Ravichandran Ashwin
-
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశస్రాలను సిద్దం చేసుకునున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదతో ఉన్నాయి. ఇప్పటికే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది.బౌలింగ్ విభాగంలో కూడా మార్క్ వుడ్, ఆర్చర్, అదిల్ రషీద్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. దీంతో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin) ఎంపిక చేశాడు. అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు.అదే విధంగా వరుసగా మూడు నాలుగు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అయితే పరిస్థితుల బట్టి వీరిద్దరి బ్యాటింగ్ ఆర్డర్ మారే ఛాన్స్ ఉందని అశూ అభిప్రాయపడ్డాడు. ఫినిషర్లగా టాలిస్మానిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, డైనమిక్ బ్యాటర్ రింకు సింగ్‌లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌తో పాటు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దక్కింది.అయితే తుది జట్టులో చోటు కోసం నితీశ్, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ నెలకొందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లగా మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసిన అశ్విన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని పరిగణలోకి తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేస్తుడనుకుంటున్న యువ పేసర్ హర్షిత్ రాణా(harshit rana)కు అశ్విన్ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ సాయంత్రం 7: 00 గంటలకు ప్రారంభం కానుంది.అశ్విన్ ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ మరియు మహమ్మద్ షమీఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
CT 2025: గంభీర్‌కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్‌కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్‌కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్‌కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్‌లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్‌వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్‌తో సిరీస్‌లో మాత్రం హాజిల్‌వుడ్‌ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్‌లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్‌లో మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్‌ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్‌లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్‌లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్‌లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్‌లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్‌లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్‌లో రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్‌లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది! -
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యాష్ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ— Sun News (@sunnewstamil) January 9, 2025అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని స్టూడెంట్స్‌ను అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్, ఇంగ్లిష్ అని అశ్విన్ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అశ్విన్ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాష్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్‌లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు. అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 537 వికెట్లు తీసి భారత్ తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న యాష్.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్ తదుపరి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. -
అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్‌మెనెజ్‌మెంట్ తప్పించింది.ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు."టీమిండియా సరైన గేమ్ ప్లాన్‌తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్‌కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్‌ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.టెస్టు క్రికెట్లో అశ్విన్ మార్క్..అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడనున్నాడు.చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్వుడ్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్‌వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్‌వుడ్‌కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్‌వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.బ్యాటింగ్‌లో విరాట్ టాప్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు. -
BGT: చాలానే చేశారు.. ఇక చాలు.. మండిపడ్డ గంభీర్!
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.కాగా గంభీర్ ప్రధాన కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.దారుణ వైఫల్యాలుసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్‌తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.స్టార్ బ్యాటర్ల వైఫల్యంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్‌ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్‌లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.చాలా ఎక్కువే చేశారుఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్‌రూమ్‌లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్‌గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్‌తో రోహిత్‌కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
IND VS AUS 4th Test: అశ్విన్‌ను వెనక్కు నెట్టిన లియోన్
టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ (Nathan Lyon) భారత తాజా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) వెనక్కు నెట్టాడు. మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ ఘనత సాధించాడు. సిరాజ్ వికెట్‌తో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లియోన్ ఏడో స్థానానికి ఎగబాకడు. అశ్విన్ 106 టెస్ట్‌ల్లో 537 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 133 టెస్ట్‌ల్లో 538 వికెట్లు తీశాడు.టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), నాథన్ లియోన్ (538), రవి అశ్విన్ (537), కోట్నీ వాల్ష్ (519), డేల్ స్టెయిన్ (439) టాప్-10లో ఉన్నారు.మెల్బోర్న్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు చివరి సెషన్ వరకు సాగిన మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను దారుణంగా దెబ్బ తీసింది. ఏడో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.మెల్బోర్న్ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాట్ కమిన్స్ (41), నాథన్ లియోన్ (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
'డబుల్ సెంచరీ'పై కన్నేసిన బుమ్రా...
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.తద్వారా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్?
ముంబై క్రికెటర్ తనుశ్ కొటియాన్‌కు అరుదైన అవకాశం దక్కింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy- బీజీటీ)లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు.. టీమిండియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. తనుశ్కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం కంగారూల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయింది.అశ్విన్ రిటైర్మెంట్ఇక ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అశూ స్థానంలో ముంబై ఆటగాడు తనుశ్ కొటియాన్(Tanush Kotian)కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. నిజానికి మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు జట్టుతోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం అతడిని ఎంపిక చేశారు.ఎవరీ తనుశ్ కొటియాన్?మహారాష్ట్ర చెందిన తనుశ్ కొటియాన్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 26 ఏళ్ల తనుశ్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 25.70 సగటుతో 101 వికెట్లు తీశాడు.అదే విధంగా.. బ్యాటింగ్‌లోనూ రాణించిన అతను 47 ఇన్నింగ్స్‌లలో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2023–24 రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై గెలుచుకోవడంలో తనుశ్దే కీలకపాత్ర. ఆ ఎడిషన్‌లో 502 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలవడం విశేషం. ఇక ఇటీవల భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఒక మ్యాచ్‌లోనూ తనుశ్ బరిలోకి దిగాడు. వన్డే టోర్నీలో సత్తా చాటుతూతనుశ్ కొటియాన్ ప్రస్తుతం ముంబై తరఫు విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy) మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టీమిండియాలోకి ఎంపికైన రోజే అతడు అహ్మదాబాద్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించడం విశేషం. రెండు వికెట్లు తీయడంతో పాటు.. 37 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో నాలుగో టెస్టు జరుగనుంది. తదుపరి సిడ్నీ వేదికగా ఇరుజట్లు ఆఖరి టెస్టులో తలపడతాయి.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!? -
Indian Cricket In 2024: టీ20 వరల్డ్ కప్ టూ అశ్విన్ రిటైర్మెంట్..
2024 ఏడాదికి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. భారత్‌లో గత 12 నెలలలో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత క్రికెట్‌కు బాగా కలిసొచ్చిందేనే చెప్పుకోవాలి.టీ20 వరల్డ్‌కప్ విజయం నుంచి ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక వరకు భారత క్రికెట్‌కు ఎన్నో అపురూప క్షణాలు ఉన్నాయి. అయితే అన్నీ తీపి గుర్తులే కాకుండా టీమిండియాకు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలో భారత క్రికెట్లో చోటుచేసుకున్న కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.11 ఏళ్ల నిరీక్షణకు తెర.. జూన్ 13 2024.. ఆ రోజు భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీ20 వరల్డ్‌కప్-2024ను సొంతం చేసుకున్న భారత జట్టు.. తమ 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఓటమి తప్పదనకున్న చోట సూర్యకుమార్ యాదవ్ తన అద్బుతక్యాచ్తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ రోజు అతడు పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ధోని సారథ్యంలో చివరగా(2013 ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు.. మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలోవిరాట్, రోహిత్, జడ్డూ రిటైర్మెంట్..వరల్డ్‌కప్ గెలిచిన అనందంలో అందరూ మునిగి తెలుతున్న వేళ భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఓ బాంబు పేల్చారు. ఈ సీనియర్ త్రయం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. అంతేకాకుండా ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం కూడా ముగిసింది.వరల్డ్‌కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. భారత ఆటగాళ్లకు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.కెప్టెన్‌గా సూర్య, కోచ్‌గా గంభీర్..ఇక టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అప్పటివరకు తత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిన హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు జట్టు పగ్గాలు అప్పగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా భారత హెడ్ కోచ్ బాధ్యతలను మాజీ క్రికెటర్ గౌతం గంబీర్ చేపట్టాడు.క్రికెట్ చరిత్రలో తొలిసారి..టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్వదేశంలో భారత్‌కు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సొంతగడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.చరిత్ర సృష్టించిన పంత్..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.కొత్త కుర్రాళ్లు అరంగేట్రం.. ఇక ఈ ఏడాది భారత క్రికెట్ తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. టెస్టుల్లో రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా డెబ్యూ చేయగా.. టీ20ల్లో రమణదీప్ సింగ్, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్‌పాండే, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ అడుగుపెట్టారు.ఐసీసీ ఛైర్మన్‌గా జై షాఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 2024 డిసెంబరు 1 నుంచి ఆయన పదవీకాలం మొదలైంది. అతడి నేతృత్వంలోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగకరీంచింది.అశ్విన్ విడ్కోలు..ఈ ఏడాది ఆఖరిలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అశ్విన్‌తో పాటు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. -
'మీ అమ్మగారు అస్పత్రిలో ఉన్నా.. జట్టు కోసం ఆలోచించావు'
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన వెంటనే తన 14 ఏళ్ల కెరీర్‌కు అశ్విన్ ముగింపు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులే కాకుండా సహచరలు సైతం అశ్చర్యపోయారు. ఈ నిర్ణయాన్ని ఎంత సడన్‌గా అశ్విన్ ఎందుకు తీసుకున్నాడో ఆర్ధం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికి 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించినందుకు గాను అశ్విన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.అతడికి ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అశ్విన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశించారు. అతడొక లెజెండ్ అని మోదీ కొనియాడారు."అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ ఆకస్మిక రిటైర్మెంట్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అందరిని ఆశ్చర్యపరిచింది. మీ నుంచి మరెన్నో ఆఫ్-బ్రేక్‌ల కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మీరు క్యారమ్ బాల్ని విసిరి అందరినీ బౌల్డ్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని మీరు ఎంతగానో ఆలోచించి తీసుకున్నారని మాకు ఆర్ధమవుతోంది. భారత క్రికెట్ తరపున సుదీర్ఘ కాలం పాటు ఆడిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.భారత క్రికెట్ కోసం 14 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకపై జెర్సీ నంబర్ 99ను మేము మిస్ అవ్వనున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు. మీ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను హడలెత్తించారు. అంతర్జాతీయ క్రికెట్లో మీరు పడగొట్టిన ఒక్కో ఒక్క వికెట్ వెనక మీ కష్టం దాగి ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల రికార్డు మీ పేరిట ఉండడం అందుకు నిదర్శం.అరంగేట్రంలోని 5 వికెట్లు పడగొట్టి మీ సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా మీరు భాగమయ్యారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవంలో మీరు కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పట్ల మీకెంతో అంకితభావం ఉంది మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం ఆడావు. చెన్నైలో వరదల సమయంలో కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నావు. నిజంగా మీరు ఒక లెజెండ్. మీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ అంటూ అశ్విన్‌కు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నాడు. -
అశ్విన్ రిటైర్మెంట్పై భార్య ప్రీతి తొలి రియాక్షన్.. వైరల్
‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్‌లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్‌కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్అంతర్జాతీయ క్రికెట్‌కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్‌లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.ఎందుకింత అకస్మాత్తుగా?ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్‌ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).చదవండి: 'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు' -
అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ వెల్లడించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్‌కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.అశ్విన్‌కు ఎంతంటే?ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. 2022 వరకు ఆటగాళ్లకు తక్కువ మొత్తంలో పెన్షన్ లభించేది. కానీ జూన్ 1, 2022 ఆటగాళ్ల పెన్షన్ స్కీమ్‌లో బీసీసీఐ భారీగా మార్పులు చేసింది.ప్రస్తుత విధానం ప్రకారం.. 25 నుండి 49 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లందరికి ప్రతీ నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది. గతంలో వారికి నెలకు 15,000 రూపంలో పెన్షన్ అందేది. అదే విధంగా 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పెన్షన్ బీసీసీఐ నుంచి అందనుంది.75కి పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 25 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన టెస్టు క్రికెటర్లందరికీ నెలకు రూ.70,000 పెన్షన్ లభించింది. గతంలో వీరి పింఛన్ రూ. 50,000గా ఉండేది. ఈ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్‌కు రూ. 70,000 పెన్షన్ అందనుంది.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు క్రికెట్లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అతడికి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్‌మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
అశ్విన్ బాటలో రోహిత్ శర్మ?!.. హిట్‌మ్యాన్ సమాధానం ఇదే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.పితృత్వ సెలవుల కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం కాగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ నేతృత్వంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్‌లో కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇక అడిలైడ్, బ్రిస్బేన్‌లో రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్‌గా రోహిత్ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్ కూడా గుడ్‌బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.అయితే, రోహిత్ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే వీలుంటుంది. చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్‌గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్‌గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్‌లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్‌లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనపై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలా కాలంగా అవమానానికి గురవుతున్నాడని, అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగి ఉన్నప్పటికీ ప్లేయింగ్ XIలో రెగ్యులర్‌గా స్థానం పొందలేకపోవడాన్ని యాష్ అవమానంగా భావించవచ్చని అభిప్రాయడపడ్డాడు.CNN న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని ఆరోపించాడు. యాష్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన విన్నప్పుడు అందరి లాగే తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని తెలిపాడు. అశ్విన్ మనస్సులో ఏముందో తెలియదు కానీ, అతని నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విధానం చూస్తే ఓ పక్క సంతోషం, మరో పక్క బాధగా ఉందని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అన్నది అశ్విన్ వ్యక్తిగతం. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ అతని ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి అశ్విన్‌కి మాత్రమే తెలుసు. బహుశా తనుకు రెగ్యులర్‌గా జట్టులో చోటు దక్కకపోవడాన్ని అశ్విన్ అవమానంగా భావించి ఉండవచ్చని రవిచంద్రన్ చెప్పుకోచ్చాడు. కాగా, రిటైర్మెంట్పై అశ్విన్ గత కొంతకాలంగా మదన పడుతున్న విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ వరకు రిటైర్మెంట్ను పోస్ట్‌పోన్ చేసుకోవాలని అశ్విన్‌ను కోరినట్లు హిట్‌మ్యాన్ స్వయంగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి చేరుకున్న అశ్విన్.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలతో అశ్విన్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. WELCOME BACK TO INDIA, RAVI ASHWIN. 🇮🇳❤️- Ash reaches Chennai after announcing his retirement. 🥹 pic.twitter.com/kIQ1gxzHIA— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2024వాయిద్యాల నడుమ అశ్విన్ తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. అశ్విన్‌కు మొదటిగా తన తండ్రి ఎదురుపడి అభినందించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా యాష్‌ను విష్ చేశారు. అభిమానులు యాష్‌ను పూల మాలలతో సత్కరించారు. ఫ్యాన్స్ అశ్విన్‌తో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు.HOME TOWN HERO IS BACK. 🇮🇳- A Grand welcome for Ravichandran Ashwin at his home. 🤍 pic.twitter.com/WNGywMr4Sj— Johns. (@CricCrazyJohns) December 19, 2024కాగా, అశ్విన్ ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్పై అశ్విన్ బీజీటీ ప్రారంభానికి ముందు నుంచే క్లారిటీ కలిగి ఉన్నాడు. అశ్విన్ తాను రిటైర్ కావాలనుకుంటున్న విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో తొలి టెస్ట్ సందర్భంగా చెప్పాడు. అయితే రోహిత్ అప్పుడు అశ్విన్‌ను వారించి రెండో టెస్ట్ వరకు ఎదురుచూడాలని కోరాడు. రెండో టెస్ట్ అయిన పింక్ బాల్ టెస్ట్‌లో అశ్విన్ చివరిసారి టీమిండియా జెర్సీలో కనిపించాడు. జట్టు సమీకరణల దృష్ట్యా ఆశ్విన్కు మూడో టెస్ట్‌లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇదే రిటైర్మెంట్కు సరైన సమయమని భావించిన యాష్.. బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం మీడియా సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించాడు.38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆస్ట్రేలియాను వీడి భారత్‌కు పయనమయ్యాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో ఆడతాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 180 వికెట్లు తీశాడు. అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. -
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్‌ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!టెస్ట్‌ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్‌ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు. -
అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సమయమా ఇది..?
ఆసీస్‌తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్‌గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు. అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)