లనేమో. పుట్టి, పెరిగి, పాతికేళ్లు గడిపిన ఇల్లే అయినా ఎందుకో నిద్ర పట్టడం లేదు. వీథి చివర టీ కొట్టు వరకు నడిచి వెళ్లొస్తే బావుండనిపించి బయటకొచ్చేశాను.ధనుర్మాసం.. చలి.. పారిజాతాలు!దారి మొత్తాన్ని ఆక్రమించేసిన పారిజాతాల్ని చూసి ఎన్నేళ్లు గడిచిపోయాయో సరిగ్గా గుర్తు లేదు. లెక్కపెట్టుకోవడం మానేసి కూడా చాలా సంవత్సరాలయ్యింది. ఈ మధ్య అసలేం గుర్తుండటం లేదు. నిమిషం క్రితం తీసి పెట్టిన కళ్లజోడు, నోట్లోనే నానుతూ ఉండే ఫోన్ నంబర్లు, అలవాటుపడిన దారులు కూడా మర్చిపోతున్నా. డాక్టర్ దగ్గరకు వెళితే ‘రోజుకు పదిమంది వస్తున్నారు సార్ మీవంటి పెద్దలు. అందరికీ అలై్జమర్స్ ఛాయలే.. ఎక్కువో తక్కువో! వృద్ధాప్య దశలో ఇవన్నీ మాములే’ అని డాక్టర్ కూడా సులువుగా చెప్పేశాడు. కాని జీర్ణించుకోవడం కష్టంగా మారింది.ఏవో రోజువారి పనులు, ఏటీఎమ్ పిన్ నంబర్లు లాంటివి మర్చిపోతే దిగుల్లేదు.. అవి మర్చిపోతున్నానన్న బాధ కంటే ఎక్కడ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతాయోనన్న భయమే ఎక్కువౌతూ ఉంది. ఈ వయసులో అందరూ వాళ్ల జీవితాల్లో నచ్చిన కొన్ని క్షణాల్ని జ్ఞాపకాలుగా పదిలంగా దాచుకుని, గతాన్ని నెమరు వేసుకోవడం వల్ల సాంత్వన పొందుతారు. పెరుగుతూ వచ్చిన వయస్సుతో పాటే ఎన్నో జ్ఞాపకాలు నా లోపలే జీవిస్తూ ఉన్నాయి. అవి నా నుంచి జారిపోతే? అందుకే గతాన్ని తవ్వుకుంటూ ఊరికొచ్చాను. జీవం ఉన్నంత వరకు నాలోని జ్ఞాపకాలు నాతోనే ఉంటే బావుండనిపించి పెనుగులాడుతున్నాను. లేకుంటే ఇంత చలిలో లేవచ్చా? ఇలా మంచుకురిసే వీథుల్లో నడవొచ్చా? ఇదీ మంచికేనేమో. ఈ రాలి పడిన పారిజాత పూలు నన్ను చుట్టేసి వెనక్కి లాక్కెళ్తున్నాయి. జ్ఞాపకాలను తట్టి లేపుతున్నాయి.ఆ రోజు గుర్తుంది..‘ముంబై మెయిలొచ్చే టైమ్ అయ్యిందిరా.. మీ నాన్న దిగిపోయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడ్రా’ అని దుప్పటి లాగేస్తూనే చెప్తూ ఉంది అమ్మ. వారాంతాల్లో నాన్న మద్రాసు నుండి వస్తే ఆయన్ని తీసుకురావడానికి సైకిల్ వేసుకుని వెళ్లాలి.. అది నా డ్యూటీ. ఎప్పుడూ సరే.. కాని ఈ చలికాలంలో కూడా! ముడుక్కుని పడుకుని గాఢ నిద్రలో ఉన్నాను. అమ్మకు కనికరం లేదు. ఆయన రాలేడా?గడియారం వైపు చూస్తే నాలుగవుతోంది. చెడ్డ కోపం వచ్చింది. విసురుగా లేచి గోడకి ఆన్చి పెట్టిన సైకిల్ని బయటకి తోస్తూ ఉంటే ‘మొహమైనా కడుక్కుని వెళ్లరా’ అంది అమ్మ మళ్లీ.‘ఈ చలికి జనాలు సస్తుంటే’ అని కసురుకుంటూ వచ్చేశాను.చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది సైకిల్. ఎక్కి తొక్కగానే కిర్రుమని ఆగిపోయింది. చలికి కాళ్ల మీదున్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచు కున్నాయి. నోట్లోంచి ముక్కులోంచి సన్నటి పొగ గాల్లో కలిసిపోయింది. జనసంచారం లేక వీథి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ పసిడి వర్ణంలో వెలుగుతున్న వీథి దీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.‘ఈ టైమ్‌లో మనుషులందరూ హాయిగా ఎంత బాగా నిద్ర పోతుంటారు. నాకేంటి ఈ బాధ’ అని గొణుక్కుంటూ వెళ్తూంటే ఎవరో దూరంగా నేల మీద ఉన్న వాటిని ఏరుకుంటూ బుట్టలో వేసుకుంటున్నారు. కొరుక్కుతినే చలిలో నేల మీద ఏరుకోడానికి ఏముంటాయి? పైగా అక్కడ చింతచెట్లు కూడా లేవు అనుకున్నాను మనస్సులో. దగ్గరికి వెళ్లే కొద్ది ఏదో సువాసన ఎటు వైపు నుండి వస్తుందో అర్థం కాలేదు. దగ్గరగా వెళ్లా. ఎవరో అమ్మాయి బుట్ట చేత్తో పట్టుకుని కిందపడిన పారిజాత పువ్వుల్ని ఏరి అందులో వేసుకుంటూ ఉంది. పారిజాతాలకి పరిమళం ఉంటుందా? అది పూలదా.. అమ్మాయి ఒంటిదా? ఇంకాస్త దగ్గరగా వెళ్లా. ఆ అమ్మాయి ముడివేసిన జుట్టులోంచి నీటి బొట్లు పరికిణీ మీదుగా జారిపోతున్నాయి. మొహం సరిగ్గా గమనించలేదు కాని ఎర్రటి ముక్కుపుడక మాత్రం స్పష్టంగా కనిపించింది. అచ్చం పారిజాత పువ్వుకాడ లాగా.ఆ ఇల్లు దాటగానే సైకిల్ ఎక్కి తొక్కడం మొదలు పెట్టి రైల్వేస్టేషన్ దగ్గర ఆగి నిలబడ్డాను. నాన్న అప్పటికే ఎప్పటిలాగే బ్రౌన్ కలర్ షోల్డర్ బ్యాగ్‌తో నిలబడి ఉన్నారు. చలికి మఫ్లర్ బిగించి ఉన్నారు. తిరిగొచ్చేటప్పుడు ఎప్పటిలానే నాన్న సైకిల్ తొక్కుతుంటే వెనుక క్యారేజ్ మీద చలిగాలికి ముడుచుకుని కూర్చున్నాను బ్యాగ్‌తో. ఆ పువ్వులున్న చెట్టు దాటుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఎప్పుడూ చూడలేదు కాని చూడాలనిపించింది ఎందుకో మరి!ఆ రోజు తర్వాత అటు వైపుగా ఎప్పుడు వెళ్లినా నా కళ్లు ఆమె కోసం వెతికేవి. ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు తిరిగా.. కనిపించనే లేదు. మళ్లీ తెల్లవారుజాము నాన్నని తీసుకుని రావడానికి సైకిల్ని తోసుకుంటూ వెళ్తూ ఉంటే పువ్వులు ఏరుకుంటూ కనిపించింది. తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో మెదులుతుంది తన రూపం. ఎరుపు రంగు వోణీ బంగారపు అంచు, తడి ఆరని జుట్టులో చిక్కుకున్న కుంకుడు పలుకులతో మెడ దగ్గర వరకూ వేలాడుతున్న కురులు. కళ్ల దగ్గర చెదిరిన కాటుక. కనుబొమ్మల మధ్య ఎర్రటి సింధూరం.మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు ఎప్పటిలాగానే !పరమ బద్ధకస్తుడిని నేను. కాని ఆ రోజు నుండి అమ్మాయిని చూడ్డం కోసమే గంట కొట్టినట్టు పొద్దున్నే నాల్గింటికి లేవడం నా దినచర్యలో భాగమైంది. అటు వైపుగా చూస్తూ వెళ్లి వీథి చివర టీ కొట్టు దగ్గర కూర్చోవడం. ఆ అమ్మాయి నన్ను చూసిందో లేదో నా గురించి తెలుసో లేదో కూడా నాకిప్పటికీ తెలీదు. కాని నేనైతే రోజూ చూసేవాడ్ని. ఏ పరిచయం లేని ఆ అమ్మాయి సొంత మనిషిలా అనిపించేది. ఆ అనుభూతి నచ్చింది. అది ప్రేమో కాదో కూడా తెలీదు. ఆ అమ్మాయి గురించిన తలపులతో మనస్సంతా హాయిగా ఉండేది.పొద్దున్నే గుడిలో తిరుప్పావై మొదలయ్యేది. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే భర్తగా తలచి పెంచుకున్న అపారమైన భక్తి ప్రేమ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు శ్రీరంగనాథుడే గోదాదేవి ప్రేమకి లొంగిపోయాడు. సాధారణ మానవులం మనమెంత! కొత్తగా ప్రేమ పుట్టుకు రావడంతో రెక్కలు మొలిచినట్టు అనిపించింది.ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ ఇంటిని చూసినా చాలనిపించి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాని అప్పుడు ఉన్న పరిస్థితులకి కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయా. నా వరకు మాత్రం తన పేరు పారిజాతం అనుకున్నా. పారిజాతం.. ఎంత బాగుంది! అసలు పేరు ఏమైనాగానీ ఆ తర్వాత మేము కలిస్తే ప్రేమ ఫలిస్తే ఒక్కటిగా బతికితే ఆజన్మాంతం పారిజాతం అనే పిలుద్దామనుకున్నా. ఈ ఊహలు ఇంకా ఎన్ని సాగేవోకాని ఆ సమయంలో నాన్న మరణం ఒక్కసారిగా కుదిపేసింది. ఇల్లంతా చీకటితో నిండుకుంది. నాన్న భుజాల వరకు ఉండేవాణ్ణి.. ఆ వయస్సులోనే బాధ్యతలన్నీ మోయాల్సి వచ్చింది. నా ప్రేమ చెప్పే అవకాశం లేక నాలోనే దాచేశాను. ఊరొదిలి వచ్చేసి పై చదువులు, ఉద్యోగాలు పూర్తయ్యేసరికి ఆ అమ్మాయికిపెళ్లై పోయిందని తెలిసింది. ఒంటరితనం దరి చేరింది. కొన్నాళ్లకి నేనూ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఆడవాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని నా భార్యని చూశాకే అర్థమయ్యింది. సుఖదుఃఖాల్లో నాతోనే ఉంటూ ముందుకు నడిపించింది. కాని నా తొలిరోజుల పారిజాతాన్ని మాత్రం మర్చిపోలేదు. నా ప్రేమ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలు, వాళ్ల చదువులు పెళ్లిళ్లు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. వాటితో పాటే భార్య మరణం కూడా. భార్య మరణానంతరం కోలుకోడానికి చాలా సమయం పట్టింది.మళ్లీ ఏదో తెలియని ఒంటరితనం.. దాంతో పాటుగా చెదిరిపోతున్న జ్ఞాపకాలు.. ఎన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయినా పారిజాతం జ్ఞాపకం పోకూడదు. జివ్వుమని మరో వరుస చల్లగాలి వీచింది. వర్తమానంలోకి వచ్చిపడ్డాను. అప్పటిలాగే ఇప్పుడూ టీకొట్టు తెరిచి ఉంది.టీ కొట్టు దగ్గరకి వెళ్లాను. పెద్ద బెంచీ ఉండాల్సిన చోట కుర్చీలున్నాయి. పెద్దాయన మనవడు కాబోలు టీ కొట్టు నడిపిస్తున్నాడు. టీతో పాటు ఊరి విషయాలన్నీ చెప్పాడు. దూరంగా గుడిలోంచి తిరుప్పావై పఠనం వినిపిస్తూ ఉంది.‘ఈ వీథిలో అన్నీ మారిపోయాయి, ఆ పారిజాత చెట్టు’ తప్ప అన్నాను టీకొట్టు అతని వైపు చూస్తూ.‘ఆ ఇంట్లో ఉన్న ముసలావిడ చెట్టుని ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తుంది సార్’ అన్నాడు నవ్వుతూ.మాటల్లోనే ఆ ఇంటి గేట్ తెరుచుకుని ఆమె బయటకి వచ్చింది. నెరిసిన జుట్టు, వంగిన శరీరంతో మెల్లగా వచ్చింది. నేల మీద రాలిన పువ్వుల్ని ఏరుకుంటూ ఉంటే నా గుండె గడగడ అదిరిపోయింది. అదే మనిషి. అదే చెట్టు. అవే పూలు. చెదిరిపోతున్న జ్ఞాపకం రివ్వున తిరిగి వచ్చి బలపడి పూర్తిగా స్పష్టమైనట్టు ఉంది నా స్థితి. ఎంతగా అంటే ఇక అలై్జమర్స్ నన్ను ఎంత మింగినా ఈ జ్ఞాపకం మాత్రం పోదు.‘పాపం.. భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. పిల్లలు రమ్మన్నా ఈవిడ ఇల్లు విడిచి వెళ్లదు. ఎవరో పని మనిషి తోడుంది అంతే’ అన్నాడు టీ కొట్టతను.‘ఆవిడ పేరు?’ అడిగాను పూలు ఏరుతున్న ఆమెను చూస్తూ ఉద్వేగంగా.టీకొట్టు అతను కొంచెం సిగ్గు పడుతున్నట్టు తల గోక్కున్నాడు.‘అరే.. ఎప్పుడూ తెలుసుకోలేదు సార్’ అన్నాడు.‘పర్లేదు.. నేను కనుక్కుంటాను’ అన్నాను, ఆమెను పలకరించడానికి నిశ్చయించుకుని లేస్తూ. ‘లాభం లేదు సార్’ అన్నాడు టీ అతను.‘ఏం?’‘ఆమెకేం గుర్తు లేవు.. ఆ పారిజాతం చెట్టు పారిజాత పూలు తప్ప’అలాగే కుర్చీలో కూచున్నాను.రాలిన పారిజాతాలను ఒక్కొక్కటిగా ఏరుకుని ఆమె మెల్లగా గేటు వేసుకొని లోపలికి వెళ్లిపోయింది.
ఈవారం కథ: గుండ్లకమ్మ నీడలు
మేం నలుగురం ఊరి చివర నల్లవాగు మీద కట్టిన ఆ పాత కల్వర్టు దగ్గరకు చేరుకునేసరికి దూరంగా శ్మశానంలో అరగంట ముందు మాకు సెంటరులో కనపడిన శవయాత్ర తాలూకు మనుషుల గుంపు కనపడింది. కల్వర్టుకి, శ్మశానానికి సుమారు కిలోమీటరు దూరం. అప్పటివరకు లీలగా మా చెవుల్లో వినిపించిన చావు డప్పు అక్కడితో ఆగిపోయింది. శ్మశానంలో మనుషులని చూడగానే మామధ్య నిశ్శబ్దం అలముకుంది. అప్పటికి పడమటి సూర్యుడు పూర్తిగా వాలిపోయాడు. అందరం పాతకాలంనాటి పెచ్చులూడిపోయిన కల్వర్టు సిమెంటు గట్టుమీద కూర్చున్నాం. మా మధ్యలో రామబ్రహ్మం మేష్టారు.అసలీ సాయంత్రపు నడక ఎవరు మొదలుపెట్టారో తెలీదు. రామబ్రహ్మంగారే మొదలుపెట్టారంటారు. తరవాత చాలామంది సరదాగా వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. నేనొచ్చి సంవత్సరమైంది. ప్రతిరోజూ సాయంత్రంకల్లా సెంటరుకు చేరుకుంటాం. ఒక్కోసారి బ్రహ్మంగారు మాకంటే ముందే వెళ్ళిపోతారు. అందరం స్కూలు టీచర్లమే. దూరంగా కనపడుతున్న మనుషుల్ని చూస్తూ ‘మీరెప్పుడైనా శ్మశానానికి వెళ్ళారా?’ అడిగేరు బ్రహ్మంగారు.‘వెళ్ళకపోవడమేంటి.. చాలాసార్లు వెళ్ళాం. చుట్టాలెవరో చనిపోతే’ అన్నాడు రామప్ప. అతను మా స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్సు టీచరు. పత్రికలలో కథలు, కవిత్వం రాస్తూంటాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. ‘మీవాళ్ళెవరో చనిపోతేనో కాదు రామప్ప. చిన్నప్పుడు స్నేహితులతోనో.. ఒంటరిగానో..’మాలో ఎవరూ మాట్లాడలేదు.‘మీరు రచయితలు కదా.. ఆ వయసులో మీకెప్పుడూ శ్మశానం చూడాలని కుతూహలం కలగలేదా?’ అన్నారు మేష్టారు మళ్లీ రామప్పని ఉద్దేశించి.‘రచయితలైతే మాత్రం.. శ్మశానం చూడాలని ఎందుకుంటుంది చెప్పండి?’ అన్నాడు లెక్కల టీచరు కృష్ణారెడ్డి.‘ఎందుకుండదు? జీవితానికి అర్థం తెలుసుకోవాలనే ఆలోచన అక్కడే మొదలవచ్చు. చావుపుట్టుకలకి అర్థం ఏమిటి? చనిపోయాక మనిషి ఎక్కడికి వెళతాడు? బాల్యం, యవ్వనం, ప్రేమ, ముసలితనం అలా అనేక ఆలోచనలు అక్కడే పుడతాయి. మీరు అలా అంటున్నారు గానీ గోర్కీ చాలా చిన్నవయసులో తోటి స్నేహితులతో పందెంకట్టి ఒక రూబుల్ కోసం రాత్రంతా శ్మశానంలో గడిపాడు. ఆ శ్మశానంలో అతడి తల్లి సమాధి కూడా ఉంది.’ ‘ఆయన రూబుల్ కోసం శ్మశానంలో కూర్చున్నాడు సార్, కుతూహలంతో కాదేమో’ అన్నాను నేను.‘అయితేమాత్రం.. అది ఆయనకు గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిపోయింది కదా!’బ్రహ్మం మేష్టారు తెల్లచొక్కా, పంచెతో చూట్టానికి తెలుగు పంతుల్లా కనపడతారు గాని ఆయన స్కూల్లో ఇంగ్లీషు టీచరుగా పనిచేసి రిటైరయ్యారు. ఆ ఇంగ్లీషు టీచరు కూడా తీరికవేళల్లో బొమ్మలు గీస్తుంటారు. ఆయన చెప్పుకుపోయారు.‘శరత్ రాసిన శ్రీకాంత్ నవలలో కూడా శ్రీకాంత్ తన స్నేహితులతో పందెం కట్టి ఒక రాత్రంతా శ్మశానంలో గడుపుతాడు. అక్కడ అతనికి భయంగొలిపే అనుభవాలు ఎదురౌతాయి. విచిత్రం ఏమంటే మర్నాడు మళ్ళీ ఎవరో పిలుచుకెళ్ళినట్లు తనకు తెలీకుండానే ఆ శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్తాడు శ్రీకాంత్. ఇది ఇంకోరకమైన అనుభవం.’‘మనలో ఎవరికైనా చిన్నతనంలో దయ్యాలు, భూతాలు మంత్రాలని భయం ఉంటుంది. ఆ భయం మనలోకి ఎలా వస్తుందో తెలీదు. అది ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. వయసుతోపాటు పెరిగే ఎరుక చాలా భయాల్ని పోగొడుతుంది. లేదా ఇంకేదైనా కారణంచేత కూడా మనలో ఆ భయం పోవచ్చు. ఏదైనా సంఘటన జరిగి..’చుట్టూ చీకట్లు ముసురుకుంటుండగా శ్మశానంలో ఎర్రటి మంట వెలిగి తెల్లటి పొగ చెట్ల మధ్య నుంచి పైకి లేచింది. బ్రహ్మంగారు మననం చేసుకున్నట్టుగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ నిదానంగా చెప్పడం ప్రారంభించారు. ‘నేనూ చిన్నతనంలో అంటే పదిహేనేళ్ళ వయసులో మా ఊరి శ్మశానంలో అడుగుపెట్టాను. చాలా సంవత్సరాల పాటు ప్రతిరోజూ సాయంత్రం దాని పక్కనుంచే గుండ్లకమ్మ నదికి నడిచివెళ్ళేవాడిని. ఆ వయసులో నాకూ అందరిలానే దయ్యాలు, భూతాల భయాలుండేవి. కానీ ఒకరోజు శ్మశానంలో జరిగిన సంఘటనతో అవన్నీ పక్కకి జరిగిపోయాయి. నేను వయసుతో పాటు వచ్చే ఎరుక సంగతి చెప్పడం లేదు.’ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. దూరంగా శ్మశానంలోని చెట్ల నుండి నల్లటి చుక్కలు ఎగిరినట్లు కాకుల గుంపు పైకి లేచింది. ఆయన చెప్పడం మొదలెడితే ఎవరైనాసరే చెవులొగ్గి వినాల్సిందే! ఏది చెప్పినా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.‘నేను హైస్కూలు చదివేరోజుల్లో శ్రీనివాసరావు అనే స్నేహితుడు ఉండేవాడు. వాడిని ‘శీనాయ్’ అని పిలిచేవాడిని. చదువులో మేమంత తోపులం కాదుగాని మిగతా పిల్లలకీ మాకు మధ్య కొంత తేడా ఉండేది. తేడా అంటే అది చందమామ, బాలమిత్రలాంటి పుస్తకాలు చదవడం వలన వచ్చింది. ఈ పుస్తకాలు చదవడానికి తోడు మేము ఖాళీ దొరికినప్పుడల్లా అటు శింగరకొండకో, ఇటు మేదరమెట్లవైపో ఈత పండ్లనీ రేక్కాయలకనీ ఊరవతల పోరంబోకు భూముల్లో తిరుగుతా ఉండేవాళ్ళం. ఇక ప్రతిరోజూ పొద్దుగూకే టయానికి గుండ్లకమ్మ ఒడ్డుకి పోతావుండేవాళ్ళం. వచ్చేటప్పుడు శీనాయి మంచినీళ్ళ కోసరమని ఖాళీ ఇత్తడి బిందె తీసుకొచ్చేవాడు. అద్దంకి నుంచి గుండ్లకమ్మ వెళ్ళడానికి మూడుదారులు ఉన్నాయి. మొదటిది ఊరి బయట చిన్న కాలవ ఒకటి దాటాక పొలాల మధ్య వేసిన రోడ్డు దాటుకుని ఎర్రమట్టి డొంకలోంచి గుండ్లకమ్మకి నడుచుకుంటూ పోవడం. అటువైపు పొరుగూర్ల నుంచి ఎవరైనా ఇటువైపు అద్దంకి రావాలంటే ఇది తప్ప మరో దారి లేదు. రావాలంటే నీళ్ళలోంచి నడుచుకుంటూ రావాల్సిందే. దాటేటప్పుడు మధ్యలో మెడలోతు నీళ్ళు. నీళ్ళలో నడవకూడదనుకుంటే ఏదైనా ఎడ్లబండి వచ్చేదాకా ఆగాలి. ఆడవాళ్ళు ఎడ్లబండి వచ్చేదాకా ఒడ్డునే కూర్చునేవారు. ఆదారి కాక, చాలా కాలానికి ఊరు దాటాక అద్దంకి నుంచి దర్శి వైపు వెళ్ళే రోడ్డుమీద వంతెన కట్టారు. ఈ రెండూ కాక మూడో దారి ఒకటి ఉంది. ఊరికి దక్షిణం వైపున దూరంగా ఉంటుందది. ఆ కాలిబాట గుండ్లకమ్మ దగ్గర కలిసేచోట నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ పక్కనే శ్మశానం. ఎప్పుడన్నా అక్కడ శవాలని పూడ్చిపెట్టడమో, కాల్చడమో చేస్తారుగాని మేమెప్పుడూ చూసింది లేదు. చీకటి పడ్డాక ఆ దారిలో ఎవరూ పోరు. లోపలవైపు చిల్లచెట్ల మధ్య సున్నం వెలిసిపోయిన పాతకాలంనాటి సమాధులు కనపడతాయి. గుండ్లకమ్మ వెళ్ళేటప్పుడు మేమెప్పుడైనా ఆ శ్మశానంలోకి నడిచేవాళ్ళం. ముళ్ళ కంపలు, జిల్లేడు చెట్లు, పగిలిపోయిన కుండ పెంకులూ, ఎముకలూ కనిపించేవి. వాటిని చూసి మాకు అనేక ఆలోచనలు కలిగేవి. చందమామ కథల్లాంటి రకరకాల దయ్యాల కథలు, మాంత్రికుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. మాకు భయమైతే లేదుగాని దయ్యాలూ మా్రంతికులూ ఉంటారని నమ్మేవాళ్ళం. మేము ఒడ్డున కూర్చుని చూస్తావుండగానే మనుషులు పంచెలు పైకి ఎగలాక్కుని నది దాటి అవతలవైపు పడమట దిక్కున ఉండే తిమ్మాయిపాలెం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు రైతుల ఎడ్లబండ్లు నీళ్ళలోంచి అవతలికి వెళ్ళేవి. మధ్యలో లోతు దాటేటప్పుడు ఎద్దుల తలలు, బండి ముందువైపు కూర్చున్న మనిషి మాత్రం కనిపించేవాడు. మేము ‘తిమ్మాయిపాలెం’ పేరు వినడమేగాని గుండ్లకమ్మ అవతలి ఒడ్డుకు ఐదారు మైళ్ళుండే ఆ ఊరికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇటువైపు నిలబడి అవతలికి చూస్తే ఒడ్డు నుండి ఒక అరమైలుదాకా అంతా ఒండ్రుమట్టి, ఇసక. ఆ పైన రెల్లు దుబ్బు, చిల్లచెట్లు ఆపైనంతా ఎటుచూసినా పోరంబోకు భూమి. రకరకాల వరుసల్లో దట్టంగా సరివిచెట్లు కనపడేవి. ఎక్కడపడితే అక్కడ పొడవాటి తాటిచెట్లు. ఆ తరవాత దూ..రం..గా.. భూమీ ఆకాశం కలిసే ఆకుపచ్చ అడవి మధ్య ఒకచోట గుండ్రంగా ఎవరో నిలబెట్టినట్లుగా నల్లగా ఎత్తైన తాటిచెట్లు. ఆ తాటి చెట్ల తలల మధ్య ఆకుపచ్చ, నీలం కలగలిసి బూదరబూదరగా కనపడేది. అక్కడేముందో తెలిసేదికాదు. శీనాయికీ నాకూ ఒక్కసారన్నా అవతలి ఒడ్డుకు వెళ్ళి ఏముందో చూడాలని అనిపించేది. మేం ఎప్పుడు వెళ్ళినా ఈతపండ్ల కోసం అద్దంకికి ఉత్తరాన ఉండే శింగరకొండకో, దక్షిణంవైపు మేదరమెట్లకో నడిచి వెళ్ళేవాళ్ళమే కానీ గుండ్లకమ్మ దాటుకుని అవతలి ఒడ్డుకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడన్నా పారే నీళ్ళలో మునకలేస్తున్నప్పుడు శీనాయ్గాడితో ‘ఒరేయ్.. తిమ్మాయిపాలెం దాకా కాకపోయినా కనీసం ఆ తాటితోపు వరకయినా వెళ్ళొద్దాంరా’ అనేవాడిని.ఒక అదివారంనాడు గుండ్లకమ్మ ఒడ్డుకెళ్ళి ఒక్కణ్ణే కూర్చున్నాను. అప్పటికి సూర్యుడు ఏటవాలుకి దిగినా ఎండ ఇంకా నులివెచ్చగా ఒంటికి గుచ్చుకుంటూ ఉంది. నేను చూస్తుండగానే ఎద్దులబండి ఒకటి నీళ్ళలోకి దిగింది. రైతు ఎవరో అద్దంకిలో పని ముగించుకుని తిమ్మాయిపాలెం వెళుతున్నాడు. బండి కాస్తంత ముందుకు పోగానే వెనకవైపు కూర్చున్న మనిషిని చూసి అదిరిపడ్డాను. వెనకాల చెక్కమీద కాళ్ళు కిందకేసి కూర్చున్న శీనాయి! వాడు నన్ను చూడగానే ‘రేయ్.. రారా.. బండెక్కు’ అన్నాడు.అప్పటిదాకా తీరుబాటుగా కూర్చున్న నేను వాడి పిలుపు వినగానే ఉలిక్కిపడి ఒక్కసారిగా నీళ్ళలోకి పరుగెత్తి ఎద్దులబండి వెనకాల ఎగిరి కూర్చున్నాను. బండి కుదుపుకి రైతు వెనక్కితిరిగి చూశాడు. బళ్ళు నీళ్ళలోంచి వెళ్ళేటప్పుడు మనుషులు వెనకాల ఎక్కడం వాళ్ళకి అలవాటే. శీనాయి వచ్చే దారిలోనే ఎక్కడో ఎక్కి కూర్చున్నట్లున్నాడు. బండి లోతుకు దిగేకొద్దీ మా అరికాళ్ళకు చల్లగా నీళ్ళు తగలసాగాయి. మొదట పాదాలు.. ఆ తరవాత నిదానంగా నీటిమట్టం పెరుగుతూ మోకాళ్ళు.. చివరికి నేను కూర్చున్న చెక్కమీదికి నీళ్ళు వచ్చి నా నిక్కరు కిందవైపు తడిసిపోయింది. మందువైపు చూస్తే ఎద్దుల మూతుల దాకా వచ్చాయి నీళ్ళు. పంచె తడవకుండా రైతు ముందువైపు నిటారుగా నిలబడి ఉన్నాడు. కొంచెం దూరంపోయాక నీటిమట్టం మళ్ళీ తగ్గసాగింది. ఒడ్డు దగ్గర పడ్డాక బండి నీళ్ళలో ఉండగానే ఇద్దరం కిందకి దూకేశాం. అక్కడ ఒడ్డున నిలబడి చూస్తే ఇరువైపులా తాటిచెట్లున్న ఎత్తైన రోడ్డు కనపడింది. అక్కడికి దగ్గరలోనే ఉంటుందనుకున్న ఊరు పొలిమేర కనుచూపులో కూడా లేదు. ఆ కనపడే రోడ్డువైపు కాకుండా మరోవైపు నడవడం మొదలుపెట్టాం. అది దుక్కిదున్ని సేద్యం చేసే నేల కాదు. ఎటుచూసినా అడ్డదిడ్డంగా పెరిగిన చిల్ల చెట్లు, పల్లేరు కాయలతో ముళ్ళ పొదలు, మట్టిదిబ్బలతో ఎగుడుదిగుడు నేల. దారిపొడుగునా పచ్చగా పెరిగిన పసిరిక గడ్డిలో రాలి ఎండిపోయిన తాటి ఆకులు, జిల్లేడు మొక్కలు, కొన్నిచోట్ల మనిషెత్తు పెరిగిన జపా¯Œ తుమ్మచెట్లు తప్పితే మరింకేంలేదు. చివరికి తాటివనంలా కనిపిస్తున్న చోటు చేరేసరికి అదంతా పోరంబోకు భూమిలో చెదురుమదురుగా పెరిగిన తాటిచెట్లు. విసుగుపుట్టి ఒకచోట మొదలు నరికి ఒరిగిపోయిన తాటిచెట్టు మీద కూర్చున్నాం.తలెత్తి చూస్తే మళ్ళీ మా చుట్టూ తలలెత్తుకుని నిలబడిన తాటిచెట్లు. మా వెనక ఏటవాలుకు దిగిన సూర్యుడి పసుపురంగు ఎండ. అప్పటిదాకా ఎండలో ఆవిర్లు గక్కిన గాలి నెమ్మదిగా చల్లబడుతూ ఉంది. మాముందు నల్లటి పికిలిపిట్ట కొత్తవారిని చూసి ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఊరికూరికే హైరానా పడతావుంది. మాకు కొద్ది దూరంలో మందనుంచి తప్పిపోయిన గేదె మోర వంచి తదేకంగా గడ్డి పెరుక్కుంటావుంది. శీనాయి దిగ్గున లేచి ‘ఒరేయ్ అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తున్నార్రా’ అన్నాడు.లేచి నిలబడి చూశాను. అక్కడినుండి చూస్తే దూరంగా అద్దంకివైపు గుండ్లకమ్మ అవతలి ఒడ్డు కనబడతావుంది. ఎండ పొడకు మెరుస్తున్న నీటి ప్రవాహం .. ఆ తరువాత తీరపుగట్టు, ఆపైన ఎత్తుగా ఎర్రటి మట్టి.. అక్కడ ఆకుపచ్చచెట్లలో లీలగా అక్కడక్కడా పైకి లేచిన తెల్లటి గోరీలు.. వాటి మధ్య నలకల్లా మనుషులు కనబడ్డారు. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుండిపోయాం. ఉన్నట్టుండి శీనాయి..‘ఒరే.. ఎవరో చనిపోయార్రా.. అందుకే ఆ జనం’ అన్నాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. అవతల వాళ్ళని చూడగానే ఎలాగైనా అక్కడ జరిగేది చూడాలని అక్కడనుంచి లేచి గబగబా నడవడం మొదలుపెట్టాం. పరుగులాంటి నడక. నేలపై పిచ్చి మొక్కలు కాళ్ళకి గీరుకుంటున్నాయి. అడుగులు చిన్నపాటి గుంతలు, రాళ్ళురప్పలు, తుమ్మ ముళ్ళు ఎదురైనప్పుడల్లా తడబడుతున్నాయి. వేటినీ లెక్క చేయకుండా పరుగులాంటి నడక.. తాటివనం నుంచి గుండ్లకమ్మ ఒడ్డుకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు. నీళ్ళలోకి దిగి గబగబ అడుగులు వేస్తుంటే తపతపమని నీళ్ళు పైకి చిమ్మి మొహాల మీద పడ్డాయి. మోకాళ్ళదాకా వచ్చాక నీళ్ళు కాళ్ళకి ఎదురీదుతున్నాయి. ఇంకాస్త లోపలికి నీళ్ళలో సంకలదాకా వచ్చాక అడుగులు ముందుకు వెళుతుంటే ప్రవాహం పక్కకి నెడతావుంది. మరింత ముందుకు వెళ్ళాక నీటిమట్టం తగ్గినచోట గబగబా అడుగులు వేస్తుంటే అడుగున పాచిపట్టిన రాళ్ళు పాదాలకు తగులుతున్నాయి. బొటనవేళ్ళు రాళ్ళల్లో గుదిగుచ్చి ఒక్కొక్క అడుగు బలంగా వేసుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళాం. అప్పటికి బట్టలు పైదాకా పూర్తిగా తడిసిపోయాయి.ఒక్క ఉదుటున శ్మశానంలో వచ్చిపడ్డాం. ఒక గోతి చుట్టూ నిలబడిన నల్లటి మనుషులు కనపడ్డారు. అస్తమించే సూర్యుడి లేత పసుపురంగు ఎండ ఆచ్ఛాదనలేని నల్లటి మనుషుల శరీరాల మీద పడతావుంది. వాళ్ళకి కొంత దూరంలో నేల మీద చాపలో చుట్టిన శవం. తల బయటికి కనిపిస్తా ఉంది. ఎవరో యువకుడు. పాతికేళ్ళుండొచ్చు. జుట్టంతా చెదిరి, తల ఒక పక్కకి ఒరిగి ఉంది. ఉండీ లేనట్లు మొలిచిన లేలేత గడ్డం వెంట్రుకలు. ఆ మసిబారిన గాజు కళ్ళు కలలు కంటున్నట్లుగా సగం తెరుచుకుని నిశ్చలంగా ఉన్నాయి. శవానికి రెండడుగుల దూరంలో ఒంటికి చుట్టుకున్న ముతక చీర కొంగునే భుజాల చుట్టూ శాలువాలాగా చుట్టుకుని ఒక నడివయసు ఆడ మనిషి నిలబడి ఉంది.మరోపక్క భూమిలో గసగసమని మనుషులు గొయ్యి తవ్వుతున్న చప్పుడు. లోపలనుంచి దోకుడు పారతో పైకి ఎగదోసిన మెత్తటి మట్టి గోతి చుట్టూ పేరుకుంటోంది. గొయ్యి తవ్వడం పూర్తయ్యాక ఇద్దరు మనుషులు గోతిలోంచి పైకి వచ్చారు.చివరికి అందరూ చూస్తుండగా చాపలో శవాన్ని బయటికి తీశారు. తల, కాళ్ళు ఏ దిక్కులో ఉండాలనే మంతనాలయ్యాక తలవైపు ఇద్దరు పాదాల వైపు ఇద్దరు పట్టుకుని శవాన్ని గోతిలో బోర్లా పడేశారు. లోపల నేల మీద దబ్బున శబ్దం వచ్చింది. నేను రెండడుగులు ముందుకు వెళ్ళి గోతిలోకి చూశాను. ఉత్త నేల మీద, బొక్క బోర్లా పడిన శవం, ఒక పక్కకి తిరిగిన తల.. అవే గాజుకళ్ళు. అక్కడ నిలబడిన వాళ్ళలో ఒక మనిషి ‘ఏంది గుడ్డతో కప్పెడతావా? అట్టా కుదర్దు. ఆ లుంగీ తీయాలి’ అన్నాడు. పొడవాటి కర్ర పట్టుకున్న మనిషి గోతిలోకి కర్రని పోనిచ్చి ఆ శరీరం మీద ఉన్న మాసిన లుంగీని పక్కకి జరిపాడు. అలా జరపడంతోటి నల్లటి అతడి వీపు కింద, సరిగ్గా నడుము మీద ఎర్రగా ఉన్న అరచేతి మందం ఎర్రటి పుండు కనిపించింది. పైనుండి పడిన అదురుపాటుకి నడుముకి కట్టిన గాజుగుడ్డ రక్తపు మరకల దూదితోపాటు చెదిరి నల్లటి ఒంటి మీద ఎర్రటి పుండు బయటపడింది. ‘ఎన్నాళ్ళబట్టి ఓర్చుకున్నాడో నా బిడ్డ. యియ్యాల్టికి నెల దినాలు. సివరికి ఈ మాయదారి పుండు పొట్టనబెట్టుకుంది’ అన్నది అక్కడ నుంచున్న ముసలమ్మ.‘ప్రార్థన చేసే వాళ్ళెవురూ లేరా ఇక్కడ?’ అన్నాడు అక్కడున్న నడివయసు మనిషి.‘ఊరుగాని ఊళ్ళో పేస్టరుని ఎక్కడనుంచి తెచ్చేది’ అన్నది ఆ ముసలి తల్లి.‘అయితే కడసారి కొడుకుని చూసుకో’ అన్నారెవరో ఆ గుంపులో వెనక నుంచి.ఆ ముసలామె ఒకడుగు ముందుకు వేసి గోతిలో బోర్లా పడిన శవాన్ని తేరిపార చూసింది. అలా చూడటంతోటే ఆమె కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా కారాయి. ఆమె కొంగుతో చెంపల మీద నీళ్ళను తుడుచుకుంటూ వెనక్కి జరిగింది. అక్కడ నిలబడ్డ నలుగురు మనుషులు దోకుడు పారతో మట్టిని గోతిలోకి ఎగదోయసాగారు. నేను చూస్తుండగానే ఆ మనిషి మీద కాస్తకాస్త మట్టి పడుతూ చివరికి కనుమరుగయింది.అలా పైనుంచి మట్టి పడుతున్నంతసేపూ ఆ మనిషికి ఊపిరి ఆడటం ఎలా? అతడు ఎలా లేవగలుగుతాడు. అయ్యో కాళ్ళు చేతులు కదిలించలేడు కదా. చనిపోయిన తరవాత మనుషులు చివరికి ఎక్కడికి వెళతారు? చివరికి ఏమవుతుంది? కొంత కాలానికి ఆ శరీరం అస్థిపంజరంలా మారిపోతుందేమో అన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. పక్కన జిల్లేడు పొదలో కపాలం దవడలు విప్పి నావైపే తదేకంగా చూస్తావుంది.గొయ్యిని పూర్తిగా మట్టితో పూడ్చాక ఇద్దరు మనుషులు మట్టిని దట్టంగా ఎగదొక్కి చివరికి గుర్తుగా ఎత్తైన నిలువుపాటి గుట్టను గోరీలాగా పారలతో చదును చేశారు. వాళ్ళంతా తమ పనిలో నిమగ్నమయి ఉండగా ఆ ఆడామె ఉన్నచోటునే నిలబడి శూన్యంలోకి చూస్తావుంది. ఆమె చెంపల మీద చారికలు ఇంకా తడారి పోలేదు.చివరికి అందరూ అక్కడ్నుంచి కదలబోతున్నంతలో ఆ ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. వాడ్ని సూడ్డానికి ఎంత దూరం నుంచి వచ్చుండారు. మా మీద ఎంత ప్రేమ మీకు’ అని అంటా ముందుకు నడిచింది.ఆవిడ మాటలు మొదట నాకు అర్థం కాలేదు. ఆవిడ కొడుకు మీద మాకు ప్రేమ ఏమిటి? వాళ్ళెవురో మాకు తెలీదు. మేము ఆవిడ కొడుకుని చూట్టానికి రాలేదనీ, ఆ శ్మశానంలో కర్మకాండలు చూట్టానికి మాత్రమే వచ్చామనీ, అంతకు మించి మరేమీ కాదని ఆవిడ దగ్గరకెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాను. ఎందుకో సిగ్గనిపించింది. అది కూడా చెప్పడానికి మనసురాక ‘ఆవిడ ఎలాగనుకుంటే అలాగ అనుకోనిమ్మని.. ఆవిడ అలా అనుకుంటేనే బాగుందనుకున్నాను.మేమంతా శ్మశానం నుంచి బయటకు వస్తావుంటే ఆమె మాత్రం కొంచెం ఇవతలికి వచ్చాక ఒక జిల్లేడు చెట్టు మొదల్లో కూలబడింది. ఒక మేస్త్రీలాంటి మనిషెవరో కూలీలకు డబ్బు లెక్కచేసి వెళ్ళబోతా ‘ఇంకేవిటికి ఇక్కడ పెద్దమ్మా.. కొడుకు లేచొస్తాడని కూకుండావా? దబ్బునెళ్ళి మీవూరి బొస్సు పట్టుకో. చీకటి పడిపోతావుంది’ అని కాలిబాట పట్టాడు. ఆవిడ ఆయన చెప్పిన మాటలు వినిపించుకోకుండా అక్కడే కూర్చుని గుడ్ల నీరు కుక్కుకుంటా కుళ్ళికుళ్ళి ఏడుస్తావుంది. మేమిద్దరం ఆమెను దూరం నుంచి చూస్తా, అటు ఇటు తారట్లాడతా ఏం చేయలేక ఊరకుండిపోయాం. చీకటి పడ్డాక ఎవురి దారిన వాళ్ళు ఇళ్ళకు పోయాక ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు. కండ్లు మూసుకుంటే ‘నాయనలారా నా బిడ్డ మీద మీకెంత ప్రేమ..’ అంటూ చింకిచీర కట్టుకుని ఆ శ్మశానంలో గోరీల మధ్య నిలబడిన ఆ నల్లటి ఆడమనిషి మాటలే చెవుల్లో వినిపించాయి. చాలాకాలం ఆమెని మర్చిపోలేకపోయాను. ఆ తరవాత ఎప్పుడు గుండ్లకమ్మ వెళ్ళినా ఆ పక్కనే ఉండే ఆ శ్మశానంలోకి అడుగుపెట్టలేదు. అంతకుముందు భయపెట్టే శ్మశానం ఆ రోజు నుంచి మామూలుగా కనపడసాగింది. నా మనసులో ఏదో మాయపొర తొలగినట్లైంది. ఒక అనుభవం అలా అనేక ఆలోచనలని చెరిపేసింది.ఈడు పెరిగేకొద్దీ చావంటే దుఖమనీ అంతులేనివిషాదమనీ తెలిసొచ్చింది.బ్రహ్మం మేష్టారు చెప్పడం ముగించి మౌనంగా ఉండిపోయారు. మేము ఎన్నో సంవత్సరాల కిత్రం గుండ్లకమ్మ ఒడ్డున ఒక సాయంత్రంలోంచి ఇప్పటి దట్టమైన ఈ చీకటి లోకంలోకి వచ్చి పడ్డాం. మేష్టారి తెల్లటి జుట్టు చీకట్లో వెండి జరీలా మెరుస్తా ఉంది. మీసం లేని ఆయన నల్లటి మొహంలోని గీతలు అస్పష్టంగా కనబడుతున్నాయి.‘అయితే మేష్టారూ, మరణం అనేది ఒక రహస్యం కాదంటారా?’ అన్నారు కృష్ణారెడ్డిగారు ఉన్నట్లుండి తన మౌనంలోంచి బయటపడి.‘కాదని ఎవరన్నారు.. అది ఎవరూ తెలుసుకోలేని ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే..’ ‘అదిసరే.. ఆరోజు నుంచి మీకు దేవుడంటే నమ్మకం పోయిందన్నమాట’ అన్నాడు రామప్ప మధ్యలో కల్పించుకుని. ‘ఆ మాట నేను అనలేదే? దయ్యాలూ, భూతాలు అంటే భయం పోయిందని అన్నాను. దేవుడి మీద నమ్మకం పోయిందని చెప్పానా?’‘మరయితే అది కూడా మూఢనమ్మకమేగా మేష్టారూ?’ఆ మాటకి ఆయన గట్టిగా నవ్వి ‘నాది మూఢ నమ్మకమే. దాన్నలాగే ఉండనీ..’ అని కొంచెం సేపు ఆగి ‘మనిషి లోపల దయ్యం ఉంటుందన్నది నిజం. పాపాలు అందరిలోనూ ఉన్నాయి. అసలు ఉన్నదల్లా సైతానే. దానిని పోగొట్టడానికి మనం చేయాల్సిందల్లా దేవుడిని కనుక్కోవడమే. అంటాడు దోస్తయేవ్స్కీ’ అని ఇక చెప్పాల్సింది ఏదీ లేదన్నట్లు మేష్టారు లేచి నిలబడి పంచెకు అంటుకున్న దుమ్ము దులుపుకున్నారు.అందరం లేచి ఇంటిదారి పట్టాం. దూరంగా నల్లటి చీకటి మధ్య ఎర్రటి కాష్ఠంలో రగులుతున్న మంటలు చీకట్లోకి నాలుకలు చాపుతున్నాయి.
ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ అంటున్నారు.. నిజమేనా?
నా వయసు 35 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. నాకు ట్యూబ్స్, ఓవరీస్‌లో ఇన్ఫెక్షన్ ఉందని ఈమధ్యే సర్జరీ చేసి రెండు ఓవరీస్‌ను తీసేశారు. ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు. నిజమేనా? – లక్ష్మీపద్మజ, కిసాన్నగర్ఓవరీస్ అనేవి పిల్లలు కావటానికి మాత్రమే కాదు, అవి కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్ చేయ్యటం వలన ఆరోగ్యానికీ చాలా అవసరం. 50 నుంచి 55 సంవత్సరాల మధ్య అండాల విడుదల ఆగిపోయా, ఓవరీస్ ఎండిపోతాయి. అప్పుడు ఇంక హార్మోన్స్ విడుదల ఉండదు. నెలసరి కూడా ఆగిపోతుంది. దాన్ని నేచురల్ మెనోపాజ్ అంటాం. కానీ 50 ఏళ్లలోపు ఏ కారణంతో అయినా సర్జరీ ద్వారా ఓవరీస్‌ను తొలగిస్తే దానిని సర్జికల్ మెనోపాజ్ అంటాం. చిన్న వయసులో హఠాత్తుగా పీరియడ్స్ ఆగిపోతాయి. హర్మోన్స్ రిలీజ్ ఆగిపోతుంది. ఇలా సర్జరీ తర్వాత మెనోపాజ్ వచ్చిన వాళ్లకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. ఒంట్లోంచి వేడివేడి పొగలు రావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, గుండె దడ, మూడ్ స్వింగ్స్, యాంగ్జయిటీ, నిద్ర పట్టకపోవడం, నీరసం, మతిమరుపు, వజైనల్ డ్రైనెస్, యూరీనరీ ఇన్ఫెక్షన్స్, జాయింట్ పెయిన్స్, చర్మం పొడిబారిపోవడం వంటివి ఉంటాయి. అయితే వీటన్నిటినీ జీవనశైలి మార్పుతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారాన్ని తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం, మసాలా ఫుడ్‌కి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వంటివాటితో మెనోపాజ్ ఇబ్బందులను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను విభజించి.. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. అలాంటివారికి డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని సూచిస్తారు. హార్మోన్స్‌ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడమే హెచ్ఆర్టీ. ఇవి జెల్స్, ప్యాచెస్, స్ప్రేలుగానూ అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ గర్భసంచి ఆరోగ్యానికి అవసరం. మీకు గర్భసంచి తీయలేదు కాబట్టి కేవలం ఈస్ట్రోజన్ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ రెండూ ఇవ్వాలి. కుటుంబంలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి హెచ్ఆర్టీ మంచిది కాదు. అలాంటివారికి కొన్ని ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు. వాటిని ఎస్సెస్సారై ( ఖఐ) అంటారు. ఈ మెడిసిన్‌ను డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. వజైనా డ్రైనెస్, ఇచింగ్ తగ్గడానికి వజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్‌ను సూచిస్తారు. ఇలా ఒక్కోవ్యక్తికి వాళ్ల వాళ్ల ఆరోగ్యపరిస్థితిని బట్టి సరైన చికిత్సను అందిస్తే రిస్క్, కాంప్లికేషన్స్ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాకు మూడు సిజేరియన్స్ అయ్యాయి. మొదటి ఆపరేషన్ తర్వాత కుట్ల మీద నల్లటి పెద్ద మచ్చ ఏర్పడింది. దాన్ని కెలాయిడ్ అంటారని చెప్పారు. చివరి రెండు సర్జరీల్లో దాన్ని తొలగించినా, మళ్లీ ఏర్పడింది. అక్కడ చర్మం పొడిబారిపోయి.. దురదగా ఉంటోంది. ఇది శాశ్వతంగా ఉంటుందా? దీనికి ట్రీట్మెంట్ లేదా? – అంజలి, వైజాగ్సిజేరియన్స్కి పెద్దగా కోత పెడతాం కాబట్టి ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కెలాయిడ్స్ పెద్దగానే ఉంటాయి. ఈ టెండెన్సీ ఉన్న వారిలో తర్వాత డెలివరీలో ఆ కెలాయిడ్ స్కార్ను తీసేసినా హీలింగ్ ప్రాసెస్‌లో మళ్లీ ఫామ్ అవుతుంది. కొంచెం లైట్‌గా ఉన్న కెలాయిడ్ స్కార్‌కి అయితే కార్టిసోన్ అనే స్టెరాయిడ్ క్రీమ్ లేదా ఇంజెక్షన్స్‌ని ట్రై చేస్తారు. వీటిని అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లను నెలకొకటి చొప్పున ఆరునెలల పాటు వాడినవారిలో ఈ మచ్చ ఫేడ్ అవటం కనిపించింది. అయితే కొంతమందికి పిగ్మెంటేషన్ స్కార్స్ కూడా రావచ్చు. కొంతమందిలో ఈ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క్రిప్టోథెరపీ అని.. లిక్విడ్ నైట్రోజన్‌ను అప్లై చేసిన కొంతమందిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. Pulsed dye laser థెరపీ ద్వారా 80 నుంచి 90 శాతం కెలాయిడ్ స్కార్‌ని తగ్గించవచ్చు. ఈ ట్రీట్మెంట్ 4 నంచి 8 వారాలుంటుంది. లో లెవెల్ రేడియోథెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీంతో మచ్చ మాసిపోవడమే కాక, దురద, అనీజీనెస్ కూడా తగ్గుతాయి. ఈ చికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కెలాయిడ్ స్కార్‌ని ఆపరేషన్ ద్వారా తీసేసి, 48 గంటల్లోపే ఫస్ట్ డాక్స్ ఆఫ్ ఎక్స్–రే థెరపీని ఇస్తారు. వారం తర్వాత రెండో డాక్స్‌ను ఇస్తారు. ఈ ప్రోసీజర్కు 2 నుంచి 3 గంటలు పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని షార్ట్‌టర్మ్ సైడ్ఎఫెక్ట్స్ 2 నుంచి 3 వారాలు ఉండి తగ్గిపోతాయి. కొంచెం మంట ఉంటుంది. దీనికి డ్రెస్సింగ్‌ను సూచిస్తారు. లాంగ్‌టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్.. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలల తర్వాత స్కిన్ డార్క్ అవటం, పింగ్మేంటేషన్ కనిపిస్తుంది. సన్‌స్క్రీన్ వాడాల్సి వస్తుంది. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు.
ఫొటోలు
National View all
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీల
‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’
ఢిల్లీ: ‘నన్ను క్షమించండి.
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly El
‘శీష్‌మహల్’ ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్
ఢిల్లీ : ‘కోవిడ్-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే..
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది.
International View all
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీల
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది.
శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్
అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది.
హమాస్ వ్యూహాలు..మరో బందీ వీడియో విడుదల
టెల్అవీవ్:తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువ మహిళా జవాను ల
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన
NRI View all
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
క్రైమ్
ఓటీపీ లేకుండానే నగదు మాయం చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన సైబర్ కేసు. బాధితురాలి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఎలా మాయమైందో ఆమెకే కాదు... సైబర్ క్రైమ్ పోలీసులకూ అంతుచిక్కట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన ఓ గృహిణిని (59) ఫేస్‌బుక్‌లోని ప్రకటన ఆకర్షించింది. మహిళలకు సంబంధించిన వస్త్రాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నామనేది దాని సారాంశం. ఆ వ్రస్తాలు ఖరీదు చేయడానికి ఆసక్తిచూపిన ఆమె, ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించారు. తన కావాల్సినవి ఆర్డర్ ఇవ్వడంతో పాటు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఆపై ఆ గృహిణికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు డెలివరీ చేయాల్సిన బాయ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఫలితంగా సరుకు అందించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా మీరు చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తున్నామని అన్నారు. దానికోసం బ్యాంకు ఖాతాను సరిచూసుకోవాల్సి ఉందంటూ రెండు దఫాల్లో రూ.1, రూ.10 బదిలీ చేశారు. ఆ మొత్తం చేరిందా? లేదా? అనేది ఆమెను సంప్రదించి ఖరారు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత బాధితురాలి ఖాతాలో ఉండాల్సిన రూ.1,38,171 మాయమయ్యాయి. తనకు ఎలాంటి ఓటీపీ రాలేదని, అయినప్పటికీ డబ్బు పోయిందంటూ ఆమె శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. ఈ స్కామ్ ఎలా జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. సైబర్ నేరాల అవగాహనకు ‘మూడు కోతులు’సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ ఏజ్ త్రీ మంకీస్’ను తెరపైకి తెచ్చారు. నాటి మూడు కోతులు ‘చెడు మాట్లాడ వద్దు–చెడు చూడవద్దు–చెడు వినవద్దు’అంటే.. నేటి ఈ ‘డిజిటల్ కోతులు ‘ఎవరికీ ఓటీపీ చెప్పవద్దు–తెలియని లింకులు తెరవద్దు–నకిలీ ఫోన్ కాల్స్ వినవద్దు’అంటున్నట్లుగా రూపొందించారు. దీన్ని తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా విçస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో మాఫియా డాన్ హత్యకు ప్లాన్!
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్‌ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.ఎవరీ స్వప్నా దీదీ?ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్‌వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్‌స్టర్ మెహమూద్ ఖాన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్‌తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.డీ-కంపెనీ ఆగడాలకు చెక్ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్‌ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్‌లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.దావూద్ హత్యకు ప్లాన్మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్‌ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో దావూద్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్‌క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్‌ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్‌ను చంపాలని పథక రచన చేసింది.చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"22 సార్లు కత్తితో పొడిచి హత్యదురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్‌కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.
అంకుల్.. మొత్తం కుటుంబాన్ని చంపేశా..!
లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది.
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.