KL Rahul
-
చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు
పెర్త్ టెస్టులో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత జట్టు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. తాను అవుటైన తీరుకు రాహుల్ సైతం ఆశ్చర్యంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఆ ముగ్గురు విఫలంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0), నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు!అయితే, టీమిండియా ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో బరిలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రాహుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయినా సరే.. వెనక్కి తగ్గని ఆతిథ్య జట్టు రివ్యూకు వెళ్లింది.థర్డ్ అంపైర్ మాత్రంఈ క్రమంలో థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి.. బంతి కీపర్ చేతుల్లో పడే సమయంలో వచ్చిన శబ్దం.. బ్యాట్ రాహుల్ ప్యాడ్‌కు తాకడం వల్ల వచ్చిందా? లేదంటే బంతిని తాకడం వల్ల వచ్చిందా అన్న అంశంపై స్పష్టత రాలేదు. కానీ రీప్లేలో వివిధ కోణాల్లో పరిశీలించకుండానే.. కేవలం స్నీకో స్పైక్ రాగానే థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించడం గమనార్హం. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహంథర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు కారణమైంది. రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదొక చెత్త నిర్ణయం. పెద్ద జోక్ కూడా’’ అంటూ మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఫైర్ అయ్యాడు.మరోవైపు.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం.. ‘‘ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నాటౌట్. అయినా స్పష్టత లేకుండానే అతడి కాల్‌ను ఎలా తిరస్కరిస్తారు. బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపిస్తున్నా.. ఇదేం విచిత్రం. ఇది ఒక మతిలేని నిర్ణయం. చెత్త అంపైరింగ్’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం విశేషం. కాగా రాహుల్ తొలి రోజు ఆటలో భాగంగా 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి నిష్క్రమించాడు. చదవండి: 77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా! Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
IND VS AUS 1st Test: అరుదైన క్లబ్లో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కును దాటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రాహుల్ ఈ ఘనతను సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున 3000 పరుగుల మార్కును తాకిన 26వ ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు (15921) దక్కుతుంది. ఓవరాల్‌గా చూసినా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసింది సచినే. రాహుల్ తన 54వ టెస్ట్‌లో 3000 పరుగుల మార్కును దాటాడు. రాహుల్ 92 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3007 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్ టెస్ట్‌లో ఆది నుంచి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్.. ఓ వివాదాస్పద నిర్ణయానికి ఔటయ్యాడు. రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 51/4గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్ ఖాతా తెరవకుండానే ఔట్ కాగా.. విరాట్ కోహ్లి 5, రాహుల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. రిషబ్ పంత్ (10), ధృవ్ జురెల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల పూర్తి డామినేషన్ నడిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేసిందేమో అనిపించింది. పిచ్‌పై బౌన్స్‌తో పాటు అనూహ్యమైన స్వింగ్ లభిస్తుంది. -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్‌తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024 -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్‌మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్‌ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్‌గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్‌మన్ గిల్‌కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు మరో భారీ షాక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడగా.. తాజాగా ఈ జాబితాలో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చేరాడు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం పెర్త్‌లోని డబ్ల్యూఎసీఎ గ్రౌండ్లో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా తన మోచేయికి బంతి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ తన బ్యాటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు.కానీ నొప్పి తగ్గకపోవడంతో రాహుల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.భారత ఓపెనర్ ఎవరు?కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడు. దీంతో జైశ్వాల్ జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపించాలని టీమ్ మేనెజ్మెంట్ నిర్ణయించుకుంది. ఇప్పుడు రాహుల్ కూడా గాయం బారిన పడడంతో మేనెజ్మెంట్ ఆందోళన చెందుతుంది. ఒక వేళ రాహుల్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్‌బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.కెప్టెన్‌గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్‌కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు రూ.20 కోట్లు! ఆర్సీబీ కెప్టెన్‌గా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్‌కు రూ.20 కోట్లు!ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్‌ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల -
వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-‘ఎ’ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆసీస్-‘ఎ’ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.వారు ముందుగానే ఆస్ట్రేలియాకుకాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బీజీటీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో బీజీటీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులను బీసీసీఐ ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది.రాహుల్‌తో పాటు జురెల్ కూడారుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-‘ఎ’ జట్టుకు కూడా వీరిని ఎంపిక చేసింది. కంగారూ గడ్డపై పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను సైతం భారత్-‘ఎ’ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేలా అక్కడకు పంపింది.సానుకూలాంశాలు ఆ రెండేఅయితే, ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో ఏడు, రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ రెండు మ్యాచ్‌లలో సానుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ శతకం(103).. రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీలు(80, 68).వరుసగా నాలుగు సెంచరీలతో సత్తా చాటిఇక ఈ సిరీస్‌లో అత్యంత నిరాశపరిచింది ఎవరంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(4, 10). రాహుల్ సంగతి పక్కన పెడితే.. అభిమన్యుపైనే ఈ సిరీస్ ప్రభావం గట్టిగా పడనుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ఈ బెంగాల్ బ్యాటర్‌ను సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బీజీటీ ఆడబోయే జట్టుకు ఎంపిక చేశారు.రోహిత్ స్థానంలో ఆడించాలనే యోచన.. కానీతొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడన్న వార్తల నడుమ.. అభిమన్యునే యశస్వి జైస్వాల్‌తో ఓపెనర్‌గా దించుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఆసీస్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలోనే అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాడు.దీంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.అతడు ఫెయిల్ అయినా ఓపెనర్గానేఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్ బీజీటీ మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్- ‘ఎ’ జట్టుతో రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ.. ‘‘మరోసారి మనవాళ్లు ఫెయిల్ అయ్యారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. అంతా చేతులెత్తేశారునిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి బీసీసీఐ వాళ్లను అక్కడికి పంపింది. కానీ.. వాళ్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ సిరీస్‌లో అభిమన్యు ఈశ్వరన్ విఫలమైనా.. అతడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దారుణంగా విఫలంఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఆసీస్-‘ఎ’తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో అభిమన్యు చేసిన పరుగులు వరుసగా.. 7, 12, 0, 17. ఇదిలా ఉంటే.. నవంబరు 22 నుంచి ఆసీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. మా అందమైన ఆశీర్వాదం 2025లో రాబోతుందని రాహుల్, అతియా జంట తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. వీరికి బాలీవుడ్ మరియు క్రికెట్ సర్కిల్స్‌లో అందమైన, అన్యూన్యమైన జంటగా పేరుంది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty)కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. రాహుల్.. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాహుల్ ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేస్తూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రాహుల్ భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు, పది పరుగులు చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్‌కు ఆట పరంగా ఏదీ కలిసి రావడం లేదు. రాహుల్‌ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కూడా వేలానికి వదిలేసింది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితక డెలివరీకి సిద్దంగా ఉండటంతోనే రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌కు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. -
ఏంటి రాహుల్.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్‌ను కోల్పోయాడు.అసలేం జరిగిందంటే?భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు. "Don't know what he was thinking!"Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024 -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
BGT 2024: సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు.. మిడిలార్డర్లో అతడు ఫిక్స్!
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.కివీస్‌తో టెస్టులలో నో ఛాన్స్కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. జురెల్‌ను పక్కనపెట్టారు.అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోఇక కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్‌ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.161 పరుగులకే ఆలౌట్ఇక ఇప్పటికే ఆసీస్-ఎ, భారత్-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్.టాపార్డర్ కుప్పకూలి 11 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ వికెట్ కీపర్ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. సహచరులంతా ఆసీస్ బౌలర్ల ధాటికి.. పెవిలియన్‌కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్ జురెల్‌ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో జురెల్‌కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.వికెట్ కీపర్‌గా పంత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్‌కు లైన్ క్లియర్ అవుతుంది. కివీస్ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కివీస్‌తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్‌కు బదులు జురెల్ ఆసీస్ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయిబోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు శుభారంభం లభించలేదు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు.ఏమైంది రాహుల్?రాహుల్ తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరాశపరచడంతో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ కూడా చోటు దక్కింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అలవాటు పడేందుకు రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ ప్రధాన జట్టుకంటే ముందే ఆస్ట్రేలియాకు భారత జట్టు మేనెజ్మెంట్ పంపింది. కానీ అక్కడ కూడా రాహుల్ తనకు దక్కిన అవకాశాన్ని అంది పుచ్చుకోలేకపోయాడు. నవంబర్ 22 నుంచి ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. కానీ రాహుల్ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "మరి నీవు మారావా రాహుల్, ఎక్కడికి వెళ్లినా అంతేనా? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.కష్టాల్లో భారత్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు కేవలం 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ మైఖల్ నీసర్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. అతడితో పాటు వెబ్‌స్టార్ రెండు, స్కాట్ బోలాండ్ ఒక్క పడగొట్టాడు. భారత బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(52 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.చదవండి: BAN vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ -
IPL 2025: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా ఐపీఎల్–2025 వేలం జరగనుండగా... ఇందులో భారత్ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు... చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, యుజువేంద్ర చహల్ కూడా ఉన్నారు. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా... ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అండర్సన్ తొలిసారి... టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ వేలానికి దూరమయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్... టి20 మ్యాచ్ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అండర్సన్ చివరిసారిగా 2014లో ఈ ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. అండర్సన్ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. గత వేలంలో అత్యధిక ధర (రూ. 24 కోట్ల 50 లక్షలు) పలికిన ప్లేయర్‌గా ఘనత సాధించిన ఆ్రస్టేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు. రూ. 75 లక్షలతో సర్ఫరాజ్ గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు... పేలవ ఫామ్‌తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా... ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్ తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇటలీ నుంచి తొలి ఎంట్రీ... ఇటలీ పేసర్ థామస్ డ్రాకా ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా డ్రాకా నిలిచాడు. ఇటలీ తరఫున ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల డ్రాకా... గ్లోబల్ టి20 కెనడా టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోరీ్నలో 11 వికెట్లు పడగొట్టిన డ్రాకా... ఆల్‌రౌండర్ల జాబితాలో ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఐఎల్ టి20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్ జట్టుకు డ్రాకా ఎంపికయ్యాడు. ఇక అండర్–19 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్లో రాణిస్తున్న నేత్రావల్కర్ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు. -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
కేఎల్ రాహుల్‌పై దృష్టి
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఒత్తిడిలోనే ఉంచే ప్రయత్నం చేస్తామని... ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ్రస్టేలియా ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు ఒక అనధికారిక టెస్టు ఆడి ఓడిపోగా... రెండో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ముందుగానే ఆ్రస్టేలియాలో అడుగు పెట్టారు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మాత్రమే ఆడి తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్... బోర్డర్–గావస్కర్ సిరీస్‌లోని మొదటి టెస్టు కోసం తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో బోలాండ్ మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్‌కు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత స్వదేశంలో అతడికి బౌలింగ్ చేయనున్నా. అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్. అతడిని ఒత్తిడిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని బోలాండ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడి పిచ్‌లపై బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ్రస్టేలియా పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసుకునే విధానం భారత్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. 2015లో తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన రాహుల్... సిడ్నీ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై చివరిసారి సెంచరీ చేసిన రాహుల్... ఆ తర్వాత 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు. -
మై క్రేజీ బేబీ: భార్యకు కేఎల్ రాహుల్ బర్త్‌డే విషెస్ (ఫొటోలు)
-
బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కివీస్‌పై చేసిన తప్పిదాలను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పునరావృతం చేయకూడదని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం రోజుల ముందుగానే ఆస్ట్రేలియా పంపాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుతో వీరిద్దరూ బుధవారం(నవంబర్ 6) కలవనున్నారు. నవంబర్ 7 నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్, జురెల్ భారత్-ఎ తరపున ఆడే ఛాన్స్ ఉంది.కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన రాహుల్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో మిగితా రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. రాహుల్‌కు ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్ 20.77 సగటుతో కేవలం 187 పరుగులు మాత్రమే చేశాడు.జురెల్ ఇదే తొలిసారి.. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్‌కు లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే జురెల్‌ను కూడా జట్టు మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాకు పంపింది. ఇక నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Ind vs Aus: కివీస్ చేతిలో టీమిండియా వైట్‌వాష్.. ఆసీస్ స్టార్ కామెంట్స్ వైరల్ -
IPL 2025 Retention List: కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు ఇవే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..కోల్‌కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుపంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్‌తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్‌ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్‌ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాన్పూర్ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్‌ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్‌కు లైన్‌క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..?
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ రాహుల్ స్ట్రయిక్‌రేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్ స్ట్రయిక్ రేట్ ప్రధాన కారణమని మేనేజ్మెంట్ భావిస్తుందట.రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను కూడా రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం.కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు.