Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Tweet On Counting Of AP Elections
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024

All Arrangements Complete For AP Elections Counting
AP: ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్ ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లుు పోల్ 26,721 సర్వీస్ ఓట్లు భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్‌కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలురాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటులోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటుఅసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లుఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతిమూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపురెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులుకౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులుతుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశంగెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు

AP Election Results 2024: Is June 4th Doom Day For TDP Alliance?
ఏపీ జడ్జిమెంట్‌ డే.. కూటమిలో గుబులు

సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్‌సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్‌ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్‌ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్‌ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్‌ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్‌ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్‌' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్‌సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్‌ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్‌ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్‌ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్‌ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్‌ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్‌ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్‌ మీ సాక్షిలో..

Swami Paripurnanandha Key Comments On Ap Election Result
వైఎస్‌ఆర్‌సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద

సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్‌ చేశారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్‌సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్‌జగన్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.

Sajjala On Postal Ballot EC Decision And Chandrababu Manage Politics
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల

గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్‌ పూర్తై డిక్లరేషన్‌ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు.

India Cricketer Kedar Jadhav Announces Retirement From All Forms Of Cricket
రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్‌.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్‌ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్‌ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్‌ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్‌ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్‌.. ఐపీఎల్‌ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్‌కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్‌ పలు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం​ వహించే కేదార్‌.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 186 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్‌ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన కేదార్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్‌.. తన రిటైర్మెంట్‌ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్‌లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Bangalore Rave Party Case: Actress Hema Has Been Retained By Bengaluru CCB Police
బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్‌ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్‌ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్‌ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్‌, మహ్మద్‌ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్‌, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్‌ గిఫ్ట్‌

Congress Government make Vastu changes at telangana secretariat
తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌.. ఇక నుంచి వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చి నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్‌ ఈస్ట్‌ గేట్‌ ద్వారా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.కాగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్‌ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Count Down Starts For AP Election Results Live Updates
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

AP Elections Counting Count Down4:37 PM, 3rd June, 2024విజయవాడఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిమొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలుకైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులువిజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులుఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లుమచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లుమచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిప్రతీ రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటుప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయంసాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశంఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు2:19 PM, 3rd June, 2024కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ హల్‌లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాముకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధంఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాంకౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం 2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్‌ ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్‌ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్‌ గుప్తా కామెంట్స్‌..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏ‍ర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్‌..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్‌సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్‌ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్‌ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్‌ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్‌ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కామెంట్స్‌..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న దైనిక్‌ భాస్కర్‌(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 పోల్స్‌ వైఎస్సార్‌సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్‌డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్‌సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్‌ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్‌డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్‌’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్‌సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్‌

CEC Rajiv Kumar Comments Over Election Counting Process
సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్‌: ఈసీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్‌ సిటిజన్స్‌, మహిళలకు తాము సెల్యూట్‌ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్‌ ఓయేషన్‌ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్‌లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్‌ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రా‍ల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్‌ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement