Joe Biden
-
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
ఉక్రెయిన్‌కు బైడెన్ భారీ ఆఫర్.. ట్రంప్ సమర్థిస్తారా?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్‌కు ఇచ్చిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేల సంఖ్యలో ఉక్రెయిన్‌వాసులు దేశం విడిచివెళ్లారు. రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్‌కు అగ్ర రాజ్యం అమెరికా అండగా నిలిచింది. బైడెస్ ప్రభుత్వం జెలెన్ స్కీకి ఆర్థికంగా, ఆయుధాల విషయంలోనూ సాయం అందజేసింది.ఇక, తాజాగా అధ్యక్షుడు బైడెన్.. ఉక్రెయిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అందజేసిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపిన అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. బైడెన్ తన పదవి నుంచి దిగేపోయే ముందే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తాము చేయాల్సినంత సాయం చేసి వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక సాయం అందించే దిశగా బైడెన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, బైడెన్ నిర్ణయం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. The Biden Administration has moved to forgive $4.7 billion of US 🇺🇸 loans provided to Ukraine 🇺🇦 says State Department Spokesperson Matthew MillerThese loans were approved as part of a $60.8 billion package for Ukraine this April. Great news for Ukraine this week from US pic.twitter.com/hbob3Ixvji— Ukraine Battle Map (@ukraine_map) November 20, 2024 -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్‌తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
బైడెన్ గ్రీన్‌సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్, ట్రూడో మిస్సింగ్!
ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం. తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
గ్లోబల్ సౌత్‌ను పట్టించుకోవాలి
రియో డిజనిరో: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు దక్షిణార్ధ గోళ (గ్లోబల్ సౌత్) దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై జీ20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ‘‘గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే జీ20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతం అవుతాయి’’ అని స్పష్టం చేశారు.రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ‘ఆకలి, పేదరికంపై పోరు–సోషల్ ఇంక్లూజన్’ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ‘‘గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలి్పస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది.అన్ని దేశాలనూ కలుపుకునిపోయేలా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాథమ్యమివ్వాలని నిర్ణయించింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలి’’ అని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి మొదలుకుని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్ తీరు ఆచరణీయం పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ‘‘ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పై చిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు’’ అని వివరించారు. గ్లోబల్ సౌత్‌తో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది.బైడెన్‌తో మోదీ భేటీజీ20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం.ఘనస్వాగతం జీ20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో శాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు. -
బైడెన్ లాగే మతిమరుపు
అమరావతి/ చిముర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని నరేంద్ర మోదీ మతిమరుపుతో బాధపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దేశ డీఎన్ఏగా భావిస్తుందని, అధికార బీజేపీ, రాష్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లకు మాత్రం అదో ఖాళీ పుస్తకమని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని, కానీ మహారాష్ట్రలో అదే జరిగిందని పేర్కొన్నారు.బడా వ్యాపారవేత్తలకు సంబంధించి 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని బీజేపీపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగమే మన దేశ డీఎన్ఏగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అదో ఖాళీ పుస్తకం’అని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ ప్రదర్శిస్తున్న రాజ్యాంగ ప్రతిలో లోపలి పేజీలు ఖాళీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా స్పందించారు. నేను లెవనెత్తుతున్న అంశాలపైనే మోదీ మాట్లాడుతున్నారని సోదరి ప్రియాంకగాంధీ నా దృష్టికి తెచ్చారు. ‘కులగణన జరగాలని, రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని నేను మోదీకి లోక్‌సభలో చెప్పాను.కానీ ఆయన మాత్రం నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే మతిమరుపుతో బాధపడుతున్నారు’అని రాహుల్ ధ్వజమెత్తారు. బైడెన్ ఒక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేయడాన్ని ఉదహరించారు. అలాంటి లక్షణాలే మోదీలోనూ కనపడుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ కులగణనకు వ్యతిరేకమని కూడా మోదీ చెబుతారని ఎద్దేవా చేశారు. రాహుల్ బ్యాగ్ తనిఖీ సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లా రు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ధమన్‌గావ్ రైల్వే హెలిప్యాడ్‌లో దిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల సంఘం తనిఖీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. -
జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీక జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరుచూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌మాట్లాడుతూ.. బిడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు.‘ప్రధానిమోదీ ప్రసంగం విన్నట్లు మా సోదరి ప్రియాంక నాతో చెప్పింది. ఆయన ఆ స్పీచ్‌లో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుతోందే దానిపైనే మోదీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తప్పుగా అన్నారు. అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అలాగే మన ప్రధాని కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. గత ఏడాది కాలంగా నా ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా.. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్దాలు చెబుతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేస్తామని లోక్‌సభలో కూడా చెప్పాను. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘వెల్కమ్ బ్యాక్ ట్రంప్’.. బైడెన్‌తో భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బుధవారం తొలిసారి వాషింగ్టన్లో అడుగు పెట్టారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఓవర్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు వారి నడుమ చర్చకు వచ్చినట్టు సమాచారం. తన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి ‘వెల్కం బ్యాక్’ అంటూ ట్రంప్‌ను బైడెన్ స్వాగతించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అనంతరం నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ‘‘రాజకీయా లు కఠినమైన వ్యవహారం. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.మెలానియా డుమ్మాబైడెన్తో ట్రంప్ భేటీకి ఆయన భార్య మెలానియా డుమ్మా కొట్టారు. ట్రంప్‌పై నమోదైన రహస్య పత్రాల కేసులో బైడెన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతోనే ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్లోరిడా నివాసంలో సోదాల సందర్భంగా మెలానియా వార్డ్ రోబ్‌ను అధికారులు అణువణువూ శోధించారు. ఆ క్రమంలో ఆమె లో దుస్తులున్న షెల్ఫ్‌ను కూడా వదిలి పెట్టలేదు. మెలానియా భేటీకి రాకున్నా ఆమెకు జిల్ అభినందన లేఖ రాశారు. దాన్ని ట్రంప్‌కు స్వయంగా అందజేశారు. -
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
బైడెన్ వల్లే ఓడిపోయాం
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్ సాకులు చెబుతున్నారని బైడెన్ మాజీ సహాయకుడు ఆక్సియోస్ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఆరోపించారు. -
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు మనదేశం నుంచి ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వేలాది మంది వెళ్తుంటారు. ఇప్పటికే చాలామంది అక్కడి వెళ్లి స్థిరపడ్డారు.ఆ దేశంలో ఈనెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్ బరిలో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లో..కమలా హారిస్‌కే విజయావకాశాలు ఎక్కువ కోదాడ: మాది కోదాడ. మేము ఉద్యోగ రీత్యా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కే ఎక్కువ విజయావకాలున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వారిలో 80 శాతం మంది కమలకే మద్దతుగా నిలుస్తున్నారు. భారతీయులు దాదాపు కమలాహారిస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వారి అంచనాల ప్రకారం 2శాతం మెజార్టీతో కమల గెలుపొంది అమెరికా అధ్యక్షురాలు అవుతుంది. – కందిబండ ప్రియాంక, నార్త్ కరోలినాట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్నారుకోదాడ: మా స్వస్థలం కోదాడ పట్టణం. అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ట్రంప్‌కు మద్దతిచ్చేవారు తగ్గిపోయారు. ట్రంప్ గెలవకూడదని ఎక్కువ శాతం ప్రజలు కోరుతున్నారు. నార్త్ కరోలినాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కమలా హారిస్‌కే మద్దతు ఎక్కువగా ఉంది. – శరాబు కృష్ణకాంత్, నార్త్ కరోలినాడెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గుకోదాడ: మాది కోదాడ పట్టణం. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడ్డాం. అధ్యక్ష్య ఎన్నికల్లో ఈ సారి ఇండియన్స్ డెమోక్రాట్స్ అభ్యర్థి కమలాహారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా కమల గెలుస్తుందనే చర్చ జరుగుతుంది. వలస చట్టాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారు భయపడుతున్నారు. ట్రంప్ కూడా తన ప్రసంగాలలో ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ప్రచారం చేసూ్తన్నారు. – బొగ్గారపు మణిదీప్, గుడుగుంట్ల నాగలక్ష్మి, చికాగోబలమైన నాయకత్వం అవసరంఆత్మకూర్ (ఎస్): మాది ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. అమెరికాలోని నార్త్ కేరోలినాలో కెమికల్ ఎనావిుస్ట్గా స్థిరపడ్డాను. అమెరికా దేశం ముందు ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కొంటోంది. ధరలు పెరగడం, పెరుగుతున్న నేరాలు, సరిహద్దు భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నాయకత్వం అవసరం. వైఫల్యంతో నిండిన బైడెన్ ఆర్థిక, వలస, విదేశీ విధానాల నుంచి పునరుద్ధరించడానికి ట్రంప్ గెలుపు చాలా అవసరం. – దండ నీరజ, కెమికల్ ఎనావిుస్ట్, నార్త్ కేరోలినాడోనాల్డ్ ట్రంపే గెలుస్తారు సూర్యాపేట: మాది సూర్యాపేట పట్టణం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సిన్సినాటి, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కే విజయావకాశాలు ఉన్నాయి. నేను కూడా అదే పార్టీకి ఓటేయాలనుకుంటున్నా. ఈ సారి ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్, ఇజ్రాయిల్ యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే వ్యాపార వర్గాలకు పన్నుల్లో రాయితీ ఇస్తారని, దీంతో ద్రవ్యోల్భణం నియంత్రణ అవుతుంది. – విజయశంకర్ కోణం, సిన్సినాటి, ఒహాయోట్రంప్ గెలిస్తేనే బాగుంటుందిఆత్మకూర్(ఎం) : మాది ఆత్మకూర్(ఎం) మండలం సిద్ధాపురం. మేము 27 సంవత్సరాల నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్నాం. మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రటికన్ పార్టీ నుంచి కమల హారిష్ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ట్రంప్ ముక్కుసూటి మనిషి అయినా ఆయన గెలిస్తేనే భద్రత అనే ఉంటుందని నా అభిప్రాయం. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నా పాలన పరంగా పెద్దగా అనుభవం లేదు. ఆమె విధి విధానాలు ట్రంప్‌కు లాభం కలిగేలా ఉన్నాయి. – ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి, న్యూయార్క్హోరాహోరీగా ఎన్నికల ప్రచారంఅర్వపల్లి: మాస్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అమెరికాలోని టెన్నెసి రాష్ట్రంలో ఉంటున్నాం. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఈసారి అక్కడి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కమలాహారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా ఉంది. భారతదేశ అభివృద్ధికి కృషిచేసే వారికే ఓటేయాలి. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – జన్నపు శ్రీదేవి, టెన్నెసిట్రంప్ గెలిస్తేనే భారతీయులకు భద్రతతిరుమలగిరి(నాగార్జునసాగర్): మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం కొంపల్లి గ్రామం. నేను, నా భర్త బొలిగోర్ల శ్రీనివాస్, ఆలియాస్ కొంపల్లి శ్రీనివాస్ 2010లోనే ఆమెరికాలోని కొలంబస్కు వచ్చాం. అప్పటి నుంచి కొలంబస్లో ఉంటున్నాం. భారతీయుల భద్రత విషయంలో ట్రంప్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంప్ గెలుస్తేనే భారతదేశానికి గానీ, అమెరికాలో ఉంటున్న భారతీయులకు గానీ లాభం చేకూరుతుంది. కమలాహారిస్భారత సంతతికి చెందినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. – దివ్య, కొలంబస్ట్రంప్ గెలిచే అవకాశం ఉందిభువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు. – జి.సంతోష్, కాలిఫోరి్నయాప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ గెలవాలి భువనగిరి: మాది వలిగొండ మండలం టేకులసోమారం గ్రామం. అమెరికాలోని నార్త్ కరోలినాలో 23 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఆరు నుంచి 7 వరకు స్వింగ్ స్టేట్స్ వీరి గెలుపును నిర్థారిస్తాయి. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఇండియన్స్ ఎక్కువ శాతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేడు మాత్రం ట్రంప్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. – పడమటి శ్యాంసుందర్‌రెడ్డి, నార్త్ కరోలినాభారతదేశ అభివృద్ధికి సహకరించే వారికే ఓటేయాలిఅర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామం. అమెరికాలోని అట్లాంటా ఉంటున్నాం. ఇప్పటికే రెండు సార్లు అమెరికా ఎన్నికల్లో ఓటు వేశాను. భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటేయాలి. సాఫ్ట్వేర్ పరిశ్రమకు, భారత విదేశాంగ విధానం, ఎగుమతి, దిగుమతికి మద్దతు తెలిపే వాళ్లకే మా ఓటు. కులాలను చూసి ఓటు వేయవద్దు. – జూలకంటి లక్ష్మారెడ్డి, అట్లాంటాభారతీయులు ట్రంప్ వైపే.. అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం. అమెరికాలోని హూస్టన్‌లో స్థిరపడ్డాం. 30 ఏళ్ల పైనుంచి అక్కడే ఉంటున్నాం. ఇప్పటికే 20 సార్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ట్రంప్‌వైపే ఉన్నారు. నాది రిపబ్లికన్ పార్టీ. నేను ఎన్నికల్లో ట్రంప్‌కే ఓటేస్తాను. – ఆలూరి బంగార్రెడ్డి, హూస్టన్ట్రంప్ గెలవాలనుకుంటున్నారునల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్‌కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్ గెలవాలనుకుంటున్నారు. – కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్ ఏంజెల్స్ట్రంప్తోనే ఉద్యోగావకాశాలునేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి. మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయి. – దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, బేబికాన్ నా మద్దతు కమలాహారిస్‌కే..శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్‌లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్‌కే. – పాదూరి రామమోహన్‌రెడ్డి, మిజోరి స్టేట్ -
ఎన్నికల వేళ ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సోషల్‌మీడియాలో ప్రజలకు చివరిసారిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.ముస్లిం ఓటర్లకు ట్రంప్ గాలంఅమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందామని,దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద, విస్తృతమైన సంకీర్ణాన్ని నిర్మిద్దామని ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని శాంతిని కోరుకునే మిచిగాన్‌లోని అనేక మంది అరబ్,ముస్లిం ఓటర్లుఓటర్లకు తెలుసన్నారు. అందుకే తనకు ఓటేసి శాంతిని పునరుద్ధరించాలని ట్రంప్ కోరారు.కమల చేతిలో ట్రంప్ ఓటమి ఖాయం:బైడెన్మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయని, కమలా హారిస్ ట్రంప్‌ను ఓడిస్తుందని తనకు తెలుసని అధ్యకక్షుడు జో బైడెన్ పోస్టు చేశారు. ఇందుకు మీరంతా ఓటింగ్‌లో పాల్గొనాలని బైడెన్ కోరారు.ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. Tomorrow is our last chance to defeat the corrupt establishment. GET OUT AND VOTE! #FightForAmerica https://t.co/czQRkZmr59 pic.twitter.com/vKF0bXhBnb— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2024ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం.. వీడియో వైరల్ -
‘చెత్త ట్రక్’ నడిపిన ట్రంప్.. బైడెన్, కమలకు కౌంటర్
న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్‌ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్‌ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్‌క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నాయకులు స్పీడ్ పెంచారు. తాజగా రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారీస్ సంచలన విమర్శలు చేశారు. క్రమంగా ట్రంప్ మతి తప్పుతోందని ఆమె కామెంట్స్ చేశారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆరు మిలియన్ల మంది యూదులు, వందల వేల మంది అమెరికన్ల మరణాలకు కారణమైన వ్యక్తి హిట్లర్. అటువంటి వ్యక్తిని ట్రంప్ పొడుగుతున్నారు. హిట్లర్ కొన్ని మంచి పనులు చేశారని ట్రంప్ అంటున్నారు. అమెరికాకు మిలటరీ బదులుగా హిట్లర్ వంటి జనరల్స్ ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. హిట్లర్ వంటి వ్యక్తిని ప్రశంసించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ట్రంప్ ఎలాంటి వారో ఆయన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. అమెరికా ప్రజలు ట్రంప్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి’ అని కోరారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబర్ ఐదో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29న కమలా హరీస్ ప్రచార ముగింపు సభ ఉండనుంది. 29న తన చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇక, ఇప్పటికే ట్రంప్ కూడా వినూత్నంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.As a Jew, nothing is more offensive to me than hearing Kamala Harris compare her political opponent to Hitler simply because she disagrees with him. Hitler was responsible for the murder of six million Jews, whereas Trump has done everything to make Jews in America safer. The… pic.twitter.com/GyidDA4dYu— Awesome Jew (@JewsAreTheGOAT) October 23, 2024 -
ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాక్(జైలులో వేయాలి) చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల ముందు న్యూ హాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న పలు నేరారోపణల ఎత్తి చూపుతూ బైడెన్ జైలులో వేయాలని విమర్శలు గుప్పించారు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని బైడెన్ హెచ్చరించారు.NOW - Biden says America needs to imprison Trump 14 days before election day: "We gotta lock him up."@disclosetv pic.twitter.com/FB6Xb8Wv3T— THE VOICE 🌹 🗣🎙🇺🇸🦅🌎⚓💜♠️CHRIST CONSCIOUSNESS (@WETHEKINGDQMQ98) October 22, 2024‘‘అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత 2016 ఎన్నికలను గుర్తు చేస్తుంది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్.. హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ ‘లాక్ హర్ అప్’ అని ప్రచారం చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించారు. దీనిని అప్పుడు ట్రంప్ తన ప్రచారానికి అస్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్అ టువంటి వ్యాఖ్యలు, నినాదాలకు చాలా దూరంగా ఉన్నారు. నేరారోపణలను కోర్టులు చూసుకుంటాయి. మనం నవంబర్‌లో ఫలితాలను చూద్దామని కమల వ్యాఖ్యానించారు. నేను హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ఇతర దేశాధినేతలు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు’’ అని అన్నారు. అయితే.. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్ హర్ అప్’ అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ట్రంప్ తన మద్దతుదారులను నిలువరించలేదు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్‌నకు కమలా హారిస్ మద్దతుదారులు అన్వయిస్తూ నినాదాలు చేయటం గమనార్హం. -
ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: తమపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి తమకు తెలుసునని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, యూఎన్ భద్రతా మండలి స్విస్ ప్రెసిడెన్సీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రాసిన లేఖ తీవ్రమైన ఆందోళన, రెచ్చగొట్టే విధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. చట్టవిరుద్ధమైన సైనిక దురాక్రమణకు అమెరికా పరోక్ష ఆమోదం, స్పష్టమైన మద్దతును ప్రకటిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ‘‘అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే దురాక్రమణ చర్యలను ప్రేరేపించటం, ప్రారంభించటంపై అగ్రరాజ్యం అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.BREAKING: Iran says US will bear ‘full responsibility' for an Israeli retaliation.— The International Index (@theintlindex) October 21, 2024క్రెడిట్స్: The International Indexఅక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన మిసైల్స్ దాడికి ఎలా? ఎప్పుడు? స్పందిస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు జో బైడెన్ ఇటీవల స్పందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్.. ఇరాన్‌పై చేసే ప్రతీకార దాడిపై స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.ఇక.. టెహ్రాన్ మద్దతుగల హమాస్, హెజ్బొల్లాకు చెందిన నాయకులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్‌ను అంతంచేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు మిత్ర దేశమైన ఇజ్రాయెల్.. గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాను దాడులకు అంతం చేసి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.చదవండి: ట్రంప్ ‘మెక్‌డొనాల్డ్’ షోపై భారీ ట్రోలింగ్ -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్ -
నా పాలన బైడెన్‌కు కొనసాగింపుగా ఉండదు: కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.Kamala Harris on what she would do differently from Biden’s presidency: “Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024 ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్ -
‘కమల మార్క్ పాలన వేరు’.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు. .. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు. ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు -
ట్రంప్‌పై కుట్ర.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాలం చోటుచేసుకున్న హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలపై అగ్రరాజ్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.అయితే ట్రంప్.. ఇప్పటికే ఇరాన్ దేశ హిట్‌లిస్ట్‌లో ఉండటంతో టెహ్రాన్‌కు జో బైడెన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ హత్యకు కుట్రలు చేసినా.. యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని వైట్ హౌజ్ మంగళవారం ఓ ప్రకటనవిడుదల చేసింది.‘‘మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్ నుంచి వచ్చే బెదిరింపులను కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నాం. అమెరికా పౌరుడిపై ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి.ఈ భద్రతాపరమైన అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ, స్వదేశ భద్రత అంశంగా పరిగణిస్తున్నాం. ఇరాన్ బెదిరింపులకు తీవ్రంగా ఖండిస్తున్నాం.అమెరికాకు సేవలను కొనసాగించే వారితో సహా, గతంలో సేవలందించిన వారి, అమెరికా పౌరులపై ఇరాన్ బెదిరింపులకు పాల్పడితే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుంది’’ అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సీన్ సావెట్ అన్నారు.మరోవైపు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పరోక్ష చర్చలను విరమించుకున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఒమన్‌ను కీలక మధ్యవర్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఒమన్ రాజధాని మస్కట్లోమీడియాతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు చర్చలకు జరిగే అవకాశాలు కనిపించటం లేదు’’అని అన్నారు.