Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Conspiracy with EC new rules on validity of postal ballot
కుట్రపూరితం! పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ విష­యంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్‌ నంబర్‌తో డిక్లరేషన్‌ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్‌ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్‌ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్‌.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్‌ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్‌ అధికారి హోదా వివరాలు, సీల్‌ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేయడం ద్వారా పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్‌ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్‌ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్‌ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్‌ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్‌ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్‌ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంత మంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్‌) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్‌ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్‌ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సీల్‌ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్‌ వేయకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

AP Elections 2024: May 31th Political Updates In Telugu
May 31th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 31th AP Elections 2024 News Political Updates..9:40 AM, May 31st, 2024పచ్చ బ్యాచ్‌ ఫేక్‌ బతుకు బట్టబయలు..టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీటీడీపీది ఫేక్‌ బతుకంటూ ప్రజల ఆగ్రహం. టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.. కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఉమ్మేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్… https://t.co/2S5r92PmK1— YSR Congress Party (@YSRCParty) May 30, 2024 9:00 AM, May 31st, 2024స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌తిరుపతి జిల్లా..అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుహర్షవర్ధన్ రాజు కామెంట్స్..స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.ఔటర్ కార్డెన్‌లో మూడు మొబైల్ పార్టీస్‌తో నిరంతర పహారా కొనసాగుతోంది.స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు. 8:40 AM, May 31st, 2024తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌అనంతపురం..తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకంఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డికాగా, రాంభూపాల్‌ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం 8:00 AM, May 31st, 2024ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటవైఎస్సార్‌ జిల్లా..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటచాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరుఅరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం 7:45 AM, May 31st, 2024విశాఖలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌..విశాఖపట్నం.. పీఎం పాలెం..ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.కార్డన్ సెర్చ్‌లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. 7:30 AM, May 31st, 2024పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటంకేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్‌ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదం ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్‌సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టుఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ పిటిషన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్‌లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం 7:00 AM, May 31st, 2024స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’! ఆ మేరకు టీడీపీ బేరసారాలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడఅవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం

Prajwal returns from Germany arrested by SIT at bangalore airport
బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్‌ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్‌ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్‌ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్‌ గత ఏప్రిల్‌లో భారత్‌ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్‌ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్‌.. వెంటనే భారత్‌కు రావాలి

Gam Gam Ganesha Movie Twitter Review
Gam Gam Ganesha X Review: ‘గం..గం..గణేశా’ టాక్‌ ఎలా ఉందంటే..

బేబీ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూగా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గం..గం..గణేశా ఎలా ఉంది? ఆనంద్‌ దేవరకొండ ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో గం..గం..గణేశాకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని కామెంట్‌ చేస్తున్నారు. ఆనంద్‌ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్‌ కమర్షియల్‌ థ్రిల్లర్‌ ప్యాకేజీ అని అంటున్నారు. #GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024 ఆనంద్‌ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్‌ కమర్షియల్‌ థ్రిల్లర్‌ ప్యాకేజ్‌ గం..గం..గణేశా. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌ ఉంది. సెకండాఫ్‌ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ బాగుంది. ఇమ్మాన్యుయేల్‌, కృష్ణ చైతన్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించారని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & CharacterisationsMusic & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024 గం..గం..గణేశా ఒక కంప్లీట్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌. ఆనంద్‌ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్‌ ఉదయ్‌ నెరేటివ్‌ స్టైల్‌తో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.#GamGamGanesha is a 'Sit-back and Relax' fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024 గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్‌ క్రైమ్‌ కామెడీ. వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్‌ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఉదయ్‌ బొమ్మిశెట్టి కథనాన్ని నడించిన తీరు బాగుంది. ఆనంద్‌ దేవరకొండ ఖాతాలో మరో హిట్‌ పడిందని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. #GamGamGanesha Day 🔥UK reviews bagunavi 😍Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024

Horoscope Today: Rasi Phalalu On 31-05-2024 In Telugu
ఈ రాశి వారికి ఇంటా బయటా అనుకూలం.. శుభవార్త వింటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.47 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శతభిషం ఉ.5.50 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.4.08 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: ఉ.11.46 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.16 వరకు, అమృతఘడియలు: రా.8.41 నుండి 10.11 వరకు; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 5.28, సూర్యాస్తమయం : 6.26. మేషం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.మిథునం: చేపట్టిన కార్యాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.సింహం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.కన్య: ఇంటాబయటా అనుకూలం. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృశ్చికం: కుటుంబసభ్యులతో కలహాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు: ఆకస్మిక ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి.మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.కుంభం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మీనం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

TDP Leaders As Independent Candidate Agents In AP Counting Day
AP: స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’!

సత్తెనపల్లి: జూన్‌ 4న కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లను పంపేలా కూటమి నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్ల నియామకానికి గురువారంలోగా వివరాలు పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్‌ బి లత్కర్‌ సూచించారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులతోపాటు మరో 93 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్‌ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పోటీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థు­లకు ఎరవేసి వారి తరఫున కూడా తమవారిని నియమించుకునే వ్యూహాన్ని పల్నాడు జిల్లాలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులు పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది. స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థు­లుగా బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థులు సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమా­చారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్‌ అను­మతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరఫున తమ అనుచరులను ఏజెంట్లుగా నియమించుకు­న్నట్టు తెలిసింది. లెక్కింపు కేంద్రం లోపల తమ వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నా­రని, అందుకు ప్రధాన కారణం రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు అధికారులు ప్రకటించగానే తమకు సమాచారం ఇచ్చేలా నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్లు అనుచర వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలు­స్తోంది. జిల్లాలోని రిటర్నింగ్‌ అధికారులు, పోలీ­సులు ఇలాంటి ప్రలోభాలను నిలువరిస్తారా! లేక చేతులు ఎత్తేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. వ్యూహాత్మకంగా స్వతంత్రులుగా రంగంలోకి.. టీడీపీకి చెందిన కొందరినీ ముందుగానే వ్యూహం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. ఇప్పుడు వారి తరఫున కూడా ఏజెంట్లుగా తెలుగు తమ్ముళ్లే వెళ్లబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీల నుంచి 9 మంది బరిలో ఉంటే ఆరుగురు స్వతంత్రులున్నారు. స్వతంత్రులతో పాటు కొందరు బరిలో ఉన్న అభ్యర్థులనూ ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా చివరి ఘట్టమైన కౌంటింగ్‌ కేంద్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, అనుకూలంగా లేకపోతే గొడవలకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Donald Trump Found Guilty In Hush Money Trial Case
TRUMP: ‘హుష్‌ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూయార్క్‌: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హుష్‌మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్‌ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్‌ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్‌ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ హుష్‌మనీ కేసు ఫైల్‌ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్‌ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్‌ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్‌5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్‌ చేసే రిపబ్లికన్‌ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్‌ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్‌ మీడియాతో అన్నారు.

T20 World Cup 2024 Warm-Up Matches: Pooran Shines With Blasting Innings, West Indies Beat Aussies By 35 Runs
పూరన్‌ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్‌ ఇచ్చిన విండీస్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్‌ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. పూరన్‌ సిక్సర్ల సునామీనికోలస్‌ పూరన్‌ ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.‍ కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్‌ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ మైదానం తడిసి ముద్దైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్‌ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 14 పరుగులు.. జాన్సన్‌ ఛార్లెస్‌ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్‌ పావెల్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్‌ 13 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్‌ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్‌ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్‌ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్‌ డేవిడ్‌, ఆస్టన్‌ అగర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.పోరాడిన ఆసీస్‌అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. గెలుపు కోసం​ చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్‌ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్‌ అగర్‌ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్‌ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్‌ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్‌ డేవిడ్‌ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్‌ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 25 పరుగులు.. నాథన్‌ ఇల్లిస్‌ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 21.. హాజిల్‌వుడ్‌ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్‌ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్‌ హొసేన్‌, షమార్‌ జోసఫ్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్‌ రెగ్యులర్‌ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.

Lok Sabha Election 2024: BJP and Congress in a fierce battle for power in Himachal Pradesh
Lok Sabha Election 2024: హిమాచల్‌ప్రదేశ్‌లో.. బీజేపీకి పరీక్ష!

హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్‌పూర్‌ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తదితరులున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్‌ సింగ్‌ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్‌ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్‌ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ సురేశ్‌ కుమార్‌ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్‌ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్‌ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్‌ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్‌ ప్రతిభాసింగ్‌ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్‌ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్‌ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.హమీర్‌పూర్‌ కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్‌ సింగ్‌ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్‌ కొడుతుందని అనురాగ్‌ ఠాకూర్‌ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్‌ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్‌ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్‌పూర్‌ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

High Court order to Central Election Commission and DGP
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి

సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్‌ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్‌స్పెక్టర్‌ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్‌ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్‌ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్‌స్పెక్టర్‌ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్‌లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement