Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSR Jayanthi: YS Jagan Idupulapaya Visit Updates
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్‌ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

NEET UG 2024 SC Hearing Live July 8 2024 Telugu News Update
నీట్‌ విచారణ.. 23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: నీట్‌ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్‌ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్‌ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్‌ లీక్‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలిలీక్‌ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?పేపర్‌ లీక్‌కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉందిపేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్‌ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్‌ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్‌ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్‌ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్‌ ఆరా తీసింది.. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐదీనికి అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు. అంటే నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐపరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐఅక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐపేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లుఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వంపరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx— ANI (@ANI) July 8, 2024

YS Jagan Tweet On Occasion Of YSR 75th Birth Anniversary
నాన్న మీ మార్గం శిరోధార్యం.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024

Congress Ex MLA Jagga Reddy Interesting Comments Over Chandrababu
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్‌ చేశారు.కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్‌ గేమ్‌ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే.

104 Year Old World War II Veteran Reveals The Secret To His Long Life
కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..

గోర్డాన్‌ గ్రెన్‌లే హంట్‌ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్‌ లైలాండ్‌ రాయల్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్‌ సలాడ్‌ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్‌ చేపలు, చిప్స్‌ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్‌ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్‌ రెంట్‌ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్‌ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్‌ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్‌ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్‌ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల​ స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్‌ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్‌ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్‌ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్‌లో 25 గ్రాముల ప్రోటీన్‌, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్‌, విటమిన్‌ బీ12, సెలీనియం, నియాసిన్‌, పాంతోతేనిక్‌ ఆమ్లం, థియామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పోటాషియం, ఫాస్ఫరస్‌ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్‌నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్‌ ప్రకటనలే కారణం!)

What Hell Looks Like Check The AI Video
'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!

స్వర్గం, నరకం ఉన్నాయో.. లేదో తెలియదు!.. కానీ దశాబ్దాల క్రితం గరుడు పురాణం చదివి ఇలా ఉంటుందని కొందరు ఊహించుకుని ఉండొచ్చు. ఆ తరువాత తరం వాళ్ళు సినిమాలు చూసి ఇలాగే ఉంటాయని భావన పొంది ఉండవచ్చు. అయితే నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి చెందిన తరుణంలో ఏ ప్రశ్నకైనా.. ఇదిగో సమాధానం అన్నట్టు తయారైపోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నరకం ఎలా ఉంటుందని 'ఏఐ'ను అడిగారు. దీనికి కూడా ఏఐ ఓ వీడియో క్రియేట్ చేసింది.ఏఐ చూపించిన నరకం వీడియోను హిస్టారిక్ వీడియోస్ వారు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేస్తూ.. నరకం చూపించమని ఏఐను అడిగాను' దానికి సమాధానంగా ఈ వీడియో వచ్చిందని పేర్కొన్నారు.18 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో లెక్కకు మించిన చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ మధ్యలోకి ఒక శరీరం పడుతుంది. ఆ తరువాత ఆ శరీరం ముఖం ఆకృతి వక్రంగా మారుతుంది. ఒకేసారి నోటి నుంచి చేయి బయటకు వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు తప్పకుండా భయం పుడుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ఏఐను ఇలాంటి వింత ప్రశ్నలు కూడా అడుగుతారా? అని అన్నారు. మరొకరు రోజూ పబ్లిక్ బస్సులో వెళుతుంటే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అన్నారు. మొత్తం మీద ఏఐ నరకం చూపించిందని చెబుతున్నారు.Asked Al to show "Hell' pic.twitter.com/XxoHVE9HKu— Historic Vids (@historyinmemes) April 3, 2024

He Was Very Happy When I Got Out For 0: Abhishek Sharma About Yuvraj Singh
‘నేను డకౌట్‌ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’

‘‘మొదటి మ్యాచ్‌ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్‌ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్‌ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్‌ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్‌.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్‌ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్‌ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రంలోనే అతడు డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. డకౌట్‌ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్‌ శర్మ తన మెంటార్‌ యువరాజ్‌ సింగ్‌కు కాల్‌ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్‌ ఫోన్‌కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్‌లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.చదవండి: బాబర్‌ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial)

check these foods that can help you prevent allergies this monsoon
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!

చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది. తేమ గట్‌లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.సాధ్యమైనంతవరకు ఈ సీజన్‌లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్‌హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.పెరుగు : ప్రోబయోటిక్స్‌తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్‌లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్‌ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్‌ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Tollywood Hero Sudheer Babu Reacts On Sai Dharam Tej post On Social Media
'సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్‌ బాబు

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్‌ ‍అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్‌ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా ‍అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్‌లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
ముంబై హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. అతడికి బెయిల్‌ మంజూరు

ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణ

కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్‌’

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్‌ మద్దతుదారులు ఆయన ఎ

భారీ వ‌ర్షాలు.. ముంబై వాసుల‌కు సీఎం షిండే విజ్ఞప్తి

ఒక పూట కురిసిన భారీ వ‌ర్షం మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైల‌ను అత‌లాకుత‌లం చేసింది.

రైలు కింద ప‌డిన మ‌హిళ‌.. కాపాడేందుకు ట్రైన్ రివ‌ర్స్‌

ముంబై: ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బ‌య‌డ‌ప‌టింది.

బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌

చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all