Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్‌ అనేది కచ్చితంగా ఉంటుంది. – మాజీ సీఎం వైఎస్‌ జగన్‌సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీ­యాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే భవిష్యత్‌లో రియాక్షన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్‌­సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా­రని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ ద్వారా పరామ­ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగు­తు­న్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. ⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్‌లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? ⇒ అసలు ఇన్సిడెంట్‌ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్‌ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్‌ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్‌ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?ప్రతి దశలో ఓ రెడ్‌బుక్‌⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్‌బుక్స్‌ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్‌బుక్, లోకేశ్‌ స్థాయిలో ఒక రెడ్‌బుక్, ఎమ్మెల్యే స్థాయి­లో, మండల స్థాయి­లో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్‌బుక్‌లు పెట్టు­కుని ఏం చేస్తు­న్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొ­త్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడ­టం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్‌ చేసినా ఎస్పీ స్పందించలేదు⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్‌ అనే పోలింగ్‌ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామా­జిక వర్గం వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్‌ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్‌ బూత్‌లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థి­తుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగల­గొట్టిన కేసులో తనకు బెయిల్‌ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పు­డు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్‌ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. ⇒ వైఎస్‌ జగన్‌ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్‌లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌­యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీ­లకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితుల­య్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్‌ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్‌లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్‌ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. ⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. ⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్‌ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం.

సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు. చిత్రంలో మంత్రి పొంగులేటి
కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్‌రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్‌ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.

USA Presidential Elections 2024: House Democrats Consider Demanding Biden Withdraw From Race
USA Presidential Elections 2024: బైడెన్‌ను.. మార్చొచ్చా?

డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో జో బైడెన్‌ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్‌ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్‌ నుంచి డెమొక్రాట్‌ ఎంపీ ఒకరు బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్‌ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్‌పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్‌ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ (డీఎన్‌సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్‌ పేపర్‌పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్‌ కన్వెన్షన్‌లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్‌ గెల్చుకున్నారు. డీఎన్‌సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్‌కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్‌ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్‌లో (ఓపెన్‌ కన్వెన్షన్‌ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్‌ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్‌ బి.జాన్సన్‌ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్‌ కన్వెన్షన్‌ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్‌ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్‌సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్‌ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్‌ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్‌ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్‌ కన్వెన్షన్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్‌ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్‌సీ రూల్స్‌ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్‌కు ఛాన్స్‌ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్‌ కన్వెన్షన్‌లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్‌ హారిస్‌ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్‌ తర్వాత సీఎన్‌ఎన్‌ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్‌కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్‌ పార్టీ ప్రచార ఫండ్‌ను బైడెన్‌ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్‌ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్‌ డెస్క్‌

The Lancet Planetary Health journal: PM2. 5 pollution takes 33,000 lives each year in Indian cities
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు.

AP High Court key orders for demolitions YSRCP Offices
కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలే లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముకుతాడు వేసింది. అధికారుల దుందు­డుకు చర్యలను అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అతిక్రమణలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ప్రజల భద్రతకు ప్రమాదకారిగా మారినప్పుడు మాత్రమే కూల్చివేతలు చేపట్టవచ్చని, అయితే అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు అధికారులు ఎంత మాత్రం భవనాల కూల్చివేతలకు దిగరాదని హైకోర్టు ఆదేశించింది. అధికారులు తమ విచక్షణ, అధికారాన్ని వినియోగించే సమయంలో నిష్పాక్షికంగా, వాస్తవ దృక్పథంతో చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ కార్యాలయాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తమకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ వైఎస్సార్‌సీపీ వర్గాలు సంబంధిత అధికారుల వద్ద ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. చట్ట ప్రకారం వ్యవహరించేందుకు వీలుగా నేటి నుంచి రెండు వారాల్లోపు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు, అదనపు డాక్యుమెంట్లు, వివరణ, అదనపు వివరణలను అధికారులకు సమర్పించవచ్చని పేర్కొంది. రెండు వారాల గడువు ముగిసిన తరువాత వైఎస్సార్‌ సీపీ సమర్పించిన ఆధారాలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ వాదనను కూడా వినాలని ఆదేశించింది. అంతేకాకుండా రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించిన తరువాతే పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పింది. ప్రతి దశలోనూ వైఎస్సార్‌సీపీ వాదనలు వినాలని, ముఖ్యంగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం, మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్ట నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా వారి వాదనను వినాల్సిందేనని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం తీర్పు వెలువరించారు.కూల్చివేతల నోటీసులపై పిటిషన్లు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల కూల్చివేత నిమిత్తం పురపాలక శాఖ అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు, ప్రాథమిక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ, పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కూల్చివేతలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.నిర్మాణ సమయంలో అధికారులు సందర్శించలేదు..‘రాష్ట్ర విధానంలో భాగంగా అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీ కార్యాలయాల నిర్మాణం నిమిత్తం భూముల కేటాయింపు జరిగింది. భూములను స్వాధీనం కూడా చేశారు. ఆ ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు కూడా చెల్లించారు. భవన నిర్మాణాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. కొన్ని చోట్ల బిల్డింగ్‌ పర్మిట్‌లు కూడా వచ్చాయి. అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అధికారులు ఎప్పుడూ నిర్మాణ సమయంలో భవనాలను సందర్శించ లేదు. ఇప్పుడు అత్రికమణలు ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కూల్చివేతల కోసం నోటీసులు జారీ చేశారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలుభవన నిర్మాణాల్లో ఎలాంటి అతిక్రమణలు లేవని, చట్ట నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టామన్న వైఎస్సార్‌ సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం పెనాల్టీ విధించి నిర్మాణాలను క్రమబద్ధీకరించే అధికారం కమిషనర్లకు ఉందన్న వాదనను కూడా పరిగణలోకి తీసుకున్నారు. భవనాల కూల్చివేత వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదని, తమకు మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, అధికారులు ప్రస్తావించిన అతిక్రమణలు సైతం సరిచేసేందుకు అవకాశం ఉన్నవేనన్న వాదనను కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు.

Bill with more carats for jewelrys of less carats
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!

హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్‌ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్‌మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్‌ మాల్స్‌ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్‌ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్‌ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్‌ మార్క్‌ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్‌ మార్క్‌ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌లపై 916, 21 క్యారెట్‌లపై 875, 18 క్యారెట్‌లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్‌ తర్వాత హాల్‌ మార్క్‌ వేసిన సెంటర్‌ మార్క్‌ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్‌ అక్షరం కోడ్‌ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్‌ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్‌ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్‌లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్‌ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్‌ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్‌ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్‌లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్‌ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్‌) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్‌ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్‌ లేదా 91.6 కేడీయం గోల్డ్‌ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్‌ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్‌ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్‌ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్‌ మిషన్‌లతో ‘పంచ్‌’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్‌ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్‌ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్‌ మిషన్‌లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్‌–రే ఫ్లోరోసెన్స్‌ మిషన్‌ (కంప్యూటర్‌ అనుసంధాన యంత్రాల టంచ్‌ మిష¯Œన్‌)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్‌ గ్రామ్‌వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్‌ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్‌ గ్రామ్‌ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్‌ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్‌ స్వచ్ఛత24 క్యారెట్‌ 99.923 క్యారెట్‌ 95.822 క్యారెట్‌ 91.621 క్యారెట్‌ 87.518 క్యారెట్‌ 75.014 క్యారెట్‌ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్‌ మాల్స్‌ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్‌ మిషన్‌ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్‌ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్‌ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్‌ మార్క్‌ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ – భాస్కర్‌ కూచన, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్, లీగల్‌ మెట్రాలజీ, హైదరాబాద్‌(ఫోటో కామన్‌లో 04భాస్కర్‌.జేపీజీగా ఉంది.గమనించగలరు.

Sakshi Editorial On Parliament Sessions
రచ్చ కాదు... చర్చ కావాలి!

కొత్త సభ కొలువు తీరిందన్న మాటే కానీ, పార్లమెంట్‌లో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. 18వ లోక్‌సభ ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్‌ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికే పరిమితమయ్యాయి. కానీ, నేతలెవరు మాట్లాడుతున్నా... వెనుక నుంచి అవే అరుపులు, గందరగోళ పరిస్థితులు, రన్నింగ్‌ కామెంటరీలు, సభాపతితో వాగ్వాదాలు, చివరకు వాకౌట్లు తప్పలేదు. సర్వసాధారణంగా ఏకగ్రీవం గానో, లేదంటే అధికార – ప్రతిపక్షాల మధ్య పోటీతోనో జరగాల్సిన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మూజువాణి ఓటుతో సాగింది. ఇక, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని తద్భిన్నంగా గత అయిదేళ్ళుగా ఖాళీగా అట్టిపెట్టేసిన అధికార బీజేపీ, ఈసారి కూడా ఆ పదవిని వారికి వదిలిపెట్టే పెద్దమనసు చేస్తున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా తన మిత్రపక్షాలకు ఆ పదవిని కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నట్టు వస్తున్న కథనాలే అందుకు నిదర్శనం. ఇక, సభానాయకుడికీ, ప్రతిపక్ష నేతకూ మధ్య పొసగని పరిస్థితి సరేసరి. వెరసి లోక్‌సభలో మంగళవారం, రాజ్యసభలో బుధవారం ముగిసిన తొలి సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయి. ఈ పాపంలో అధికార, ప్రతిపక్షాలు రెంటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కొద్ది నెలలుగా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన పార్టీలు ఇప్పటికీ ఆ మానసిక స్థితి నుంచి బయట పడినట్టు లేవు. ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇరుపక్షాలూ పరస్పరం ఎన్నికల ప్రచార తరహా ఆరోపణల పర్వం కొనసాగించడం దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ తన ప్రథమ ప్రసంగంలోనే ప్రభుత్వంపై నిశిత విమర్శలతో దూకుడు ప్రదర్శించారు. ఇతర ప్రతిపక్ష నేతలు సైతం శక్తిమంత మైన ప్రసంగాలే చేశారు. కాబట్టి వారికి తగినంత సమయం ఇవ్వలేదన్న ప్రసక్తే లేదు. రాహుల్‌ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ మార్కులు సంపాదించినా, సరైన గణాంకాలతో సమస్యల్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేకపోయారు. అగ్నివీర్‌ లాంటి అంశాల్లో ఆయన లెక్కలు తప్పు చెప్పారు. మరోపక్క ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయే తప్ప, హుందాతనం పాటించలేదు. రాహుల్‌ సైతం సభలో సభ్యుల్ని రెచ్చిపొమ్మన్నట్టు ప్రేరేపించడం సైతం ఏ మాత్రం సమర్థనీయం కాదు.రాహుల్‌ది పిల్లతనం, కాంగ్రెస్‌ పరాన్నజీవి లాంటి రాజకీయ విమర్శలు గుప్పించిన మోదీ కూడా తక్కువేమీ తినలేదు. ఎంతసేపటికీ పాత ఎమర్జెన్సీ గాయాన్ని గుర్తు చేసి, కాంగ్రెస్‌ను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. లేదంటే గడచిన తమ పదేళ్ళ ప్రస్థానాన్ని గుణగాన సంకీర్తన చేశారు. అంతేతప్ప లోక్‌సభలో చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన, దేశాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలనుకోలేదు. సంక్షుభిత మణిపుర్‌లో ఏడాదిగా ఒక్కసారైన పర్యటించని మోదీ సదరు ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయంటూ రాజ్యసభలో అసత్యాలాపన చేయడం మరీ విడ్డూరం. ఒక్కమాటలో... ఈసారి సొంత మెజారిటీ తగ్గి, కూటమి ప్రభుత్వం నడుపుతున్న మోదీ ఇప్పటికీ గత రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో సాగిన బీజేపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తు న్నారు. ప్రభుత్వ పెద్దగా, అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని పోవాలన్న ఆలోచన చేయట్లేదు. పట్టువిడుపులు చూపట్లేదు. దాంతో ఇరుపక్షాలకూ మధ్య రాజీ కుదిరేలా కనిపించట్లేదు.అందరూ కలిసి నాటకీయ చర్యలు, వ్యాఖ్యలతో పార్లమెంట్‌ను (రణ) రంగస్థలిగా మార్చేశా రన్నది చేదు నిజం. అధికార, ప్రతిపక్ష నేతలు అంశాల వారీగా చర్చిస్తే, విభేదిస్తే ఫరవాలేదు కానీ, నిత్యం ఉప్పు నిప్పుగా ఉంటే పార్లమెంట్‌ నడిచేదెట్లా? మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి మరో అయిదేళ్ళుండగా, రేపే ఎన్నికలన్నట్టు రాజకీయ విమర్శల్లో మునిగితేలితే లాభమేంటి? నీట్‌ పరీక్ష, నిరుద్యోగం, ఈ అయిదేళ్ళలో సాగాల్సిన నియోజక వర్గ పునర్విభజన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన జనగణన లాంటి అనేక తక్షణ, దీర్ఘకాలిక అంశాలు చర్చకు మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. కీలకమైన బిల్లుల ఆమోదానికి లోక్‌సభలో టీడీపీ, జేడీయూల పైన, రాజ్యసభలో బిజూ జనతాదళ్‌ సైతం దూరమైనందున ఇతరులపైన ఆధారపడాల్సిన మోదీ 3.0 ఆభిజాత్యం వదులుకోకపోతే కష్టం. ఘర్షణ, విద్వేషం మరింత పెరిగిపోవడాని కన్నా ముందే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశ శ్రేయస్సు కోసం హుందా చర్చకు తెర తీయాలి.బడ్జెట్‌ కోసం జూలై మూడో వారంలో పార్లమెంట్‌ తిరిగి సమావేశం కానుంది. అప్పుడైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ఇరుపక్షాలూ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతిపక్ష వాదనకు చెవి ఒగ్గాల్సిన బాధ్యత పాలకులకు తప్పనిసరిగా ఉంది. అదే సమయంలో– ప్రజలిచ్చిన మెజారిటీతో గద్దెనెక్కి, చెప్పే అధికారం చేజిక్కించుకున్న పాలకుల మాటలను ప్రతిపక్షాలూ సావధానంగా విని తీరాలి. ఎవరు ఎవరిని మాట్లాడనివ్వబోమన్నా, వినిపించుకోబోమన్నా అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాక్షేమానికి అసలు పనికిరాదు. అనేక అంశాలపై పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. కానీ పార్లమెంట్‌లో జరగాల్సింది అర్థవంతమైన చర్చే తప్ప అనవసర రాద్ధాంతం కాదు. ప్రజాస్వామ్య దేవాలయంగా, అత్యున్నత నిర్ణాయక వేదికగా పార్లమెంట్‌కు ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అది అందరికీ నష్టం. గత పదేళ్ళుగా చట్ట సభల్లో అంతకంతకూ పెరిగిపోతున్న ఇలాంటి ప్రవర్తన ఇలాగే కొనసాగితే, మొదటికే మోసం వస్తుంది. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన చట్టసభల సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతుంది.

BRS Leader KCR Comments On Congress Party
మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ పాలన లేకపోవడంతో మహారాష్ట్రతోపాటు దేశం కూడా నష్టపోయిందనే భావన కొందరు మహారాష్ట్ర నేతలు తనవద్ద వ్యక్తం చేశారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమితో కేసీఆర్‌ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం తనను కలిసేందుకు వచి్చన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. ‘విద్యుత్, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్‌ పాలన కావాలని కోరుకున్నారు. ఆబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులు వేశారు. దేశ రైతాంగం పురోగతికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతులను నిరుత్సాహ పరిచింది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలదే అంతిమ నిర్ణయం ‘ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. అధికారం, ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు..ప్రజాతీర్పే శిరోధార్యం. వారు ఏ పాత్ర అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమానికి కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతర పోరాటం ద్వారా అభిమానాన్ని సాధించాలి. గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించక పోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధే బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యం.నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేయాలంటూ’పార్టీ కేడర్‌కు కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. సమాచారం లేకుండా రావొద్దు ముందస్తు సమాచారం లేకుండా తనను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడొద్దని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నుంచి అందే సమాచారం తర్వాతే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకొని రావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కేసీఆర్‌ తిరిగి సీఎం కావాలని నినాదాలు చేశారు. గురువారం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్‌ ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Team India T20 World Cup victory parade
సంద్రం.. జనసంద్రం

పొట్టి ఫార్మాట్‌లో 17 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి టి20 ప్రపంచకప్‌ను ధోని బృందం గెలుచుకొచ్చింది. దేశమంతా వరల్డ్‌కప్‌ విజయంతో పెద్ద పండగే చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్‌ శర్మ జట్టు రెండో టి20 ప్రపంచకప్‌ను తెచ్చి పెట్టింది. మరి అ‘ద్వితీయ’ చాంపియన్‌షిప్‌ సంబరాలు మామూలుగా ఉండవుగా! ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్‌ అవగానే గ్రాండ్‌గా మొదలైన సంబరాలు సాయంత్రం ముంబైలో మెరైన్‌డ్రైవ్‌ను ముంచెత్తాయి. రాత్రయ్యేసరికి వాంఖెడేలో ఆటగాళ్లకు రూ. 125 కోట్ల నజరానా, ఘన సన్మానంతో కనులవిందుగా ముగిసింది. న్యూఢిల్లీ/ముంబై: గత శనివారం టీమిండియా టి20 ప్రపంచకప్‌ గెలిచింది. యావత్‌ భారతం చిందేసింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ గెలవడం... ఆ కప్‌ రాక ఆలస్యం కావడంతో దాని కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన అభిమానగణం రాగానే ఊరుకుంటారా? ‘పూనకాలు లోడింగ్‌’ అని హోరెత్తించరు! అవును సరిగ్గా అదే చేశారు. అడుగడుగునా అ‘ద్వితీయ’ ప్రపంచకప్‌నకు అపూర్వ స్వాగతం పలికారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల్లో కొందరు ‘త్రివర్ణ’ పతాకాలతో... మరికొందరు ‘కంగ్రాట్స్‌’ ప్లకార్డులతో ఆటగాళ్లను అభినందిస్తూ తెగ సందడి చేశారు. క్రికెట్‌కు మతమైన భారత్‌లో అభిమానులు కప్‌నకు, కప్‌ కార్యసాధకులకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఉదయం ఢిల్లీలో ఆగమనంతో మొదలైనపుడు ఎంతటి జోష్‌ కనబడిందో... ముంబైలో ఘన సన్మానం పూర్తయ్యేసరికి రాత్రిదాకా అభిమానోత్సాహం అలాగే కొనసాగడం విశేషం! అభిమాన ప్రవాహం ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ఏకబిగిన 14 వేల కిలోమీటర్ల ప్రయాణం బహుశా ఇదే మొదటిసారేమో! ఎందుకంటే 14,000 వేల కి.మీ. అంటే సగం ప్రపంచాన్ని చుట్టేసే దూరమన్న మాట! ఇంత ప్రయాణ బడలిక ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుంది. వెంటనే తనువు–మనసు విశ్రాంతి కోరుతుంది. కానీ అభిమాన ప్రవాహం ముందు ఆటగాళ్లలో ఎలాంటి అలసటే కనిపించలేదు. కిక్కిరిసిన మెరైన్‌ డ్రైవ్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక బస్‌లో బయలుదేరిన భారత క్రికెటర్లు నారీమన్‌ పాయింట్‌కు రాగానే ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఎక్కారు. మెరైన్‌ డ్రైవ్‌ తీరం వెంట సాగరం (అరేబియా సముద్రం) పక్కన సాగరం (ప్రేక్షకులతో) కనిపించింది. వానచినుకులు పడుతున్నా ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడికీ కదల్లేదు. తమ దేశానికి కప్‌ సాధించిపెట్టిన క్రికెటర్ల అభివాదాల కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూశారు తప్ప వెనక్కి తగ్గలేదు. ఓపెన్‌ టాప్‌ బస్‌లో ప్రపంచకప్‌తో ఉన్న ఆటగాళ్లను క్రికెట్‌ వీరాభిమానులంతా తమతమ ఫోన్‌ కెమెరాల్లో అదేపనిగా బంధించేపనిలో పడ్డారు. దారిపొడవునా సాగిన ఈ విజయోత్సవ ర్యాలీ మెరైన్‌ డ్రైవ్‌కే కొత్త శోభ తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడే సమీపంలో ఉన్న వాంఖెడే స్టేడియంలో సీట్ల సామర్థ్యానికి సరిపడా అభిమానుల్ని అనుమతించగా, ప్రత్యేకంగా నీలిరంగులో ఏర్పాటు వేదికపై తెలుపు రంగులో ‘చాంపియన్స్‌’ అక్షరాలు ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. కోహ్లి, రోహిత్, హార్దిక్‌ ఇతర సభ్యులందరూ డాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించిన నజరానాను ఒక్కొక్కరిగా కాకుండా టీమ్‌ సాధించిన విజయానికి సూచికగా రూ. 125 కోట్ల చెక్‌ను ఆటగాళ్లకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక నిష్క్రమించే సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా టెన్నిస్‌ బంతులపై ఆటోగ్రాఫ్‌ చేసి ప్రేక్షకుల గ్యాలరీ దిశగా కొట్టారు. జగజ్జేతలకు మోదీ జేజేలు కరీబియన్‌ గడ్డపై టి20 ప్రపంచకప్‌ సాధించిన భారత క్రికెటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఉదయం అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని ప్రతి ఒక్క క్రికెటర్‌ కప్‌ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. కెప్టెన్ రోహిత్‌ శర్మ, కోచ్‌ ద్రవిడ్‌ ఇద్దరు కలిసి మోదీ చేతిలో ప్రపంచకప్‌ను పెట్టారు. ఇరువైపులా జట్టు సభ్యులంతా నిల్చొని ఫొటోకు ఫోజిచ్చారు. ‘చాంపియన్స్‌తో జరిగిన ఈ మీటింగ్‌ చాలా అద్భుతంగా గడిచింది. వారికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతో ఆనందాన్ని పంచింది. కప్‌ వేటలో వాళ్లు పడిన పాట్లు, చేసిన పోరాటాలు.మొత్తం టోర్నీ జర్నీపై వారు నాతో పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నా మదిలో పదిలంగా ఉంటాయి’ అని మోదీ ‘ఎక్స్‌’లో ఫొటోలను జతచేసి ట్వీట్‌ చేశారు. క్రికెటర్లతో పాటు ప్రధానిని కలిసిన బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్‌ బిన్నీ, జై షా ఈ సందర్భంగా మోదీకి ‘నమో’ పేరిట నం.1 జెర్సీని అందజేశారు. ఇంతటి జనసందోహం చూస్తుంటే మాలాగే ఈ ప్రపంచకప్‌ కోసం వాళ్లు ఎంతగా ఆరాటపడ్డారో... టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. –కెప్టెన్ రోహిత్‌ శర్మ కిక్కిరిసిన రోడ్లపై ఈ రాత్రి మీరు కురిపించిన ప్రేమాభిమానాల్ని ఇకపై మిస్‌ అవుతాను. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోను. –కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గినపుడు సీనియర్లు వెలిబుచ్చిన భావోద్వేగాలకు, కన్నీళ్లకు నేను చలించలేదు. కానీ ఇప్పుడు అవే... నన్ను నేను అదుపు చేసుకోలేనంతగా బయటికి వస్తున్నాయి. –విరాట్‌ కోహ్లి

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all