Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Neet Pg Exam Held In August 2024
నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌పై కీలక ప్రకటన

సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్‌)‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వాయిదా పడ్డ నీట్‌-పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ను ఆగస్ట్‌ 11న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు షిప్ట్‌లలో ఆ పరీక్ష జరగనుంది. కటాఫ్ తేదీ, ఇతర వివరాల్ని ఆగస్ట్‌ 15న వెల్లడిస్తామని పేర్కొంది. ‘ఎన్‌బీఈఎంఎస్‌ 22-06-2024న వాయిదా వేసిన నీట్‌ పీజీ ఆగస్ట్‌ 11న నిర్వహిస్తున్నాం. రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్ష జరగనుంది’ అని విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో..ఇటీవల నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా తర్వలో జరగనున్న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రం ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జరగనుంది. పరీక్షను ఎన్‌బీఈఎంఎస్‌ జరుపుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీట్‌ పీజీ పరీక్ష నిమిత్తం అవసరమయ్యే టెక్నికల్‌ సపోర్ట్‌ను ఎన్‌బీఈఎంఎస్‌తో కలిసి ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ అందించనుంది.

Mudragada Padmanabham And Many Other Leaders Meet Ys Jagan
వైఎస్‌ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణపై వైఎస్‌ జగన్‌ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్‌ జగన్‌ మరోసారి వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్‌ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

World First CNG Bike Bajaj Freedom 125 Launches in India
వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్‌జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024

 Seven BRS MLAs Not Attended Party Meeting At Telangana Bhavan
బీఆర్‌ఎస్‌ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా.. వారంతా ఎక్కడ?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, వారంతా పార్టీ మారుతున్నారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు.. జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు రెడీ అయ్యారు.కాగా, తెలంగాణ భవన్‌లో నేడు హైదరాబాద్‌ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్‌ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌ను బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు.అయితే, రేపటి సమావేశంలో కౌన్సిల్‌ హాల్‌లోనే బైఠాయించాలని వారు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. సంఖ్యా బలం చూసుకుంటే తమకే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కుతాయని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో, రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, వీరు పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది.

Tollywood Hero Raj Tarun Reacts On His Girlfriend Lavanya Allegations
మూడేళ్లు కలిసున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకోలేదు: రాజ్‌ తరుణ్‌

రాజ్‌ తరుణ్‌ మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా రాజ్‌ తరుణ్‌ను బుట్టలో వేసుకుందని, తన ప్రియుడిని తనకు కాకుండా చేసిందని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణలపై హీరో రాజ్‌ తరుణ్‌ స్పందించాడు.డ్రగ్స్‌ అలవాటు'లావణ్య.. మొదట్లో నాతో కలిసున్న మాట వాస్తవమే! నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్‌ చేసింది. మేము రెండుమూడేళ్లు కలిసున్నాం. అయితే తనకు డ్రగ్స్‌ అలవాటు ఉంది. డ్రగ్స్‌ తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్‌ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్లిపోయాను. తనను అసలు పెళ్లే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో కలిసుంది.మరొకరితో రిలేషన్‌ప్రస్తుతం అతడితోనే రిలేషన్‌లో ఉంది. కానీ డబ్బు కోసం నాతో పని చేసేవారందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. అలా మాల్వీ మల్హోత్రాకు ఫోన్‌ చేసి బెదిరించింది, బూతులు మాట్లాడింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడమేంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చాడు.చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు

The intriguing real life story of Keir Starmer UK next prime minister
బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా కీర్ స్టార్మ‌ర్‌.. 50 ఏళ్ల‌కు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం

బ్రిట‌న్ పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష‌ లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశ‌గా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియ‌న్ కూడా. ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 61 ఏళ్లు. గ‌త 50 ఏళ్ల‌లో ఈ వ‌య‌సులో బ్రిట‌న్‌ ప్ర‌ధాన‌మంత్రి అయిన వ్య‌క్తిగా స్టార్మ‌ర్ నిలిచారు. అంతేగాక పార్ల‌మెంట్‌కు ఎన్నికైన తొమ్మిదేళ్ల‌లోనే ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి చేప‌డుతుండటం మ‌రో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్‌మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గ‌డిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్య‌ను అభ్య‌సించాడు. అనంత‌రం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్‌డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మ‌ర‌ణ శిక్ష‌లు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంత‌రం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల త‌ర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడ‌య్యాడు.2008 నుంచి 2013 మధ్య వ‌ర‌కు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయ‌డం, జ‌ర్న‌లిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్‌లో యువ‌త అల్ల‌ర్ల వంటి విచారణల‌ను ఆయ‌న పర్యవేక్షించాడు. త‌న ప‌నిత‌నంతో క్వీన్ ఎలిజ‌బెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్‌ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మ‌ర్‌కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్‌లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌ల ఉన్నారు. శుక్ర‌వారం వ‌ర‌కు ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యే కీర్‌.. శ‌ని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజ‌కీయాల్లోకి రాక‌ముందు న్యాయ‌వాద వృత్తిలో సుధీర్ఘ‌కాలం కొన‌సాగారు. ఆయ‌న ఆధునిక రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నంగా ఉంటార‌నే పేరు ఉంది. ఈ ఎన్నిక‌ల్లో బ్రిట‌న్‌లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్ర‌ధాన‌ నినాదాల‌తో ప్ర‌చారంలో ముందుకు సాగారు. గ‌త 14 ఏళ్ల‌లో క‌న్జ‌ర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్ర‌ధానుల‌ను మార్చిన ఉద్దేశంలో ఆయ‌న ఈ నినాదాల‌ను న‌డిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్‌.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్‌లో మొత్తం 650 సీట్లు ఉండ‌గా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబ‌ర్ పార్టీ అభ్య‌ర్ధులు ముందంజ‌లో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మ‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గం లండ‌న్‌లోని హోల్‌బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భార‌త్‌- బ్రిట‌న్ మ‌ధ్య సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి..లేబ‌ర్ పార్టీ అధినేత కీర్ స్టార్మ‌ర్ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత భార‌త్‌-యూకే సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. యూకే- భార‌త్ సంబంధాల‌ను బ‌లోపేత చేయ‌డం త‌న‌ విదేశాంగ విధానం ఎజెండాలో కీల‌క అంశ‌మ‌ని గ‌తంలో స్టార్మ‌ర్ పేర్కొన్నాడు. క‌శ్మీర్ వంటి స‌మ‌స్య‌ల‌పై లేబ‌ర్ పార్టీ వైఖ‌రిని కూడా తెలియ‌జేస్తూ.. భార‌త్‌తో కొత్త వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌రుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒక‌టైన భార‌త్‌తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశ‌యంతో ఉన్న‌ట్లు నొక్కిచెప్పారు. ఇక భార‌త్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్న‌ట్లు అత‌ని మేనిఫెస్టోలో సైతం పొందుప‌రిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Ksr Comments On TDP's Violent Rule
ఏపీలో అందుకేనా టీడీపీ సైకో చర్యలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణపడినా అందులో ఒకరికి వైఎస్సార్‌సీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ ఆగడం లేదు. వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్‌సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్‌లో పుంగనూరు వెళ్లి అక్కడ అరాచకానీకి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక పోలీస్ కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ నేత చల్లా బాబుపై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోప కారణం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్‌సీపీ వారిని, ఇతర బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆదేశించారు.ఇదీ చదవండి: కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడురామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ, పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలనైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తి అయ్యేలా చేశారే! అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, వైఎస్సార్‌సీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్ధుల పొలాలలోని తోటలను నరికి వేస్తున్నారు. పుంగనూరులో అయితే వైఎస్సార్‌సీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట.రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, ఆస్సోం వంటి రాష్ట్రాలలో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్లం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కానీ, బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పుంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్‌ల తయారీ కర్మాగారాన్ని తీసుకు వస్తే, కూటమి నేతలు దానిని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి చేయాలా? అని సందిగ్ధంలో పడిందట.విశేషం ఏమిటంటే మిథున్‌ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ, అక్కడకు వచ్చిన పుంగనూరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని ఆయనను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దమని, ప్రభుత్వ అరచాకాలను అడ్డుకుంటానని మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు మిథున్‌ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం ఉంది. టీడీపీ వారు కానీ, పోలీసులు కానీ ఎన్నాళ్లు దాడులు చేస్తారు! ఎన్ని కేసులు పెడతారు?గతంలో ఒకసారి పల్నాడులోని ఒక గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంటనే దానిని రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటనకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. దానిని చంద్రబాబు ఎంతగా విమర్శించింది అందరికి తెలుసు. అదే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ వారిపై అంతకన్నా దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ వారు చేస్తున్న క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావు పేటలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించికపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది.ఈ సందర్భంలో వేమూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జీ వి. అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి ఆయన అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతిచోట టీడీపీ వారి దుండగాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే కొనసాగిస్తారు. కేవలం వైఎస్సార్‌సీపీవారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హింసాకాండ సాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకం అయి నిరసనలకు దిగి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నలభై ఆరేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఇంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజలలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరులో చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

UK Polls Indian Origin Suella Braverman Wins
యూ​కే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రేవర్‌మాన్ సంచలనం

2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ సంచలనం రేపారు. కన్జర్వేటివ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేర్‌హామ్ అండ్‌ వాటర్‌లూవిల్లే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. లేబర్‌కు చెందిన గెమ్మా ఫర్నివాల్‌పై 6,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2015 నుండి ఆమె ఫారెహామ్‌కు ఎంపీగా ఉన్నారు . అక్టోబర్ 2022-నవంబర్ 2023 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు.తన విజయం గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ పనితీరుపై ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోయిందనీ, కన్సర్వేటివ్ పార్టీ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పార్టీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తాజా ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత లేబర్‌ పార్టీ అధికారాన్నిచేజిక్కించుకుంది. 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్‌ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు.

Hero Raj Tarun Lover Lavanya Case File Against Him
హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌పై పోలీసు కేసు నమోదైంది. తనను నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌ తనను వదిలేయడానికి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. మూడు నెలల క్రితమే..హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా నెంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమంది. రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. డ్రగ్స్‌ కేసులోఅంతేకాకుండా గతంలో డ్రగ్స్‌ కేసులో ఇరికించడంతో మూడు నెలలపాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్‌ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్‌ తరుణే తన ప్రపంచమని, అతడు తిరిగి తన దగ్గరకు వచ్చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా తిరగబడరా సామీ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్‌ మూవీ..

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
లిక్క‌ర్ కేసులో ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌రోసారి చుక్కెదురు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స

‘పీఎల్‌ఐ శాశ్వత సబ్సిడీ కాదు’

డ్రోన్‌ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి

ల‌గ్జ‌రీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్ల‌కు పైనే!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హ‌థ్రాస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కార‌ణ‌మైన సూర‌జ్ పాల్ అలియాస్ నారాయ‌ణ్ హ‌రి సాక‌ర్ అలియాస్‌ భ

నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌పై కీలక ప్రకటన

సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్‌ బోర్

షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని నోయిడాలోని ఓ మాల్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all