Top Stories
ప్రధాన వార్తలు
చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్‌బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్‌పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్‌పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్‌సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్‌సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్‌సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్‌పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్‌పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఆటంకాలు లేకుండా చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, గాయత్రీ ధ్యానం మంచిది.వృషభం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ధనప్రాప్తి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది. . వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. వారాహీ స్తోత్రం పఠించండి.మిథునం....ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా కొనసాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు, మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.కర్కాటకం...మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. కళారంగం వారు పురస్కారాలు పొందుతారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పంచాక్షరి మంత్రం పఠించండి.సింహం.....ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు, నారాయణ అష్టాక్షరి మంత్రం పఠించండి.కన్య.....ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, శ్రీ భువనేశ్వరి మంత్రం పఠించండి.తుల....దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక వ్యక్తి ద్వారా కొంత సాయం అందే సూచనలు. నూతన విద్య,ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, గులాబీ రంగులు, శ్రీహయగ్రీవస్తుతి మంచిది.వృశ్చికం....వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఎరుపు, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు....ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో మరిత విస్తరించే అవకాశం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి సమస్యల నుండి విముక్తి. వారం చివరిలో ధనవ్యయం. ఆప్తులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, తెలుపు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.మకరం....వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇబ్బందిగా మారతాయి.. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, మంచి గుర్తింపు రాగలవు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనం...బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, మెరూన్ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
India vs Aus 5th test: నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా
IND vs Aus 5th Test Day 3 Live updates and Highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 81/3ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(26 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(8 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(19 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.ఆసీస్ మూడో వికెట్ డౌన్..ప్రస్దిద్ద్ కృష్ణ భారత్‌కు మరో వికెట్ అందించాడు. 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 65/3. లబుషేన్ ఔట్..ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 52/2. ఆసీస్ తొలి వికెట్ డౌన్‌సామ్ కాన్‌స్టాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కాన్‌స్టాస్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(5), మార్నస్ లబుషేన్ ఉన్నారు.భారత్‌కు భారీ షాక్..కాగా మూడో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆలౌట్..టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా... కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఇక భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సుందర్ క్లీన్ బౌల్డ్..భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.భారత్ ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్‌రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జడేజా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 148/7మూడో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత్ బరిలోకి దిగింది.
చైనాలో వైరస్ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌ఎంపీవీ వైరస్ టెస్టింగ్ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.ఇక, చైనాలో వైరస్ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు.. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా, చైనాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Chinese hospitals experiencing a surge in Human Metapneumovirus (HMPV) infections. Reports and online posts indicate widespread transmission, with some claiming hospitals and crematories are overwhelmed pic.twitter.com/1FDyQuGr2X— News Rated (@NewsRated) January 4, 2025
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్‌లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్‌లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్‌తోపాటు అవ్‌దీవ్కా, సెలిడోవ్, వులేదార్‌లు రష్యా వశమయ్యాయి. అవ్‌దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్‌దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్‌ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్‌స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్‌పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్‌లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్‌లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్‌కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్‌లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్‌లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్‌లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్ డెస్క్
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది.
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్‌లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్‌సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
తెలుగు సినిమాలకు ఆభరణం... శంకరాభరణం
కె. విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో ‘శంకరాభరణం’ గురించి ముందుగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యమిది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెల్లుబుకుతుంది. 1980లో విడు దలైన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం. ఇందులోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందు చేస్తాయి. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ఆయన సినీ కెరీర్‌నే మార్చేసిన మూవీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మేధావులతో పాటు సామాన్యులను సైతం మెప్పించింది.రూ. పదమూడున్నర లక్షలతో...పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు ఈ సినిమాను నిర్మించారు. శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా కృష్ణంరాజు, శివాజీ గణేశన్ వంటి వారిని అనుకున్నారు. చివరగా ఇమేజ్ ఉన్న నటుడు ఈ పాత్ర చేస్తే పండదని భావించి జేవీ సోమయాజులను తీసుకున్నారు విశ్వనాథ్. అప్పటికే ఆయన డిప్యూటీకలెక్టర్‌గా పని చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు. 55 నుంచి 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను ఎక్కువగా రాజమండ్రి, రఘుదేవపురం, పోలవరం, రామచంద్రాపురం, అన్నవరం, సోమవరం, చెన్నైలోని తిరువాన్మయూరు, కర్ణాటకలోని బేలూరు, హలిబేడులో చిత్రీకరించారు.తెలుగు సినిమాకు కొత్త దారి...అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కిన ‘శంకరాభరణం’ తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, కళలకు పట్టం కడుతూ తీసిన ఈ సినిమాలోని పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. విశ్వనాథ్ సినిమాల కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను ఆయన తన సినిమాల్లో చర్చిస్తారు. సాంఘిక దురాచారాలను, పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు. ‘శంకరాభరణం’ సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. అందుకే కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది.ఫక్తు క్లాస్ సినిమా అయినప్పటికీ...శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన ఆ రోజుల్లో ఎంతో మంది సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టారంటే ‘శంకరాభరణం’ ప్రభావం ఎంతలా పని చేసిందో అర్థమవుతుంది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు ఉత్తమ నేప«థ్య గాయకుడుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాదు వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కేవీ మహదేవన్స్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. ఫక్తు క్లాస్ సినిమా అయిన ‘శంకరాభరణం’కు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ఈ సినిమా కోసం థియేటర్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి.‘శంకరాభరణం’ విడుదలైన రోజునే...విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభతో పాటు కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, యంజీఆర్, రాజ్‌కుమార్, హిందీలో శాంతారామ్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్ ఈ సినిమాను పని గట్టుకొని మరీ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాకతాళీయమో విధి విచిత్రమో గాని... 44 ఏళ్ల క్రితం ‘శంకరాభరణం’ రిలీజైన రోజునే విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైతే 2023 ఫిబ్రవరి 2న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ భౌతికంగా దూరమయ్యారు కానీ తాను తెరకెక్కించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు. – దాచేపల్లి సురేష్‌కుమార్
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్@50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు యాపిల్, శాంసంగ్ విక్రయించే ప్రీమియం డివైజ్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది (2025లో) 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,28,900 కోట్లు) చేరవచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణం 37.9 బిలియన్ డాలర్లుగా (రూ. 3.25 లక్షల కోట్లు) నమోదైంది. ‘భారతీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి, రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రీమియం, అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్లలో ఆకర్షణీయమైన ఆప్షన్లను అందిస్తూ యాపిల్, శాంసంగ్‌లాంటి బ్రాండ్లు మార్కెట్ వృద్ధికి సారథ్యం వహిస్తున్నాయి‘ అని నివేదిక వివరించింది. 2025లో తొలిసారిగా దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగటు రిటైల్ విక్రయ ధర 300 డాలర్ల మార్కును (సుమారు రూ. 25,700) అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల విభాగం ద్వారా యాపిల్ ఇండియా రూ. 67,122 కోట్లు, శాంసంగ్ రూ. 71,158 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → స్థానికంగా తయారీ, వివిధ ఐఫోన్ల మోడల్స్ ధరల తగ్గింపు వల్ల యాపిల్ విక్రయించే ప్రో మోడల్స్‌కి డిమాండ్ పటిష్టంగా ఉండవచ్చు. అదే సమయంలో మరింత విలువైన ఫీచర్లు ఉండే డివైజ్‌లు, ముఖ్యంగా తమ ఫ్లాగ్‌షిప్ ఎస్ సిరీస్ ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతుండటం శాంసంగ్ అమ్మకాల వృద్ధికి దోహదపడగలవు. → అఫోర్డబుల్ ప్రీమియం కేటగిరీలో (రూ. 30,000 – 45,000 ధర శ్రేణి) అధునాతన కెమెరాలు మొదలైన ఫీచర్లను అందించడం ద్వారా వివో, ఒపో, వన్‌ప్లస్ లాంటి → చైనా బ్రాండ్లు, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోన్ల పనితీరును దెబ్బతీసిన డిస్‌ప్లే, మదర్‌బోర్డ్ సమస్యలకు సంబంధించి రిటైలర్ల ఆందోళనల ను పరిష్కరించడం ద్వారా మళ్లీ మార్కెట్‌పై ప ట్టు సాధించేందుకు వన్‌ప్లస్ కసరత్తు చేస్తోంది. వేగవంతమైన రికవరీ, వృద్ధి సాధన కోసం స్థా నిక మార్కెట్‌లో విస్తరించేందుకు దాదాపు రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. → ప్రీమియం సెగ్మెంట్ (రూ. 30,000 ధర పైన ప్రారంభమయ్యే ఫోన్లు) 20 శాతానికి మించి మార్కెట్ వాటా దక్కించుకోవచ్చు. → కొనుగోలు చేయడానికి ముందు ప్రీమియం ఫోన్లను స్వయంగా చేతిలోకి తీసుకుని, పరిశీలించేందుకు వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఎంచుకుంటున్నారు. అలాగే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత అంశాల మీద ఆసక్తితో వివిధ ఫీచర్ల గురించి అడిగి తెలుసుకుని, కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్లో అమ్మకాల వృద్ధికి ఇలాంటి ధోరణులు కూడా తోడ్పడుతున్నాయి.
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్‌కి వెళ్లినా, ఔటింగ్‌కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్‌స్టవ్‌ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్‌లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్‌లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్‌లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్‌గా, సర్వెంట్‌గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్‌ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్‌వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్‌కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్‌లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్‌కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్‌డ్ ప్రొడక్ట్స్‌ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్‌తో ఎల్‌జీ స్మార్ట్ వర్షన్స్‌కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్‌జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్‌జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్‌తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్‌ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్‌గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్‌కి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్‌తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్‌ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్‌లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్‌తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్‌ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్‌గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్‌మెంట్‌లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్‌ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్‌ఈ డివైస్‌తో ఆరోగ్యకరమైన స్మూతీస్‌ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్‌తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్‌నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్‌లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్‌కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్‌లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్‌హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్‌డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్‌తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్‌తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్‌ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్‌ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్‌షేక్స్‌తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్‌లో జ్యూసర్ యూనిట్‌తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్‌లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్‌ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్‌కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్‌కేర్‌కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్‌మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్‌కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్‌లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా!
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
116 ఏళ్ల మహిళ ఇక లేరు
పోలవరం ముంపుపై అధ్యయనం
ఆకాశంలో అద్భుతం
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
మిర్చికి నష్టాల ఘాటు
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
‘ఇస్రో’ రోబో హస్తం
కాంక్రీట్ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సినీ నటి సీత ఇంట్లో విషాదం
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
116 ఏళ్ల మహిళ ఇక లేరు
పోలవరం ముంపుపై అధ్యయనం
ఆకాశంలో అద్భుతం
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
మిర్చికి నష్టాల ఘాటు
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
‘ఇస్రో’ రోబో హస్తం
కాంక్రీట్ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సినీ నటి సీత ఇంట్లో విషాదం
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
సినిమా
నా జీవితంలో ఈ సినిమా ఓ అద్భుతం
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి ఫ్యామిలీ మూవీ. చిన్న క్రైమ్ డ్రామా కూడా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మణిశర్మ, రమణ గోగులగార్లకు నేను అభిమానిని. ‘గోదారి గట్టు’ పాటను రమణ గోగులగారితో పాడించడం సంతోషాన్నిచ్చింది. అలాగే కొంత గ్యాప్ తర్వాత మధు ప్రియగారు ఈ పాట పాడారు. అనంత శ్రీరామ్ ‘మీనూ..’ పాటకు మంచి లిరిక్స్ ఇచ్చారు. ‘మీనూ..’ పాటను అనిల్‌గారు నన్నే పాడమన్నారు. నాతో పాటు ఈ పాటను ప్రణవి ఆచార్య పాడారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటకు రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యం అందించారు. ఈ పాటను అర్ధరాత్రి వెంకటేశ్‌గారు విని, మార్నింగ్ వచ్చి తానే పాడతానని అన్నారు. ఆయనే పాడారు. నేను, రోహిణి గొంతు కలిపాము. పాట పాడిన తర్వాత నేను పాడిన పాట నచ్చకపోతే తీసేయమని వెంకటేశ్‌గారు అన్నారు. వాస్తవానికి ఆయన స్థాయి, ఇమేజ్‌కు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఇక మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే కారణం... సాహిత్యం పట్ల అనిల్‌గారికి ఉన్న అభిరుచి. ‘దిల్’ రాజుగారి డీపీఆర్ బేనర్లో ‘బలగం’ మూవీ చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసే చాన్స్ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఇలా అన్ని విధాలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నా జీవితంలో జరిగిన ఓ అద్భుతం’’ అన్నారు.
మూలాలు మరచిపోకూడదు: పవన్ కల్యాణ్
‘‘తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి. రామారావుగారిని స్మరించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే దానికి స్ఫూర్తి అక్కినేని నాగేశ్వర రావు, ఎన్.టి. రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబుగార్లు.. ఇలా ఎంతో మంది పెద్దలే. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో మంది పెద్దలు శక్తి యుక్తులు ధారపోశారు... వారందరికీ ధన్యవాదాలు. మన మూలాలను మరచిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్‌చరణ్ ఉన్నా దానికి మూలం చిరంజీవిగారు. నేనెప్పుడూ మూలాలు మరచిపోను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్గార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోందంటే దానికి కారణం శంకర్‌గారు. ‘రంగస్థలం’ చూసి చరణ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్æస్టార్ కాకుండా ఏమవుతాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తే... మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా అనిపించింది. సినిమాని సినిమాగానే చూడండి.కిందపడిపోయి, మీద పడిపోయి, తొక్కిసలాటలో హీరోని చూడటం కంటే కూడా... దూరంగా నిలబడి మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ అండ్ సప్లయ్ వల్లే టికెట్ల ధరలు పెంచుతున్నాం. ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీని పన్ను రూపంలో కడుతున్నాం... చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి... తీయని వాళ్లు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఎన్డీయే కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) తరఫున నేను చెబుతున్నా. సినిమాలు తీసేవాళ్లతోనే మేము మాట్లాడతాం... వారినే గుర్తిస్తాం. సినిమా టికెట్ల ధరల పెంపుకోసం హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు.మహా అయితే నిర్మాతలు రండి... లేదా మీ యూనియన్‌తో రండి. మేము ఇచ్చేస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ని శంకర్‌గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ అని పెట్టారేమో అనిపిస్తోంది’’ అని చెప్పారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్‌గారిని కలిశాను. ఆయనలాంటి మంచి వ్యక్తి మా ‘గేమ్ చేంజర్’ వేడుకకి వచ్చినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు.
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాహత్ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్‌బాస్ టీమ్‌కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్‌పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్‌బాస్ టీమ్‌నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలుమొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.135 పెంచగా.. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ.175 పెంచుకునేందుకు అంగీకరిచింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.సినిమా..గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకపోయినా... ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే అని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. సిడ్నీ వికెట్ అనూహ్యంగా స్పందిస్తోందని... భారీ స్కోరు చేయడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు. శనివారం ఆట ముగిసిన అనంతరం ప్రసిధ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పిచ్‌ను తాకిన తర్వాత తక్కువ ఎత్తులో వస్తోంది. మరికొన్ని చోట్ల బాగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి చోట ఎంత లక్ష్యం సురక్షితం అని చెప్పలేం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయతి్నస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ‘ఎ’ తరఫున ఇక్కడ పర్యటించడం మంచి ఫలితాన్నిచ్చింది.దానివల్లే సులువుగా బౌలింగ్ చేశా. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైనా... ఆ వెంటనే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగా. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ప్రాథమిక సూత్రానికి కట్టుబడే బంతులు విసిరా. దాంతోనే ఫలితం రాబట్టగలిగా. ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ఆఖరి టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by shivam dube (@dubeshivam)31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు.
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది.
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు.
బిజినెస్
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టడానికి ముందు చేపడుతున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో వివిధ పథకాల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వారి సలహాలను కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 3.5-4 శాతం వృద్ధి రేటును సాధించడంపై వర్చువల్ సమావేశంలో చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉన్న గ్రామీణ పేదరిక రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదికను ఆయన స్వాగతించారు. ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ పరిశోధనల ద్వారా హెక్టార్‌కు ప్రస్తుతం నమోదవుతున్న ఉత్పత్తిని పెంచడం, కొత్త విత్తన వంగడాలను తయారు చేయడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఆరు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, నూతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాపీఎం కిసాన్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డీఏపీ ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు(Credit Card), ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎంఏఏఎస్ఏ) సహా కీలక పథకాల్లో పురోగతి ఉందని చౌహాన్ వివరించారు. వ్యవసాయ రంగంలో నిరంతరం పురోగతి నమోదువుతుందని, దాని కోసం అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్‌ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
10 నిమిషాల్లో అంబులెన్స్.. ‘జాగ్రత్తగా వ్యవహరించాలి’
బ్లింకిట్ వంటి క్విక్‌కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించాం’ అన్నారు.
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది.
ఫ్యామిలీ
విజువల్ వండర్.. సిటీలో వర్చువల్ పార్క్‌ల క్రేజ్
కృత్రిమ మేధకు ఆహ్వానం పలికిన ప్రస్తుత అధునాతన యుగంలో సాధ్యంకానిదంటూ ఏదీ లేదనేంతలా మారిపోయింది. ముఖ్యంగా ఈ అధునాతన జీవనశైలిలో వృత్తి వ్యాపారాలతో పాటుగా వినోదాత్మక కేంద్రాలు, ఊహాజనిత ప్రాంతాలన్నీ కళ్లముందుకొచ్చేశాయి. వర్చువల్ రియాలిటీ వేదికలుగా పిలుచుకునే ఈ విజువల్ వండర్లకు ఈ మధ్య ఆసక్తి, ఆదరణ విపరీతంగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం విదేశాలకే పరిమితమైన ఈ వర్చువల్ వేదికలు ప్రస్తుతం నగరంలో సందడి చేస్తున్నాయి. ఈ ఊహాజనిత వర్చువల్ ప్రపంచంలో ప్రేక్షకులు డైనోసార్ పార్క్‌లోకి ప్రవేశించి ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చు.. నగరంలో వరుసగా వర్చువల్ పార్కులు ఏర్పాటవుతున్న తరుణంలో ఆ విశేషాలు కొన్ని.. వర్చువల్ రియాలిటీ ద్వారా వజువల్గా ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా ఎవరెస్టు అధిరోహించవచ్చు, వినీల ఆకాశంలో, అంతరిక్షంలో సంచరించవచ్చు. ఆ ప్రయాణమంతా మన కళ్ల ముందు నిజంగానే జరుగుతుందనే అద్భుత అనుభూతిని, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి ఈ వేదికలు. ఐతే గతంలో 1, 2 ఉన్నటువంటి ఈ వర్చువల్ రియాలిటీ వేదికలు క్రమంగా వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఒక పెద్ద మాల్‌లోనో, అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఒక భాగంగానో ఉన్న ఈ ఆశ్చర్యభరిత వేదికలు ప్రస్తుతం నగరంలో పదుల సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. గదిలో ఓ ప్రదేశం నుంచి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం విశేషం. వర్చువల్ రియాలిటీ అంటే..? ఇదొక మాయా ప్రపంచం.. సామాన్య మానవునికి సాధ్యం కాని సాహసాలను నిజం చేశామనే అనుభూతిని కల్పిస్తాయి. స్వయంగా దట్టమైన అడవిలోకి వెళ్లి డైనోసార్లతో ఫైటింగ్ చేయొచ్చు. అనకొండలతో ఆడుకోవచ్చు. మహాసముద్రాల అడుగున అద్భుత జీవజాతులను విక్షించే ఫీలింగ్‌ను పొందవచ్చు.. అంతేకాదు.. మనమే ఒక భీకర యుద్ధంలో పాల్గొంటే ఎలా ఉంటుందో మన కళ్లకు గంతలు కట్టినట్టుగా ఉండే వర్చువల్ హెడ్‌సెట్‌తో చూపిస్తుంది. అలా కాకుండా వర్చువల్ సాంకేతికతతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థియేటర్ వంటి ఒక 3డీ గదిలో అంతరిక్షాన్ని, ఏలియన్ ప్రపంచాన్ని నిజజీవితంలానే భ్రమింపజేస్తుంది. ఇప్పటి వరకూ మనిషి చూడని జల కన్యలు, గ్రహాంతర వాసులతో కలిసి మలన్ని నడిపిస్తుంది. ఇదంతా వాస్తవంగా జరుగుతుందనేలా మనకు అనిపించడమే ఈ వర్చువల్ రియాలిటీ ప్రత్యేకత. ఈ అనుభూతి కలి్పంచడంలో 3డీ, 4డీ, వీఆర్ ఎక్స్పీరియన్స్ వంటి అధునాతన సాంకేతికతలు కీలకంగా పనిచేస్తున్నాయి. మనిషి చూడని ప్రపంచంలోకి.. నగరం వేదికగా ఈ వర్చువల్ విజువల్ వండర్‌ను అందిస్తున్న వేదికల్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి. ఇందులో గతంలో ప్రారంభించిన ఇంటర్స్టెల్లార్ వర్చువల్ షో.. ప్రేక్షకులను అంతరిక్షంలోకి, ఇక్కడి గ్రహాల పైకీ తీసుకెళుతుంది. మనమే ఒక వ్యోమగామిగా ఆ అందాలను, అద్భుతాలను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతినిస్తుంది. శాటిలైట్ వ్యూతో పాటు జలాంతర్గాములు, అగ్ని పర్వతాలు, మంచుకొండలను చేధించుకుంటూ వెళ్లే ఈ వర్చువల్ ప్రయాణం మరో లోకంలోకి తీసుకెళుతుంది. లేజర్ గన్లతో వర్చువల్ గేమ్స్.. నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్‌లో కూడా వర్చువల్ విజువల్ వండర్లను ప్రదర్శించే ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠను, సాహస కృత్యాలతో భయభ్రాంతులకు గురిచేసే ఈ వర్చువల్ ప్రదర్శన మరచిపోని అనుభూతిని అందిస్తుంది. దీంతో పాటు ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా వర్చువల్ గేమింగ్ అందుబాటులో ఉంది. ఇందులో లేజర్ గన్లతో పబ్జీ, బీజీఎమ్ ఐ, ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్స్ పోలిన వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఎవరైనా ఆడవచ్చు. ఇవేకాకుండా ఇనార్బిట్ మాల్తో పాటు గచి్చ»ౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ మాల్స్‌లో థ్రిల్ కలిగించే వర్చువల్ వేదికలు నగరవాసులను అలరిస్తున్నాయి. వీఆర్ కార్ రేసింగ్, షూటింగ్, ఎస్కేప్ రూమ్, కిడ్స్ జోన్ వంటివి వీక్షకులను అలరిస్తున్నాయి. అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్.. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వేదికగా ఏకంగా 107 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద వర్చువల్ అమ్యూజ్మెంట్ పార్క్‌గా అవతరించింది. ఇందులో ఎత్తయిన జలపాతాలు, దట్టమైన అడవులు, గిరిజన జాతి తెగల జీవితాలు, వన్యప్రాణులు, క్రూరమృగాలను దగ్గరగా చూపించే వర్చువల్ బస్ రైడ్ వంటి ఆశ్చర్యపరిచే వింతలు చూపిస్తున్నారు. ఇందుకోసం వీఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు, 3డీ సాంకేతికత, 360 ఇండోర్ థియేటర్, వర్చువల్ హెడ్సెట్ బస్ ప్రయాణాలను అందుబాటులో ఉంచారు. వైల్డ్ సఫారీ ఎలా ఉంటుందో వర్చువల్ వేదికగా కళ్ల ముందే చూపిస్తుండటం విశేషం.దశాబ్ద కాలం క్రితమే.. దశాబ్ద కాలం క్రితమే ట్యాంక్ బండ్ వేదికగా ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌లో 3డీ షో థియేటర్ ఉండేది. అప్పట్లో ఇలాంటి వేదికలు ఒకటీ, రెండు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం మరింత అధునాతన సాంకేతికతతో 3డీ నుంచి రూపాంతరం చెందిన వర్చువల్ అద్భుతాలు నగరం నలుమూలలా ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో పాటు ఈ వేదికలో మరో వర్చువల్ 3డీ గది.. ప్రేక్షకులను ఊహాజనిత డైనోసార్ యుగంలోకి తీసుకెళుతుంది. ఇందులో విభిన్న రకాల రాక్షస బల్లులతో పాటు విభిన్న రకాల జంతువులను దగ్గరగా చూడవచ్చు.
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు.
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే.
ఫొటోలు
International View all
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్
116 ఏళ్ల మహిళ ఇక లేరు
టోక్యో: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది.
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన
National View all
చైనాలో వైరస్ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర
Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి..
దేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మక
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కేవలం పం
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో కనువిందైన దృశ్యం కనిపించింది.
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ
NRI View all
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్
క్రైమ్
అంకుల్.. మొత్తం కుటుంబాన్ని చంపేశా..!
లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది.
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు.
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.