Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rajya Sabha sessions july 3rd 2024 updates
ప్రధాని ప్రసంగం: రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌

updatesరాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీచర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.సభను విపక్షాలు అవమానిస్తున్నాయి. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ అసంతృప్తివిపక్షాలు ఇలా చేయటం సరికాదువిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదువిపక్షాలు అవమానిస్తున్నాయి.రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌కిషాన్‌ సమ్మాన్‌ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాంప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలుపదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాంప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగంరైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఈ ఎన్నికలో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నాపదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో ముందు వెళ్లుతోంది.అంబేద్కర్‌ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.మా విజయాన్ని చూసి కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు.రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందిఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచికరోనా కష్టకాలంలో కూడా భారత్‌ ఆర్థికంగా ముందుకు వెళ్లింది.గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాంఆర్థిక వృద్ధిలో భారత్‌ను ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాంవచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాంవిపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.గతంలో రిమోట్‌ ప్రభుత్వం నడిచింది. ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు. హత్రాస్‌ సత్సంగ్‌ తొక్కిసలాట ఘటనపై రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది భక్తులు మృతి చెందారు.#WATCH | Delhi: Rajya Sabha observes silence to mourn the loss of lives in Hathras Stampede accident. pic.twitter.com/mcF3aBszUo— ANI (@ANI) July 3, 2024 ప్రారంభమైన రాజ్యసభరాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.Prime Minister Narendra Modi will speak in the Rajya Sabha on the Motion of Thanks to the President's Address at around 12 noon. pic.twitter.com/YQqV0GqVlH— ANI (@ANI) July 3, 2024 నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్‌ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Kommineni Srinivasa Rao Strong Counter On TDP Super Six Schemes
ఏపీలో అప్పులు.. లెక్కలు.. ఇక అంతా మాయేనా?

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం.. ఇది టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే,పదే చేసిన ప్రచారం. ఆయనకు మద్దతు ఇస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇచ్చేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్‌లు అంటున్నారు.. పైగా సంపద సృష్టిస్తామంటున్నారు. అంటే అప్పులే చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు!. రాష్ట్రానికి అదే మేలు" కదా అని చాలా మంది అనుకున్నారు. ఎలాగైతేనేం చంద్రబాబు, పవన్‌లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇబ్బడి ,ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించినవారు ఇప్పుడు బిత్తరపోతున్నారు. ఇరవైరోజుల్లోనే ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవసరార్దం వెయ్యి కోట్లు రుణం సేకరించినా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా,చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడువేల కోట్ల అప్పు చేస్తే అదసలు లెక్కే కాదన్నట్లుగా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అంతేకాదు..జూలై నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అయితే ఈ అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. నిజంగా వారికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు మీడియా సమావేశం పెట్టి ,తాము ఎందుకు అప్పు చేశామో ప్రజలకు వివరించాలి. దానిని సంపద సృష్టికి వాడారా?లేక సంక్షేమ స్కీములకు వాడారా అన్నది చెప్పాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టైమ్ లో స్కీములు అమలు చేస్తుంటే, డబ్బును పప్పు ,బెల్లాల మాదిరి పందారం చేస్తున్నారని, బటన్ నొక్కుడు తప్ప ఇంకేమి చేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన స్కీములకన్నా మూడు రెట్లు అధికంగా వెల్ఫేర్ పధకాలు ప్రజలకు ఇస్తామని, దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ఊదరగొట్టారు. బహిరంగ సభలలో కన్నా, వీటిపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు వంటివారు ప్రతి గృహానికి వెళ్లి అక్కడ ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికి నీకు పదిహేనువేలు, నీకు పదిహేనువేలు అంటూ,పద్దెనిమిదేళ్ల వయసు దాటిని మహిళ కనిపిస్తే నీకు పద్దెనిమిది వేల రూపాయలు అంటూ తెగ ప్రచారం చేశారు. సంబంధిత వీడియో వైరల్ కూడా అయింది.ఈ సంగతి పక్కనబెడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన వృద్దాప్య పెన్షన్ నాలుగువేల రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇదిపాత స్కీమే అయినా వెయ్యి రూపాయలు పెంచారు. కనుక బాగానే హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది,ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలంతా దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అది వేరే విషయం.పెన్షన్ తో పాటు మూడు నెలల బకాయి మూడువేల రూపాయలు కూడా ఇచ్చారు.ఈ ఏడువేల రూపాయలను సుమారు అరవైఐదు లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను సుమారు 4550 కోట్ల వ్యయం అవుతుంది. ఇదే టైమ్ లో దివ్యాంగులకు, కిడ్నీ బాధితులు,ఇతర అర్హులైన వర్గాల వారికి కూడా పెరిగిన పెన్షన్ ఇచ్చారు. దీనికి అయ్యే వ్యయం మరికొన్ని కోట్లు ఉంటుంది.ఈసారి బకాయిలు కూడా చెల్లించవలసి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా, వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు రూ.2,600 కోట్ల వ్యయం అవుతుంది.ఇది కూడా చాలా ఎక్కువే. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండువేల రూపాయల పెన్షన్ ను మూడువేల రూపాయలు చేసి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ అమలు చేసింది. దానికి సుమారు రూ.1,800 కోట్ల వరకు అయ్యేది. విశేషం ఏమిటంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి.చంద్రబాబు వీటిలో కోతలుపెట్టకుండా అది కూడా ఇస్తే బహుశా నెలకు రూ.3,500 కోట్ల వరకు వెళ్లవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్ లకు సుమారు రూ.4,500 కోట్లు అవవుతుంది. అంటే ఈ రెండు పద్దుల కిందే సుమారు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నమాట.ఇదీ చదవండి: ఒక్క రోజే రూ.5,000 కోట్ల అప్పుఇవి కాకుండా అనేక ఇతర స్కీములు, ప్రభుత్వపరంగా ఉండే ఇతర వ్యయాలు ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే పదివేల కోట్ల రూపాయల అంచనా దాటిపోతుంది. కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత మొత్తం ఖర్చు అయితే, ఇక సూపర్ సిక్స్ లోని ఇతర స్కీముల అమలుకు ఇంకెంత కావాలో గణించుకోవచ్చు. బహుశా నెలకు పదిహేనువేల కోట్ల రూపాయల వరకు అవుతుందేమో తెలియదు. కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నిటిని అలవాటు ప్రకారం ఎగవేస్తే చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాని, కేంద్రం నుంచి వచ్చే వాటా,సాయం కాని అన్ని కలిపినా పది,పన్నెండు వేల రూపాయలు మించి ఉండకపోవచ్చు. అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది.కేవలం ఒక స్కీము అమలు చేసినందునే ఏడువేల కోట్ల అప్పు చేస్తే, మరి మిగిలిన స్కీముల కోసం ఎంత డబ్బు సమీకరించాలి?ఎంత అప్పు చేయాలి?దీని గురించి చంద్రబాబు లేదా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణాత్మకంగా చిత్తశుద్దితో చెబితే మెచ్చుకోవచ్చు. కాని వారు అలా చేసే అవకాశం ఉండదు. పైగా శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.అది వేరే కధ. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తే అప్పులపాలు అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇరవై రోజులలోనే ఎందుకు ఇంత అప్పు చేశారు?ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు తొంభైవేల కోట్ల నుంచి లక్ష కోట్ల అప్పు చేయడానికి సిద్దపడుతున్నారా?లేదా ఆ మేరకు సంపద సృష్టిస్తారా? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దిగిపోయే టైమ్ కు ఖజానాలో వంద కోట్లే ఉంది. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మారే నాటికి సుమారు 5500 కోట్ల నిధులు ఉన్నాయట.దీని గురించి వారు మాట్లాడరనుకోండి. ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు,పన్నేతర ఆదాయం ఉండనే ఉంటుంది. ఇవేవి చాలక ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. అన్నింటికి జిందాతిలిస్మాత్ మాదిరి.. అమరావతిని అభివృద్ది చేస్తామని, ఆ తర్వాత భూములు అమ్మి వేలు,లక్షల కోట్లు పంపాదిస్తామని, అదే సంపదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారు. భూములు అమ్మితే లక్షల కోట్ల ఆదాయం వస్తుందో,రాదోకాని, ముందుగా ఆ ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయడానికి సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు. ఇంకా ఏ రకంగా సంపద వస్తుందో వీరు ఇంతవరకు వెల్లడించలేదు. పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి మాదిరి చంద్రబాబు, పవన్ లు డబ్బును ఏమైనా సృష్టించే అవకాశం ఉందా?అన్న సందేహం రావచ్చు.అది సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే.ఈ మొత్తం ప్రక్రియలో అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన లక్షల కోట్ల రూపాయల విలువైన స్కీములను ఎగవేయాలి. అంటే ప్రజలను మోసం చేయాలి. లేక మభ్య పెట్టాలి. లేదంటే అప్పులు మరింతగా తెచ్చి వాటిని అర్హులందరికి పంచిపెట్టాలి. అది కూడా బటన్ నొక్కుడు కిందే వస్తుంది కదా?అప్పుడు ఏపీ రెండు శ్రీలంకలు అవుతుంది కదా! అయినా ఫర్వాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు, ఆయన అప్పుల ద్వారా సంపద సృష్టించడంలో చాలా శ్రమపడుతున్నట్లు పిక్చర్ ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉంది కనుక ఏమి చేసినా వారికి పచ్చగానే కనపడవచ్చు.కాని ప్రజలకు అలా కనిపిస్తుందా? అంటే చెప్పలేం. పాత వృద్దాప్య పెన్షన్ స్కీములో వెయ్యిరూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లేనని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సుమా!.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

BRS MP Keshava Rao Will Join In Congress
నేడు కాంగ్రెస్‌లోకి కేశవరావు.. కేబినెట్‌ విస్తరణ వాయిదా?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, సీనియర్‌ నేత కే. కేశవరావు నేడు హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవి(రాజ్యసభ సభ్యత్వం)కి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. రేపు(గురువారం) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్‌ హస్తిన పర్యటన నేపథ్యంలో కేబినెట్‌ విస్తరణ ఉండే అవకాశంలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. దీంతో, కేబినెట్‌ విస్తరణ వాయిదాపడే ఛాన్స్‌ ఉంది.

Union Minister BJP MP Srinivasa Varma Comments On AP Special Status
‘ప్రత్యేక హోదాకు బదులుగానే కదా ఏపీకి ప్యాకేజీ ఇచ్చింది’

న్యూఢిల్లీ, సాక్షి: ఎన్టీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మిత్రపక్షాలకు కేంద్రంలోని బీజేపీ మొండి చేయి చూపిస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్‌ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నరసాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారాయన. అలాగే.. బీహార్‌ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపైనా స్పందిస్తూ.. జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని ఎదురు ప్రశ్నించారాయన. ‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీర్మానాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్‌కు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారాయన. ఇక.. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా స్పందిస్తూ.. నిర్మాణ వైఫల్యం వల్లే డయాఫ్రం వాల్‌, కాపర్‌ డ్యాంకు పగుళ్లు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పొలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పర్వంపైనా స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు కొలిక్కి రావడానికి రెండు, మూడు నెలల టైం పట్టొచ్చని, గత పరిస్థితుల వల్లే ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారాయన.

Box Office War Between Prabhas, Jr NTR And Ram Charan
ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌.. మూడు సినిమాలు ఒకేసారి!

టాలీవుడ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్‌ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్‌ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్‌ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్‌ కొట్టింది. అల్లు అర్జున్‌ పుష్ప 2, ఎన్టీఆర్‌ దేవర, రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్‌ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్‌ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మధ్య 2026లో బక్సాఫీస్‌ వార్‌ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్‌ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ లవ్‌ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్‌ నటి)మరోవైపు గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌ చరణ్‌..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్‌ కొన్ని ట్యూన్స్‌ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్‌..ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కూడా సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్‌ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్‌ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే.

T20 World Cup 2024: Team India To Tour Mumbai In Open Bus After Meeting PM Modi
ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్‌.. ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగింపు

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్‌ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2007) టీమిండియా టైటిల్‌ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.THE MUMBAI TOUR OF TEAM INDIA IN OPEN BUS...!!!!! 🇮🇳- After meeting PM Narendra Modi, Team India will tour Mumbai in Open bus with T20 World Cup Trophy. 🏆❤️ (Abhishek Tripathi). pic.twitter.com/75tnkBihMD— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్‌లో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్‌ చేసుకోవాలని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించనుందని తెలుస్తుంది.వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. మోదీ భారత బృందం మొత్తాన్ని సన్మానించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆథ్వర్యంలోనే భారత ఆటగాళ్లను ముంబై నగర వీధుల్లో ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నీలు, ముఖ్యంగా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఓపెన్‌ టాప్‌ బస్‌ల్లో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని భారత ప్రభుత్వం బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తుంది.Can't wait to see these types of scenes in Mumbai of Team India with T20 World Cup Trophy...!!!!🏆❤️- THIS IS GOING TO BE GOOSEBUMPS. 🇮🇳 pic.twitter.com/o25c2dJDdZ— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో విజయబావుటా ఎగరవేసిన టీమిండియా ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెటర్లు హరికేన్‌ (గాలివాన) కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో ఇరుక్కుపోయారు. భారత బృందం రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో బార్బడోస్‌ నుంచి బయల్దేరనుంది.

Karnataka And Tami Nadu May Ban Pani Puri
త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో పానీ పూరీ బ్యాన్‌!?

బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పానీ పూరీలో క్యాన్సర్‌ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్‌ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Google Engineer Makes Worlds First AI Dress
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్‌'!

ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్‌ ఫోన్‌ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్‌ ఇంజనీర్‌ క్రిస్టినా ఎర్నెస్ట్‌. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్‌సైట్‌ సాయంతో రోబోట్‌లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్‌ని రోబోటిక్‌ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్‌"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్‌ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్‌ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్‌ స్నేక్‌ డ్రెస్‌ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న​ వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్‌ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ ‍డ్రెస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్‌ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్‌లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్‌ అయినా ఫ్యాషన్‌ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్‌నెస్‌ మంత్ర..సెవెన్‌ సెకండ్‌ కాఫీ ట్రెండ్‌..!)

Poll Says Kamala Harris Is Better Than Joe Biden For Democratic Party
బైడెన్‌ కంటే కమలా హారీస్‌ బెటర్‌.. పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహార శైలే కారణమని పలువురు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారీస్‌ను బరిలో దింపాలని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక పలు సర్వేల పోల్స్‌ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో, అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా సీఎన్‌ఎన్‌ పోల్‌ ప్రకారం.. నమోదైన ఓటర్లలో ట్రంప్‌నకు 47 శాతం ఓట్లు రాగా.. కమలా హరీస్‌కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్‌ 50 శాతం ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్‌కు 44 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు.. మిచెల్లీ ఒబామాకు 37 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో బైడెన్‌ డిబెట్‌ గురించే ప్రధానంగా చర్య జరుగుతోంది. ట్రంప్‌ను ఢీకొనడంతో బైడెన్‌ విఫలమయ్యారనే డెమోక్రటిక్‌ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో, ఆయన పోటీలో ఉంటారా? అనే చర్య మొదలైంది. మరోవైపు.. ట్రంప్‌తో డిబెట్‌ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్‌ చెప్పుకొచ్చారు.వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన..‘తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబెట్‌లో ట్రంప్‌తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించవద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all