Jasprit Bumrah
-
అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఆసీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు భారత బౌలర్ల దాటికి 238 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి కారణమని తెలిపాడు.అదే మా కొంపముంచింది"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం మేము బాగానే సన్నద్దమయ్యాము. జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగారు. కానీ మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాము. కొన్ని మ్యాచ్‌ల్లో మనం ప్లాన్ చేసింది జరగదు. అటువంటి మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఇక ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తర్వాతి మ్యాచ్‌లో మేము తిరిగిపుంజుకుంటామన్న నమ్మకం ఉంది. ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాము.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాము. ఈ మ్యాచ్‌లో మాకు ఏదీ కలిసిరాలేదు. తొలి రోజు బౌలర్లు ఇచ్చిన ఆరంభాన్ని మేము అందిపుచ్చుకోలేకపోయాం. మొదటి రోజు బ్యాటింగ్ పరంగా మేము రాణించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఈ మ్యాచ్‌లో తప్పు ఎక్కడ జరిగిందో చర్చించుకుంటాము. అయితే మా జట్టులో చాలా మంది అనుభవం ఉ న్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి బలంగా ఎలా తిరిగి రావాలో బాగా తెలుసు. ఆడిలైడ్ టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాము. రెండో టెస్టులో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తాం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రజేంటేషన్లో కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. -
వాళ్లిద్దరు అద్భుతం... గర్వంగా ఉంది.. ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్‌లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మవిశ్వాసం ఉంటే అనుభవంతో పనిలేదని భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించారని కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. పేసర్ బుమ్రా భారత జట్టు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడిన టీమిండియా.. ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా కంగారూ గడ్డపై అతిపెద్ద విజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో విజయానంతరం తాత్కాలిక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘విజయంతో సిరీస్ ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. అయితే, ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది.2018లో ఇక్కడ ఆడాను. ఇక ఈ పిచ్ మాకు సవాళ్లు విసిరింది. అయితే, అనుభవం కంటే.. సామర్థ్యాన్నే మేము ఎక్కువగా నమ్ముకున్నాం. పూర్తిస్థాయిలో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాం. ఆత్మవిశ్వాసం ఉంటే.. ప్రత్యేకంగా ఏదైనా సాధించగలమని విశ్వసించాం. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి’’ అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.ఇక సెంచరీ వీరులు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావన రాగా.. ‘‘జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. టెస్టుల్లో ఇదే అతడికి మొదటి అత్యుత్తమ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ అతడు అటాక్ చేసిన విధానం అద్భుతం.ఇక విరాట్.. అతడు ఫామ్‌లో లేడని నేనెప్పుడూ అనుకోను. ఇలాంటి కఠినమైన పిచ్‌లపైనే కదా.. బ్యాటర్ అసలైన ఫామ్ తెలిసేది’’ అంటూ బుమ్రా వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు. కాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్, కోహ్లి నిరాశపరిచిని విషయం తెలిసిందే. జైస్వాల్ డకౌట్ కాగా.. కోహ్లి 5 పరుగులే చేశాడు.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టాండ్ బ్యాటర్ జైస్వాల్.. 161 పరుగులతో దుమ్ములేపగా.. కోహ్లి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఎనిమిది వికెట్లు కూల్చాడు.ఇక తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెర్త్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియగా.. ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు అడిలైడ్‌లో రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పెర్తు టెస్టు స్కోర్లు👉భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్👉ఫలితం: ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో బుమ్రా సేన భారీ విజయం -
ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్‌తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్‌లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్‌ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్‌కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్‌పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. బుమ్రాకు కూడా సాధ్యం కాలేదు
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. భువీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ యష్ ధుల్‌ను ఔట్ చేసిన భువీ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 287 టీ20 మ్యాచ్‌లు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మొత్తం 300 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న మూడో భారత బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.టీ20 ఫార్మాట్లో భువీ కంటే ముందు భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ (354), పీయూష్ చావ్లా (314), ఆర్ అశ్విన్ (310)లు ఈ ఫీట్‌ను సాధించారు. కానీ ఫాస్ట్ బౌలర్లలో మాత్రం భువీ తప్ప మిగితా ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు.అయితే భువీ తర్వాతి స్ధానంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 300 వికెట్ల మైలు రాయిని చేరుకోవడానికి బుమ్రా 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. బమ్రా ఇప్పటివరకు 233 మ్యాచ్‌లు ఆడి 295 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా? -
నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా మొదటి టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా 150 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలాఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21)ని అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. ఓవరాల్‌గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సారథిగా మొదటిది.ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్ మన్కడ్, బిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు1. వినోద్ మన్కడ్(1)2. బిషన్ బేడి(8)3. కపిల్ దేవ్(4)4. అనిల్ కుంబ్లే(2)5. జస్ప్రీత్ బుమ్రా(1)టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లు1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్‌లు) 2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్‌లు) 3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్‌లు) 4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్‌లు) 5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్‌లు) 6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్‌లు) 7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్‌లు) 8. సుభాశ్ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్‌లు) 9. జస్ప్రీత్ బుమ్రా - 11 (41 మ్యాచ్‌లు) 10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్‌లు) 11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్‌లు)ఇదిలా ఉంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Make that FIVE! There's the first five-wicket haul of the series #MilestoneMoment #AUSvIND @nrmainsurance pic.twitter.com/t4KIdyMTLI— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
Ind vs Aus 1st Day 2: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజూ మనదే
Australia vs India, 1st Test Day 2 At Perth Updates: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజు మనదేపెర్త్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రాహుల్ అద్బుతంగా ఆడుతున్నారు. జైశ్వాల్(90), రాహుల్(62) ఆజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను రాహుల్ ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజులో జైశ్వాల్(74), కేఎల్ రాహుల్(56) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు- 145/0 (37.4). 191 పరుగుల లీడ్.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీఆసీస్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది తొమ్మిదో ఫిఫ్టీ. మరోవైపు రాహుల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు- 100/0 (37.4). 146 పరుగుల లీడ్.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుటీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.అయితే, స్టార్క్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్క్‌తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).రెండో రోజు ఆట ఆరంభంఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లుఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.తుదిజట్లుటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి -
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కుతుంది. పెర్త్: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలవగా... రిషబ్ పంత్ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు), స్టార్క్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది. బుల్లెట్‌లాంటి బంతులతో.. బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్లో మెక్‌స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్లో ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్ ఖ్వాజా (8)ను అవుట్ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్ హర్షిత్ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ మెయిడెన్లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (11)ను హర్షిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. మార్ష్ (6) రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న సిరాజ్... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్ సారథి కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. పేస్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్ ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్ పిచ్‌పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మూడో ఓవర్లోనే అవుట్ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్ పడిక్కల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్ రాహుల్ అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్‌కు నితీశ్ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్... కమిన్స్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్ వెనుదిరిగాడు. పంత్ అవుటయ్యాక నితీశ్వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; పడిక్కల్ (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్‌వుడ్ 5; పంత్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 37; జురేల్ (సి) లబుషేన్ (బి) మార్ష్ 11; సుందర్ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 41; హర్షిత్ (సి) లబుషేన్ (బి) హాజల్‌వుడ్ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 8; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్: స్టార్క్ 11–3–14–2; హాజల్‌వుడ్ 13–5–29–4; కమిన్స్ 15.4–2–67–2; లయన్ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (బ్యాటింగ్) 19; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్: బుమ్రా 10–3–17–4; సిరాజ్ 9–6–17–2; హర్షిత్ రాణా 8–1–33–1. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు నితీశ్‌కు మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లీ టెస్టు క్యాప్ అందించగా... హర్షిత్‌కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ జాతీయ జట్టు క్యాప్ ఇచ్చి అభినందించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి, 316వ ప్లేయర్‌గా హర్షిత్ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్‌లో నితీశ్ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్ మెక్‌స్వీనీ కూడా పెర్త్ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
IND vs AUS: అరుదైన రికార్డు.. 72 ఏళ్లలో ఇదే తొలిసారి
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజులో బౌలర్లు అధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు.ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41), రిషభ్ పంత్ (37), కేఎల్ రాహుల్(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.బుమ్ బుమ్ బుమ్రా...అనంతరం భారత ఫాస్ట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు ధీటుగా బదులిచ్చారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. అతడిని ఎదుర్కొవడం ఆసీస్ బ్యాటర్ల తరం కాలేదు. అతడి బౌలింగ్ దాటికి కంగారులు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 4 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను బుమ్రా దెబ్బ తీశాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఓ వికెట్ సాధించారు.72 ఏళ్లలో ఇదే తొలిసారి..ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో మొత్తం 17 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడడం 1952 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో 72 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. -
బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు. తొలుత అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీని ఔట్ చేసి ఆసీస్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టిన బుమ్రా.. ఆ తర్వాత స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కమ్మిన్స్ ఔట్ చేసి ఆతిథ్య జట్టును కష్టాల్లో నెట్టేశాడు.ఇప్పటివరకు మొదటి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ తొలి బంతికే ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా టెస్టుల్లో స్మిత్‌ను బుమ్రా కంటే ముందు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత స్మిత్ రెండో సారి గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IND vs AUS: వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్ -
చెలరేగిన బుమ్రా.. రాణించిన రాణా, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతోటాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.పంత్, నితీశ్ రాణించగా..అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హర్షిత్ రాణాకు తొలి వికెట్మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు -
బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆసీస్‌కు ఆరంభంలోనే షాకులు!
పెర్త్ టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన పేస్ పదునుతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శిస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. బుమ్రా దెబ్బకు ఆసీస్ ఓపెనింగ్ ద్వయం చేతులెత్తేసింది.అదే విధంగా.. అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను సైతం బుమ్రా అద్భుత రీతిలో డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం మ్యాచ్ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా టీమిండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.రాణించిన పంత్, నితీశ్ఇక టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(37), నితీశ్ రెడ్డి(41) రాణించడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటింగ్‌కు దిగగా.. బుమ్రా మూడో ఓవర్లోనే కంగారూలకు షాకిచ్చాడు.బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి ఆసీస్ ఓపెనర్, అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీ లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. అయితే, తొలుత ఫీల్డ్ అంపైర్ మెక్‌స్వీనీని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు.. బుమ్రా కూడా రివ్యూకు వెళ్లే విషయంలో కాస్త సంశయించారు.బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. అయితే, విరాట్ కోహ్లి మాత్రం బుమ్రాను రివ్యూకు వెళ్లేలా ఒప్పించాడు. ఈ క్రమంలో రీప్లేలో మెక్‌స్వీనీ(10) అవుటైనట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించగా.. బుమ్రా, టీమిండియా ఖాతాలో తొలిరోజు తొలి వికెట్ చేరింది.తొలి మూడు వికెట్లు బుమ్రాకేఇక మళ్లీ ఏడో ఓవర్లో బుమ్రా వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతికి మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(8)ను అవుట్ చేసిన బుమ్రా.. ఆ మరుసటి బాల్కే స్టీవ్ స్మిత్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 19 పరుగులకే ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బుమ్రా ఆరంభంలోనే ఇలా మూడు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ సైతం విజృంభించారు. ఈ క్రమంలో 21 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 47 పరుగులు చేసింది.చదవండి: నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్JASPRIT BUMRAH - THE GREATEST OF THIS GENERATION.🐐 pic.twitter.com/xyxvTRHTF5— Tanuj Singh (@ImTanujSingh) November 22, 2024 -
77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్ కమిన్స్- జస్ప్రీత్ బుమ్రా కలిసి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.రోహిత్ శర్మ దూరంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో టీమిండియాకు ఈ సిరీస్ ఆఖరిది. ఇక ఇందులో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ ఈసారీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలకమైన సిరీస్‌లో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నాడు.బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలుఈ క్రమంలో రోహిత్ స్థానంలో భారత జట్టు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ సమయంలో కెప్టెన్లు బుమ్రా- కమిన్స్ కరచాలనం చేసుకున్న దృశ్యాలు క్రికెట్ ప్రేమికులను ఆకర్షించాయి.77 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిఈ నేపథ్యంలోనే భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరుజట్లకు ఫాస్ట్‌బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా 2021 ద్వితీయార్థంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ అయ్యాడు.మరోవైపు.. భారత పేసర్ బుమ్రా గతంలో ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆస్ట్రేలియాలో మాత్రం సారథిగా అతడికి ఇదే తొలి అనుభవం. ఇదిలా ఉంటే.. 1947-48లో భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్టు సిరీస్ జరిగింది. నాడు వీరి సారథ్యంలోనాడు టీమిండియా ఆసీస్ చేతిలో 4-0తో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ జట్టుకు లెజెండరీ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఉండగా.. టీమిండియాకు ఆల్‌రౌండర్ లాలా అమర్నాథ్ నాయకుడు.ఇక 1985-86లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఇంత వరకు బుమ్రాలా పూర్తిస్థాయిలో ఓ ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించలేదు.పేలవంగా మొదలుకాగా పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు మాత్రం శుభారంభం లభించలేదు. శుక్రవారం నాటి తొలిరోజు ఆట భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది.చదవండి: Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. మండిపడుతున్న ఫ్యాన్స్టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్🗣️🗣️ 𝙏𝙝𝙚𝙧𝙚'𝙨 𝙣𝙤 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙧 𝙝𝙤𝙣𝙤𝙪𝙧 𝙩𝙝𝙖𝙣 𝙩𝙝𝙞𝙨.Captain Jasprit Bumrah is charged 🆙 to lead from the front in Perth ⚡️⚡️#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/0voNU7p014— BCCI (@BCCI) November 21, 2024 -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్‌లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరంఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్‌రౌండర్‌ను కోరుకుంటుంది. అయితే, జస్ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్‌లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్‌తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదనపు బలం అదేఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్‌కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్‌లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..రోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్. చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్‌తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్‌లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్‌లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్‌గా తన రెండో టెస్ట్‌లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో మొదటి టెస్టులో భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయినందున తన కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ తిరిగి మళ్లీ అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో భారత కెప్టెన్‌గా ఒకరే ఉండాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని అతడు సూచించాడు."రోహిత్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే, బుమ్రా కెప్టెన్‌గా కొనసాగాలని భారత అభిమానులందరూ కోరుకుంటారు. ఒకవేళ రెండు గేమ్‌లలో భారత్ ఓడిపోతే రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అదే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అభిమానుల మనసు చాలా త్వరగా మారిపోతుంది. నేను ఇప్పుడు సునీల్ గవాస్కర్ సర్ కోసం మాట్లడటం లేదు. నేను సాధారణ ప్రజల అభిప్రాయాన్ని చెబుతున్నా అంతే.నా వరకు అయితే మొత్తం సిరీస్‌కు ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అన్పిస్తోంది. అదే జట్టుకు కూడా మంచిది. అప్పుడు ఒక వేళ ఓడిపోయినా ఎవరూ ప్రశ్నించరు. అదే బుమ్రా కెప్టెన్సీలో గెలిచి, తర్వాత రోహిత్ నాయకత్వంతలో ఓడిపోతే కచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఇంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.చదవండి: SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు -
బుమ్రా సారథ్యంలో...
పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుబ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. మరో వైపు పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో సాధన చేస్తుంది. రెండో టెస్టునుంచి అందుబాటులోకి... సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్స్టాప్ పెడుతూ కెప్టెన్ తుది నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్ నైట్) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఈశ్వరన్‌కూ అవకాశం! శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు. రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు. నితీశ్ రెడ్డికి చాన్స్! పెర్త్ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్ కార్డ్’ కాగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్‌లో తన స్వింగ్ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆదివారం టీమ్ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్‌ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి -
తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో?
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ 2024-25 బరిలో దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌తో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.ఇండోర్ వేదికగా బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య మధ్యప్రదేశ్‌తో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది.తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీఇందులో షమీతో పాటు అతడి తమ్ముడు మహ్మద్ కైఫ్ పాత్ర కీలకం. షమీ 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. కైఫ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇతరుల్లో సూరజ్ సింధు జైస్వాల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్.. 276 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందులో షమీ చేసిన పరుగులు 37. కేవలం 36 బంతుల్లోనే అతడు ఈ మేర రన్స్ స్కోరు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరతాడని తెలిపాడు.రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడుఈ మేరకు.. ‘‘అడిలైడ్‌లో రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు. అతడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఆసీస్ పర్యటన రెండో అర్ధ భాగంలో జట్టు అతడి సేవలు కీలకంగా మారనున్నాయి’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో బద్రుద్దీన్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. బుమ్రా స్థానంలో?ఇరుజట్ల మధ్య నవంబరు 22న పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్‌తో టెస్టులకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన నాటికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కాంపిటేటివ్ క్రికెట్లో షమీ సత్తా చాటుతున్నాడు కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొనడం విశేషం. దీంతో బుమ్రా స్థానంలో షమీ మిగిలిన టెస్టులు ఆడతాడా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ! -
BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూల గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే భారత జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టు నుంచే పట్టు బిగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనాన్ని మరచి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు కారణమైంది.వారిద్దరు విఫలంకాగా డబ్ల్యూటీసీలో భాగంగా కివీస్‌తో స్వదేశంలో సిరీస్‌లో రోహిత్ సేన బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లు రాణించినా.. కీలక బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆసీస్ గడ్డపై వీరిద్దరు మెరుగ్గా ఆడితేనే సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ ఇంట్రా- స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.అభిమానులకు బ్యాడ్న్యూస్మొదటి టెస్టుకు వేదికైన పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. అయితే, ఈ వార్మప్ గేమ్‌ను ప్రేక్షకులు చూడకుండా లాక్డౌన్ విధించిందని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. అభిమానులను ఈ మ్యాచ్ చూసేందుకు అనుమతినివ్వడం లేదని తెలిపింది.భారత్-ఎ జట్టుతో మ్యాచ్ రద్దు చేసినిజానికి బీసీసీఐ ముందుగా భారత్-ఎ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని భావించింది. అయితే, కారణమేమిటో తెలియదు కానీ దానిని రద్దు చేసి నెట్ సెషన్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాల నుంచి విమర్శలు రాగా.. మళ్లీ ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి సహా రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. కోహ్లి డుమ్మాఇక వీరందరి కంటే ముందుగానే ఆసీస్‌లో అడుగుపెట్టి భారత్-ఎ జట్టుకు ఆడిన కేఎల్ రాహుల్‌తో పాటు యశస్వి, పంత్ మంగళవారం ప్రాక్టీస్ చేశారు. అయితే, కోహ్లి మాత్రం ఈ ఆప్షనల్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నవంబరు 22 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
'బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు'
ఆస్ట్రేలియా యువ సంచలనం నాథన్ మెక్‌స్వీనీ తన జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. టీమిండియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన ఆసీస్ జట్టులో నాథన్ మెక్‌స్వీనీకి చోటు దక్కింది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్‌తో జరగనున్న తొలి టెస్టుతో మెక్‌స్వీనీ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైనట్లే. మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వారుసుడిగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను మెక్‌స్వీనీ ప్రారంభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తొలి టెస్టుకు సన్నద్దమవుతున్న మెక్‌స్వీనీ.. భారత్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టమని ఈ ఆసీస్ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.బుమ్రాతో అంత ఈజీ కాదు: మెక్‌స్వీనీ"ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్‌ను ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పెర్త్‌లో నా బెస్ట్ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. ఇక బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. అతడు వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.నేను ఇప్పటివరకు అటువంటి బౌలింగ్ యాక్షన్‌ను ఎదుర్కోలేదు. అందుకే బుమ్రాను క్యాచ్‌అప్ చేయడానికి అతడి పాత బౌలింగ్ వీడియోలు చూస్తున్నాను. ఇప్పటికే అతడు బౌలింగ్ ఎటాక్ ఎలా ఉంటుందో, కొత్త బంతితో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో కొన్ని వీడియో క్లిప్‌లను చూశాను. ఏదేమైనప్పటకి బుమ్రా లాంటి కొత్త బౌలర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు" అని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు.చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే! -
BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి: టీమిండియా దిగ్గజం
చారిత్రాత్మక ఓటమి నుంచి కోలుకుని తదుపరి టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్‌ను తప్పించండిఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని గావస్కర్ బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సారథిగా నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అతడు రెండో టెస్టు కూడా ఆడకపోవచ్చు.అదే నిజమైతే మాత్రం.. టీమిండియా సెలక్షన్ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే అలాగే చేయండి. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమై.. రెండు- మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోతే మాత్రం.. ఈ టూర్లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించండి.భారత క్రికెట్ కంటే ఎవరూ ఎక్కువ కాదువైస్ కెప్టెన్‌ను ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించండి. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్ బాగోగులే మనకు ముఖ్యం. ఒకవేళ మనం న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. మనం కివీస్ చేతిలో 3-0తో ఓడిపోయాం. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్ అవసరం తప్పకుండా ఉంటుంది.కెప్టెన్ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుంది. ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్ వచ్చాడంటే మాత్రం పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గావస్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు. టెస్టు సారథిగా ఒకే ఒకసారిఇదిలా ఉంటే.. బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. నాడు ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో బుమ్రా సేన పరాజయం పాలైంది. ఇక.. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా జరగటం ఇదే తొలిసారి. కాగా ఆసీస్‌తో నవంబరు 22 నుంచి టీమిండియా టెస్టులు ఆరంభం కానున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: IPL Auction: టీమిండియా స్టార్ల కనీస ధర? అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడకుండానే...