Shubman Gill
-
గిల్.. భారత్‌లో ఆడినట్లు అక్కడ ఆడితే కుదరదు: దినేష్ కార్తీక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు."శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. మీరు వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్‌కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్‌లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్బాల్గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్కు వెళ్లి ఆడమని చెబుతుంది.కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్‌ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్‌తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్‌మన్ గిల్ భారత్‌లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్‌కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
నేను బాగానే ఉన్నా.. వాళ్లు పుంజుకుంటారు: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.నేను బాగానే ఉన్నానుఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్‌లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్‌మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.అతడిపై ఒత్తిడి లేదుఅదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.వాళ్లు తిరిగి పుంజుకుంటారుఅంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేశాడు. మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
‘షాట్ సెలక్షన్ చెత్తగా ఉంది.. నీ ఇమేజ్ను వదిలెయ్’
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గిల్ షాట్ సెలక్షన్‌ను సన్నీ తప్పుబట్టాడు. బ్యాటింగ్‌కు వచ్చే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఇమేజ్ను వదిలేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవంటూ చురకలు అంటించాడు.అడిలైడ్‌లో అలాబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా గిల్ దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్‌బాల్ మ్యాచ్‌లో గిల్ ఫర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులు చేశాడు.అయితే, బ్రిస్బేన్ టెస్టులో మాత్రం గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ వెలుపలా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి గల్లీ పాయింట్లో ఉన్న మిచెల్ మార్ష్ చేతిలో పడింది. దీంతో గిల్ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇలాంటి షాట్లు ఆడటం ప్రమాదకరమని తెలిసినా.. నువ్వు జాగ్రత్త పడలేదు.చెత్త షాట్ సెలక్షన్కాస్త కుదురుకున్న తర్వాత ఇలాంటివి ప్రయత్నించవచ్చు. 30- 40- 50 పరుగులు సాధించిన తర్వాత రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఆరంభంలోనే ఇలాంటి చెత్త షాట్ సెలక్షన్ ఏమిటి? నిజానికి మార్ష్ క్యాచ్ పట్టిన తీరు అద్భుతం. ఈ విషయంలో గిల్‌కు కాస్త దురదృష్టం ఎదురైందని చెప్పవచ్చు.ఏదేమైనా.. ఆ బంతిని ఆడకుండా.. అలా వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరపు షాట్‌కు యత్నించినందుకు గిల్ డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా గావస్కర్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కష్టాల్లో టీమిండియాకాగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్ కనీసం మూడు వందల పరుగుల మార్కును కూడా చేరుకునేలా కనిపించడం లేదు. గాబ్బాలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి రోహిత్ సేన ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో టీమిండియా, అడిలైడ్‌లో ఆసీస్ గెలిచి ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్ -
అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చెరో గెలుపుతో సమంగాకాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో తాము షార్ట్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.అవునా.. నాకైతే తెలియదే!అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్‌తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్‌ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను మాత్రమే అవుట్ చేశారు.కానీ.. అతడు ఏ షార్ట్‌బాల్‌ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్‌లో పింక్ బాల్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్‌ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మధురానుభవం ఉంది.నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్‌గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడుShots fired already? 👀While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024 -
‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు!
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్‌లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
IND vs AUS: రెండో టెస్ట్‌కూ గిల్ అనుమానమే..?
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రాక్టీస్ సందర్భంగా గిల్ ఎడమ చేతి బొటన వేలు ప్రాక్చర్ అయ్యింది. ఈ కారణంగా అతను పెర్త్ టెస్ట్‌కు (తొలి టెస్ట్) దూరమయ్యాడు. డాక్టర్లు గిల్‌కు రెండు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గిల్ రెండో టెస్ట్‌కు కూడా దూరం అవుతాడని తెలుస్తుంది. గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా రెండో టెస్ట్‌కు తగినంత ప్రాక్టీస్ అవసరమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట. అందుకు అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. గిల్ రెండో టెస్ట్‌కు ముందు జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొనడని తెలుస్తుంది. పింక్ బాల్‌తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఒకవేళ రెండో టెస్ట్‌కు గిల్ దూరమైతే తొలి టెస్ట్‌లో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ వన్ డౌన్లో బరిలోకి దిగుతాడు. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన దేవ్‌దత్ పడిక్కల్ జట్టు నుంచి తప్పించబడతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.గిల్ అందుబాటులోకి వస్తే..గిల్ గాయం నుంచి కోలుకునే సమయం డిసెంబర్ 1తో ముగుస్తుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా గిల్‌ను బరిలోకి దించాలని భావిస్తే, రెండో టెస్ట్‌లో అతను పడిక్కల్ స్థానంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. యశస్వికి జతగా రోహిత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతాడు. గిల్ రెండో టెస్ట్‌లో బరిలోకి దిగితే అడిలైడ్ ఓవల్ మైదానంలో అతనికి మొదటి టెస్ట్ అవుతుంది. గిల్ గత పర్యటనలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్లలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్‌తో జరుగనున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితమైన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమిష్టిగా రాణించి ఆసీస్‌ను గెలుపు దరిదాపుల్లోకి కూడా చేరనివ్వలేదు. ఈ మ్యాచ్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. -
ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్‌మన్ గిల్‌కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలిని గాయపర్చుకున్నాడు. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మెడికల్ టీమ్ గిల్‌కు తగిలిన గాయాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్ గాయం నేపథ్యంలో అతను తొలి టెస్ట్ ఆడేది లేదన్నది సందిగ్దంలో పడింది.కాగా, గిల్ గాయానికి ముందు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాయం కాస్త తీవ్రమైందిగా తెలుస్తుంది. విరాట్ తనకు తగిలిన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. సర్ఫరాజ్ సైతం మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ గాయమే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను (యశస్వి జైస్వాల్‌తో కలిసి) ప్రారంభిస్తాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వన్‌డౌన్‌లో వస్తాడు. ఆతర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా బరిలో ఉంటాడు. అశ్విన్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ బరిలోకి దిగడం దాదాపుగా ఖయమైపోయింది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
BGT 2024: రోహిత్ ఓపెనర్‌గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్‌లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్‌గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్‌తో సిరీస్‌లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్‌కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రావాలి. రోహిత్ వన్‌డౌన్‌లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే? -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్‌మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్‌లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్‌అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
Ind vs NZ: గిల్ ఫిఫ్టీ.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. దూకుడుగా భారత్
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.గేర్ మార్చిన గిల్, పంత్శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్‌పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్‌కు లైఫ్ లభించింది. పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియాకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్‌కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరిభారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్‌గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్లో నైట్‌వాచ్‌మన్‌గా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పంపించింది.ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులుజైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమిInd vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి! -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్‌ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. 34 పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్ కోల్పోయినప్పటికీ.. టీమిండియా దూకుడు తగ్గలేదు. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టీ20 తరహాలో రెచ్చిపోతుండగా.. శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) అడపాదడపా షాట్లతో అలరిస్తున్నాడు. టీమిండియా లక్ష్యానికి మరో 278 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ వికెట్ మిచెల్ సాంట్నర్‌కు దక్కింది.అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. -
వారిద్దరూ సిద్ధమే
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్‌మన్ గిల్‌తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు. ఆ ఇద్దరి మధ్యే పోటీ భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్‌పై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్‌ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది. తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్‌లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపం లేదు. నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు. టీమిండియా ముమ్మర సాధన తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను తయారు చేసినట్లు సమాచారం. -
IND vs NZ 1st: పటిష్ట స్థితిలో న్యూజిలాండ్
IND vs NZ 1st Test Day 2 Updates And Highlights: టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్ జట్టు.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. డెవాన్ కాన్వే అద్భుత ఇన్నింగ్స్ వల్ల.. రెండో రోజు ఆట ముగిసే సరికి 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. గురువారం నాటి ఆటలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 39.1: కాన్వే అవుట్టీమిండియాకు కీలక వికెట్ దక్కింది. సెంచరీకి చేరువగా వచ్చిన కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే అవుటయ్యాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. రచిన్ 10 పరుగులతో ఆడుతుండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 154/3 (39.1). 36.3: రెండో వికెట్ కోల్పోయిన కివీస్రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విల్ యంగ్(33) కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాన్వే 89 పరుగులతో ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-2(37 ఓవర్లలో)తొలి వికెట్ డౌన్కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టామ్ లాథమ్(15) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాన్వే 51 పరుగులతో ఆడుతున్నాడు. 17.1 ఓవర్లలో కివీస్ స్కోరు: 67-1. విల్ యంగ్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు..న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్ లాథమ్(6), కాన్వే(21) ఉన్నారు.3 ఓవర్లకు కివీస్ స్కోర్: 10/03 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్ లాథమ్(6), కాన్వే(4) ఉన్నారు.46 పరుగులకే టీమిండియా ఆలౌట్..తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఘోర ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్ పేసర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో నిప్పులు చేరిగాడు. అతడితో పాటు యువ పేసర్ విలియం ఓ రూర్క్ 4 వికెట్లు, సౌథీ తలా వికెట్‌తో భారత పతనాన్ని శాసించారు.టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్‌ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2), జైశ్వాల్(13) పరుగులు మాత్రమే చేశారు. కాగా భారత్‌కు ఇది టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.ఆలౌట్‌కు చేరువలో భారత్‌తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్‌కు చేరువైంది. 39 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత మాట్ హెన్రీ వరుస క్రమంలో అశ్విన్,పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు.34 పరుగులకే 6 వికెట్లుబెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా కేఎల్ రాహుల్(0), ఆరో వికెట్‌గా జడేజా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.భారత్ నాలుగో వికెట్ డౌన్..భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జైశ్వాల్.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు.వర్షం అంతరాయం..బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిపోయో సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది.కష్టాల్లో భారత్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. 12 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(2) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కాగా.. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్(8), రిషబ్(3) ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్..9 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.6 ఓవర్లకు భారత స్కోర్: 9/06 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(7), రోహిత్ శర్మ(2) పరుగులతో ఉన్నారు. తొలి సెషన్లో బంతి అద్భుతంగా స్వింగ్ అవుతోంది. దీంతో కివీస్ పేసర్లు భారత ఓపెనర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.తొలుత బ్యాటింగ్ భారత్‌దే..బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో రెండో రోజు టాస్ వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లున్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: LLC 2024: యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో) -
శుభ్‌మన్ గిల్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు అనుమానం..?
న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా మారింది. గిల్‌కు మెడ పట్టేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి కామెంట్లు చేయలేదు. గిల్ విషయంలో భారత్ మేనేజ్మెంట్ చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.మ్యాచ్ సమయానికి గిల్ పూర్తిగా కోలుకోకపోతే సర్ఫరాజ్ ఖాన్ అతని స్థానాన్ని భర్తీ చేయవచ్చు. సర్ఫరాజ్ ఇటీవల జరిగిన ఇరానీ కప్‌లో మ్యాచ్ విన్నింగ్ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు (భారత్, న్యూజిలాండ్) వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దైంది. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ -
Ind vs Ban: గిల్, జైస్వాల్‌లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్‌తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్‌గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్‌ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్‌మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్‌కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్‌లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
Ind vs Ban: టీమిండియాదే విజయం.. రికార్డులే సాక్ష్యం!
పాకిస్తాన్‌ను సొంతగడ్డపై మట్టికరిపించి 2-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. అదే జోరులో భారత్‌లో అడుగుపెట్టింది. పటిష్ట టీమిండియాను పడగొట్టడం తేలికేమీ కాదని తెలిసినా.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొంది. అయితే, తొలి టెస్టు తొలి రోజు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.గెలుపు సంగతి దేవుడెరుగు.. బంగ్లాదేశ్ ప్రస్తుతం భారీ ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో నిలిచింది. అవును.. రెండు రోజుల ఆట మిగిలి ఉండవచ్చ. కానీ 515 పరుగులు సాధించడమైతే షాంటో బృందానికి అంత తేలికేమీ కాదు. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.ఇప్పటి వరకు టెస్టుల్లో 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని(ఫోర్త్ ఇన్నింగ్స్) బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఛేదించనే లేదు. 20 సార్లు ఇంతంటి భారీ లక్ష్యం ముందు నిలిచిన బంగ్లా.. ఒక్కసారి మాత్రం మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే.. పందొమ్మిదిసార్లూ ఓటమినే చవిచూసింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తూ ఉంటే.. బంగ్లాదేశ్ ఖాతాలో 20వ పరాజయం కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.అప్పుడు అశ్విన్ సెంచరీ.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఆరంభంలో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ధాటి(5/83)కి ఇబ్బంది పడ్డ టీమిండియా.. రవిచంద్రన్ అశ్విన్(113) సూపర్ సెంచరీతో కోలుకుంది.అశూతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 56, మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 86 పరుగులతో రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు స్కోరు చేసింది. అనంతరం.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ జడ్డూ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇపుడు గిల్, పంత్ శతకాలుఈ క్రమంలో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాను శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. గిల్(119 నాటౌట్), పంత్(109) అద్భుత శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 64 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్‌గా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్ విధించింది. అయితే, ఇంతటి లక్ష్యాన్ని ఛేదించాలంటే బంగ్లాదేశ్‌కు ఈజీ కాదు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! చూద్దాం.. ఇప్పటికైతే టీమిండియా విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుచదవండి: AFG vs SA: వన్డేల్లో అఫ్గన్ సంచలన విజయం.. సౌతాఫ్రికాపై సిరీస్ గెలుపు Aaj ka toh din hi 𝙎𝙝𝙪𝙗𝙝 hai! 🤌🏻Shubman Gill joins the centurion party with a stylish 💯#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/ZpcuwZyjxQ— JioCinema (@JioCinema) September 21, 2024WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
డకౌట్ని మరిపించి.. సెంచరీతో చెలరేగిన గిల్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. శనివారం నాటి మూడో రోజు ఆట భోజన విరామ సమయానికి 137 బంతులు ఎదుర్కొన్న గిల్.. 86 పరుగులు సాధించాడు.రెండో ఇన్నింగ్స్‌లోనే ఇలాబ్రేక్ తర్వాత తిరిగొచ్చి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ వన్‌డౌన్ బ్యాటర్ గత నాలుగు టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలతో పాటు.. ఒక సెంచరీ సాధించాడు. తాజాగా మరోసారి రెండో ఇన్నింగ్స్‌లోనే శతకంతో సత్తా చాటడం విశేషం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. పంత్ కూడా శతకం బాదాడుఈ క్రమంలో 83/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు గిల్, పంత్ శుభారంభం అందించారు. వీరిద్దరి శతకాల కారణంగా టీమిండియాకు ఏకంగా 514 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో గిల్.. 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని విధించింది.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుతుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్