Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Receives Grand Welcome At Pulivendula
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్‌కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్‌ జగన్‌ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు.

Exercise of revision of registration values ​​of lands and properties is over
ఎకరం రూ.4 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్‌ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్‌ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్‌మెంట్ల కంపోజిట్‌ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్‌సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్‌ డివిజన్‌ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్‌ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్‌ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్‌ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్‌ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్‌ డోర్‌ నంబర్‌ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్‌ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్‌ ఎస్టేట్‌ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్‌ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది.

Conspiracy Of Chandrababu Govt To Demolish Another Ysrcp Office
మరో వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో

సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్‌ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్‌నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్‌ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది.దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్‌ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. “విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరొక వైయస్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేత కుట్రపై బయటపడ్డ సంచలన ఆడియో”తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పడు ఈ పార్టీ ఆఫీసునీ కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు. ఈ మేరకు కార్పొరేషన్… pic.twitter.com/HOj5nlm3Fx— YSR Congress Party (@YSRCParty) June 23, 2024

Ys Jagan Trending Continue After Election On Social Media
‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ నువ్వే మా కింగ్‌’

సాక్షి, గుంటూరు: గత ఐదేళ్ల పాటు ప్రజలకు అన్నీ తానై అండదండగా నిలిచారు వైఎస్‌ జగన్‌. ‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ నువ్వే మా కింగ్‌’.. మీపై అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయన ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.‘ఎక్కడ వున్న రాజు రాజే గెలుపు ఓటములు సహజం.. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీకే అవకాశం. మా హృదయాల్లో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌, పేజీలకు లక్షల వ్యూస్‌ వస్తున్నాయి. కాగా, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40 శాతం ఓట్లు పోల్‌ అయ్యాయి. 2019లో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు, పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు తగ్గినా వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్‌ జగన్‌ చేసిన కృషి ఎంతో ఉంది. View this post on Instagram A post shared by Vara Nuzvid (@vara_nuzvid) View this post on Instagram A post shared by 𝗬𝗦𝗝𝗔𝗚𝗔𝗡 𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟 🌀 (@ys_jagan.official)

INDW VS SAW 3rd ODI: Smriti Mandhana Narrowly Missed Hat Trick Of Centuries, Team India Clean Sweep Series
హ్యాట్రిక్‌ సెంచరీలు మిస్‌ అయిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌.. అయినా రికార్డే..!

స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్‌ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్‌ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్‌ సెంచరీలు మిస్‌ఈ మ్యాచ్‌లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన హ్యాట్రిక్‌ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్‌ మొత్తంలో (3 మ్యాచ్‌ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్‌ విషయానికొస్తే.. కెప్టెన్‌ లారా వొల్వార్డ్ట్‌ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో తంజిమ్‌ బ్రిట్స్‌ (38), డి క్లెర్క్‌ (26), డి రిడ్డర్‌ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో మంధనతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్‌ పడగొట్టారు.

YS Jagan Meets Party Activists And Normal People At Pulivendula
పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్‌ జగన్‌

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్‌ జగన్‌ స్పీకరిస్తున్నారు.ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో క్యాంప్‌ కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు.

YS Jagan Fires On Chandrababu Govt For Demolishing YSRCP Party Office
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

Chitral Rangaswamy Says She Received Bad Messages from Renukaswamy
రేణుకాస్వామి.. నాక్కూడా అసభ్య సందేశాలు పంపాడు: నటి

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్‌, అతడి గ్యాంగ్‌ రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. అశ్లీల ఫోటోలు పంపడం రేణుకాస్వామి చేసిన తప్పయితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడి ప్రాణాలు తీయడం దర్శన్‌ గ్యాంగ్‌ చేసిన ఘోర తప్పిదం.ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదుఅయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటోంది కన్నడ నటి చిత్రల్‌ రంగస్వామి. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్‌లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్‌ స్టేషన్‌లోనూ తనపై కేసు నమోదైంది.పనికిమాలిన మెసేజ్‌లుఅలాగే అతడు గౌతమ్‌ అనే ఫేక్‌ అకౌంట్‌తో చాలామందికి పనికిమాలిన మెసేజ్‌లు చేసేవాడు. ఆ స్క్రీన్‌షాట్లను నేనిప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్‌ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసుంటే నేనైతే బ్లాక్‌ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ చేసిన లిస్టులో ఆల్‌రెడీ ఇతడి అకౌంట్‌ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను' అని చిత్రల్‌ పేర్కొంది. కాగా చిత్రల్‌ రంగస్వామి బాడీ బిల్డర్‌. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లోనూ పాల్గొంది.చదవండి: థర్డ్‌ హ్యాండ్‌ కారు.. వర్షం వస్తే కారులో వాటర్‌ లీకేజీ..

Do You Know Who is Singer Shreya Ghoshal Husband and His Job
సింగర్‌ శ్రేయా ఘోషల్‌ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్‌ కంపెనీ..

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్‌ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్‌లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement