Aakash Chopra
-
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అతడి కెరీర్‌ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్‌తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్‌ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్‌గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్‌కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్‌లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
'ఛాంపియన్స్ ట్రోఫీ.. అతడికి భారత జట్టులో నో ఛాన్స్'
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేరళ క్రికెట్ ఆసోషియేషన్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి స్ధానంలో తమ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్‌కు కేసీఎ అప్పగించింది. ఈ నేపథ్యంలో శాంసన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు."విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు ఆర్ధం కావడం లేదు. వాయనాడ్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేదని, అందుకే కెసీఎ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని కొంత మంది చెబుతున్నారు.కాలి గాయం కారణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేనని సంజూ కెసీఎకు ముందే తెలియజేసినట్లు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదమైనప్పటకి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేకపోయాడు.ఈ టోర్నీని సంజూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్‌ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్‌ను ఛాంపియన్స్ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!? -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్‌బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ముందు రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్‌పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్‌లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్‌లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్‌లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్‌తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.ప్రోటీస్ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్‌లలో అభిషేక్‌కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు."అభిషేక్ శర్మ ఈ సిరీస్‌లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్‌లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
రోహిత్ అసలేం చేశావు.. అతడితో ఎందుకు బౌలింగ్ చేయించలేదు?
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టాస్ దగ్గర నుంచి బౌలర్ల ఎంపిక వరకు రోహిత్ నిర్ణయాలు బెడిసి కొట్టాయి. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కంటే ముందు కోహ్లిని బ్యాటింగ్‌కు పంపడం, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, కివీస్ టెయిలాండర్ టిమ్ సౌథీ భారత స్పిన్నర్లపై విరుచుకుపడుతున్నప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించకపోవడం వంటివి రోహిత్ చేసిన తప్పిదాలగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆలస్యంగా ఎటాక్‌లోకి తీసుకురావడాన్ని చోప్రా తప్పు బట్టాడు."అంత తక్కువ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ అశ్విన్‌తో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అశ్విన్ బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ మనదే అని నేను చెప్పడం లేదు. కానీ అతడు వరల్డ్‌లోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. టీమ్‌లో కూడా అశ్విన్ మించినవారే లేరు. టెస్టుల్లో అతని కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేదు. లెఫ్ట్ హ్యాండర్లపై కూడా అశూకు మంచి రికార్డు ఉంది. ఎడమచేతి వాటం ఆటగాళ్ళు క్రీజులో ఉన్నప్పుడు కూడా అతడిని ఎటాక్‌లోకి తీసుకు రాలేదు. అస్సలు ఎందుకు అలా చేయలేకపోయారో ఎవరికీ ఆర్ధం కావడం లేదంటూ" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు డేంజరస్ ప్లేయర్ దూరం!? -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. -
IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్‌లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్‌ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్‌లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్‌లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్‌లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్‌లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్‌లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్‌సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్‌పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్‌లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్‌తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్‌లోని నల్లమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్‌పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్‌గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్‌ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్‌కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్‌గా భావిస్తున్న పంత్‌ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్‌ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్‌గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్‌గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్‌కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.