Rishabh Pant
-
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్‌కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్‌ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్‌ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్‌కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యాజమాన్యం రిషభ్ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ప్రాణాపాయస్థితిలో రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి
టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్‌ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు. రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్‌తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది. రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్‌నగర్ పోలీసులకు (ఉత్తర్‌ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్‌కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్‌కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపింది. ఈ క్రమంలో నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్‌ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్‌ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్‌లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్‌లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్‌తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్‌గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
ఢిల్లీ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లికి చోటు! పంత్ దూరం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జనవరి 30 ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రైల్వేస్‌తో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టులో విరాట్ కోహ్లి డీడీసీఎ సెలక్టర్లు చోటిచ్చారు. జనవరి 28న కోహ్లి జట్టుతో చేరుతాడని ఢిల్లీ హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఇప్పుడు ఢిల్లీ తమ జట్టును ప్రకటించడంతో కోహ్లి రీఎంట్రీ ఖాయమైంది. యువ ఆటగాడు అయూష్ బడోని సారథ్యంలో కింగ్ కోహ్లి ఆడనున్నాడు. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.ఆ సీజన్లో కోహ్లి కేవల ఒకే ఒక మ్యాచ్ ఆడి 57 పరుగులు చేశాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం విరాట్ అద్బుతంగా రాణించాడు. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి.అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.రిషబ్ పంత్ దూరం..ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సౌరాష్ట్రపై ఆడిన పంత్ ఈ మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల,ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పంత్.. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తన రంజీ రీ ఎంట్రీ మ్యాచ్‌లో పంత్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ, వైభవ్ కంద్పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన రంజీ పునరాగమనంలో సత్తాచాటాడు. రంజీ ట్రోఫీ 2024-25లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 12 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో మెరిశాడు. అతడి స్పిన్ మయాజాలానికి ప్రత్యర్ధి బ్యాటర్లు విల్లవిల్లాడారు. అటు బ్యాటింగ్‌లోనూ జడేజా అదరగొట్టాడు. 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఢిల్లీని చిత్తు చేసిన సౌరాష్ట్ర..ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో మాత్రమే ముగిసిపోయింది. ఢిల్లీ విధించిన 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్(6), అర్పిత్ రానా(4) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.కాగా అంతకముందు 163/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం లభించింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో హర్విక్ దేశాయ్(93) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాస్వాద(62), జడేజా(38) పరుగులతో రాణించారు.ఢిల్లీ బౌలర్లలో హర్ష్ త్యాగీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయూష్ బదోని మూడు వికెట్లు సాధించాడు. అనంతరం 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రముందు ఢిల్లీ కేవలం 15 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయూష్ బదోని(44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌లలో తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజా(7 వికెట్లు)తో పాటు దర్మేంద్ర జడేజా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 188 పరుగులకు ఆలౌటైంది.ఇక 12 వికెట్లతో మెరిసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
పంత్‌తో పోటీలో సంజూ వెనుకబడటానికి కారణం అదే: డీకే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్‌కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.పాకిస్తాన్ వేదికగావన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.సంజూకు దక్కని చోటుఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్‌కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్‌తో పాటు.. రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.అప్పుడు కూడా ఇదే తరహాలోఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు. నిజానికి సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.పంత్‌ను చేర్చడం ద్వారానే అది సాధ్యంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్‌ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్‌ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్‌కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్‌సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. ‘నాడా’ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ(Tilak Varma) పేర్లు కూడా జత చేరాయి.ఇక ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా ‘ఆర్టీపీ’లో చేర్చారు. ‘నాడా’ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్‌ను అధికారులు సేకరిస్తారు. డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతేతాము ‘ఎప్పుడు, ఎక్కడ’ ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్‌ల షెడ్యూల్వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది.కాగా డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద ‘నాడా’ చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే ‘నాడా’ పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్‌గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.మరిన్నిక్రీడా వార్తలుఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు’ అని వెల్లడించారు. పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్. మహిళల జట్టు: సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. సహజ శుభారంభంబెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది.2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రషి్మక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది. -
‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్‌లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.సంజూ శాంసన్‌కు మొండిచేయిఅయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్‌గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.అదే విధంగా.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.నా కుమారుడిపై పగబట్టారునిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.ఇంతవరకు మేము అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.వారి ప్రమేయం లేదుకేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్‌కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
IPL 2025: పంత్‌కే లక్నో పగ్గాలు
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించిన విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్‌కు టీమ్ జెర్సీని అందిస్తూ తమ ఎల్ఎస్జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతనే కెపె్టన్ కావడం దాదాపు ఖాయమైంది. ‘కొత్త ఆశలు, ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం. మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్‌ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. మూడేళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం’ అని గోయెంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్లో మూడు సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇప్పుడు కెపె్టన్‌గా బాధ్యతలు అప్పగించింది. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ టీమ్ సభ్యుడైన పంత్... మూడేళ్లు నాయకుడిగా కూడా పని చేశాడు. 200 శాతం ప్రదర్శన కనబరుస్తా... దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడినా... పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. గతంలో ఇది ఉత్తరప్రదేశ్‌లోనే భాగం. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్‌కు అంటే దాదాపుగా సొంత టీమ్‌కు అతను ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. లక్నో మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా 200 శాతం కష్టపడతానని మీకు మాటిస్తున్నా. కొత్త ఉత్సాహంతో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు ఇచి్చన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా. టీమ్‌లో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త లక్ష్యాలతో మా ప్రయాణం మొదలైంది’ అని పంత్ వ్యాఖ్యానించాడు. కెపె్టన్‌గా తాను ఇప్పటికే ఎంతో నేర్చుకున్నానని పంత్ అన్నాడు. ‘ఇక్కడ కొత్త ఫ్రాంచైజీ, కొత్త ఆరంభం అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ బాధ్యతలు నాకు కొత్త కాదు. అయితే మా జట్టు అవసరాలను బట్టి నేనేం చేయాలో మేనేజ్మెంట్తో చర్చిస్తా. సహచరులకు అండగా ఎలా నిలవాలో, వారినుంచి మంచి ప్రదర్శన ఎలా రాబట్టాలో రోహిత్ శర్మ నుంచి, ఇతర సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయంపై నాకు స్పష్టత ఉంది’ అని పంత్ వివరించాడు. పంత్‌లో సత్తా ఉంది... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న 2016లో పంత్ మొదటిసారి ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్‌తో పంత్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు. ‘ఎన్నో ఆటుపోట్లను దాటి పంత్ క్రికెటర్‌గా ఎదగడం నేను ప్రత్యక్షంగా చూశాను. తన ఆటతో అతను అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇకపై అతను సాధించాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ పంత్ ఆ పని చేయగలడు’ అని జహీర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ జట్టు మిడిలార్డర్లో అంతా ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉండటం కూడా ఒకరకమైన వ్యూహమని తెలిపాడు. -
అందుకే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాల్గొనబోయే భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటివ్వాల్సిందని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో వరుస శతకాలతో చెలరేగినా అతడికి మొండిచేయి ఎదురుకావడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సంజూ తిరస్కారానికి గురైనట్లుగా భావించరాదని.. క్రికెట్ ప్రేమికులంతా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నాడు.జట్టు కూర్పు దృష్ట్యానే సంజూను కాదని.. సెలక్టర్లు రిషభ్ పంత్(RIishabh Pant) వైపు మొగ్గుచూపారని గాసవ్కర్ అభిప్రాయపం వ్యక్తం చేశాడు. కాగా హైబ్రిడ్ విధానంలో పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం(జనవరి 18) జట్టును ప్రకటించింది.వారిద్దరికే చోటురోహిత్ శర్మ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు.. రిషభ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. నిజానికి వన్డేల్లో పంత్‌తో పోలిస్తే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాదు.. ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడు మూడు శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి వారు సంజూను చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించారు. అయితే, బీసీసీఐ మాత్రం పంత్ వైపే మొగ్గుచూపింది. దీంతో సంజూకు గతంలో మాదిరే మరోసారి భంగపాటు తప్పలేదు.అందుకే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు!ఈ విషయంపై గావస్కర్ తాజాగా స్పందిస్తూ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఆటగాడిని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. అసలు అతడిని ఎంపిక చేయకపోవడానికి సరైన కారణం లేదనే చెప్పవచ్చు.సంజూను కాదని.. రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారు. గేమ్ ఛేంజర్‌గా అతడికి పేరుండం ఒక కారణం కావచ్చు. ఇక అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరొక ప్లస్ పాయింట్. అంతేగాక.. సంజూ కంటే బెటర్ వికెట్ కీపర్ కావడం కూడా అతడికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా పంత్ సొంతం. అయితే, సంజూకు అలాంటి ఫేమ్ లేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ.. సంజూ ఎందులోనూ తక్కువ కాదు. అతడు తిరస్కార భావంతో ముడుచుకుపోవాల్సిన పనిలేదు. ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతడికి మద్దతు ప్రకటిస్తున్నారు’’ అని సునిల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
‘గిల్ కంటే బెటర్.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా అతడికే నా ఓటు’
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్‌పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు. అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్‌కు శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.గిల్ కంటే జైస్వాల్ బెటర్అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్‌కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.టీమిండియా భవిష్య కెప్టెన్‌గా అతడికే నా ఓటుఇక టీమిండియా భవిష్య కెప్టెన్‌గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్‌ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.ఓపెనర్‌గా జైసూ, మిడిల్ ఆర్డర్లో పంత్ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్‌కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమేఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్‌ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.ఇక వన్డేల్లో గిల్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
‘ధోని అంతటివాడు.. పంత్ కంటే సంజూనే బెటర్’
టీమిండియా స్టార్ రిషభ్ పంత్(Rishabh Pant)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపింగ్ విషయంలో ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్.. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతటి స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం పంత్ కంటే.. సంజూ శాంసన్ బెటర్ అని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో వికెట్ కీపర్ కోటాలో తాను సంజూకే ఓటువేస్తానని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ తనను దాటుకుని ముందుకు వెళ్లాడన్న నిజాన్ని రిషభ్ పంత్ అంగీకరించాలి.వికెట్ కీపర్‌గా పంత్ సూపర్నిజానికి రిషభ్ పంత్ అంటే అభిమానులకు ఓ ఎమోషన్. టెస్టుల్లో అతడొక మ్యాచ్ విన్నర్. ఆస్ట్రేలియాతో గబ్బా మైదానంలో.. అదే విధంగా సౌతాఫ్రికాపై టెస్టులో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడు అద్భుత ప్రదర్శన కనబరచగలడు.మంచి వికెట్ కీపర్ కూడా!.. వికెట్ కీపింగ్ విషయంలో సంజూ శాంసన్ కంటే పంత్ మెరుగు. అతడు దాదాపుగా ఎంఎస్ ధోని స్థాయికి చేరుకున్నాడు. ఇక్కడ మాత్రం సంజూనే బెటర్కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన గణాంకాలు ఎలా ఉన్నాయో పంత్ ఓసారి గమనించుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోకుండా.. తనకు తానుగా విశ్లేషణ చేసుకోవాలి.చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దొరక్కపోతే.. అది పంత్‌కు అన్యాయం జరిగినట్లు కాదు. సంజూ శాంసన్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కించుకునే అర్హత ఉంది. ఈ ఇద్దరినీ పోల్చినపుడు పంత్ కంటే సంజూనే బెటర్’’ అని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.పంత్ వర్సెస్ సంజూ - గణాంకాలుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రేసులో ఉన్నారు. అయితే, వన్డేల్లో పంత్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇప్పటి వరకు 31 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది.మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ 16 మ్యాచ్‌లలో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీ20లలోనూ సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. రెండు శతకాలతో చెలరేగాడు. గావస్కర్ ఓటు కూడా సంజూకేఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూ శాంసన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ సైతం సంజూ వైపే మొగ్గుచూపాడు. అతడిని ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. -
విరాట్ కోహ్లికి గాయం!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) గాయపడినట్లు సమాచారం. మెడ నొప్పితో అతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపశమనం కోసం కోహ్లి ఇంజక్షన్ కూడా తీసుకున్నాడని.. ప్రస్తుతం అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలంకాగా కోహ్లి ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆడిన ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. అయితే, కంగారూ గడ్డపై తనకున్న ఘనమైన రికార్డును ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈసారి కొనసాగించలేకపోయాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా అన్నింట్లోనూ విఫలమయ్యాడు.రంజీలు ఆడతాడనుకుంటేఅంతేకాదు.. ఒకే రీతిలో అవుట్ కావడం కూడా కోహ్లి ఆట తీరుపై విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడు కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున రంజీ(Ranji Trophy) సెకండ్ లెగ్‌లో ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ స్టార్ బ్యాటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ ఇటీవలే తెలిపాడు.అంతేకాదు.. దేశీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ముంబై క్రికెటర్లను చూసి కోహ్లి నేర్చుకోవాలని విమర్శలు గుప్పించాడు. ఇక జనవరి 23 నుంచి ఆరంభం కాబోయే రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లి పేరును డీడీసీఏ చేర్చింది. ఈ నేపథ్యంలో అతడు గాయపడినట్లు తాజాగా వార్తలు రావడం గమనార్హం.ఇంజక్షన్ కూడా తీసుకున్నాడుఈ విషయం గురించి డీడీసీఏ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి మెడనొప్పితో బాధపడుతున్నాడు. ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు. తొలి రెండు రంజీలకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. సెలక్టర్లు మాత్రమే ఈ విషయం గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ వద్దన్న పంత్ఇక మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం రంజీలు ఆడేందుకు సిద్ధమయ్యాడు. తొలుత అతడే ఢిల్లీ సారథిగా వ్యవహరిస్తాడని వార్తలు రాగా.. పంత్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయుష్ బదోని కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌరాష్ట్ర, రైల్వేస్‌తో మ్యాచ్‌లకు డీడీసీఏ శుక్రవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం.కాగా విరాట్ కోహ్లి 2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య ఘజియాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 14, 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాటి మ్యాచ్‌లో యూపీ చేతిలో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. రిషభ్ పంత్ 2017-18లో ఆఖరిగా ఢిల్లీ తరఫున రంజీ బరిలో దిగాడు. విదర్భతో నాటి ఫైనల్లో 21, 32 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్ పంత్!.. కోహ్లి ఆడుతున్నాడా?
దేశవాళీ క్రికెట్లో విరాట్ కోహ్లి ఆడతాడా? లేదా? ఢిల్లీ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడా? అన్న ప్రశ్నలకు తెరదించేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సిద్దమైంది. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23న మొదలుకానున్న మ్యాచ్‌కు శుక్రవారం తమ జట్టును ప్రకటించనుంది.కోహ్లి, పంత్‌లపై విమర్శలుకాగా రంజీ ట్రోఫీ తాజా సీజన్ కోసం డీడీసీఏ గతంలోనే 41 మందితో కూడి ప్రాబబుల్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి. అయితే, జాతీయ జట్టు విధుల దృష్ట్యా కోహ్లి, పంత్ ఢిల్లీ తరఫున ఆడలేకపోయారు. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి(Virat Kohli), పంత్ విఫలమైన తీరు విమర్శలకు దారి తీసింది.ముఖ్యంగా ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్ల షాట్ సెలక్షన్, వికెట్ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్ రంజీ బరిలో దిగి.. తిరిగి మునుపటి లయను అందుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలో రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు రిషభ్ పంత్ అందుబాటులోకి రాగా.. కోహ్లి మాత్రం ఇంత వరకు తన నిర్ణయం చెప్పలేదు.ఈ విషయాన్ని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్వయంగా వెల్లడించాడు. పంత్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని.. అయితే, కోహ్లి మాత్రం ఈ విషయంపై మౌనం వీడటం లేదని విమర్శించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా రిషభ్ పంత్అంతేకాదు.. ముంబై తరఫున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బరిలోకి దిగనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ముంబై క్రికెటర్లును చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ జట్టును ప్రకటించేందుకు డీడీసీఏ సిద్ధమైంది. ఈ విషయం గురించి డీడీసీఏ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మధ్యాహ్నం సెలక్షన్ మీటింగ్ జరుగుతుంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది’’ అని తెలిపారు. అయితే, కోహ్లి గురించి మాత్రం తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. హర్షిత్ రాణా మాత్రం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రంజీలకు అందుబాటులో ఉండడని తెలిపారు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్- ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్ రాణా (అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధూ, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), పార్థీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్. -
విరాట్ కోహ్లిపై డీడీసీఏ ఆగ్రహం!.. వాళ్లను చూసి నేర్చుకో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీరును ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ విమర్శించాడు. దేశవాళీ క్రికెట్ ఆడే విషయంలో.. ముంబై ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోహ్లికి సూచించాడు. అదే విధంగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెప్పిన తర్వాత కూడా రంజీల్లో ఆడే విషయమై అతడు ఇంకా మౌనం వహించడం సరికాదని అశోక్ శర్మ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో శతకం బాదడం మినహా మిగతా వేదికల్లో తేలిపోయాడు.బీసీసీఐ చెప్పింది.. మౌనం వీడని కోహ్లిఅంతేకాదు.. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. కోహ్లి దాదాపు ప్రతిసారీ ఒకే రీతిలో అవుటయ్యాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురిసింది. మునుపటి లయను అందుకునేందుకు కోహ్లి ఇకనైనా రంజీల్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు.ఇక బీసీసీఐ సైతం.. జాతీయ జట్టు విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లంతా దేశీ క్రికెట్ ఆడాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి ఇంత వరకు తాను రంజీ మ్యాచ్‌లో పాల్గొనే విషయమై డీడీసీఏకే సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలాఈ పరిణామాల నేపథ్యంలో డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్పందించాడు. ‘‘సౌరాష్ట్రతో జనవరి 23 నుంచి రాజ్‌కోట్ మొదలయ్యే రంజీ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు తరఫున అందుబాటులో ఉంటానని రిషభ్ పంత్ చెప్పాడు. ఇక ప్రాబబుల్స్ జట్టులో విరాట్ కోహ్లి కూడా పేరు ఉంది. కానీ అతడి నుంచి ఎటువంటి సమాచారం లేదు. దేశవాళీ క్రికెట్‌కు ముంబై క్రికెటర్లు ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ల నుంచి కోహ్లి స్ఫూర్తి పొందాలి. ఎప్పుడు వీలు దొరికినా దేశీ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేందుకు ముంబై క్రికెటర్లు అందుబాటులో ఉంటారు. వాళ్లలో ఇలాంటి గొప్ప సంస్కృతిని చూసి కోహ్లి నేర్చుకోవాలి.దురదృష్టవశాత్తూ ఉత్తరాదిన.. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం ఆటగాళ్లలో ఇలాంటి చొరవ కనిపించడం లేదు. అయినా.. బీసీసీఐ కూడా ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని చెప్పింది. అయినప్పటికీ విరాట్ మాత్రం స్పందించడం లేదు. ఢిల్లీ తరఫున అతడు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడితే బాగుంటుంది’’ అని అశోక్ శర్మ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.రోహన్ జైట్లీ స్పందన ఇదీఅయితే, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ మాత్రం అశోక్ శర్మ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు. ఫిట్నెస్, పనిభారం దృష్ట్యా కొంత మంది క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి ఢిల్లీ తరఫున బరిలోకి దిగితే బాగుంటుంది. అతడు ఢిల్లీకి ఆడాలి కూడా!.. కానీ.. చాలా మంది ఫిట్నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. ఒక క్రికెటర్ దేశీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండటం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల ప్రాధాన్యం ఆధారంగానే ఆటగాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు’’ అని రోహన్ జైట్లీ వ్యాఖ్యానించాడు. చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం? -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
‘బుమ్రాను కెప్టెన్ చేయొద్దు.. కేఎల్ రాహుల్ బెటర్ ఆప్షన్’
టెస్టుల్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు?... ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన, రోహిత్ శర్మ(Rohit Sharma) వైఫల్యం నేపథ్యంలో ఈ ప్రశ్న తెర మీదకు వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఓటమిభారంతో ఇంటిబాట పట్టింది.దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను భారత జట్టు ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తనంతట తానుగా తప్పుకొన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు భారంగా మారడం ఇష్టం లేక తుదిజట్టు నుంచి స్వయంగా వైదొలిగాడు. నాయకుడిగా బుమ్రా సఫలం!ఈ రెండు సందర్భాల్లోనూ పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెర్త్‌లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఐదో టెస్టులో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. అయితే, సిరీస్ ఆసాంతం జట్టు భారాన్ని తన భుజాలపై మోసిన బుమ్రా.. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.గాయం వల్ల జట్టుకు దూరమయ్యే పరిస్థితిఫలితంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డేలతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా బుమ్రా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ గురించి ప్రచారం ఊపందుకుంది. అతడి వారసుడిగా బుమ్రా పగ్గాలు చేపడతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వవద్దుఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. బుమ్రాను టెస్టు కెప్టెన్ చేయవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అతడు విజ్ఞప్తి చేశాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా సమీప భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టబోతున్నాడా? రోహిత్ శర్మ వారసుడిగా అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.ఎందుకంటే.. జట్టు భారం మొత్తాన్ని మోస్తూ.. టీమ్ కోసం ప్రాణం పెట్టి మరీ పోరాడగల ఏకైక బౌలర్ అతడే. మిగతా పేసర్ల నుంచి అతడికి పెద్దగా సహాయం అందడం లేదు. కాబట్టి బుమ్రాపైనే అధిక భారం పడుతోంది. అందుకే అతడు గాయపడుతున్నాడు.పంత్ లేదంటే రాహుల్ బెటర్అందుకు తోడు కెప్టెన్సీ భారం పడితే ఇంకా కష్టం. కాబట్టి బుమ్రాను అస్సలు కెప్టెన్‌గా నియమించవద్దు. అతడికి బదులు బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేస్తే బాగుంటుంది. రిషభ్ పంత్ లేదంటే.. కేఎల్ రాహుల్‌ను టెస్టులకు కెప్టెన్ చేయాలి. వాళ్లిద్దరికీ ఐపీఎల్లో సారథులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అనిపించుకుంటుంది’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.అలా చేస్తే తిప్పలు తప్పవు‘‘బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అతడు ఫిట్‌గా ఉండి.. వికెట్లు తీయడంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అంతేకానీ.. నాయకత్వ భారం కూడా మోపితే గాయాల బెడద వేధించడం ఖాయం. తన అద్భుతమైన కెరీర్‌కు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి.. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకండి’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
టాప్-10లోకి రిషబ్ పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. పంత్ 12వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌లో పంత్ మెరుపు అర్ద శతకం బాదాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. బ్యాటర్ల టాప్-10లో పంత్ ఒక్కడే వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉన్నాడు. భారత్ నుంచి పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్ టాప్-10లో ఉన్నాడు. జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరాడు. జింబాబ్వే ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ 10 స్థానాలు మెరుగపర్చుకుని 37వ స్థానానికి చేరగా.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ప్లేస్‌కు చేరాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఏకంగా 48 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 54వ స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా టాప్-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. జడ్డూ తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 42 స్థానాలు మెరుగుపర్చుకుని 93వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
Ind vs Eng: తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్‌పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్‌ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్‌తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథి?
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్‌కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికికాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.రోహిత్‌పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథిఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.రేసులో ముందుంది అతడేశ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.వరుస వైఫల్యాలతో సతమతంకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్‌లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు. చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ఎప్పుడూ కొత్త సవాళ్లను విసురుతుంది. అదీ ఆస్ట్రేలియా గడ్డ పై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో పోటీ ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. భారత్ ఆటగాళ్ల క్రీడా జీవితానికి ఇది ఎప్పుడూ కఠిన పరీక్ష గా నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఈ సిరీస్ కి సన్నద్ధమయ్యే తీరు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ గడ్డ పై జరిగే టెస్ట్ సిరీస్ కి అత్యున్నత స్థాయిలో సిద్దమౌవుతారు. అదే స్థాయిలో పోటీ పడతారు. అందుకు భిన్నంగా భారత్ ఆటగాళ్లు ఈ సిరీస్ కి ముందు చాల పేలవంగా ఆడి సొంత గడ్డ పై న్యూజిలాండ్ చేతిలో వరసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసారు.అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో జట్టుకి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో భారత్ ని గెలిపించాడు. అయితే తొలి టెస్ట్ కి వ్యకిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో పునరాగమనం భారత జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఇందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్. రోహిత్ శర్మ కి జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే స్థాయిలో ఘోరంగా విఫలవడంతో ప్రస్తుత వారి టెస్ట్ క్రికెట్ జీవితం కొనసాగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాధ్యతారహితమైన షాట్ ల పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ లో చివరి రోజున కొట్టిన దారుణమైన షాట్. టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్న సమయంలో రిషబ్ (104 బంతుల్లో ౩౦ పరుగులు) ఒక చెత్త షాట్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు కొత్త ఉత్సాహాన్ని అందించాడు. దీంతో భారత్ వికెట్లు వడి వడి గా పడిపోవడంతో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషబ్ పంత్ కొట్టిన షాట్ ఆటలో భాగంగా జరిగిందనీ చెబుతూ అతన్ని హెచ్చరించాడు. పంత్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన షాట్ లు కొట్టేందుకు ప్రయత్నించాలి, అని రోహిత్ వ్యాఖ్యానించాడు. "పంత్ జట్టు అవసరాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అతని హై-రిస్క్ పద్ధతులు గతంలో జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందించాయని అంగీకరించాడు. అయితే పంత్ అవుటైన తీరును బాధాకరం అంటూనే అతను జట్టు అవసరాలకి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. "రిషబ్ పంత్ స్పష్టంగా జట్టు కి తన నుంచి ఎలాంటి అవసరమో ఉందో అర్థం చేసుకోవాలి," అని రోహిత్ వ్యాఖ్యానించాడు.అయితే పంత్ ని భారత్ మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సమర్ధించాడు. "పంత్ తన ఆటతీరును మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను సహజంగానే అద్భుతమైన ఆటగాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో జట్టుని చాల సార్లు గెలిపించాడు. కానీ అప్పుడప్పుడు అనుచిత షాట్లతో జట్టుని నిరాశపరుస్తాడు," అని దోషి వ్యాహ్యానించాడు. మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు రిషబ్ పంత్, హైదరాబాద్ మీడియం పేసర్ మహ్మద్ సిరాజ్ లు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జట్టులో పంత్ స్థానానికి ప్రస్తుతం ఢోకా లేకపోవచ్చు కానీ అతని బ్యాటింగ్ తీరు పై నిఘా నేత్రం ఉంటుందనేది స్పష్టం. -
ఆ మాత్రం తెలియదా?.. అతడికి నేనేం చెప్పగలను: రోహిత్ శర్మ
భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంది. ఆసీస్‌తో ఇప్పటి వరకు పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ వేదికలుగా జరిగిన నాలుగు టెస్టుల్లోనూ పంత్ బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఒక్క హాఫ్ సెంచరీ లేదుఈ నాలుగు టెస్టుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ చేసిన స్కోర్లు వరుసగా.. 37, 1, 21, 28, 9, 28, 30. ముఖ్యంగా మెల్బోర్న్లో సోమవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో పంత్ కాసేపు పోరాడి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది. కానీ.. వైఫల్యాల నుంచి తాను గుణపాఠాలు నేర్చుకోనని అతడు మరోసారి నిరూపించాడు.పరిస్థితులకు తగినట్లుగా ఆడకుండా తనకు నచ్చిన షాట్లనే ఆడతానని పంత్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191/5తో కష్టాల్లో ఉన్న సమయంలో స్కూప్ షాట్ ఆడబోయి డీప్ థర్డ్‌మాన్ వద్ద పంత్ క్యాచ్ ఇచ్చాడు.స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్.. రిషభ్ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్’ అంటూ అతడికి టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లే అర్హతే లేదంటూ ఘాటుగా విమర్శించాడు.నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యంగతంలో ఇవే షాట్లు తనకు పరుగులు అందించినా... ఇది సమయం కాదని సన్నీ విమర్శించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ అదే పని చేయడం గమనార్హం. జైస్వాల్‌తో 88 పరుగుల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఓటమి నుంచి తప్పించుకునే స్థితిలో ఉన్న దశలో.. పంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ పుల్ షాట్ ఆడి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతే భారత్ ఓటమికి బాటలు పడి.. 184 పరుగుల భారీ తేడాతో పరాజయం ఎదురైంది.అతడికి నేనేం చెప్పగలనుఈ నేపథ్యంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మెల్బోర్న్ టెస్టులో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు.. పంత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘తనకేం ఏం కావాలో పంత్ అర్థం చేసుకోగలగాలి.అతడికి మేము చెప్పడం కంటే.. తనకు తానుగా తన తప్పేమిటో తెలుసుకుంటే బాగుంటుంది. అలా అయితే, సరైన దారిలో నడిచేందుకు వీలు ఉంటుంది. గతంలో ఇలాంటి షాట్లతో అతడు ఎన్నోసార్లు విజయాలు అందించాడు.కాబట్టి కెప్టెన్‌గా తన పట్ల నా స్పందన మిశ్రమంగానే ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రయోగాలు విఫలమవుతాయి. అలాంటి సమయంలో ఇలాంటి విమర్శలు వస్తాయి. అయితే, కెప్టెన్‌గా ఈ విషయంలో నేను అతడికి చెప్పాల్సింది ఏమీలేదు.ఆ మాత్రం తెలిసి ఉండాలి కదా!ఎలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకువచ్చో ఆటగాడికి తెలిసి ఉండాలి. మన చర్యల వల్ల ప్రత్యర్థికి అవకాశం దొరుకుతుందని భావిస్తే ఆచితూచి ఆడటమే ఉత్తమం. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని ముందుకు సాగాలి. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో పంత్‌కు తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరుగనుంది.చదవండి: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. సరికొత్త చరిత్ర.. కానీ -
నేను బాగానే ఉన్నా.. వాళ్లు పుంజుకుంటారు: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.నేను బాగానే ఉన్నానుఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్‌లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్‌మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.అతడిపై ఒత్తిడి లేదుఅదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.వాళ్లు తిరిగి పుంజుకుంటారుఅంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేశాడు. మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
బుమ్రా కాదు.. అతడే బెస్ట్ ఫాస్ట్ బౌలర్: పాక్ క్రికెటర్
ఆధునికతరం ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్న ఈ రైటార్మ్ పేసర్ భారత్‌కు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించాడు. తనదైన బౌలింగ్ శైలితో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా మాజీ క్రికెటర్ల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు.అయితే, పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మాత్రం బుమ్రా గురించి భిన్నంగా స్పందించాడు. ఈ తరం బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడన్న షెహజాద్.. తన దృష్టిలో మాత్రం పాక్ లెజెండ్ వసీం అక్రం మాత్రమే అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్ అని పేర్కొన్నాడు.నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అహ్మద్ షెహజాద్‌ను హోస్ట్ బెటర్ పేసర్‌ను ఎంచుకోవాలంటూ.. వసీం అక్రం, వకార్ యూనిస్, షేన్ బాండ్, జస్ప్రీత్ బుమ్రా, షాన్ టైట్, మిచెల్ స్టార్క్ పేర్లను చెప్పాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇది చాలా సులువైన ప్రశ్న. మీరు చెప్పినవాళ్లలో అందరి కంటే బెస్ట్ పేసర్ వసీం అక్రం’’ అని షెహజాద్ పేర్కొన్నాడు.ఇక బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. అతడొక వరల్డ్ క్లాస్ బౌలర్. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్నవాడు’’ అని షెహజాద్ భారత పేసర్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరన్న ప్రశ్నకు బదలిస్తూ.. ‘‘రషీద్ లతీఫ్.. రిషభ్ పంత్ కంటే బెటర్ కీపర్’’ అని షెహజాద్ చెప్పుకొచ్చాడు. కాగా బుమ్రా, రిషభ్ పంత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో కంగారూల చేతిలో ఓడింది. మూడో టెస్టు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 26న మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలుకానుంది.పంత్ అద్భుత ప్రదర్శనఆసీస్తో మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తం 9 క్యాచ్‌లు పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టుకున్న పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంత్ బ్యాట్‌తో సత్తా చాటలేకపోయిన వికెట్ల వెనుక చురుగ్గా కదిలాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోగా.. పంత్ ఐదుగురిని పెవిలియన్‌కు పంపడంలో భాగమయ్యాడు. పంత్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఐదు క్యాచ్‌లు పట్టాడు. పంత్ తన 41 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 143 క్యాచ్‌లు, ఓ రనౌట్, 15 స్టంపింగ్‌లు చేశాడు. -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.అమాంతం ఏడు కోట్లు పెంచిఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.అతడే గనుక బతికి ఉంటేఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.కాగా న్యూ సౌత్ వేల్స్లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ.. -
అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఎవరనగానే ఠక్కున.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు చెప్పేస్తారు క్రికెట్ ప్రేమికులు. ఇక అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నది ఎవరంటే.. మరో ఇద్దరు భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్. మరి ఈ ముగ్గురికి సాధ్యంకాని రీతిలో ఓ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడు మరొకడు ఉన్నాడు.క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక హైక్ పొందిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 5500 శాతం హైక్‌తో కోట్లు కొలగొట్టాడు. ఇంతకీ అతడు ఎవరా అంటారా?!.... టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. అవును.. ఐపీఎల్లో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో జితేశ్ ఏకంగా ఈసారి వేలంలో తన పాత ధర కంటే.. 5500 శాతం ఎక్కువ మొత్తం పలికాడు.21 నిమిషాల వ్యవధిలోనే సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండురోజుల పాటు జరిగిన వేలంలో.. మొదటిరోజే రికార్డులు బ్రేకైన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.అయితే, 21 నిమిషాల వ్యవధిలోనే అతడి రికార్డును రిషభ్ పంత్ బద్దలుకొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. జట్టును చాంపియన్‌గా నిలిపిన అతడు కేకేఆర్ నుంచి 2022 వేలంలో రూ. 12.25 కోట్లు అందుకున్నాడు. అంతే మొత్తానికి ఈసారీ ఆడాడు.అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!అయితే, ఈసారి వేలంలో రూ. 26.75 కోట్లు దక్కించుకోవడంతో అయ్యర్‌కు 200 శాతం మేర హైక్ లభించినట్లయింది. మరోవైపు అర్ష్‌దీప్ గతంలో రూ. 4 కోట్లే అందుకున్నాడు. ఈసారి ఏకంగా రూ. 18 కోట్లు దక్కించుకున్నాడు. అంటే అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!ఇక రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా గతంలో రూ. 16 కోట్లు అందుకోగా.. ఈసారి 11 కోట్ల మేర హైక్ పొందాడు. మరోవైపు.. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా భారీ జంప్ కొట్టాడు. చివరగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ పాత ధర రూ. 6జ5 కోట్లు.. ఈసారి పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్మరి జితేశ్ శర్మ ధర సంగతి ఏమిటంటారా?!.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ విదర్భ ఆటగాడిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుక్కుంది. 2024 వరకు అదే ధరకు అతడిని కొనసాగించింది. అయితే, ఈసారి వేలంలో జితేశ్‌కు డిమాండ్ రాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 11 కోట్లకు సొంతం చేసుకుంది. అలా 20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్ కొట్టాడు.నిజానికి 2024 ఎడిషన్‌లో జితేశ్ పెద్దగా రాణించలేదు. 131 స్ట్రైక్‌రేటుతో కేవలం 187 పరుగులే చేశాడు. అయినప్పటికీ భారీ ధర పలకడానికి కారణం అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు. అంతేకాదు పొట్టిఫార్మాట్లో లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గానూ జితేశ్‌కు మంచి రికార్డు ఉంది. ఇక దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కూడా ఉండటంతో జితేశ్ పంట ఇలా పండింది. చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా? -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్‌కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్‌కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
క్రికెటర్ రిషబ్ పంత్ వెయిట్ లాస్ సీక్రెట్: ఆ టిప్స్‌తో ఏకంగా 16 కిలోలు..
ఢిల్లీ ఫ్రాంఛైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలకనున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు. రిషబ్ పంత్‌కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత కూడా అందే దూకుడుతో మైదానంలో విధ్వసం సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌గా పంత్ నిలిచారు. అలాంటి అద్భుత ఆటగాడి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా..!ఈ భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు సిద్ధమవుతున్న సమయంలో కేవలం నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గాడు. ఇంతలా బరువుని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ఫాలో అయ్యే సింపుల్ డైట్ టిప్స్ ఏంటో చూద్దామా..!.కేలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల అతని శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఇంట్లో వండిన బోజనానికే ప్రాధాన్యత. బయట ఫుడ్ జోలికి వెళ్లడు. ముఖ్యంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఫుడ్స్ వైపుకి వెళ్లడు. దీనివల్ల ఇంట్లో వండే పద్ధతుల రీత్యా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవడమే గాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఆయిల్ పరిమితంగా ఉన్న ఆహారమే ఎంపిక చేసుకుంటాడు పంత్అలాగే రాస్మలై వంటి స్వీట్లు, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ వంటి అధిక క్యాలరీల ఆహారానికి పూర్తిగా దూరం. బరువు అదుపులో ఉండేలా వేయించిన పదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలను తీసుకోరట పంత్. తగిన సమయానికి నిద్ర పోవడం కూడా తన బరువుని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోందిగోవాన్ భిండి(ఓక్రా) పట్ల తనకున్న మక్కువ, మసాల దినుసుల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా పంత్‌లా ఆగ్యకరమైన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తే బరువు తగ్గడం అత్యంత ఈజీ. అందుకు కాస్త శ్రద్ధ, నిబద్ధత అవసరం అంతే..!.(చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?) -
IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్
‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా ప్రయాణం ఒక అద్భుతం. మైదానంలో ఎన్నెన్నో ఉత్కంఠభరిత క్షణాలు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఓ టీనేజర్‌గా ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఈ తొమ్మిదేళ్లలో నేనూ ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేనిది ఎన్నడూ ఊహించలేదు.నా ప్రయాణం ఇంత ప్రత్యేకంగా మారడానికి ప్రధాన కారణం అభిమానులు. నన్ను అక్కున చేర్చుకున్నారు. నా జీవితంలోని కఠిన సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను.అయితే, నాపై మీకున్న ప్రేమాభిమానాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నా ఆటతో మీకు వినోదం అందిస్తాను. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు.. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు.. ఏదేమైనా వీడ్కోలు చెప్పడం అంత సులువేమీ కాదు’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.వీడలేక వీడిపోతున్నట్లు..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేక వీడిపోతున్నట్లు తన మనసులో ఉన్న మాటలను లేఖ రూపంలో వెల్లడించాడు. కాగా ఐపీఎల్- 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ పంత్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి ఆసక్తి చూపింది.అయితే, పంత్ ధర రూ. 20 కోట్లకు చేరుకున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవాలని చూసింది. కానీ లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. అమాంతం ఏడు కోట్లు పెంచి మొత్తంగా రూ. 27 కోట్లకు రిషబ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు.ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధంకాగా పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2016లో ఢిల్లీ జట్టుతో తన ఐపీఎల్ జర్నీ ఆరంభించిన పంత్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2017లో 366 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 2018లో మాత్రం దుమ్ములేపాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 684 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు ఫిప్టీలు ఉండటం విశేషం.ఇక 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనూ అభిమానులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి అండగా ఉంది. అయితే, వేలానికి ముందు అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో పంత్ బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి పంత్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా జట్టును ఆరో స్థానంలో నిలపగలిగాడు.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి! -
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.రాహుల్‌పై గోయెంకా ఆగ్రహంసీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలనిఅందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్‌కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్, పంత్ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నీ బాగానే ఉంటాయి.. కానీరాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్న (నవంబర్ 24) సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలం తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. తొలి రోజు వేలంలో నాలుగు ఆర్టీఎమ్ కార్డులు (రచిన్ రవీంద్ర (సీఎస్కే), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ), నమన్ ధిర్ (ముంబై), అర్షదీప్ సింగ్ (పంజాబ్)) వాడుకోబడ్డాయి. నిన్న వేలంలో అన్ని ఫ్రాంచైజీలచే మొత్తం రూ. 467.85 కోట్లు ఖర్చు చేయబడింది. నిన్నటి వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ వారీగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు..సీఎస్కే:నూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)సయ్యద్ ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (9 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్ (6.25 కోట్లు)అషుతోష్ శర్మ (3.80 కోట్లు)మోహిత్ శర్మ (2.20 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)గుజరాత్ టైటాన్స్: జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.50 కోట్లు)మహిపాల్ లోమ్రార్ (1.70 కోట్లు)మనవ్ సుతార్ (30 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)అనుజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సంధు (30 లక్షలు)కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్:ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4.2 కోట్లు)విజయ్‌కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్‌ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)రాజస్థాన్ రాయల్స్: జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీ:జోష్ హాజిల్‌వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)లియామ్ లివింగ్‌స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)సన్‌రైజర్స్ హైదరాబాద్:ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్‌జీత్ సింగ్ (1.50 కోట్లు)అథర్వ తైడే (30 లక్షలు) -
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసమే ఏ జట్టయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వెర్రిగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు రూ.27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో రూ.26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా... నాలుగు సీజన్లలో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతి పెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు రూ.10 కోట్లకంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం. అనూహ్యాలకు వేదికగా నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే తమ రివాజును కొనసాగించింది. అర్ష్ దీప్ సింగ్, బట్లర్, కేఎల్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టొయినిస్, షమీవంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా... చహల్, జేక్ ఫ్రేజర్, ఆర్చర్, జితేశ్ శర్మ, రబాడ, నూర్, అవేశ్ ఖాన్లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది. డికాక్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్‌ను తొలిరోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరం! జిద్దా: ఐపీఎల్–2025 వేలం ఊహించిన విధంగానే కోట్లాది రూపాయల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అత్యధిక ధరతో అందరికంటే టాపర్‌గా నిలిచాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ (కోల్‌కతా; రూ.24 కోట్ల 75 లక్షలు) నెలకొల్పిన అత్యధిక మొత్తం రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. 2024లో కెపె్టన్‌గా కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ (రూ.26 కోట్ల 75 లక్షలు) కాస్త తేడాతో రెండో స్థానంలో నిలవగా... వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించి కోల్‌కతా వెనక్కి తీసుకుంది. భారత ఆటగాళ్లలో అర్ష్ దీప్ సింగ్ తన ప్రస్తుతం టీమ్ పంజాబ్ కింగ్స్‌కే వెళ్లగా... చహల్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాన్ కిషన్ కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ ఎంచుకోగా... కెరీర్ చివర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ‘హోం’ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడం విశేషం. సోమవారం కూడా వేలం సాగనుంది. మొత్తం 577 మంది నుంచి మిగిలిన ఆటగాళ్లతో పాటు ఆదివారం అమ్ముడుపోని ఆటగాళ్లు కూడా రెండో రోజు మళ్లీ వేలంలోకి వస్తారు. పంత్ కోసం పోటీపడ్డారిలా...తొలి రోజు ఆరో ఆటగాడిగా రూ. 2 కోట్ల కనీస విలువతో పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుగా తమ ఆసక్తిని చూపించింది. వెంటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ దశలో ఆర్సీబీ వెనక్కి తగ్గగా... సన్‌రైజర్స్ పోటీకి సిద్ధమైంది. అలా ఇరు జట్ల మధ్య సాగిన సమరం పంత్ విలువను రూ.20 కోట్ల 75 లక్షల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో పంత్ పాత జట్టు ఢిల్లీ అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే లక్నో ఏకంగా రూ.27 కోట్ల మొత్తానికి ప్యాడిల్ ఎత్తడంతో పంత్ విలువ శిఖరానికి వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ ముందుగా... పంత్‌కంటే ముందు రికార్డు ధరతో శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. 2024 ఐపీఎల్లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా అతని పేరు వచ్చింది. గతంలో ఢిల్లీ టీమ్‌లో శ్రేయస్ ఆడినప్పుడు కోచ్‌గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరఫున ముందుగా అతనిపై ఆసక్తిని ప్రదర్శించాడు. ఆపై కోల్‌కతా, ఢిల్లీ మధ్య పోటీ సాగగా... రూ.25 కోట్ల వద్ద ఢిల్లీ సొంతమైనట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకొచి్చన పంజాబ్ కింగ్స్ చివరకు బిడ్‌ను ఖాయం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ కోసం హోరాహోరీ... ఐపీఎల్లో 2021–24 మధ్య నాలుగు సీజన్ల పాటు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫునే ఆడిన వెంకటేశ్ అయ్యర్ 49 ఇన్నింగ్స్‌లలో 137.12 స్ట్రయిక్‌రేట్‌తో 1326 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడప్పుడు కొన్ని చెప్పుకో దగ్గ ప్రదర్శనలు ఉన్నా... ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగల విధ్వంసకర ఆటగాడైతే కాదు. కానీ అతని కోసం వేలం అసాధారణ రీతిలో సాగింది. కోల్‌కతా టీమ్ ముందుగా వేలం మొదలు పెట్టింది. లక్నో ముందు ఆసక్తి చూపించినా...ఆ తర్వాత ప్రధానంగా కోల్‌కతా, ఆర్సీబీ మధ్యే పోటీ సాగింది. ఇరు జట్లు కలిసి రూ. 20 కోట్లు దాటించాయి. కోల్‌కతా రూ. 23 కోట్ల 75 లక్షలకు చేర్చిన తర్వాత బెంగళూరు స్పందించలేదు. డేవిడ్ వార్నర్‌కు నిరాశ!పట్టించుకోని ఫ్రాంచైజీలుఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు, 184 మ్యాచ్‌లలో 6565 పరుగులతో అత్యధిక స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానం, ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన రికార్డుతో పాటు కెపె్టన్‌గా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన ఘనత! ఇలాంటి ఘనాపాటి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... అతనేమీ ఆటకు దూరమై చాలా కాలం కాలేదు. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఆడి చురుగ్గా ఉన్న వార్నర్‌లో ఇప్పటికీ ఈ ఫార్మాట్లో చెలరేగిపోగల సత్తా ఉంది.వేలంలో కొందరు అనామక ఆటగాళ్ల కోసం సాగిన పోటీ చూస్తే వార్నర్ కనీస విలువ రూ.2 కోట్లకు కూడా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అనూహ్యం. గత సీజన్లో పూర్తిగా విఫలం కావడం వేలంపై ప్రభావం చూపించి ఉండవచ్చు. తొలి రోజు 12 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తిరస్కరించగా అందులో వార్నర్, బెయిర్‌స్టో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆటగాళ్లు కాగా... ప్రస్తుతం భారత టెస్టు టీమ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌పై పెద్దగా అంచనాలు లేవు. మిగిలిన 9 మందిలో పీయూష్ చావ్లా తప్ప ఇతర ఆటగాళ్లు అనామకులే. అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాచెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశ్విన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) గుజరాత్ టైటాన్స్ బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) మర్కండే (రూ. 30 లక్షలు) లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) ఆర్యన్ జుయాల్ (రూ.30 లక్షలు) ముంబై ఇండియన్స్ ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) వైశాక్ విజయ్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) రాజస్తాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) కార్తికేయ (రూ.30 లక్షలు) బెంగళూరు హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) మనోహర్ (రూ.3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జిత్ సింగ్ (రూ.1.50 కోట్లు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) టాప్–20 (రూ.10 కోట్లు, అంతకుమించి) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) శ్రేయస్ (రూ.26.75 కోట్లు) వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా... ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం రూ.467.95 కోట్లను జట్లు వెచ్చించాయి. -
Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం హోరాహోరీగా తలపడి వేలం మొదలైన కాసేపటికే ధరను రూ. 10 కోట్లకు పెంచాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చిఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి.. రూ. 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్అయితే, రూ. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. మొత్తంగా రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.పడిలేచిన కెరటంకాగా 2022 చివర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలపాలైనా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడున్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదిలేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో పంత్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 3284 పరుగులు సాధించాడు.ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు👉రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్- 2025)- రూ. 27 కోట్లు(వికెట్ కీపర్ బ్యాటర్- టీమిండియా)👉శ్రేయస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్- 2025)- రూ. 26.75 కోట్లు(బ్యాటర్- టీమిండియా)👉మిచెల్ స్టార్క్(కోల్‌కతా నైట్ రైడర్స్- 2024)- రూ. 24.75 కోట్లు(పేస్ బౌలర్)👉ప్యాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 2024)- రూ. 20.5 కోట్లు(పేస్ బౌలర్- ఆస్ట్రేలియా)👉సామ్ కర్రాన్(పంజాబ్ కింగ్స్- 2023)- రూ. 18.50 కోట్లు(ఆల్‌రౌండర్- ఇంగ్లండ్).చదవండి: IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
శ్రేయస్ అయ్యర్‌పై కనకవర్షం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి! కానీ..
మెగా వేలం-2025లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు రేసులో మున్ముందుకు దూసుకుపోయాయి.నువ్వా- నేనా అన్నట్లు ఢిల్లీ, పంజాబ్ తలపడటంతో శ్రేయస్ అయ్యర్ ధర రూ. 20 కోట్లు దాటింది. దీంతో కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోగా.. సరైన కెప్టెన్లు లేని కారణంగా ఢిల్లీ, పంజాబ్ మాత్రం అయ్యర్ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి. ఆఖరికి ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్ తమ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు మొదటి ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన మరో టీమిండియా స్టార్, పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పంజాబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.కెప్టెన్ కోసం..ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ సొంతం. అయినప్పటికీ కోల్‌కతా రిటెన్షన్‌కు ముందు అతడిని వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి హాట్‌కేకు అవుతాడని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్లుగానే అయ్యర్ భారీ ధర పలకడం విశేషం. కాగా పంజాబ్ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అంతేకాదు వేలానికి ముందు కేవలం ఇద్దరిని రిటైన్ చేసుకుని అందరినీ విడిచిపెట్టింది.దీంతో రూ. 110.5 కోట్ల పర్సు వాల్యూతో వేలంలోకి వచ్చింది. దీంతో అయ్యర్ కోసం ఈ మేర ఖర్చు చేసింది. అయితే, పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనడంతో అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.కాగా ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి.. 3127 పరుగులు చేశాడు.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతంMissed watching that stunning Shreyas bidding process❓We have you covered here with the snippets 🎥 🔽#TATAIPLAuction | #TATAIPL | @ShreyasIyer15 | @PunjabKingsIPL | #PBKS pic.twitter.com/a7jAki8LVz— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
Rishabh Pant: ఐపీఎల్-2025 మెగా వేలం రోజే ఇలా..
పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్-2025 మెగా వేలం జరిగే రోజే.. పంత్ ఇలా విఫలం కావడంతో నెట్టింట అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. రిషభ్ పంత్(37), నితీశ్ రెడ్డి(41) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగలిగింది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. ఆసీస్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసింది.ఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. భారీ లీడ్‌తో ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జైస్వాల్ భారీ శతకం(161) సాధించగా.. రాహుల్ సూపర్ హాఫ్ సెంచరీ(77)తో మెరిశాడు.వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగా టీమిండియా పెర్త్ టెస్టులో పట్టుబిగించింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(25) కాస్త ఫర్వాలేదనిపించగా.. పంత్ మాత్రం నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు క్రీజును వీడిన పంత్.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.లియాన్ పన్నిన స్పిన్ మాయాజాలన్ని సమర్థవంతంగా ఛేదించలేక.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఆదివారం ఐపీఎల్ మెగా వేలం పాట మొదలుకానుంది. రెండురోజుల పాటు నిర్వహించే ఆక్షన్‌లో కళ్లన్నీ పంత్ మీదే ఉన్నాయి.ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ అత్యధిక ధరకు అమ్ముడుపోతాడనే అంచనాల నడుమ.. ఇలా వికెట్ పారేసుకోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇక ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తుండటంతో పెర్త్ టెస్టులో టీమిండియా నాలుగు వందలకు పైగా ఆధిక్యంతో.. మరింత పట్టుబిగించే దిశగా కొనసాగుతోంది. -
Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్‌కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్‌హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది. వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్‌లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్‌పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లపై రూ. కోట్లు కురవనున్నాయి.విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. 116 మందిపైనే వేలం వెర్రి వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం. ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్‌ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్‌రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.అర్ష్‌దీప్ అ‘ధర’హో ఖాయం అంతర్జాతీయ క్రికెట్లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్‌దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్‌దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చేందుకు పంత్‌ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్‌కే ఉన్నాయి.బట్లర్ వైపు ఆర్సీబీ చూపు పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్‌జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్‌కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా నామమాత్రపు స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక ఆటగాళ్లంతా విఫలమైన చోట.. అరంగేట్ర ఆటగాడు, ఆంధ్ర యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా నితీశ్ కుమార్‌రెడ్డి, హర్షిత్ రాణా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.ఇక పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(26) కాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ అనూహ్యంగా వివాదాస్పద రీతిలో అతడు అవుట్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన పడక్కిల్ సున్నా చుట్టగా.. విరాట్ కోహ్లి ఐదు పరుగులకే నిష్క్రమించాడు.రాణించిన రిషభ్ పంత్ ఈ క్రమంలో మిడిలార్డర్లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 78 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మూడు ఫోర్లతో పాటు తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్ సాయంతో 37 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) నిరాశపరచగా.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రెడ్డి అద్బుతంగా ఆడాడు.నితీశ్ రెడ్డి ధనాధన్టెస్టుల్లో అదీ ఆసీస్ గడ్డపై అరంగేట్రం చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 59 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. అయితే, ఆసీస్ సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నితీశ్ ఇన్నింగ్స్‌తో పాటు టీమిండియా ఇన్నింగ్స్‌కూ తెరపడింది.ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి.. 49.4వ ఓవర్ వద్ద.. కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి.. పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మిగిలిన వాళ్లలో హర్షిత్ రాణా 7, బుమ్రా 8 పరుగులు చేయగా.. మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆసీస్ పేసర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు కూల్చారు.చదవండి: చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
టచ్‌లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా సన్నాహకాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా భారత జట్టు ఇండియా-ఏ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ప్రేక్షకులు లేకుండా జరుగతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభిస్తుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ మైదానంలోని పాత పిచ్‌పై ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ పిచ్ బౌన్స్ మరియు సీమ్‌కు అనుకూలంగా ఉందని తెలుస్తుంది. పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్ ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.టచ్‌లోకి వచ్చిన విరాట్..మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఇన్నింగ్స్‌ను చక్కగా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. విరాట్ చూడచక్కని కవర్ డ్రైవ్‌లతో అలరించాడని సమాచారం. అయితే విరాట్ ఓ రాంగ్ షాట్ ఆడి 15 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నట్లు తెలుస్తుంది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ నిష్క్రమించాడట. Looks like Virat Kohli is done for the day. Was on 30 after batting for an hour. Started to get in rhythm after a shaky start.Pant was bowled by the impressive Mukesh Kumar. Second time in the day he had been bowled— Tristan Lavalette (@trislavalette) November 15, 2024తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైన విరాట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడినట్లు తెలుస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ 30 పరుగులతో అజేయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ పేసర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.పంత్ మరోసారి క్లీన్ బౌల్డ్ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైనట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడట. పంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్లీన్ బౌల్డ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సారి అతను ముకేశ్ కూమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినట్లు సమాచారం. మ్యాచ్‌కు సంబంధించిన ఈ విషయాలను ఓ జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.ఇదిలా ఉంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ముందు భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. స్వదేశంలోనే పేలవ ప్రదర్శన కనబర్చిన భారత్.. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. -
కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్!
ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆసీస్‌లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇక ఆసీస్‌తో సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఇండోర్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు(శుక్రవారం- ఆదివారం) ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA) ఇందుకు వేదిక. కేవలం పదిహేను పరుగులకేఅయితే, ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం పదిహేను పరుగులకే అతడు అవుట్ అయినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో చక్కగా ఆట మొదలుపెట్టి కవర్ డ్రైవ్‌లతో అలరించిన కోహ్లి.. తప్పుడు షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. భారత పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు.పంత్ క్లీన్బౌల్డ్మరోవైపు.. రిషభ్ పంత్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కూడా 16 పరుగులకే అవుటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు ఒకరు పెర్త్ నుంచి ఈ మేరకు సోషల్ మీడియాలో అప్డేట్స్ షేర్ చేశారు.కోహ్లికి గాయం?ఇక వార్మప్ మ్యాచ్‌లో అవుటైన వెంటనే కోహ్లి, పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌కు ముందు కోహ్లి గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్కానింగ్ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. మరోవైపు.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ సైతం గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడినట్లు సమాచారం.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో రాణించడం తప్పనిసరి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు రోహిత్ సేన అర్హత సాధిస్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవంఅయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తొలిసారిగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్‌నకు గురైంది.ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1. ఇక నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్ మొదలుకానుంది. ఇక టీమిండియా కంటే ముందు ఆసీస్‌లో అడుగుపెట్టిన ఇండియా-‘ఎ’ అనధికారిక టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ అయింది.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత -
BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
టీమిండియా క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరెన్నో అరుదైన ఘనతలతో రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు.సొంతగడ్డపై పూర్తిగా విఫలమైఅయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ఒకే అర్ధ శతకం నమోదు చేయడం అతడి ఫామ్‌లేమి నిదర్శనం.ఆసీస్ మీడియా దృష్టి మొత్తం అతడి మీదే! ఇలాంటి తరుణంలో టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు వెళ్లనుండటంతో.. అందరి దృష్టి కోహ్లిపైనే నిలిచింది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్ అంటే కంగారూ బౌలర్లకూ వణుకే! అందుకే ప్రస్తుతం కోహ్లి ఫామ్ సంగతి ఎలా ఉన్నా ఆస్ట్రేలియా మీడియాలో మాత్రం అతడే హైలైట్‌గా నిలుస్తున్నాడు.తరతరాల పోరాటంప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియా వార్త పత్రికలు కోహ్లి గణాంకాలను విశ్లేషిస్తూ.. అతడి చిత్రాలను కవర్‌పేజీలపై ప్రముఖంగా ప్రచురించడం విశేషం. అంతేకాదు.. ఆసీస్- భారత్ టెస్టు పోరును హైలైట్ చేస్తూ హిందీ, పంజాబీ భాషల్లో.. ‘‘తరతరాల పోరాటం’’ అంటూ హెడ్‌లైన్స్ ఇచ్చాయి.ఇక కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆసీస్ మీడియా అతడిని ఇలా హైలైట్ చేయడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే, ఈసారి కోహ్లితో పాటు మరో యువ క్రికెటర్ నిలువెత్తు ఫొటోను సైతం ఆసీస్ పత్రికలు ప్రచురించడం విశేషం. అతడు మరెవరో కాదు.. యశస్వి జైస్వాల్.‘నవం రాజా’గా యశస్విఅవును.. టెస్టు క్రికెట్లో అరంగేట్రం నుంచే సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్‌కు కూడా ఆస్ట్రేలియా మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. ‘నవం రాజా’(కొత్త రాజు) అంటూ యశస్వికి కితాబులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ అభిమానులు మాత్రం వీటిని చూసి చిన్నబుచ్చుకుంటున్నారు.హర్ట్ అవుతున్న పంత్ అభిమానులుఆస్ట్రేలియాలో టీమిండియా గత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలకమైన ఈ వికెట్ కీపర్‌కు మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా 2020-21 పర్యటనలో గాబా టెస్టులో అద్భుత ఇన్నింగ్స్(89 నాటౌట్)తో ఆకట్టుకున్న పంత్.. భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. జైస్వాల్ ఇప్పటి వరకు14 టెస్టులు ఆడి 1407 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?A lot of @imVkohli in the Australian papers this morning as is the norm whenever India are in town but never expected to see Hindi and Punjabi appearing in the Adelaide Advertiser. Tells you about the magnitude of the #AusvInd series for Australia & cricket in this country pic.twitter.com/I5B2ogPvEJ— Bharat Sundaresan (@beastieboy07) November 12, 2024 -
IPL 2025: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా ఐపీఎల్–2025 వేలం జరగనుండగా... ఇందులో భారత్ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు... చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, యుజువేంద్ర చహల్ కూడా ఉన్నారు. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా... ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అండర్సన్ తొలిసారి... టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ వేలానికి దూరమయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్... టి20 మ్యాచ్ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అండర్సన్ చివరిసారిగా 2014లో ఈ ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. అండర్సన్ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. గత వేలంలో అత్యధిక ధర (రూ. 24 కోట్ల 50 లక్షలు) పలికిన ప్లేయర్‌గా ఘనత సాధించిన ఆ్రస్టేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు. రూ. 75 లక్షలతో సర్ఫరాజ్ గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు... పేలవ ఫామ్‌తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా... ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్ తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇటలీ నుంచి తొలి ఎంట్రీ... ఇటలీ పేసర్ థామస్ డ్రాకా ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా డ్రాకా నిలిచాడు. ఇటలీ తరఫున ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల డ్రాకా... గ్లోబల్ టి20 కెనడా టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోరీ్నలో 11 వికెట్లు పడగొట్టిన డ్రాకా... ఆల్‌రౌండర్ల జాబితాలో ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఐఎల్ టి20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్ జట్టుకు డ్రాకా ఎంపికయ్యాడు. ఇక అండర్–19 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్లో రాణిస్తున్న నేత్రావల్కర్ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు. -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. ఆ టెక్నాలజీ మాత్రం వాడదు!
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. ముంబై.. వాంఖడే మైదానం.. రిషభ్ పంత్ ఇంకాసేపు క్రీజులో నిలబడితే చాలు.. టీమిండియా గెలవడం ఖాయం.. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడం అందరికీ షాకిచ్చింది.నిజానికి ఫీల్డ్ అంపైర్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అజాజ్ వేసిన బంతి పంత్ బ్యాట్‌ను కాకుండా ప్యాడ్లను తాకిందనే ఉద్దేశంతో.. అజాజ్ అప్పీలు చేసినా అంపైర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. పంత్ సైతం అదే ధీమాతో క్రీజులో నిలబడి చిరునవ్వులు చిందించాడు.అయితే, కివీస్ మాత్రం రివ్యూకు వెళ్లింది. అందులో బంతి బ్యాట్ అంచును తాకినట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో బ్యాట్ ప్యాడ్లను తాకిన తాకిందని పంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ బంతి బ్యాట్‌ను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయంటూ థర్డ్ అంపైర్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించాడు.కానీ పంత్ మాత్రం మైదానాన్ని వీడేందుకు ఇష్టపడక కాసేపు ఫీల్డ్ అంపైర్లతో వాదించి.. ఇక లాభం లేదనుకుని పెవిలియన్ చేరాడు. పంత్ నిష్క్రమణ తర్వాత భారత్ ఓటమి ఖారారై.. కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో పంత్ అవుటైన తీరు విస్తృతంగా చర్చకు వచ్చింది.ఈ క్రమంలోనే చాలా మంది హాట్‌స్పాట్ టెక్నాలజీ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)లో ఈ సాంకేతికతను కూడా బీసీసీఐ చేర్చుకుని ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.హాట్‌స్పాట్ టెక్నాలజీ అంటే ఏమిటి?ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్ బియాన్ హాట్‌స్పాట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రక్షణ దళాలు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ సాంకేతికతను రూపొందించారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. చీకట్లో, పొగ కమ్ముకున్న సమయంలో యుద్ధ ట్యాంకులు, విమానాల కదలికలను పసిగట్టడం కోసం దీనిని వాడతారు.క్రికెట్లో హాట్స్పాట్ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య 2006-07 నాటి యాషెస్ సిరీస్ సందర్భంగా క్రికెట్లో హాట్‌స్పాట్ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా బంతి బ్యాటర్‌కు శరీరానికి తగిలిందో లేదో పరిశీలించే వీలు కలుగుతుంది. డీఆర్ఎస్ను మరింత సరళతరంగా, కచ్చితంగా మార్చేందుకు ఈ సాంకేతికతను వాడారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, యూఏఈలలో కూడా ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని ఉపయోగించారు.ఇది ఎలా పనిచేస్తుందంటే?బౌలర్ సైడ్ రెండు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమరుస్తారు. బంతిని బ్యాటర్ శరీరాన్ని లేదంటే ప్యాడ్‌ను తాకినపుడు వెలువడ్డ ఉష్ణోగ్రత ఆధారంగా నెగటివ్ ఇమేజ్ ద్వారా ఏ పాయింట్లో బంతి తాకిందో గుర్తిస్తారు. బంతి బ్యాట్ అంచును తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.కచ్చితత్వం ఎంత?హాట్‌స్పాట్ చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి. 2011లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు ఈ టెక్నాలజీ వాడగా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కాకుండా లైఫ్ పొందిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ సాంకేతికతను తప్పుబట్టాడు. ఇక టూల్ ఇన్వెంటర్ వారెన్ బ్రెనాన్ సైతం పూత ఉండే బ్యాట్ల విషయంలో ఈ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఇండియాలో ఎందుకు వాడటం లేదు?హాట్‌స్పాట్ టెక్నాలజీ ఖరీదైనదని బీసీసీఐ, బ్రాడ్కాస్ట్ వర్గాలు అంటున్నాయి. ఒక్క కిట్ కోసం రోజుకు పది వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. ఇంతచేసినా కచ్చితమైన ఫలితాలు పొందలేమని పేర్కొంటున్నాయి. అందుకే ఈ టెక్నాలజీని ఇండియాలో వాడటం లేదని.. స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్స్ కూడా వీటి వినియోగాన్ని ఆపేశాయని తెలిపాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం హాట్‌స్పాట్ టెక్నాలజీని ఇంత వరకు ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం విశేషం.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్‌మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్‌మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్‌దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్‌సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్‌మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్‌లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్‌అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
Ind vs NZ: గిల్ ఫిఫ్టీ.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. దూకుడుగా భారత్
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.గేర్ మార్చిన గిల్, పంత్శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్‌పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్‌కు లైఫ్ లభించింది. పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియాకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్‌కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరిభారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్‌గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్లో నైట్‌వాచ్‌మన్‌గా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పంపించింది.ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులుజైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమిInd vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి! -
IPL 2025 Retention List: కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు ఇవే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..కోల్‌కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుపంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్‌ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్‌లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్‌గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్‌గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్‌లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్‌ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. ఆ నలుగురు జట్టుతోనేదాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
పుణె టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లక్ష్యం ముందున్నా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్ రనౌట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తప్పు ఎవరిది? పంత్ అవుట్ కావడానికి విరాట్ కోహ్లినే కారణమని కొందరు.. పంత్ స్వీయ తప్పిదం వల్లే ఇలా జరిగిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.ఈ క్రమంలో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు కట్టడి చేయగలిగిన భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. 255 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.అయితే, టార్గెట్ ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. శుబ్‌మన్ గిల్ 23 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(77).. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ సాంట్నర్ ఈ జోడీని విడగొట్టాడు. జైస్వాల్‌ను అతడు అవుట్ చేయడంతో.. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో కోహ్లితో కలిసి పంత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోహ్లి- పంత్ తొందరపాటు చర్య వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 23వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.మెరుపు వేగంతో బాల్ విసరడంతోఅప్పటికి క్రీజులో ఉన్న కోహ్లి బంతిని లెఫ్ట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గట్టిగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ .. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వైపు వేగంగా విసిరాడు. అప్పటికే సింగిల్ కోసం పంత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు రాగా.. కోహ్లి కూడా పరుగుకు వెళ్లాడు. అయితే, అంతలోనే సాంట్నర్ మెరుపు వేగంతో బంతిని విసరడం.. బ్లండెల్ వికెట్లకు గిరాటేయడం జరిగిపోయింది.అప్పటికి పంత్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల భారీ తేడాతో ఓడి కివీస్‌కు సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది.చదవండి: దంచికొట్టిన యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డుTrust me bro Kohli ran pant out 😭 pic.twitter.com/0qmNYdZhYh— M. (@IconicKohIi) October 26, 2024Kohli saw pant is running thn he Ran .. clearly pant' call.. and lazy lazy running from him #INDvsNZ pic.twitter.com/Tv5lJm89Gj— भाई साहब (@Bhai_saheb) October 26, 2024 -
Ind vs NZ: వాషీకి సలహా.. బెడిసికొట్టగానే పంత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహా బెడిసికొట్టింది. ఫలితంగా.. వికెట్ తీయాలనుకున్న వాషీకి.. బ్యాటర్ బౌండరీ బాది షాకిచ్చాడు. దీంతో మాట మార్చిన పంత్.. తనదేమీ తప్పులేదన్నట్లుగా సమర్థించుకోవడంతో వాషీ బిక్కముఖం వేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే..!న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్ సేన బౌలింగ్‌కు దిగింది.ఈ క్రమంలో రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు చెన్నై బౌలర్లు కలిసి కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ వాషీ వేశాడు.పంత్ సలహాను పాటించిన వాషీఅప్పుడు.. న్యూజిలాండ్ టెయిలెండర్ అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కాళ్ల ముందు కాస్త ఎడంగా బాల్ వేయాలని వికెట్ కీపర్ రిషభ్ పంత్ వాషింగ్టన్కు సూచించాడు. అందుకు సానుకూలంగా స్పందించిన వాషీ.. పంత్ సలహాను పాటించాడు.PC: Jio Cinema Xఫోర్ కొట్టిన అజాజ్ పటేల్అయితే, వీరి సంభాషణను అర్థం చేసుకున్న అజాజ్ పటేల్ కాస్త ముందుకు వచ్చి ఆడి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో వాషీ నిరాశకు గురికాగా.. పంత్ మాత్రం.. ‘‘అతడికి హిందీ వచ్చని నాకేం తెలుసు?’’ అంటూ తన సలహాను సమర్థించుకున్నాడు.ఇక పంత్ కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. కాగా భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు అజాజ్ కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. మరి పంత్ హిందీలో వాషీతో మాట్లాడుతుంటే అజాజ్ పటేల్‌కు అర్థం కాకుండా ఉంటుందా?! అదీ సంగతి!156 పరుగులకే ఆలౌట్‌కాగా శుక్రవారం 16-1తో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా 156 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్In today's episode of 𝘒𝘦𝘦𝘱𝘪𝘯𝘨 𝘸𝘪𝘵𝘩 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 𝘗𝘢𝘯𝘵! 👀😂#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #TeamIndia pic.twitter.com/LoUC31wADr— JioCinema (@JioCinema) October 24, 2024 -
గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలం: పంత్ బౌల్డ్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. పుణె వేదికగా రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం 16-1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు.తొలుత కోహ్లిభారత ఇన్నింగ్స్ 22వ ఓవర్ మూడో బంతికి శుబ్‌మన్ గిల్(30)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సాంట్నర్.. 24వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లి(1)ని బౌల్డ్ చేశాడు. అయితే, సాంట్నర్ వేసిన లో ఫుల్‌టాస్‌ను ఆడలేక వికెట్ పారేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రిషభ్ పంత్ తోడయ్యాడు.పంత్- సర్ఫరాజ్ జోడీపై ఆశలువీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అభిమానులు భావించగా.. కాసేపటికే ఆ ఆశలపై గ్లెన్ ఫిలిప్స్ నీళ్లు చల్లాడు. ఈ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ 26వ ఓవర్ నాలుగో బంతికి జైస్వాల్(30)ను నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరు కలిసి బెంగళూరు టెస్టు తరహాలో భారీ భాగస్వామ్యం(నాలుగో వికెట్‌కు 177) నెలకొల్పుతారని అభిమానులు ఆశించారు. గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలంఅయితే, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి స్పిన్ మంత్రం వేసి.. రిషభ్ పంత్‌ను బౌల్డ్ చేశాడు. 31వ ఓవర్ రెండో బంతికి 18 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ నిష్క్రమించాడు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈసారి రంగంలోకి దిగిన సాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. 34వ ఓవర్ ఆరో బంతికి సాంట్నర్ బౌలింఘ్ సర్ఫరాజ్ విలియం రూర్కీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా కేవలం 95 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్@ 107/7ఇక అశ్విన్(4) సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. 103 పరుగుల స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు- 107/7 (38). కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఓవరాల్‌గా రెండోసారి..! -
విరాట్ కోహ్లిని వెనక్కినెట్టిన రిషభ్ పంత్
టెస్టు క్రికెట్ పునరాగమనంలో అద్బుతంగా ఆడుతున్న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. సహచర ఆటగాడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ తన టాప్ ర్యాంకును కాపాడుకోగలిగాడు.కారు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు సంపాదించాడు. ఆ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.టెస్టు రీ ఎంట్రీలోనే శతకంఈ క్రమంలో స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో దుమ్ములేపాడు. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సహచరులంతా విఫలమైనా ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ 20 పరుగులు చేయగలిగాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌కు ముందు మోకాలి గాయం తిరగబెట్టినా మైదానంలో దిగి.. 99 పరుగులతో తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మరోవైపు.. టీమిండియా నుంచి యశస్వి జైస్వాల్ నాలుగు, విరాట్ కోహ్లి ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-51. జో రూట్- ఇంగ్లండ్- 917 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 821 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- 803 రేటింగ్ పాయింట్లు4. యశస్వి జైస్వాల్- ఇండియా- 780 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్- ఆస్ట్రేలియా- 757 రేటింగ్ పాయింట్లు.బుమ్రానే టాప్అదే విధంగా.. టెస్టు బౌలర్ల విభాగంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ నాలుగు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ కగిసో రబాడ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరోస్థానానికి చేరుకోగా.. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపికైనా.. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్. రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చిన కారణంగా ఈ వికెట్ కీపర్‌ను ఈవెంట్ ఆసాంతం బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్లో రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంతో వరల్డ్‌కప్ గెలిచిన సభ్యుల జాబితాలో మాత్రం సంజూ తన పేరును లిఖించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సంజూ శాంసన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌కు ముందు తనకు మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందని.. మెగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని యాజమాన్యం చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్ మ్యాచ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు.ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జర్నలిస్టు విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఫైనల్‌కు ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్నపుడు రోహిత్ నన్ను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడు.జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. ‘నేను ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమైంది కదా!.. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని నీకు తెలుసు కదా! ఇది సహజమైన ప్రక్రియే!’ అని నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ.. ‘ముందుగా మ్యాచ్ గెలవాలి.ఇప్పుడు మీ దృష్టి మొత్తం మ్యాచ్ మీదే పెట్టండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని చెప్పాను. అయితే, నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘మనసులో నాకు శాపనార్థాలు పెడుతున్నావని నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వు సంతోషంగా లేవు. మీ మైండ్‌లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోంది’ అన్నాడు.అప్పుడు నేను.. ‘ఓ ఆటగాడిగా మ్యాచ్ ఆడాలని నేను ఆశపడటం సహజం. మీ నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాను. మ్యాచ్ ఆడలేకపోయాననే పశ్చాత్తాపం నాకు ఉంటుంది. మీ లాంటి గొప్ప లీడర్‌తో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అదొక్కటే నా మెదడును తొలిచివేస్తుంది’ అని అన్నాను’’ అంటూ సంజూ శాంసన్ నాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.‘‘ఏదేమైనా ఫైనల్‌కు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పడంతో నేను మానసికంగా రెడీ అయిపోయా. అయితే, టాస్కు ముందు పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు. కాస్తత నిరాశకు గురైనా.. పర్లేదు. ఇలాంటివి సహజమే అని సరిపెట్టుకున్నా. అయితే, టాస్ పడటానికి ముందు కూడా రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి.. నాకోసం పది నిమిషాలు కేటాయించడం మామూలు విషయం కాదు. అతడి స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఇలా చేసే వారు కాదేమో’’ అని సంజూ శాంసన్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
IND vs NZ: పంత్‌కు గాయం.. కేఎల్ రాహుల్‌కు లక్కీ ఛాన్స్?
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనుహ్యంగా ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా భారత్-కివీస్ మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.అయితే ఈ పుణే టెస్టుకు భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో రాహుల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని సెకెండ్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.రాహుల్‌కు మరో ఛాన్స్..?అయితే భారత జట్టు మెనెజ్‌మెంట్ మాత్రం రాహుల్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తుందంట. మొదటి టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. పుణే టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఈ క్రమంలో రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించి, పంత్ స్ధానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్‌ను ఆడించాలని హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ రెండో టెస్టులో కూడా రాహుల్ విఫలమైతే కచ్చితంగా మూడో టెస్టుకు వేటు పడే ఛాన్స్ ఉంది.తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: BAN vs SA: చరిత్ర సృష్టించిన రబాడ.. ప్రపంచ రికార్డు బ్రేక్ -
అయ్యో పంత్...! నీకే ఎందుకిలా..? ఏడోసారి సెంచరీ మిస్..
-
వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 50 లోపు స్కోరుకే ఆలౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపిందని.. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో తమ జట్టు అద్భుతంగా పోరాడిందని పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారని కొనియాడిన రోహిత్.. వారిద్దరి వల్లే తాము మెరుగైన స్కోరు సాధించామని తెలిపాడు.46 పరుగులకే ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయి సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగింది.సర్ఫరాజ్, పంత్ అద్భుత ఇన్నింగ్స్మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అద్భుతంగా రాణించినందు వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన సర్ఫరాజ్ 150 పరుగులతో చెలరేగగా.. మోకాలి నొప్పి ఉన్నా పంత్ 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టును గెలిపించేందుకు వీరి పోరాటం సరిపోలేదు.మోచ్యూర్గా ఆడారుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా బ్యాటింగ్ చేశాం. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మేము పుంజుకున్నాం. ఆ ఇద్దరు(సర్ఫరాజ్, పంత్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫరాజ్, పంత్ బ్యాటింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్‌రూంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు.వాళ్లిద్దరు ఎంతో పరిణతి కనబరిచారు. మామూలుగా అయితే, రిషభ్ చాలా వరకు రిస్క్ తీసుకుంటాడు. కానీ ఈసారి మంచి బంతులు పడ్డప్పుడు డిఫెన్స్ చేసుకున్నాడు. కొన్నింటిని వదిలేశాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు.ఇక సర్ఫరాజ్ గురించి చెప్పాలంటే.. ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్లో ఇది నాలుగో టెస్టే అయినా.. ఓవైపు ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న రోహిత్ శర్మ.. తాము మూకుమ్మడిగా విఫలం కావడం బాధించిందన్నాడు.వరుసగా నాలుగు గెలిచాంఅయితే, గతంలో ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తాము.. తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన విషయాన్ని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసునని పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు(అక్టోబరు 16- 20)👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు.. రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాస్కోర్లు:👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్- 110/2👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రచిన్ రవీంద్ర(134, 39 నాటౌట్)చదవండి: IND vs PAK: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదంటే రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ పడుతుంది.బెంగళూరు వేదికగా భారత్- కివీస్ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. రోహిత్, విరాట్ ఫిఫ్టీలుఓపెనర్లలో యశస్వి జైస్వాల్(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ(52), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.చెలరేగిన హీరోలు.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, పంత్ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. విలియం రూర్కీ బౌలింగ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కివీస్ టార్గెట్ ఎంతంటే?కుల్దీప్ యాదవ్ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్‌కు స్వల్ప లక్ష్యం విధించింది.అంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్! రోహిత్ రియాక్షన్ వైరల్ -
Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?
టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్‌లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.స్టాండింగ్ ఓవియేషన్అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్‌కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్!
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ‘వెనక్కి పంపేందుకు’ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. అసలు సంగతి ఏమిటంటే!?బెంగళూరు వేదికగా భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం(రెండో రోజు) మొదటి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన..తమ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తద్వారా స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.అయితే, టీమిండియా బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగ్గా ఆడారు. ఓపెనర్ డెవాన్ కాన్వే 91, రచిన్ రవీంద్ర 134, టిమ్ సౌథీ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి.. భారత్ కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు.. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకోవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలతో బలమైన పునాది వేశారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ రాకతో టీమిండియా స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. శనివారం నాటి ఆటలో శతకం సాధించాడు.పంత్, సర్ఫరాజ్ దూకుడుఅయితే, కోహ్లి అవుటైన తర్వాత సర్ఫరాజ్‌కు రిషభ్ పంత్ జతకాగా.. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 56వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో తొలి బంతికి సర్ఫరాజ్ ఖాన్ షాట్ ఆడి.. సింగిల్ తీసుకున్నాడు. అయితే, పంత్ రెండో పరుగు కోసం పరిగెత్తుకు రాగా.. ప్రమాదాన్ని పసిగట్టిన సర్ఫరాజ్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి కాస్త ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు. వెనక్కి వెళ్తావా? లేదా? పంత్‌ను ఎలాగైనా వెనక్కి పంపించడం సహా ఫీల్డర్ల ఏకాగ్రత చెదిరేలా గెంతులు వేస్తూ పంత్‌కు సైగలు చేశాడు. దీంతో పంత్ క్రీజులోకి వెళ్లగా.. అప్పటికే ఫీల్డర్ త్రో చేసిన బంతిని కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వికెట్ల వైపునకు విసిరాడు. అయితే, అంతకంటే ముందే పంత్ క్రీజులోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.రోహిత్ రియాక్షన్ వైరల్ఇదిలా ఉంటే.. పంత్‌ను వెనక్కి పంపేందుకు సర్ఫరాజ్ చిన్న పిల్లాడిలా జంప్ చేసిన విధానం.. భారత శిబిరంలో నవ్వులు పూయించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి తదితరులు పంత్ సమయానికి చేరుకుంటాడో లేదోనని ఆందోళన పడుతూనే.. నవ్వులు ఆపుకోలేకపోయారు. 🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4— mon (@4sacinom) October 19, 2024 ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సర్ఫరాజ్ 150, పంత్ 99 పరుగులు చేసి అవుటయ్యారు. టీ బ్రేక్ సమయానికి 90.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)ALL INDIA REACTION ON SARFARAZ RISHABH RUN OUT CHANCE #INDvNZ pic.twitter.com/ImFtIck1sp— Wasi (@WasiTheBoi) October 19, 2024 -
Rishabh Pant: సర్జరీ జరిగిన కాలికే గాయం.. దురదృష్టవశాత్తూ..
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్డేట్ అందించాడు. సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకిందని.. ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.అప్పుడు ప్రాణాలతో బయటపడినాభారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొని టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.‘టాప్’ స్కోరర్‌గా ఇక కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. బుధవారమే ఆరంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షం వల్ల మొదటి రోజు ఆట సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గురువారం వాన పడకపోవడంతో ఆటను మొదలుపెట్టారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 46 పరుగులకే కుప్పకూలింది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. అయితే, కివీస్ మొదిటి ఇన్నింగ్స్ సమయంలో పంత్‌కు గాయమైంది. 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అతడి స్థానాన్ని ధ్రువ్ జురెల్ భర్తీ చేశాడు. నిజానికి.. ఈ మ్యాచ్‌కు పంత్ మళ్లీ అందుబాటులోకి రావడం అత్యంత ముఖ్యం. బ్యాటర్‌గా, కీపర్‌గా అతడి సేవలు జట్టుకు అవసరం. మోకాలు కాస్త వాపు వచ్చిందిదీంతో అతడు గాయం వల్ల దూరమైతే పరిస్థితి ఏమిటన్న అభిమానుల ఆందోళన నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించాడు. గురువారం ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ సరిగ్గా మోకాలికే బంతి తగలింది.అదే కాలికి గతంలో సర్జరీ జరిగింది. అందుకే.. మోకాలు కాస్త వాపు వచ్చింది. కండరాలు కూడా పట్టేశాయి. అందుకే మేము రిస్క్ తీసుకోదలచుకోలేదు. రిషభ్ కూడా మాకు ఇదే చెప్పాడు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా అతడిని వెనక్కి పంపించాం. సర్జరీ జరిగిన కాలుకే గాయం కావడంతో ఈ నిర్ణం తీసుకున్నాం. అతడు తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. రేపు(శుక్రవారం) తనని మనం మైదానంలో చూస్తామనే అనుకుంటున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్ -
IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్‌లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్‌పై కివీస్ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్‌గా రెండో రోజు కివీస్‌దే పైచేయి అయింది.భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దుకాగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్స్‌తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ‘హాక్–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్ బ్రేక్ ప్రకటించి ‘హాక్–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో రోజు కరుణించిన వరణుడుఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కెప్టెన్ రోహిత్ శర్మ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు.వికెట్ల పతనంఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.కాన్వే హీరో ఇన్నింగ్స్ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు డెవాన్ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారత్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
టీమిండియాకు మరో భారీ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 13, కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులే చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ సున్నా చుట్టారు.పంత్ ఒక్కడేఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.మోకాలికి బలంగా తాకిన బంతిమరోవైపు.. బౌలింగ్‌లోనూ రోహిత్ సేన పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు టీమిండియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది.కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.బరిలోకి జురెల్అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ పంత్ గనుక కోలుకోకపోతే టీమిండియాకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్! -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అతడు మూడు క్యాచ్‌లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్‌లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్‌లు పట్టి.. వారిని పెవిలియన్‌కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్‌లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్‌గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో పంత్ బ్యాకప్‌గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో ఆడే సిరీస్‌కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్‌డే.. లవ్ యూ అంటూ అక్క విషెస్! (ఫొటోలు)