Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lok Sabha Speaker Election June 26 Live Updates
కాసేపట్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక.. అప్‌డేట్స్‌ఓం బిర్లాకు పెరిగిన మద్దతులోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో.. ఎన్డీయే అభ్యర్థి మద్దతు ఇచ్చిన వైఎస్సార్సీపీఇండియా కూటమి ప్రస్తుత బలం 227ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌కు టీఎంసీ, శరద్‌ పవార్‌ ఎ‍న్సీపీ మద్దతుబలాబలాల పరంగా అధికార ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గెలుపు ఖాయం! #WATCH | Delhi: NDA candidate for Lok Sabha Speaker Om Birla offers prayers at his residence. The election for the post of Lok Sabha Speaker will take place today. pic.twitter.com/At80kjnz2U— ANI (@ANI) June 26, 2024 ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికదశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెరస్పీకర్‌ ఎంపిక చర్చల్లో అధికార-ప్రతిపక్ష కూటమి మధ్య కుదరని ఏకాభిప్రాయం డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలకు ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి అనాసక్తిఇండియా కూటమి స్పీకర్‌ అభ్యర్థిని నిలపడంతో అనివార్యమైన ఎన్నికతొలిసారి లోక్‌సభ స్పీకర్‌కు జరగనున్న ఎన్నిక1946లో చివరిసారిగా దేశచట్టసభ స్పీకర్‌ పదవికి ఎన్నికస్వతంత్ర భారతావనిలో ఇవాళ(జూన్‌ 26)న మూడోసారి జరగనున్న ఎన్నికనేడు సీక్రెట్ బ్యాలెట్​తో ఓటింగ్స్పీకర్‌ ఓటింగ్‌ ఎన్నిక ఎలాగంటే.. బుధవారం ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్​తో ఓటింగ్ సాధారణ మెజార్టీతోనే స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక ప్రక్రియ సభలో పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్‌‌‌‌‌‌‌‌ సంబంధిత వార్త: ఓటింగ్‌కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?స్పీకర్‌ పోస్టుకు అర్హతలివేలోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పోస్టుకు పోటీ చేయొచ్చుప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. ఇండియా కూటమికి గట్టి పోటీలోక్‌సభలో ఇండియా కూటమి సంఖ్యా బలం 232ఇండియా కూటమి తరఫున ఎంపీలుగా ప్రమాణం చేయని ఐదుగురు సభ్యులుదీంతో తగ్గిన ఎంపీల సంఖ్యఇండియా కూటమి స్పీకర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌ ఎంచుకోవడంపై తృణముల్‌ కాంగ్రెస్‌ అసంతృప్తి?ఎన్డీయే కూటమి బలం 293ఎన్డీయే కూటమిలో లేకపోయినా.. బీజేపీ కోరడంతో ఓం బిర్లాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ542 ఓట్లు ఉన్న లోక్‌సభలో స్పీకర్‌ ఎన్నికకు 271 ఓట్లు అవసరంఅయితే సభలో ఇవాళ హాజరయ్యే సభ్యుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకోనున్న ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబామెజారిటీ ఎవరికి వస్తే వారే స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటనపార్టీల విప్‌ జారీలోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో విప్‌ జారీ చేసిన వివిధ పార్టీలుఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీవైఎస్సార్‌సీపీ మద్దతు కోరిన బీజేపీ.. సానుకూలంగా స్పందించిన పార్టీత్రీ లైన్స్‌ విప్‌ జారీ చేసిన టీడీపీఓటింగ్‌ విధానంపై 16 మంది ఎంపీలకు ఈ ఉదయం అవగాహన కార్యక్రమం టీడీపీతో పాటు ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలకు సైతం ఆహ్వానంసమావేశం తర్వాతే పార్లమెంట్‌కు మూడు పార్టీల ఎంపీలుఓం బిర్లా వర్సెస్‌ సురేష్‌నేడే లోక్ సభ స్పీకర్ ఎన్నికఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనివార్యంగా మారిన పోటీడిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడం పోటీకి దిగిన కాంగ్రెస్ పార్టీఎన్డీయే లోక్‌సభ అభ్యర్థిగా ఓం బిర్లాఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ కే. సురేష్ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల బలంతో స్పష్టమైన మెజారిటీబీజేపీ అగ్రనేతలు అడగడంతో, ఓం బిర్లాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీవైఎస్ఆర్సీపీ మద్దతుతో 297 కు చేరిన ఎన్డీయే బలంకాంగ్రెస్ లాలూచీ రాజకీయాల నేపథ్యంలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడంలేదన్న వైఎస్సార్‌సీపీఉదయం 11 గంటలకు లోకసభలో స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబా సమక్షంలో జరగనున్న ఎన్నికస్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి..1952లో తొలి సార్వత్రిక ఎన్నికలుఅదే సంవత్సరం లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక శంకర్‌ శాంతారామ్‌పై మౌలాంకర్‌ విజయం మౌలాంకర్‌కు 394 ఓట్లు రాగా.. శాంతారామ్‌కు 55 ఓట్లు 1976లో (ఎమర్జెన్సీ సమయంలో) బలిరామ్‌ భగత్, జగన్నాథ్‌ రావు పోటీ 344 ఓట్లతో భగత్‌ విజయం ఆ తర్వాత నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు స్పీకర్‌లుగా ఎన్నిక

Telangana Junior Doctors Strike Rift Between Osmania And Gandhi JUDAs
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్‌ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్‌ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్‌ డాక్టర్ల ప్రెసిడెంట్‌ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్‌ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్‌ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్‌ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది.

Prabhas Kalki 2898 AD Movie Ticket Purchase Precautions
'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!

ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. దేశవ్యాప్తంగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామనుకునే చాలామందికి ఇంకా టికెట్స్ దొరకట్లేదు. పోనీ తొలిరోజు ఏ షో అయినా పర్లేదు మూవీ చూద్దామనుకున్నా సరే టికెట్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో బ్లాక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాకపోతే ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అంటే థియేటర్ల దగ్గర యాభై, వంద అని చెప్పి అమ్మేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించమని చెప్తారు. తీరా తీరా పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. మీరు వాళ్లని ఏం చేయలేరు.మరోవైపు ఆన్‌లైన్ టికెట్‌ని ఎవరైనా మీకు అమ్మిన సరే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు. ఎందుకంటే బార్ కోడ్ ఉన్న టికెట్‌ని మీకు విక్రయించినట్లే, వేరొకరికి కూడా అమ్మే అవకాశముంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే అటు సినిమా చూడక ఇటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు అవుతారు. కాబట్టి సినిమా ఈ రోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కానీ టికెట్ కొనే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!)

Kejriwal Bail Hearing By Supreme Court In Liquor Case
కేజ్రీవాల్‌ బెయిల్‌.. నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్‌26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఈ స్టే ఆర్డర్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారించట్లు తెలుస్తోంది. ఇంతకుముందే బెయిల్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టు వెళ్లారు. అయితే హైకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాత విచారిస్తామని సుప్రీం తెలిపింది. దీంతో ఇవాళ ఈ అంశంపై సుప్రీం ఈ అంశంపై విచారణ జరపనుంది. కాగా కేజజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో నిందితుడికి బెయిల్‌ ఇచ్చేముందు ట్రయల్‌ కోర్టు వెకేషన్‌ జడ్జి పూర్తిస్థాయి విచారణ జరపలేదని, కేసు డాక్యుమెంట్లను కూడా సరిగా పరిశీలించినట్లు కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. కాగా, లిక్కర్‌ కేసులో సోమ, మంగళవారాల్లో కేజ్రీవాల్‌ను తీహార్‌ జైలులో విచారించిన సీబీఐ ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాయి. మరోపక్క సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లు ఆయనను బుధవారం ఉదయం రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.

Gulbadin Naib Faces Ban For Faking Injury In Afghanistan T20 World Cup Thriller?
అఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ చీటింగ్‌.. ఐసీసీ సీరియ‌స్‌!? రూల్స్‌ ఇవే

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌- బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన ఆఖ‌రి సూప‌ర్‌-8 మ్యాచ్ సినిమా థ్రిల్ల‌ర్‌ను త‌లిపించిన సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రివ‌ర‌కు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 ప‌రుగుల‌తో తేడాతో విజ‌యం సాధించిన అఫ్గానిస్తాన్‌.. తొలి సారి ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ గుల్బాదిన్ నైబ్ వ్య‌వ‌హ‌రం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.అస‌లేం ఏం జ‌రిగిందంటే?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 115 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గల్గింది. అయితే బౌలింగ్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ స‌త్తాచాటింది. ల‌క్ష్య చేధ‌న‌లో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వ‌ర్షం మొద‌లయ్యే స‌మ‌యానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 ప‌రుగుల తేడాతో గెలవ‌నుంది.అయితే వ‌ర్షం మొద‌లైన‌ప్ప‌టికి అంపైర్లు మాత్రం ఆ ఓవ‌ర్‌ను ఫినిష్ చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలో అప‌ట్టికే నాలుగు బంతులు వేసిన‌ నూర్ ఆహ్మ‌ద్‌ను అంపైర్లు ఓవ‌ర్ పూర్తి చేయ‌మ‌ని ఆదేశించారు.అయితే రెండు బంత‌లు మిగిలుండ‌డంతో బంగ్లా బ్యాట‌ర్ బౌండ‌రీ బాదితే.. డీఎల్ఎస్ ప్ర‌కారం బంగ్లాదేశ్ ముందంజ‌వేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్‌కోచ్ ట్రాట్‌ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్ర‌మంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు క‌న్పించాడు. సరిగ్గా ఆ స‌మ‌యంలో ఊపందుకోవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశాడు. ఫిజియో వ‌చ్చి నైబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్‍గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్‌లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్య‌వ‌హరాన్ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియ‌స్‌గా తీసుకున్నట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశ‌పూర్వ‌కంగా స‌మ‌యం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్‌లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్‌లో అంపైర్‌లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.

Adani To Invest RS 2 Lakh Crore In Renewable Energy Capacity Growth By 2030
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ

అహ్మదాబాద్‌: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్‌ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్‌ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్‌ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్‌ సింగ్‌ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్‌ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్‌ క్రెడిట్స్‌.. రెన్యువబుల్‌ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్‌ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్‌ నెట్‌ జీరోకు చేరనున్నట్లు అమిత్‌ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్‌ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది.

Rahul Gandhi is Leader of Opposition in Lok Sabha
న్యూ లుక్‌లో రాహుల్‌.. పీక్‌లో 20 ఏళ్ల పొలిటికల్‌ కెరియర్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్‌ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు.

YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్‌ జగన్‌ లేఖ

అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్‌ జగన్‌ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్‌లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కానీ జూన్‌ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్‌ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్‌ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్‌ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్‌ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్‌ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 208 కింద ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్‌ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్‌ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.

Daily Horoscope On June 26, 2024 In Telugu
జూన్‌ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి రా.10.48 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ధనిష్ట ప.3.27 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.10.14 నుండి 11.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.37 నుండి 12.29 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.34. మేషం....ఇంటాబయటా అనుకూలం..పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణయత్నాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం...పనులు సకాలంలో పూర్తి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.మిథునం...పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కర్కాటకం...పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.సింహం...పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. దైవదర్శనాలు.కన్య...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.తుల...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం.....కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.ధనుస్సు....ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.మకరం....ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం...సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.మీనం...కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement