Steve Smith
-
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
ఫస్ట్ ఈజీ క్యాచ్ వదిలేశాడు.. కట్ చేస్తే! స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌ను స్మిత్ పెవిలియన్‌కు పంపాడు. తొలుత స్లిప్స్‌లో రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను విడిచిపెట్టిన స్మిత్.. రెండోసారి మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.భారత తొలి ఇన్నింగ్స్ 43 ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్.. రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ కార్నర్ దిశగా వెళ్లింది.ఈ క్రమంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న స్మిత్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన రాహుల్ బిత్తరపోయాడు. దీంతో 84 పరుగులు చేసిన రాహుల్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్ WHAT A CATCH FROM STEVE SMITH!Sweet redemption after dropping KL Rahul on the first ball of the day.#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/d7hHxvAsMd— cricket.com.au (@cricketcomau) December 17, 2024 -
చరిత్ర సృష్టించిన స్మిత్.. విలియమ్సన్, మార్క్‌వా రికార్డులు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. స్మిత్‌కు ఇది 25 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం గమనార్హం.స్మిత్ చివరగా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై చివరి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత మూడెంకెల స్కోర్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్‌కు ఇది భారత్‌పై 10వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.స్మిత్ అరుదైన రికార్డులు..టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్ రికార్డును స్మిత్ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్ 41 ఇన్నింగ్స్‌లలో పది శతకాలు సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్(32)ను స్మిత్ వెనక్కి నెట్టాడు. -
భారత్‌తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్.. వరల్డ్ రికార్డు
భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.తొలిరోజు వర్షం వల్ల అంతరాయంపెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్‌బాల్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరంభంలో భారత పేసర్ల జోరుఅయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్ మెక్‌స్వీనీ(9) అవుట్ చేసిన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఉస్మాన్ ఖవాజా(21) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా బౌలర్లకు తలనొప్పిఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్ రెడ్డి మార్నస్ లబుషేన్(12)ను పెవిలియన్‌కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ట్రవిస్ హెడ్ రాకతో సీన్ రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్‌తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రక్రీజులో పాతుకుపోయిన హెడ్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్‌లోనూ గోల్డెన్ డకౌట్(కింగ్ పెయిర్) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.గత ఏడు ఇన్నింగ్స్‌లో ఇలాగబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్‌లోనూ ట్రవిస్ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్‌లో హెడ్ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్ హెడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ఉన్నది వీరే..1. వాజిర్ మహ్మద్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19582. అల్విన్ కాళిచరణ్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19743. మార్వన్ ఆటపట్టు- కొలంబో ఎస్ఎస్సీ- 20014. రామ్‌నరేశ్ శర్వాణ్- కింగ్స్టన్- 20045. మహ్మద్ ఆఫ్రాఫుల్- చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్- 20046. ట్రవిస్ హెడ్- బ్రిస్బేన్ గబ్బా- 2024.బుమ్రా బౌలింగ్లోఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్‌కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్, గబ్బా) వరుసగా బాదడం విశేషం.బ్రేక్ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్, 152 పరుగులు సాధించిన హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్, పంత్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు.చదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్HE'S DONE IT AGAIN!Travis Head brings up another hundred ⭐️#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/10yBuL883X— cricket.com.au (@cricketcomau) December 15, 2024 -
భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టు ఫార్మాట్లో పరుగులు రాబట్టలేక ఈ మాజీ కెప్టెన్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. గత పదమూడు ఇన్నింగ్స్‌లో కలిపి స్మిత్ చేసిన పరుగులు కేవలం 232. ఇందులో ఒకే ఒక్క అర్ధ శతకం ఉంది.స్మిత్‌కు చేదు అనుభవంఇక టీమిండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ స్టీవ్ స్మిత్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 0, 17, 2. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 2015 తర్వాత అతడు కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోవడం ఇదే తొలిసారి.వేటు వేసేందుకు రెడీఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో మూడో టెస్టులో స్మిత్‌పై వేటు వేసేందుకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అతడికి కొన్నాళ్లపాటు విశ్రాంతి పేరిట తప్పించనున్నట్లు సమాచారం. అయితే, ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం.. స్మిత్ త్వరలోనే మునుపటి లయను అందుకుని.. పరుగుల వరద పారిస్తాడని ధీమా వ్యక్తం చేయడం విశేషం.1-1తో సమంగాకాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో తమకు చివరిదైన ఈ సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే.. భారత్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో 295 పరుగులు తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం పది వికెట్ల తేడాతో ఓడింది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో డిసెంబరు 14- 18 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అప్పుడు భీకర ఫామ్‌లో..2014-2017 మధ్య స్టీవ్ స్మిత్ ఏడాదికి కనీసం ఐదు నుంచి ఆరు శతకాలు బాదాడు. అదే స్థాయిలో హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. గతేడాది సైతం సగటున 42.22తో పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో మూడు శతకాలు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మాత్రం ఒక్కసారి కూడా అతడు బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ సగటు 23.20. 2010 తర్వాత ఇదే స్మిత్ లోయెస్ట్ యావరేజ్.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
విరాట్ ఒక వారియర్.. అతడిని చూసి ఆసీస్ క్రికెటర్లు నేర్చుకోవాలి: పాంటింగ్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫామ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక తన రిథమ్‌ను తిరిగి పొందిన విరాట్.. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టుకు సన్నద్దమవుతున్నాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు కోహ్లిని చూసి నేర్చుకోవాలని పాంటింగ్ సూచించాడు. కాగా ఈ ఆసీస్ స్టార్లు ఇద్దరూ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నారు. పెర్త్ టెస్టులో వీరిద్దరి దారుణ ప్రదర్శన చేశారు.ఈ క్రమంలో పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. "విరాట్ ఎప్పుడూ ఆత్మవిశ్వాన్ని కోల్పోడు. అతడొక వారియర్. తనను తను విశ్వసించినందున బలంగా తిరిగి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి డిఫెరెంట్‌గా కన్పించాడు. అతడు ప్రత్యర్ధిలతో పోరాడాలని భావించలేదు. కేవలం తన బలాలపై దృష్టి పెట్టాడు. లబుషేన్, స్మిత్ కూడా కోహ్లిని ఫాలో అవ్వాలి. పరుగులు ఎలా చేయాలో ముందు దృష్టి పెట్టిండి. అంతే తప్ప మీ వికెట్ గురించి ఆలోచించకండి.ఫామ్‌లో లేనప్పుడు ఏ ఆటగాడికైనా పరుగులు సాధించడం చాలా కష్టమవుతోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందకు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నాడు. -
బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు. తొలుత అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీని ఔట్ చేసి ఆసీస్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టిన బుమ్రా.. ఆ తర్వాత స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కమ్మిన్స్ ఔట్ చేసి ఆతిథ్య జట్టును కష్టాల్లో నెట్టేశాడు.ఇప్పటివరకు మొదటి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ తొలి బంతికే ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా టెస్టుల్లో స్మిత్‌ను బుమ్రా కంటే ముందు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత స్మిత్ రెండో సారి గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IND vs AUS: వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్ -
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
Ind vs Aus: ఓపెనర్‌గా కాదు.. మిడిలార్డర్లోనే..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2024లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ స్థానంపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ స్పష్టతనిచ్చాడు. ఈ స్టార్ ప్లేయర్ మిడిలార్డర్లోనే వస్తాడని పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్‌లతో చర్చించిన తర్వాత స్మిత్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించాడని తెలిపాడు.స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలికాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, టాపార్డర్‌లో అతడు రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌తో గాబాలో అర్ధ శతకం బాదడం మినహా ఓపెనర్‌గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లోనూ అతడి సగటు 28.50గా మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, స్మిత్ మాత్రం తాను ఓపెనర్‌గా వచ్చేందుకు సుముఖంగానే ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్, ఆండ్రూ, స్టీవ్ స్మిత్.. ముగ్గురూ ఈ విషయంపై చర్చించారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా ఎంతకాలం జట్టుకు దూరంగా ఉంటాడో తెలియని పరిస్థితి.ఓపెనర్‌గా కాదు.. మిడిలార్డర్లోనే..ఇలాంటి సమయంలో.. తాను ఓపెనర్‌గా ఉండటం కంటే మిడిలార్డర్లో ఉండటమే మంచిదని స్మిత్ భావించాడు. అదే విషయాన్ని ప్యాట్, ఆండ్రూతో చెప్పాడు. వాళ్లిద్దరు కూడా స్మిత్ నిర్ణయంతో ఏకీభవించారు. రానున్న సిరీస్‌లలో స్మిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు’’ అని స్పష్టం చేశాడు.కాగా దశాబ్దకాలానికి పైగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు వెన్నెముకలాగా ఉంటున్నాడు. నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన సగటు 61.51తో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల కంగారూ బ్యాటర్లలో స్మిత్ ముఖ్యుడు. ఈ నేపథ్యంలోనే నవంబరులో మొదలుకానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి అతడు మళ్లీ మిడిలార్డర్లో ఆడనున్నాడు.కామెరాన్ గ్రీన్‌కు వెన్నునొప్పికాగా మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆడాల్సి ఉండగా.. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైన గ్రీన్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఇదిలా ఉంటే.. మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్- సునీల్ గావస్కర్ పేర్ల మీదుగా సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’ -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ -
Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని కొనియాడాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమని.. అయితే, అతడి పోటీ మాత్రం మజానిస్తుందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తాజా టెస్టు సిరీస్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే.చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల క్లబ్లో చేరాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లో 15 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీఇక బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల అనంతరం.. బుమ్రా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉంది. అనంతరం భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ స్టార్ స్టీవ్ స్మిత్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు.ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‘‘అతడొక అద్భుతమైన బౌలర్. కొత్త బంతి అయినా.. కాస్త పాతబడినా.. మొత్తంగా అలవాటుపడిన బంతికి అయినా.. అతడిని ఎదుర్కోవడం కష్టం. బుమ్రాకు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అతడు గొప్ప బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవడం అంటే సవాలుతో కూడుకున్న పని’’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.బుమ్రా ఉంటే అంతేకాగా 2018-19, 2020-21లో ఆసీస్‌పై భారత్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2018-19లో నాలుగు టెస్టుల్లో 21, 2020-21లో మూడు టెస్టుల్లో 11 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్ సేన ఐదు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ -2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం.చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లోనూ: స్మిత్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని.. పొట్టి ఫార్మాట్లో రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు.పరుగుల వీరుడుఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేసిన స్మిత్.. ఇప్పటి వరకు 109 టెస్టులు, 158 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచరీల సాయంతో 9685 పరుగులు చేసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. వన్డేల్లో 12 శతకాలు బాది.. 5446 రన్స్ స్కోరు చేశాడు. అయితే, టీ20లలో మాత్రం స్మిత్ సగుటన 24.86తో కేవలం 1094 పరుగులు మాత్రమే చేయగలిగాడు.యువ ఆటగాళ్ల నుంచి పోటీ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆసీస్ టీ20 జట్టులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్మిత్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 35 ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్‌లో పస ఇంకా తగ్గలేదంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంఛైజీ సిడ్నీ సిక్సర్‌తో ఇటీవలే మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ సిడ్నీ క్రికెటర్... మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగలనని తెలిపాడు.ఒలింపిక్స్‌లోనూ భాగమైతే.. ‘‘ప్రపంచంలోని ఫ్రాంఛైజీ క్రికెట్లో.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే నేనే ఎక్కువ లీగ్‌లలో భాగమయ్యాను. మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగల సత్తా నాకుంది. కాబట్టి.. రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం... ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ భాగమైతే ఇంకా బాగుంటుంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.టీమిండియా పటిష్ట జట్టు ఇక భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియా పటిష్టమైన జట్టు. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రానున్న విశ్వ క్రీడల ఎడిషన్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్టీవ్ స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. మేజర్ లీగ్ క్రికెట్ విజేత వాషింగ్టన్ ఫ్రీడం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను వాషింగ్టన్ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్ ఆధ్యాంతం భీకర ఫామ్‌లో ఉండిన ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్ బౌలర్లలో కమిన్స్ 2, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్, డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన జన్సెన్.. రచిన్ మాయాజాలం208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్ మార్కో జన్సెన్ (4-1-28-3), రచిన్ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్ నేత్రావల్కర్ (4-0-33-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు కార్మీ రౌక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. జన్సెన్, రచిన్ అద్భుతంగా బౌలింగ్ చేసి యూనికార్న్స్ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ టీమ్‌ను స్టీవ్ స్మిత్ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్ టీమ్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ విధ్వంసం.. ట్రవిస్ హెడ్ మెరుపులు
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లో స్మిత్‌కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024మరో ఎండ్‌లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. -
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న స్టీవ్ స్మిత్
మేజర్ లీగ్ క్రికెట్లో (ఎంఎల్సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్‌లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.Steven Smith loving the MLC. pic.twitter.com/k8CfprlXnQ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ గత సీజన్‌కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.వాషింగ్టన్ ఫ్రీడం, టెక్సస్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన వాషింగ్టన్ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు. -
రోహిత్, బాబర్ కాదు.. అతడే వరల్డ్‌కప్ టాప్ రన్ స్కోరర్: స్మిత్
టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు. "ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్‌స్కోరర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
స్మిత్‌కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్‌ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్‌లు ఆడి 125.45 స్ట్రయిక్‌రేట్‌తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టీవ్ స్మిత్‌కు షాక్.. ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్‌కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్‌కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్‌లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్‌గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్‌ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్‌కు జాతీయ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్‌పై ఉండనే ఉంది. స్మిత్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్‌కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో స్మిత్‌కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
మేజర్ లీగ్ క్రికెట్లో స్టీవ్ స్మిత్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీ స్టీవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ రెండో సీజన్లో స్టీవ్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్సీ అరంగేట్రం సీజన్లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడంకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. 𝐒𝐦𝐮𝐝𝐠𝐞 x 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 = 😍 Welcome the the family, 𝐒𝐭𝐞𝐯𝐞 𝐒𝐦𝐢𝐭𝐡 ❤️#WashingtonFreedom #MLC2024 #SteveSmith pic.twitter.com/bGrzxlsr61 — Washington Freedom (@WSHFreedom) April 11, 2024 వాషింగ్టన్ ఫ్రీడంకు ఆసీస్ ఆటగాడు మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్‌తో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి స్టీవ్ వీరితో జతకట్టనున్నాడు. ఎంఎల్సీ రెండో సీజన్ కోసం మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, స్టీవ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్ క్రికెట్లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో స్టీవ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్‌ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్ టాపార్డర్ బెర్తులు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లతో భర్తీ అయ్యాయి.