Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Delhi Weather Heavy Rain Lashes Out Latest News Updates
కుండపోత వానతో ఢిల్లీ జలమయం.. కూలిన ఎయిర్‌పోర్ట్‌ రూఫ్‌

న్యూఢిల్లీ, సాక్షి: విపరీతమైన ఉష్ణోగ్రతలు.. తీవ్ర ఉక్కపోతతో అల్లలాడిపోతున్న దేశ రాజధానిని.. వరుసగా రెండో రోజు వరుణుడు కరుణించాడు. గురువారం రాత్రి నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. అయితే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరం జలమయంగా మారింది. పొద్దుపొద్దున్నే ట్రాఫిక్‌జామ్‌ కావడం, పలు కాలనీల్లో కార్లు, బైకులు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు గంటలపాటు భారీ వర్షం కొనసాగుతుందని, అత్యవరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ చెబుతోంది.#WATCH | People wade through water as incessant rainfall causes waterlogging in parts of Delhi; visuals from Mehrauli Badarpur Road pic.twitter.com/pcMa0eTQzC— ANI (@ANI) June 28, 2024#WATCH | Roads in several parts of Delhi inundated after heavy rainfall overnight(Visuals from Shanti Path) pic.twitter.com/mIBlFtJnGw— ANI (@ANI) June 28, 2024#WATCH | Waterlogging witnessed at several parts of Delhi following heavy rain(Visuals from Moti Bagh) pic.twitter.com/XLV1xs7YyW— ANI (@ANI) June 28, 2024 #WATCH | Heavy overnight rainfall leaves several parts of Delhi waterlogged. Visuals from Mandawali area. pic.twitter.com/UBUCidfoOS— ANI (@ANI) June 28, 2024#WATCH | A truck submerged as incessant rainfall causes severe waterlogging in parts of Delhi. (Visuals from Minto Road) pic.twitter.com/tc2DJQpSVX— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈదురు గాలుల ధాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో కొన్ని కార్లు ధ్వంసం కాగా, ఆరుగురికి గాయాలైనట్లు ఢిల్లీ ఫైర్‌ సిబ్బంది తెలిపారు. ఉదయం 5.30గం. ప్రాంతంలో ఘటన జరిగిందని సమాచారం వచ్చిందని, వాళ్లను రక్షించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని ఫైర్‌ విభాగం డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందక్కడ. #WATCH | Latest visuals from Terminal-1 of Delhi airport, where a roof collapsed amid heavy rainfall, leaving 6 people injured pic.twitter.com/KzxvkVHRGG— ANI (@ANI) June 28, 2024 #UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈ ఘటనసహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. Personally monitoring the roof collapse incident at T1 Delhi Airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospital. Rescue operations are still ongoing.— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 28, 2024

First Presidential Debate Between Donald Trump And Joe Biden Live Updates
Watch: బైడెన్‌ Vs ట్రంప్‌ వాడీవేడీ చర్చ..

Live Updates..👉ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇ‍స్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్‌ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.బైడెన్‌ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్‌ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్‌ను వారు ఇష్టపడటం లేదు. Donald Trump to Joe Biden during the Presidential debate:“He’s become like a Palestinian. They don’t like him because he’s a very bad Palestinian. He’s a weak one.” pic.twitter.com/pi9leLCmS8— Pop Base (@PopBase) June 28, 2024 👉అమెరికాలో చరిత్రలో బైడెన్‌ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్‌ Donald Trump and Joe Biden get into an argument over golfing skills during the Presidential debate. pic.twitter.com/guuYjcLUSn— Pop Base (@PopBase) June 28, 2024 👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్‌ అంశాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారు. 👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్‌ లూసర్‌ అంటూ బైడెన్‌ అన్నారు. Joe Biden calls Donald Trump a ‘sucker’ and ‘loser’ during the Presidential debate while defending his son. pic.twitter.com/ZpvyZv1DlM— Pop Base (@PopBase) June 28, 2024 👉ఆప్ఘనిస్థాన్‌ విషయంలో బైడెన్‌ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్‌ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్‌ దారుణంగా విఫలమయ్యారు. I can’t believe Joe Biden is actually BOASTING about his Afghanistan withdrawal. 13 servicemembers were kiIIed during his disastrous withdrawal!REMEMBER THEIR NAMES!Johanny Rosario PichardoNicole L. GeeDarin T. HooverHunter LopezDaegan W. PageHumberto A. SanchezDavid L.… pic.twitter.com/uQPHRrghPv— Libs of TikTok (@libsoftiktok) June 28, 2024 👉 ట్రంప్‌నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్‌. ట్రంప్‌ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. Joe Biden just declared that every single person who votes for Trump is voting against American democracy. He just vilified well over half the country. This is the most disgraceful thing he has said on the stage tonight. pic.twitter.com/KoEOqP9Z6U— Riley Gaines (@Riley_Gaines_) June 28, 2024 👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.👉ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్‌లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు. 👉దీనికి ప్రతిగా ట్రంప్‌ మాట్లాడుతూ.. చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్‌ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. 👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్‌లో పాల్గొన్నారు.👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు.

Prabhas Name Changed For Kalki 2898 Movie
పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?

డార్లింగ్ ప్రభాస్ హిట్ కొట్టేశాడు. 'కల్కి'తో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్‌కి ముందు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వస్తున్న టాక్ చూస్తుంటే తొలిరోజు వసూళ్లతో పాటు ఓవరాల్ కలెక్షన్స్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సినిమా సూపర్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తన కామెడీ టైమింగ్ ప్లస్ యాక్షన్‌తో అదరగొట్టాడు. కానీ చాలామంది మూవీలో ఓ విషయం మాత్రం సరిగా గమనించలేదేమో!(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)ప్రభాస్ పేరులో చిన్న మార్పు చోటు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. 'కల్కి' సినిమా చూడాలనే ఆత్రుత వల్లో ఏమో గానీ ఇటు ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ టైటిల్స్‌లో ప్రభాస్ బదులు 'శ్రీ ప్రభాస్' అని పడింది. అయితే దీన్ని గౌరవ సూచకంగా పెట్టారా? లేదంటే న్యూమరాలజీ ప్రకారం పేరుకి ముందు శ్రీ అని జోడీంచుకున్నాడా అనేది మరో మూవీ వస్తే క్లారిటీ వచ్చేస్తుంది.ఏ పేరు మార్చినా సరే ఫ్యాన్స్‌కి మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ప్రభాస్ డార్లింగే. ఇకపోతే మూవీలో మహాభారతం ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే సీన్స్‌తో పాటు చివర్లో వచ్చే సన్నివేశాలు వావ్ అనిపించాయి. 3 గంటల సినిమాలో దాదాపు 30 నిమిషాలు మహాభారతం ట్రాక్ పెట్టారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ కనిపించారు. వీళ్ల గెటప్స్ అయితే అలా అందరికీ నచ్చేసేయంతే!(ఇదీ చదవండి: 'కల్కి' గెస్ట్‌ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు)

T20 World Cup 2024 IND VS ENG 2nd Semi Final:Rohit Sharma Comments
కోహ్లి ఫైనల్లో ఫామ్‌లోకి వస్తాడు.. టైటిల్‌ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్‌ శర్మ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సహచర ఓపెనర్‌, భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్‌ అని రోహిత్‌ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్‌ ఆడిన వ్యక్తికి ఫామ్‌ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్‌ కోసం​ కోహ్లి తన ఫామ్‌ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం రోహిత్‌ మరిన్ని విషయాలు షేర్‌ చేసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్‌గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్‌కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్‌పై ఇది చాలా మంచి స్కోర్‌. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అక్షర్‌, కుల్దీప్‌ మా గన్‌ స్పిన్నర్స్‌. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్‌ విన్నర్‌. మ్యాచ్‌ మొత్తంలో మేము చాలా కామ్‌గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్‌లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్‌ అన్నాడు.కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-19-3), అక్షర్‌ పటేల్‌ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్‌ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

Daily Horoscope June 28 2024 Telugu
ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం, ఆప్తుల నుంచి ధనలాభం

మేషం: నూతనోత్సాహం. పనులలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖుల పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.మిథునం: శ్రమకు ఫలితం కనిపించదు. వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కొత్త బాధ్యతలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.తుల: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పులు.వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అదనపు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం.ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపార వృద్ధి.మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. శుభవార్తలు.మీనం: శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

T20 World Cup 2024 IND VS ENG 2nd Semi Final:Rohit Sharma Creates History, Becomes First Indian To Achieve MASSIVE T20 World Cup Milestone
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్‌'మ్యాన్‌ శర్మ.. రికార్డులు బద్దలు

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్‌ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్‌.. క్రిస్‌ గేల్‌ (63) తర్వాత టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్‌ గేల్‌- 63రోహిత్‌ శర్మ- 50జోస్‌ బట్లర్‌- 43డేవిడ్‌ వార్నర్‌- 40యువరాజ్‌ సింగ్‌- 33విరాట్‌ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్‌ శర్మ- 113జయవర్దనే- 111విరాట్‌- 105వార్నర్‌- 103తిలకరత్నే దిల్షన్‌- 101భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులువిరాట్‌- 12883ధోని- 11207అజహారుద్దీన్‌- 8095గంగూలీ- 7643రోహిత్‌- 5012ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లురోహిత్‌ శర్మ- 22క్రిస్‌ గేల్‌- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-19-3), అక్షర్‌ పటేల్‌ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్‌ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

Road plaque vandalized in Tirupati
ఆగని టీడీపీ అరాచకం

సాక్షి నెట్‌వర్క్‌: టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపో­యి ఘర్షణల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికా­రం ఇచ్చింది దౌర్జన్యం చేయడానికే అన్నట్టుగా వ్యవ­హరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై 20 రో­జులు దాటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండ ఆపకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం సైతం శిలా­ఫలకాల ధ్వంసం వంటి ఘటనలు కొనసాగాయి. తిరుపతిలో ఆగని విధ్వంసం తిరుపతిలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు శిలాఫలకాన్ని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటి మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా 22 రోడ్లను నిర్మించారు. ప్రతి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు కవులు, మహానీయుల పేర్లు పెట్టారు. అందులో భాగంగానే తిరుపతి జీవకోన ప్రధాన మార్గంలోని సత్యనారాయణపురం మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు ‘విరజా మార్గం’గా నామకరణం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీసీ నేతలు ఇలా కక్ష సాధింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ చర్యతో ఇరువాడలో ఉద్రిక్తత సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలను ఎందుకు పెట్టలేదంటూ సచివాలయ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన అచ్యుతాపురం మండలం ఇరువాడలో గురువారం చోటుచేసుకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గునపాలతో శిలాఫలకాలు ధ్వంసం చేసి పెకలించడంతో సచివాలయ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడంతో వీడియోల ఆధారంగా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఫొటో ధ్వంసం వైఎస్సార్‌ జిల్లా నల్లచెరువుపల్లె రైతు భరోసా కేంద్రం భవనంపై నవరత్నాలు పేరుతో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫొటోను రాళ్లతో పగులగొట్టారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ యువనేతపై హత్యాయత్నంబీరు సీసాలు, మారణాయుధాలతో దాడి పాకాలలో చిత్తూరు రౌడీ గ్యాంగ్‌ బీభత్సం చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు నుంచి దిగుమతి అయిన రౌడీమూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి పాకాల మండల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యుగంధర్‌ నాయుడు (చంటి)పై చిత్తూరు నుంచి బైకులపై వచ్చిన ఐదుగురు సభ్యుల రౌడీ గ్యాంగ్‌ బీరు సీసాలు, మారణాయుధాలతో దాడిచేసి అతడిని హతమార్చేందుకు యత్నించారు. యుగంధర్‌ తలను బీరు బాటిల్‌తో పగులగొట్టారు. మారణాయుధాలతో ఒళ్లంతా గాయాలు చేశారు. ‘మా అన్న పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి పనిచేస్తావా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుగారిపల్లి సమీపంలోని తన మామిడి తోటలో ఉండగా.. గుర్తు తెలియని ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై తోటలోకి చొరబడి హతాయత్నం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి తోటలోని తన గెస్ట్‌హౌస్‌లో ఉన్న గృహోపకరణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీలో కొనసాగితే ప్రాణాలతో ఉంచబోమని బెదిరించారని తెలిపారు. చిత్తూరు నుంచి కిరాయి మూకలను రప్పించి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేయించి ఓ నేత పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితుడు మండిపడ్డాడు.ఇది ప్రజాస్వామ్యమా .. అరాచకమా?దాడులపై హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ స్పందించాలి మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సాక్షి,అమరావతి/ రైల్వేకోడూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 25 రోజులుగా కొనసాగిస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, దాషీ్టకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక అరాచక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తమకు ఊహ వచి్చనప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజలపై జరుగుతున్న దాడులపై హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కోరారు. పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం.. ఎస్టీ కాలనీ వాసుల ఇళ్లను రెవెన్యూ, ఏపీఎండీసీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకాపుపల్లె ఎస్టీ కాలనీ వాసుల గృహాలను బుధవారం జేసీబీతో అధికారులు కూల్చి వేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లల్లో బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలున్నారని చూడకుండా తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు పెట్టుబడి సాయం  ఇవ్వాలంటూ వైఎస్సార్‌ జిల్లా  కడపలోని తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తున్న  ఏపీ రైతు సంఘం నాయకులు
రైతుకు రొక్కమేది?

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాల­యాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్‌ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్‌ – వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్‌ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్‌ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్‌ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గత సీజన్‌లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్‌ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్‌కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్‌ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్‌ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్‌కు ముందుగానే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం

high command exercise selection telangana pcc president
చివరి దశకు ‘పీసీసీ’ కసరత్తు!

సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఢిల్లీలో విస్తృతంగా చర్చలు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ పీసీసీ చీఫ్‌ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతోపాటు ఇతర సీనియర్‌ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్‌ షెట్కార్, సంపత్‌కుమార్‌ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్‌తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాం«దీని మహేశ్‌గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ చర్చించారు. తెలంగాణ భవన్‌లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు. కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపైనా..పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్‌ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్‌ గౌడ్, బలరాం నాయక్‌ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్‌ విస్తరణపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement