Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP MP YV Subba Reddy Voice On AP Special Status in Rajya Sabha
ఇది డిమాండ్ కాదు ఏపీ ప్రజల హక్కు

న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్‌సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలి👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలిఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ

Parliament Session 2024 2nd july  2024 Updates
ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: అఖిలేష్‌ యాదవ్‌

Updatesరాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైఎస్సాసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.విశాఖ, చెన్నై కోస్టల్‌ కారిడార్‌పై రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలిఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కాదు, అది ప్రజల హక్కుఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి ఉందిరాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పార్టీప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలిఅన్యాయంగా విభజించడం వల్ల ఏపీ నష్టపోయిందిప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందివిభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలిటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తుందిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలివిశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలిఏపీలో శాంతిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలిఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్‌ జగన్ స్థాపించారు.తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టారుఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారురైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండిగ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలిరైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలిరైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలిభద్రత చర్యలను వెంటనే అప్‌గ్రెడ్ చేయాలిరైల్వే జోన్‌కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించిందినడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలివైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలివిశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే వ్యవహరిస్తున్న తీరును ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తప్పుపట్టారు. ప్రతిసారి రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచలేరు. దేశ చరిత్రలో రాజ్యసభ కార్యకలాపాల్లో సభ ఛైర్మన్‌ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదు.తాను ఎప్పుడూ ప్రతిపక్ష సభ్యుల గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాన్నారు. లోక్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.గత ఎన్నికల ఇండియా కూటమి నైతిక విజయం సాధించింది: ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైంది.జూన్‌ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించింది400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు.వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది.ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ #WATCH | Speaking on the paper leaks issue in Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav says," Why are paper leaks happening? The truth is that this is being done by the government so that it doesn’t have to give jobs to youth." pic.twitter.com/9EC1y8kUgi— ANI (@ANI) July 2, 2024 జులై 1వ తేదీన లోక్‌సభలో రాహుల్‌ స్పీచ్‌ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.పార్లమెంట్‌లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలి: మోదీలోక్‌సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలా వ్యవహరించవద్దుఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు.సమావేశాలు జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలిప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.#WATCH | PM Modi welcomed by NDA leaders at the NDA Parliamentary Party meeting in Delhi pic.twitter.com/dRZnJ7yHzv— ANI (@ANI) July 2, 2024 ప్రధాని మోదీ నేతృత్వలో జరిగినే ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడానికి పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు.Delhi | NDA leaders Giriraj Singh, Milind Deora, Kangana Ranaut and Jayant Chaudhary arrive for NDA parliamentary party meeting in Parliament premises pic.twitter.com/eWnafFv0yN— ANI (@ANI) July 2, 2024 ఢిల్లీ: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సోమవారం ఉభయ సభల్లో వాడీవేడీగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. నీట్‌, అగ్నిపథ్‌ వంటి అంశాలపై మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపట్టారు. హిందుత్వ, అగ్నిపథ్‌ పథకాలపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్‌ గాంధీ క్షమాపణలు చేప్పాలని హోంశాఖ మంత్రి అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. ఇవాళ జరిగే లోక్‌సభ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సాయంత్రం మాట్లాడానున్నారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చడంతో ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.లోక్‌సభలో ప్రసంగానికి ముందు ఎన్డీయే కూటమి పార్లమెంట్‌ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధికారంలోకి వచ్చాక.. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించిన మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ కూడా లోక్‌సభలో వాడీవేడీగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటలు యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు.

KSR Comments On Telangana Chief Minister Revanth Reddy's Speech
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?

రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్‌ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్‌సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Rs 25 Lakh Contract: Bishnoi Gang Plan To Kill Salman Khan
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్ కుట్ర‌

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖ‌లు చేసిన చార్జ్‌షీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు క‌రుడుగట్టిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర బ‌య‌ట‌ప‌డింది. కాగా గ‌త ఏప్రిల్‌ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్‌ థాపన్‌ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసిన‌ట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్‌ హత్య కుట్రలో భాగంగా సల్మాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్‌లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి ప‌నిచేస్తున్న‌ట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది.

TDP Leaders Attacks On YSRCP Supporters In Kuppam
కుప్పం: పెన్షన్ల పంపిణీలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

సాక్షి, చిత్తూరు: ఏపీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులే లక్ష్యంగా పచ్చ బ్యాచ్‌లు దాడులు చేస్తోంది. తాజాగా కుప్పంలో టీడీపీ శ్రేణుల కారణంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త కేశవ మృతి చెందాడు.కాగా, ​కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, లబ్ధిదారులైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కేశవ కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేశవ తల్లి ప్రమీలకు పెన్షన్ల ఇచ్చేదిలేదని టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో, తన తల్లికి పెన్షన్‌ కోసం కేశవ వారితో వాగ్వాదానికి దిగాడు. ఎట్టకేలకు పంచాయతీ సెక్రటరీ సిబ్భంది సోమవారం సాయంత్రానికి ప్రమీలకు పెన్షన​్‌ అందజేశారు.అ‍యితే, ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేశవను బెదిరించారు. నీ అంత చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, మనస్థాపానికి గురైన కేశవ ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు కేశవను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అతడిని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కేశవ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

17 Year Old Chinese Player Died With Cardiac Arrest During A Badminton Match In Indonesia
బ్యాడ్మింటన్‌ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్‌ అరెస్ట్‌తో యువ షట్లర్‌ మృతి

బ్యాడ్మింటన్‌ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా యువ షట్లర్‌ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్‌ జిఝి ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్‌ జిఝి ఒక్కసారిగా కుప్పలిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్‌ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్‌ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024

Elon Musk Slams Kamala Harris Over Trump Lie
కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్‌ సెటైర్‌

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌పై ప్రపంచ టాప్‌ బిలీయనీర్‌ ఎలన్‌ మస్క్‌ ఎక్స్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్‌ గనుక అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా అబార్షన్‌లపై నిషేధం విధిస్తారంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అయితే అది అబద్ధం కావడం.. ఎక్స్‌ సైతం కమ్యూనిటీ నోట్‌ ఇవ్వడంతో మస్క్‌ సెటైర్‌ సంధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్‌) కీలకాంశంగా మారింది. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అయితే అధ్యక్ష బరిలో రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థి ట్రంప్‌ గనుక గెలిస్తే.. అమెరికా వ్యాప్తంగా అబార్షన్‌ రద్దు చేస్తారు అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా హారిస్‌ పోస్ట్‌ చేశారు. Donald Trump would ban abortion nationwide.President @JoeBiden and I will do everything in our power to stop him and restore women's reproductive freedom.— Kamala Harris (@KamalaHarris) June 30, 2024 అయితే ఆమె పోస్టుకి వెంటనే ఎక్స్‌ ‘కమ్యూనిటీ నోట్‌’ ఇచ్చింది(ఫ్యాక్ట్‌ చెక్‌ టైప్‌ ఫీచర్‌). అబార్షన్ చట్టంపై తాను సంతకం చేయబోనని ట్రంప్ పదే పదే చెప్పారు అని ఆ నోట్‌ పేర్కొంది. దీంతో వెంటనే ఎక్స్‌ ఓనర్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. రాజకీయ నాయకులైతేనేం.. వాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్లను నడిపేవాళ్లు అయితేనేం.. ఇలాంటి మాధ్యమాల్లో అబద్ధాలు ఇక మీదట పని చేయవని ఎప్పటికి గుర్తిస్తారో అంటూ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు.. కమ్యూనిటీ నోట్‌ వచ్చిన హారిస్‌ పోస్టును స్క్రీన్‌ షాట్‌ ఉంచారాయన. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టుకు సైతం ఆయన కామెంట్‌ చేశాడు.When will politicians, or at least the intern who runs their account, learn that lying on this platform doesn’t work anymore? pic.twitter.com/wP7H4AJFwG— Elon Musk (@elonmusk) July 1, 2024 ఇదిలా ఉంటే.. అబార్షన్‌ను నిషేధించే ఉద్దేశం తనకు లేదంటూ గత వారం అట్లాంటాలో బైడెన్‌తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్‌ డిబేట్‌లోనూ ట్రంప్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్‌ కమ్యూనిటీ ఫీచర్‌ను గత కొంతకాలంగా మస్క్‌ పొడుగుతూ వస్తుండడం చూస్తున్నాం. కమ్యూనిటీ నోట్‌ ఫీచర్‌ అనేది.. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్‌ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని యూజర్‌కు సూచిస్తుంది. అలాగే.. యూజర్లు ఆ పోస్టులో ఆ నోట్‌ ద్వారా అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది.

Indian Army introduced first indigenous chip based 4G station procured from Signaltron
సైన్యానికి సేవలందించే చిప్‌ ఆధారిత 4జీ బేస్‌ స్టేషన్‌

భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్‌టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్‌ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్‌ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్‌ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్‌ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్‌లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్‌ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్‌వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్‌ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్‌ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్‌ చేయడానికి వీలవుతుంది. భారత్‌ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్‌స్టాల్‌ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్‌విడియా, క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్‌లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు.

 Kalki 2898 AD Movie Records
కల్కి దెబ్బకు 'షారుఖ్‌ ఖాన్‌' రికార్డ్‌ బద్దలైంది

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, వీకెండ్‌లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే అనేక రికార్డ్స్‌ను కల్కి క్రియేట్‌ చేస్తుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌ కల్కి మూవీలో నటించి మెప్పించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డ్స్‌ను దాటేసింది. ఒక వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఉంది. షారుక్‌ఖాన్‌- అట్లీ 'జవాన్‌' (రూ.520 కోట్లు) పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్‌ దెబ్బకు బద్దలైంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారత్‌ చిత్రంగా హనుమాన్‌ (రూ.350 కోట్లు) ఉంది. అయితే, ఆ రికార్డ్‌ను కల్కి కేవలం రెండు రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఇండియన్‌ టాప్‌-3 చిత్రాల జాబితాలో 'కల్కి' మూడో స్థానంలో ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (రూ.223 కోట్లు), బాహుబలి2 (రూ.217 కోట్లు), కల్కి (రూ.191.5కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో రెండు ప్రభాస్‌ సినిమాలే ఉండటం విశేషం.బాలీవుడ్‌లో పెరుగుతున్న కలెక్షన్స్‌కల్కి సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో బాలీవుడ్‌లో కలెక్షన్స్‌ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీకెండ్‌ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీగానే రాబట్టింది. సోమవారం నాడు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో రూ. 170 కోట్లకు పైగానే గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి దూసుకుపోతుంది. బాలీవుడ్‌ బయర్ల నుంచి కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో కల్కి సులభంగానే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all