Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Fires On Chandrababu Govt For Demolishing YSRCP Party Office
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

Pat Cummins becomes first player to pick two T20 WC hat-tricks
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా కింగ్‌స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.కమ్మిన్స్‌ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్‌), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్‌) ఉన్నారు.

Sakshi Editorial On TDP Chandrababu Andhra Pradesh Politics
ఏ ఫర్‌ ఎటాక్‌... పీ ఫర్‌ పొక్లెయిన్‌?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్‌ చెప్పారు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్‌ సిక్స్‌ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనే కొటేషన్‌ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్‌ ఇంజన్‌ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్‌ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్‌ వయసు డెబ్బయ్‌ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్‌ ఫీల్డ్‌ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్‌జెన్‌ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్‌ స్టోరీలే. మయన్మార్‌ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్‌ జంగిల్‌ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్‌), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్‌ ఎస్టేట్‌ మోడల్‌ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్‌ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్‌ నిర్మాత కులీ కుతుబ్‌షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్‌ వాల్‌కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.ప్రధాన డ్యామ్‌కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్‌ వాల్‌ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, స్పిల్‌ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లుగా వ్యవహరిస్తారు.ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్‌ వాల్‌ కడతారని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్‌ డ్యామ్‌లను సగం కట్టి వదిలేశారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్‌ 11 నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయినట్టు అక్కడో పైలాన్‌ను ఆవిష్కరించారు.ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన తర్వాత కూడా కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేయడానికి, స్పిల్‌ చానల్‌ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్‌ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్‌ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్‌ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్‌ నుంచి కోరుతూ వస్తున్నది.మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్‌ ఎటాక్, పీ ఫర్‌ పొక్లెయిన్‌’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్‌సభ స్పీకర్‌ జీ.వీ. మావలంకర్‌ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్‌ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్‌సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. మూడు – స్పీకర్‌ గుర్తించాలి. ఈ స్పీకర్‌ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్‌ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్‌సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope From 23 June 2024 To 29 June 2024 In Telugu
Weekly Horoscope: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతమే

మేషంమొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. క్రమేపీ మీకు ఎదురులేని పరిస్థితి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో మానసిక అశాంతి. వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.వృషభంఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు అందుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగల అవకాశం. కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.మిథునంరాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.కర్కాటకంకార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.కన్యరాబడి సంతృప్తినిస్తుంది. రావలసిన పైకం కూడా అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీసత్తా చాటుకునేందుకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితి ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.తులఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవార్డులు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. లేత నీలం, పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికంకొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా వాయిదా వేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు నత్తనడనక సాగుతూ స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.ధనుస్సుఅనుకున్న పనులు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలు, దైవకార్యాల నిర్వహణపై చర్చలు ఫలిస్తాయి. కొత్త గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.మకరంకొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీదపడతాయి. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు, విష్ణుధ్యానం చేయండి.కుంభంకొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి కొంత సహాయం సైతం అందుతుంది. ఊహలు నిజం కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిత్రవిచిత్ర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం,, అనుకూల ఫలితాలు సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌వర్గాలకు శుభసూచకాలే. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నేరేడు, తెలుపు రంగులు.గణేశాష్టకం పఠించండి.మీనంముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత గులాబీ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

CM congratulated Chintakayala Ayyannapatrudu
కరుడుగట్టిన పసుపు యోధుడు

సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్‌బ్రాండ్‌ అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయ­న నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రు­డును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్ని­కల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. అయ్యన్నను స్పీకర్‌ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. సీఎంగానే సభలో అడుగుపెట్టా.. సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్‌ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు. 25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్‌ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోల­వరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరి­కంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నా­రు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్ర­స్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు. ప్రజలు హుందాతనం చూస్తారు ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్‌ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్‌ లీడర్‌ను చేసినట్లుందన్నారు. గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు.హుందాగా మాట్లాడాలి.. శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్‌హుందాగా నడపాలంటూనే జగన్‌పై అనవసర విమర్శలు.. గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే మంత్రులు అనిత, బీసీ జనార్థన్‌రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్‌ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్‌కు అభినందనలు చెప్పడం కంటే జగన్‌ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు.

తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పొక్లెయిన్‌లతో  కూల్చివేయిస్తున్న అధికారులు
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'

సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్‌ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్‌డీఏ అధికారులు, మున్సిపల్‌ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్‌ యార్డు వద్ద సర్వే నంబర్‌ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్‌ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్‌ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్‌డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్‌ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్‌ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్‌డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్‌ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్‌డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్‌డీఏ కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్‌డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మ­కూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూ­మి­ని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయా­న్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.­వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్‌.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశా­రు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notice to YSRCP party office at Rajamahendravaram
వైఎస్సార్‌సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం: టీడీపీ ప్రభుత్వం

సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్‌)­/అనంతపురం కార్పొరేషన్‌/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసు­మంతైనా లేకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశా­లను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లే­వంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్‌ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్‌డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్‌ 25న çఫస్ట్‌ ప్లోర్‌లో 120.34 స్క్వేర్‌ యార్డ్స్‌ ప్రపోజ్‌ చేస్తూ మార్ట్‌గేజ్‌ చేశారు. గతేడాది వీఎంఆర్‌డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యం­తరం లేకపోయినా..ఆటోమెటిక్‌గా ప్లాన్‌ అప్రూవల్‌ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్‌డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్ప­లేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు. బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ..నెల్లూరులోని 54వ డివిజన్‌ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్‌డోజర్స్‌తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్య­క్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌­రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్‌ అహ్మద్‌ అక్కడికి చేరుకుని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో మా­ట్లాడారు.ప్రభు­త్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీ­సుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకు­న్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగు­తోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కా­దని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యు­మెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పి­నప్పటికీ అధికా­రులు పట్టించుకోకుండా కూల్చేసా­మని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చే­స్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్‌ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్‌ మారుతీ­హరిప్రసాద్‌ శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయా­నికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్‌ఎల్‌సీ కా­లనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొ­న్నా­రు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వా­లని, అంతవరకు నిర్మాణాలు చేపట్ట­కూడదని, ఇప్ప­టివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యా­లయంలో ఆఫీస్‌ బాయ్‌ శ్రీనివాసులుకు నోటీసు అందించారు. ఇది అనధికారిక కట్టడంరాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌సీపీ తూర్పు గో­దావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్‌ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్త­య్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడ­మంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొ­న్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కా­ర్యా­లయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Rakul Husband Jackky Bhagnani Not Paying Salaries to His Employees
చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!

సినిమా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కోట్ల రూపాయలే గుర్తొస్తాయి. కానీ అదే సినిమాకు పనిచేసిన చాలామందికి మాత్రం వేలల్లోనే జీతాలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ. బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్‌గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటిం‍గ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

Ex Union Minister Suryakanta Patil Quits BJP in maharashtra
బీజేపీకి షాక్‌.. మాజీ కేంద్ర మంత్రి రాజీనామా

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ మాజీ కేంద్రమంత్రి సూర్యకాంత పాటిల్‌ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గత పదేళ్లల్లో పార్టీలో చాలా విషయాలు నేర్చుకున్నా. పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞురాలుగా ఉంటా’అని అన్నారు.2014లో సూర్యకాంతా పాటిల్‌ ఎన్సీపీ(శరద్‌ పవార్‌) నుంచి బీజేపీలో చేరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె హింగోలి నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. అయితే సీట్ల కేటాయింపులో భాగంగా ఆ సీటు సీఎం ఎక్‌నాథ్‌ షిండే వర్గానికి దక్కింది. దీంతో సోషల్‌మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్‌ లభించని ఆమెకు బీజేపీ.. హద్గావ్ హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చీఫ్‌గా నియమించారు. ఆమె టికెట్‌ ఆశించిన హింగోలిలో ఏక్‌నాథ్‌ షిండే శివసేన వర్గం నిలబెట్టిన అభ్యర్థి శివసేన (ఉద్ధవ్‌) చేతిలో ఓటమిపాలయ్యారు. సూర్యకాంత్‌ పాటిల్‌ హింగోలి- నాందెడ్‌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఇక.. యూపీఏ ప్రభుత్వంలో రూరల్‌ డెవలప్‌మెంట్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి (రాష్ట్ర హోదా)గా పని చేశారు.ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 48 సీట్లకు గాను ఎన్డీయే కూటమ 18 స్థానాలల్లో గెలిచింది. అందులో బీజేపీ -10, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే- 7 స్థానాలు, ఎన్సీపీ( అజిత్‌ వర్గం)-1 సీట్లు గెలుచుకుంది. ఇక.. ఇండియా కూటమి 29 స్థానాలు విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ-13, శివసేన( ఉద్ధవ్‌ వర్గం)-9, ఎన్సీపీ (శరద్‌ పవార్‌)-7 సీట్లు గెలుచుకుంది.

Iran Presidential Election 2024: Iran approves six candidates for June presidential election
Iran Presidential Election 2024: ఖమేనీ కనుసన్నల్లో... ఇరాన్‌లో ఎన్నికలకు వేళాయె

అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్‌ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్‌ మసూద్‌ పెజెష్కియాన్‌ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్‌ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్‌ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది. ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం. దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్‌ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్‌ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఎన్నిక ఇలా... ఇరాన్‌ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్‌ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్‌ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్‌ కౌన్సిల్‌ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్‌తో పాటు మూడుసార్లు పార్లమెంట్‌ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్‌ 28న ఓటింగ్‌ జరగనుంది. 30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ ఆరుగురుమసూద్‌ పెజెష్కియాన్‌ గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.అలీ రజా జకానీ టెహ్రాన్‌ మేయర్‌. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్‌ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.జనరల్‌ మహమ్మద్‌ బఖర్‌ గలీబాఫ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌. రాజధాని టెహ్రాన్‌ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ కుమాండర్‌గా, దేశ పోలీస్‌ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు. సయీద్‌ జలిలీ మాజీ చీఫ్‌ న్యూక్లియర్‌ నెగోíÙయేటర్‌. ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్‌లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం. ముస్తాఫా పోర్‌ మొహమ్మదీ రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్‌ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు. ఆమిర్‌ హొసేన్‌ గజీజాదే హషేమీ ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement