Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్‌ జగన్‌ లేఖ

అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్‌ జగన్‌ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్‌లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కానీ జూన్‌ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్‌ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్‌ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్‌ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్‌ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్‌ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 208 కింద ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్‌ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్‌ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.

Delhi High Court stays trial court order granting bail to Arvind Kejriwal in Excise policy case
ఇక సీబీఐ వంతు!

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్‌ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్‌ కేసులో బెయిల్‌ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్‌ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ జైన్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్‌ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్‌ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్‌ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

WikiLeaks Founder Julian Assange Released From UK Prison
అసాంజ్‌కు ఎట్టకేలకు స్వేచ్ఛ!

వాషింగ్టన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఆయనను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్‌ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదేళ్లుగా బ్రిటన్లో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో అసాంజ్‌ విడుదలకు మార్గం సుగమమయ్యింది. దాని ప్రకారం అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు యూకే జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు.చార్టర్డ్‌ విమానంలో ఉత్తర మరియానా ఐలాండ్స్‌లోని సైపన్‌ ద్వీపానికి బయల్దేరారు. అక్కడి అమెరికా ఫెడరల్‌ కోర్టులో బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణకు హాజరవుతారు. అమెరికా వెళ్లడానికి అసాంజ్‌ నిరాకరించడంతో ఆ్రస్టేలియా సమీపంలో అమెరికా అ«దీనంలో ఉండే ఈ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం... గూఢచర్య చట్టాన్ని అతిక్రమిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలను అసాంజ్‌ అంగీకరించనున్నట్లు సమాచారం.ఆయనపై మోపిన 18 అభియోగాలను కలిపి ఒకే కేసుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. అసాంజ్‌ నేరాంగీకార వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆయనకు శిక్ష ఖరారు చేస్తారు. ఇప్పటికే బ్రిటన్‌లో అనుభవించిన ఐదేళ్ల శిక్షతో సరిపెట్టి విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే ఆ వెంటనే అసాంజ్‌ నేరుగా స్వదేశం ఆ్రస్టేలియాకు వెళ్లనున్నారు. ధ్రువీకరించిన వికీలీక్స్‌ అసాంజ్‌ విడుదలను వికీలీక్స్‌ సంస్థ ధ్రువీకరించింది. ఈ మేరకు సామాజిక వేదిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘‘1,901 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన జూన్‌ 24న విడుదలయ్యారు. అసాంజ్‌ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపింది.ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్‌ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్‌ చేసి అసాంజ్‌ సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజ్‌ స్థాపించిన వికీలీక్స్‌ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్‌ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్‌ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్‌ విడుదల చేసింది. తర్వాత ఇరాక్‌ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజ్‌ అరెస్టుకు స్వీడన్‌ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.అరెస్టు... ఆశ్రయం జైలుఅసాంజ్‌ 2010 అక్టోబర్‌లో బ్రిటన్‌లో అరెస్టయ్యారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే ఆయన్ను స్వీడన్‌కు అప్పగించాలని 2011 ఫిబ్రవరిలో లండన్‌ కోర్టు ఆదేశించింది. దీనిపై బ్రిటన్‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా లాభం లేకపోయింది. దాంతో అసాంజ్‌ కొంతకాలం లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్‌లో ఆ ఆశ్రయం రద్దయింది. అనంతరం బ్రిటన్‌ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో శిక్ష పూర్తయ్యాక కూడా జైలులోనే ఉన్నారు. అసాంజ్‌ ఆత్మహత్య చేసుకునే ప్రమాదమున్నందున అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్‌ కోర్టు 2021లో చెప్పింది.ఉత్కంఠగా ఉంది భార్యఅసాంజ్‌ భార్య స్టెల్లా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడారు. భర్త రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. న్యాయవాది అయిన ఆమె అసాంజ్‌ను 2022లో ఆయన జైల్లో ఉండగానే పెళ్లాడారు. అసాంజ్‌ చార్టర్డ్‌ విమాన ప్రయాణ ఖర్చు 5 లక్షల డాలర్లని ఆయన అభిమానులు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించడానికి ఫండ్‌ రైజింగ్‌ ప్రచారం మొదలు పెట్టామన్నారు.

There was no consensus between NDA and INDIA for Lok Sabha Speaker post
స్పీకర్‌ పదవికి పోటీ.. ఓం బిర్లా x సురేష్‌

న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్‌ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్‌ ఎంపీ కొడైకున్నిల్‌ సురేశ్‌ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్‌ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్పీకర్‌ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్‌నాథ్‌ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షాలతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్‌.బాలు మంగళవారం సమావేశమయ్యారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్‌) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్‌లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్‌ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్‌ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్‌ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్‌ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్‌ గోయల్, లలన్‌ సింగ్‌ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్‌ను పరిశీలిస్తామని సీనియర్‌ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడోసారి పోటీ స్పీకర్‌ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్‌సభ చరిత్రలో స్పీకర్‌ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్‌ అభ్యర్థి జి.వి.మౌలాంకర్‌ 394 ఓట్లు సాధించి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి. 1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్‌ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్‌సభ ఐదో సెషన్‌ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్‌ జి.ఎస్‌.ధిల్లాన్‌ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్‌ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ నాయకుడు బలిరామ్‌ భగత్‌ను స్పీకర్‌ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్‌ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్‌ భగత్‌కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్‌ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్‌ జరిగితే.. పేపర్‌ స్లిప్పులనే వాడనున్నారు. నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్‌ నేత బలరాం జాఖడ్‌ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్‌సభల్లో) స్పీకర్‌గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు. అది మా హక్కు: సురేష్‌ ‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్‌ ఉంటే డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్‌సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్‌ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్‌ అన్నారు.

Afghanistan in T20 World Cup semi finals
అఫ్‌‘గన్‌’ పేలింది

కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్‌ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్‌డాగ్‌ కిందే లెక్క.. కానీ లీగ్‌ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్‌–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్‌ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్‌ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్‌–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్‌ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్‌టౌన్‌ (సెయింట్‌ విన్సెంట్‌): ‘కమాన్‌ బంగ్లాదేశ్‌’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్‌‡్ష మాట ఇది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జట్టు కూడా మరో టీమ్‌ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్‌ గెలిస్తే తాము సెమీఫైనల్‌ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్‌–1 చివరి సూపర్‌–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్‌ టీమ్‌... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడతాయి. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్‌ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్‌ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్‌ దాస్‌ (49 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నవీన్‌ ఉల్‌ హక్‌ (4/26), కెపె్టన్‌ రషీద్‌ ఖాన్‌ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్‌–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్‌ రెండో స్థానంతో సెమీస్‌ చేరింది. బంగ్లాదేశ్‌ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్‌–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్‌ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్‌ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్‌ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్‌ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్‌ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్‌ తన తొలి ఓవర్లోనే తన్జీద్‌ (0)ను అవుట్‌ చేయగా, నవీన్‌ వరుస బంతుల్లో నజు్మల్‌ (5), షకీబ్‌ (0)లను అవుట్‌ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్‌ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్‌ (10), తౌహీద్‌ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్‌ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్‌ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్‌ లూయిస్‌ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్‌ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్‌ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేయడంతో అఫ్గాన్‌ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్‌! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్‌ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్‌ ముగిసిపోతే అఫ్గాన్‌ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి అఫ్గాన్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బదిన్‌ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్‌ తర్వాతి వికెట్‌ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్‌ తర్వాత రషీద్‌ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్‌ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్‌ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్‌డన్‌’ అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు జరిగిన వెల్‌కమ్‌ పార్టీలో క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాతో రషీద్‌ ఖాన్‌ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్‌ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్‌ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియంలోనే రషీద్‌ బృందం సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్‌లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్‌ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్‌ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌ లో నాటి పనిని అఫ్గాన్‌ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌–డివిజన్‌–5లో జపాన్, బోట్స్‌వానావంటి జట్లతో తలపడిన టీమ్‌ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్‌ కప్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్‌ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్‌ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్‌ టీమ్‌ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. రషీద్‌ ఖాన్‌: కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోరీ్నలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్‌... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్‌ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. గుర్బాజ్‌: ఓపెనర్‌గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్‌ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్‌ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్‌ ఉల్‌ హక్‌: ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి. ట్రవిస్‌ హెడ్‌ను క్లీన్‌»ౌల్డ్‌ చేసిన అతని అవుట్‌స్వింగర్‌ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్‌ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్‌ జడేజా (వన్డే వరల్డ్‌ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్‌ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్‌ బ్రేవో (బౌలింగ్‌ కన్సల్టెంట్‌): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్‌ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్‌ ట్రాట్‌: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడైన ట్రాట్‌ హెడ్‌ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్‌ కొనసాగించింది. ట్రాట్‌ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. సెమీస్‌కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్‌ ఖాన్, అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ 10 అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచకప్‌ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్‌ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్‌ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్‌ (1975), న్యూజిలాండ్‌ (1975), వెస్టిండీస్‌ (1975), పాకిస్తాన్‌ (1979), భారత్‌ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్‌ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్‌ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్‌; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్‌ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్‌ ఖాన్‌కిది తొమ్మిదిసారి. షకీబ్‌ అల్‌ హసన్‌ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్‌ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్‌ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్‌ టెండూల్కర్‌ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్‌ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్‌ ప్రదర్శన ఇది. –యువరాజ్‌ సింగ్‌

Passenger Vows To Never Again Fly Air India
‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కను’’

బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్‌ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్‌ అనే ఓ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్‌ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్‌ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను. Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last nightNever and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నా అనుభవం​ మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది.

Interesting Facts About Hope Diamond Price and Details
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!

బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూర్‌లోని కింబర్‌లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్‌లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్‌స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500.

Engineering counseling postponed to 4th July
‘గుర్తింపు’నకు గ్రహణం!

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 27 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను సాంకేతిక విద్య విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ మార్పునకు కారణాలేంటనేది అధికారులు వెల్లడించలేదు. కొన్ని కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అను మతి పొందాల్సి ఉందని మాత్రమే చెబుతున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇది వస్తేనే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కానీ ఈ ఏడాది ముందే పూర్తయింది. మే 21తో 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం ముగిసింది. అయితే వారు ఆలోగానే కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చే సమయంలో తనిఖీలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో కాలేజీలకు ఇప్పుడే గుర్తింపు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే 21 తర్వాత వీసీల పదవీకాలం ముగియడంతో ప్రతి వర్సిటీకి ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. పాత వీసీలు చేపట్టిన తనిఖీలపై వారికి అనుమానాలు రావడంతో ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గోల్‌మాల్‌ జరిగిందా? రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిలో 17 కాలేజీలు ప్రభుత్వ అ«దీనంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బ్రాంచీలు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి యాజమాన్యాలు ముందుగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. 33 కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నాయి. అంటే 128 కాలేజీలు తమ పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అయితే వర్సిటీల అధికారులు తనిఖీల సందర్భంగా ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాకల్టి, మౌలికవసతులు లేకున్నా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి వీసీలుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారులు తనిఖీల్లో అవకతవకలపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల లెక్క ఇలా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1.22 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా వాటిలో 83 వేల సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉన్నాయి. అందులోనూ 58 శాతం సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిమాండ్‌ లేని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ బ్రాంచీల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గతేడాది బ్రాంచీ మార్చుకున్నవి, కొత్తగా మంజూరైన కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు 14 వేల వరకు ఉన్నాయి. పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్‌లోకి తెచ్చారు. ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు పెరుగుతాయి? ఎందులో తగ్గుతాయి? అనే వివరాలతో ముందే కౌన్సెలింగ్‌ కేంద్రంలో సాఫ్ట్‌వేర్‌ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపే కాలేజీలకు రాకపోవడంతో సీట్లపైనా అధికారులకు స్పష్టత రావడం లేదు.

Adani To Invest RS 2 Lakh Crore In Renewable Energy Capacity Growth By 2030
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ

అహ్మదాబాద్‌: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్‌ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్‌ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్‌ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్‌ సింగ్‌ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్‌ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్‌ క్రెడిట్స్‌.. రెన్యువబుల్‌ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్‌ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్‌ నెట్‌ జీరోకు చేరనున్నట్లు అమిత్‌ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్‌ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement