Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Parliament Session 2024 Updates: NEET Issue Likely To Dominate Rajya Sabha Lok Sabha
లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌

Updates:లోక్ సభలో విపక్షాల వాకౌట్నీట్‌పై చర్చకు అనుమతించకపోవడంతో వాకౌట్రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత చర్చలో నీట్ విషయం మాట్లాడాలని కోరిన స్పీకర్అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనన్న మంత్రి రాజ్‌నాథ్ సింగ్నీట్‌పై చర్చకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలని కోరిన రాహుల్ గాంధీనోటీసు ఇచ్చిన తర్వాత దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌నీట్‌పై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్‌లోక్‌ సభ రూల్స్‌ ప్రకారం నడుస్తోంది: మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదు ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్‌ గాంధీవిద్యార్థులు పార్లమెంట్‌ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఒక్కరోజు నీట్‌పై చర్చించాలిఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశంరాహుల్‌ గాంధీ చెప్పిన అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిన స్పీకర్‌ ఓం బిర్లా #WATCH | Lok Sabha LoP Rahul Gandhi raises the NEET irregularities issue, in the House.He says, "A message is disseminated to the country, from Parliament. We want to give a message to students that NEET issue is important for the Parliament. So, to send this message we want… pic.twitter.com/MlXPdMFMH3— ANI (@ANI) July 1, 2024 లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. నీట్‌పై చర్చకు పట్టుపట్టిన విపక్షాలురాహుల్ గాంధీ మైక్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయటంపై వివరణ ఇచ్చిన స్పీకర్‌విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా​రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామన్న స్పీకర్‌స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదు: ఓం బిర్లా #WATCH | Amid Opposition protest in Lok Sabha, Speaker Om Birla says, "Outside the House, some MPs level allegations that the Speaker switches off the mic. The control of the mic is not in the hands of the one who sits on the Chair." pic.twitter.com/hAjCZsNxJg— ANI (@ANI) July 1, 2024 టీ-20 ప్రపంచకప్‌ సాధించిన భారత్‌ జట్టు, కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ అభినందనలు తెలిపారు.#WATCH | Lok Sabha Speaker Om Birla and the House congratulates Cricket Skipper Rohit Sharma and the entire Team India on winning #T20WorldCup2024 pic.twitter.com/MOI144KSxh— ANI (@ANI) July 1, 2024 లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయినీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుఎన్‌టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీల వాయిదా తీర్మానం నోటీసులు సభ ప్రారంభానికి ముందే విపక్షాల నిరసన పేపర్ల లీకేజీ, ఎన్‌టీఏపై చర్చించాలంటున్న విపక్షాలురాష్ట్రపతి ధన్యవాద తీర్మాణంపై చర్చించాలంటున్న అధికార పక్షం నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ, యూజీసీ నెట్ నిర్వహణ వైఫల్యంపై లోక్‌సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండు రోజుల విరామం అనంతరం 18వ లోక్‌సభ తాత్కాలిక సమావేశాలు తిరిగి ఇవాళ( సోమవారం) ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం, అగ్నిపథ్‌ వంటి అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తెలిపే అవకాశం ఉంది. ఈ మేరకు లోక్‌సభలో నిరసన చేట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telangana High Court Pronounce KCR Power Commission Petition Verdict Updates
కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టివేత

సాక్షి హైదారాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌, జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో.. ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా, దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. అయితే.. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో జెన్‌కో అధికారుల్ని సైతం విచారించిందని,ఈ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో ఏజీ వాదనలతో ఏకీభవించిన ప్రభుత్వం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో గులాబీ బాస్‌ తర్వాత ఏం చేయబోతున్నారో? అనే ఆసక్తి నెలకొంది.

PM Modis Love For Araku Valley Coffee This Tase Is Unique
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!

కాఫీ ఘుమఘుమలకు వహ్‌..! అని కితాబిస్తు ఒక్క సిప్‌ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్‌కీ బాత్‌ 111వ ఎపిసోడ్‌లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్‌ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్‌ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌‎గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‎లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్‌.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!)

JAY SHAH CONFIRMS ROHIT AND KOHLI WILL BE THERE IN THE CHAMPIONS TROPHY 2025
రోహిత్‌, కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త

టీ20 వరల్డ్‌కప్‌ 2024 అనంతరం టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్‌ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్‌, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడుతుందని హింట్‌ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు. టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటల్స్‌ అని తెలిపాడు. విరాట్‌, రోహిత్‌లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్‌ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్‌పాట్‌ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక​ అయిన బార్బడోస్‌లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్‌) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.అయితే, హరికేన్‌ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్‌ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్‌ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్‌ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్‌ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది.

Prabhas Kalki 2898 AD First Weekend Collection Details ‍
ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే

డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. 'కల్కి'తో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూళ్ల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి మరోసారి చేరిపోయాడు. 'బాహుబలి' నుంచి వరసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష‍్మీ)'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరస చిత్రాలతో వందల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. కాకపోతే 'బాహుబలి 2' తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్‌లో ఐదారు వందల కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. 'కల్కి' మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది.ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేసినట్లు తెలిసిపోయింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో 'బాహుబలి' మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించిందంటే.. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

Delhi High Court Judgement On MLC Kavitha Bail Petition Liquor Case
మూడు నెల‌లుగా జైల్లోనే.. క‌విత బెయిల్‌పై ఉత్కంఠ‌

న్యూఢిల్లీ: లిక్క‌ర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు(సోమ‌వారం) తీర్పు వెల్ల‌డించ‌నుంది. మూడు నెలలుగా తీహార్ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువ‌రించ‌నున్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కు రిజర్వు చేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత బెయిల్‌ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్‌ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

1st Case Under New Penal Code Filed Against This Person
కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!

న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్‌ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)గా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్‌ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్‌ నిర్వహిస్తున్న టైంలో.. ఆ‍ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్‌ బాటిల్స్‌ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ్‌ సంహిత క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్‌ పట్నాకు చెందిన పంకజ్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్‌ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్‌ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు.

Zomato has received a tax demand from the Karnataka authorities aggregating to Rs 9.5 crore
ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్‌ నోటీసులు!

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్‌ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్‌ చేసిన ట్యాక్స్‌ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్‌ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్‌లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్‌ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్‌ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్‌ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేతడిసెంబర్‌ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్‌ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్‌టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్‌లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

AP Pension Distribution Became TDP Event Amid MLAs Party Workers Hul Chul
టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!

తాడేపల్లి, సాక్షి: వలంటీర్‌ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్‌ చల్‌ చేస్తున్నారు.‘‘వలంటీర్‌ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.ఇదీ చదవండి: పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరుచంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్‌ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు జగన్‌ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి.

New Video brews Controversy Over Crucial Suryakumar Yadav Catch In T20 World Cup 2024 Final
సూర్యకుమార్‌ యాదవ్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ క్యాచ్‌... వివాదాస్పదం

టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్‌ మ్యాన్‌లా క్యాచ్‌ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్‌ క్యాచ్‌ కాదు సిక్సర్‌ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్‌ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్‌ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్‌ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్‌ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్‌ అంపైర్‌ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌ గెలిచేదని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. సూర్యకుమార్‌ క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్‌ తొలి బంతికే మిల్లర్‌ ఔటయ్యాడు. మిల్లర్‌ ఔట్‌ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement